16, సెప్టెంబర్ 2019, సోమవారం

       కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?              వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ               బేరైనం గలదే? శిబిప్రముఖులుంబ్రీతిన్ యశః కాములై               యీరే కోర్కులు? వారలన్ మఱచిరేయి క్కాలమున్? భార్గవా!         భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.          వామనునికి దానం ఇవ్వద్దు అన్న శుక్రాచార్యులకు సమాధానం చెప్పే సందర్భంలో బలి చక్రవర్తిచే పోతన పలికించిన జగత్రసిద్ధ మైన పద్య మిది.          కారే = కలుగరా; రాజులు = రాజులు;రాజ్యముల్ = రాజ్యములు; గలుగవే -కలుగవే = పొందలేదా ఏమి;గర్వోన్నతింబొందరే - గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = విర్రవీగుటను;పొందరే = చెందలేదా ఏమి; వారేరీ - వారు = వాళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరి -సిరిని = సంపదలను; మూటఁగట్టుకొని -మూటగట్టుకొని = కూడగొట్టుకొని;పోవంజాలిరే = తీసుకెళ్ళగలిగిరా, లేదు;భూమిపైఁబేరైనంగలదే - భూమి = నేలపైన;పేరైనన్ = కనీసము పేరైన; కలదే = ఉన్నదా, లేదు; శిబిప్రముఖులుంబ్రీతిన్ - శిబి = శిబిచక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగువారు;ప్రీతిన్ = కోరి; యశఃకాములై - యశః = కీర్తి;కాములు = కోరువారు; ఐ = అయ్యి; యీరే -ఈరే = ఇవ్వలేదా; కోర్కులు = దానములను;వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; యిక్కాలమున్ - ఈ= ఇప్పటి; కాలమున్ = కాలమునందును;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి