1, జులై 2015, బుధవారం

పల్లవి: 
సభికులార అందుకోండి స్పందన అభివందనం 
స్పందించే హృదయాలకు అభినందన చందనం
చరణం :
కళలకు కాణాచి మన గుడివాడ పట్టణం 
నందమూరి అక్కినేని కైకాలల స్వస్థలం 
రంగస్థల రత్నాలకు ఆలవాలమీపురం 
కళామతల్లి వారసులు కొలువైన స్థావరం । సభికులార । 
చరణం :
అమర గాన గంధర్వుడు ఘంటసాల కు నెలవు 
సంగీత విద్వాంసుడు పెండ్యాలకు కొలువు 
ఖండాంతర ఖ్యాతి గన్న కూచిపూడి నృత్యం 
కళాసేవ చేయనుంది స్పందన అను నిత్యం ।సభికులార। 
చరణం:
రాష్ట్రస్థాయి పోటీలలో రాణించిన నాటకాలు 
స్క్రూటినీ చేయబడ్డ స్థానిక కళారూపాలు 
మూడు నెలలకొక్కసారి ముచ్చటైన ప్రదర్సనలు 
అందించే స్పందనను ముందుకు నడిపించండి । సభికులార।

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి