అంతా శాస్వతం అన్నీ శాశ్వతం
అనుకోవడం లోనే ఉంది చిక్కంతా
ఏదీ శాశ్వతంగా అలాగే ఉండిపోదు
ప్రతీదీ మారుతూనే ఉంటుంది
ఒక సంతోషం ఒక సంబరం
అలాగే ఉండి పోవు
ఒక దుఖశకలం ఈ రోజు కాల్చేయొచ్చు
రేపటికి ఒక రోజు గడిచిపోయిన దుఖం
ఒక నదిలో తాగిన నీటినే రెండోసారి తాగలేవు
హిమాలయాల్లో మంచు నిశ్చలంగా కనబడుతుంది
కానీ కరుగుతూనే ఉంటుంది
కొత్త హిమం చేరుతూనే ఉంటుంది
ఈ రోజు చూస్తే ఎర్రటి కిసలయం
రేపటికి ఆకుపచ్చని పత్రం
ఈ రోజు నీ వయస్సుకి
రేపటి నీ వయస్సుకి లోటు ఒక రోజు
మార్పే జీవన నాదం
మార్పే అభ్యుదయానికి అసలు చిరునామా
శిలాజంలా ఉండిపోవడం
చాలా చింతించాల్సిన విషయం
మార్పుతో చెట్టాపట్టాల్ కట్టి చూడు
మహదానందానికి అదే కాలిబాట.
అనుకోవడం లోనే ఉంది చిక్కంతా
ఏదీ శాశ్వతంగా అలాగే ఉండిపోదు
ప్రతీదీ మారుతూనే ఉంటుంది
ఒక సంతోషం ఒక సంబరం
అలాగే ఉండి పోవు
ఒక దుఖశకలం ఈ రోజు కాల్చేయొచ్చు
రేపటికి ఒక రోజు గడిచిపోయిన దుఖం
ఒక నదిలో తాగిన నీటినే రెండోసారి తాగలేవు
హిమాలయాల్లో మంచు నిశ్చలంగా కనబడుతుంది
కానీ కరుగుతూనే ఉంటుంది
కొత్త హిమం చేరుతూనే ఉంటుంది
ఈ రోజు చూస్తే ఎర్రటి కిసలయం
రేపటికి ఆకుపచ్చని పత్రం
ఈ రోజు నీ వయస్సుకి
రేపటి నీ వయస్సుకి లోటు ఒక రోజు
మార్పే జీవన నాదం
మార్పే అభ్యుదయానికి అసలు చిరునామా
శిలాజంలా ఉండిపోవడం
చాలా చింతించాల్సిన విషయం
మార్పుతో చెట్టాపట్టాల్ కట్టి చూడు
మహదానందానికి అదే కాలిబాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి