30, జూన్ 2015, మంగళవారం

ఎక్కడో ;పుట్టి.. ఎక్కడో పెరిగి...
ఎక్కడెక్కడో తిరిగి..
జన ముంగిళ్ళలోకి చేరి..
జన దాహాన్ని, తీరుస్తూ...
ఎక్కడ తిరిగినా అక్కడ నవ్వులు పూయిస్తూ..
నడిచిన చోటల్లా నందనవనం. సృష్టిస్తూ
నిలచిన చోటంతా సస్యశ్యామలం చేస్తూ...
.కడుపులో దిగుళ్ళ లోతులెన్నో... నడకలో .మెరకల కష్టాలెన్నో
దాని మార్గంలో.. సుడిగుండాలెన్నో....
అయినా ఆగనిపరుగు తన నైజం!
ఇది ముమ్మాటికీ నిజం!
తన చెంత నిలిచి.. దాహం తీర్చుకుని సేదతీరే వారుంటే..
తనకి పుష్కరమొచ్చినంత ఆనందం!
ఆ ఆనందం తృప్తి వర్ణానాతీతం..
సాగుతుంది నిరంతరంగా..మృత్యు సాగరంలో కలిసేదాకా!
నిజాయితీగా ధ్యేయంగా, జన హితమే లక్ష్యంగా సాగే
కవి జీవితం అచ్చంగా నది కి చక్కని నమూనా!..
......................వసుధ భీమవరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి