22, సెప్టెంబర్ 2019, ఆదివారం

చెప్పండి చూద్దాం... క్షమ గలిగిన సిరి గలుగును క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్ క్షమ గలుగఁ దోన కలుగును క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుఁడు దండ్రీ! పోతన భాగవతం నవమ స్కందం 463 వ పద్యమిది. పరశురాముని చరిత్రం లోని పద్యం. పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి కామ ధేనువును ఆశ్రమానికి తీసుకు వచ్చి తన పరాక్రమాన్ని తండ్రికి చెపుతాడు. అపుడు పరశురాముడి తండ్రి జమదగ్ని , కుమారుడితో అన్న మాటలీ కంద పద్యం. క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ ఉంటే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. మూడవ పాదంలో దోన అంటే ఏమిటో ఒక పట్టాన అర్ధం కాదు. ఆఖరి పాదం - క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీ హరి సంతోషిస్తాడు. ఇప్పుడు చెప్పండి క్షమ కలుగ దోన కలుగును అన్న వాక్యంలో దోన కు అర్థం ఏమిటి?

3 కామెంట్‌లు: