23, జులై 2015, గురువారం

వేదంలాఘో షించే గోదావరీ ....
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ....
వేదంలాఘో షించే గోదావరీ
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రీ

శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం//వేదంలా//

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరూ //వేదంలా//

శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో     వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం    స్త్రీపుంసయోగోద్భవాం ...
తే వేదత్రయ మూర్తాయ స్త్రీపురుషా సంపూజితా వసురైర్భూయాసుహుఊఊఉ
పురుషోత్తమాం భుజభవథ్  శ్రీఖంధరాశ్రేయసే...............

ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసమూ పెద్ద ముచ్చట ప్తులకు కమ్మని కావ్యం...
కవి సార్వభౌములకిది ఆలవాలమూ
నవ కవితలు వికసించే నందనవనమూ//వేదంలా//

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలూ //వేదంలా//

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి