11, సెప్టెంబర్ 2019, బుధవారం

***బట్టతలపై పద్యము.*** తలనూనె రాసెడు తగులాటముండదు- క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు పేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును- చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ- జుట్టింత దొరకదు పట్టుకొనగ అద్దంబు దువ్వెన లవసరమే లేదు- పర వనితలు వెంటబడుట కల్ల తేటగీతి. కడకు కుంకుడు, శీకాయ ఖర్చు మిగులు తలకు స్నానంబు చేయుట సులభమౌను ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ బట్టతల గల్గు వాడె పో భాగ్యశాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి