30, జూన్ 2015, మంగళవారం

    వర్తమానానికి వందనం !
    _________________
    సూర్యుడి కంటే ముందే లేచి
    రోడ్ల పైన
    నడకలు, పరుగులు,
    పరుగుల్లాంటి నడకలు
    నడకలాంటి పరుగులు సాగిస్తున్న
    ఈ జనాన్ని చూస్తే నవ్వొస్తుంది !
    నిజంగా వాళ్లు ఇప్పుడే నిద్ర లేచారని అనిపిస్తుంది !
    ఇన్నేళ్ళుగా చే జార్చుకున్న ఆరోగ్యాన్ని
    ఇప్పుడే ఒడిసి పట్టేసుకోవాలని తపన ..
    వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ...
    **********
    ఈ జనాన్ని చూస్తే భలే ఆశ్చర్య మేస్తుంది !
    యవ్వన వనాన్ని వదిలి చాల దూరం వచ్చేసినా
    ఇంకా ఆ భ్రాంతిని వదల్లేక, వున్నస్తితిని స్వాగతించలేక, ఆస్వాదించలేక
    ఆపాద మస్తకం ఆకర్షణల పూతల్ని పులిమేసుకుంటూ
    వర్తమానపు సువాసనలను అఘ్రానించలేక పోతున్న ఈ జనం
    వర్తమానాన్ని ఇంకెప్పుడు ఆస్వాదిస్తారో !
    ***********
    నడి రోడ్డు పైన వయసొచ్చిన కూతుళ్ళను సైతం
    అనుకరించేస్తున్ననగర తల్లుల వస్త్రధారణ అలంకరణ చూస్తుంటే
    అనిపిస్తుంది
    నాడు దొరకని అవకాశాన్నినేడు ఇంచక్కా
    వాడేసుకుం టున్నారని..
    గతాన్ని తలచే వాళ్ళు ....భవితను ప్రేమించే వాళ్లు...
    వర్తమానాన్ని గౌరవించకుంటే ఎలా !
    వర్తమానాన్ని విస్మరిస్తీ ఎలా !
    మొక్కల పై చూపే ప్రేమకు
    చెట్లకు లభించే గౌరవానికీ తేడా గుర్తించ కుంటే ఎలా ?
    ....... వసుధ భీమవరం
    9490005199
    Unlike · Comment · 
    సూర్యుడు తిరిగి వచ్చేసాడోచ్ !
    ___________________
    అమ్మయ్య!
    పన్నెండు రోజులక్రితం...
    See More
    Like · Comment · 
    వర నిర్ణయం!
    __________
    ఆదివారం...
    సంతంతా బాగా రద్దీగావుంది!...
    See More
    Like · Comment · 
    కవి
    ___
    మాటలకందని
    అనుభూతులకు......
    See More
    Like · Comment · 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి