23, డిసెంబర్ 2019, సోమవారం

***** వృద్ధుడు అంటే ..... ******మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడుముంగిట్లో కూచోబెడితేఇంటిని కాచే ఈశ్వరుడు*బతుకుబాటలో గతుకుల్నిముందుగా హెచ్చరించికాపాడే సిద్ధుడు వృద్ధుడువృద్ధులు సారధులైతేయువకులు విజయులౌతారుఅనుభవాల గనులు ఆపాత బంగారాలు*వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడుచేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడునిర్లక్ష్యంగా చూస్తే కేవలంమూడుకాళ్ల ముసలివాడుతగిన గుర్తింపునిస్తేవిజయాన్నిచ్చే త్రివిక్రముడు*ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడుతనను పట్టించుకోకున్నానువ్వు పచ్చగా ఉండాలని తపించేఉదాత్తుడు వృద్ధుడు*పలకరిస్తే చాలు ......పాలకడలిలా పొంగులు వారేపసివాడు వృద్ధుడువృద్ధుడంటే పైపైన చూస్తేజుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడుఅంతర్గతంగాతలపండిన పండితుడు.

20, డిసెంబర్ 2019, శుక్రవారం

బైరాగి -- చీకటి నీడలు లో.. కడుపుమంట...అనురాగం అంబరమైతేఆనందం అర్ణవమైతేమేం తోకచుక్కగా వస్తాంబడబానలమై మండిస్తాంప్రపంచమొక నందనవనమైజీవితమొక గులాబి ఐతేమేం ముళ్ళతొడుగుగా ఉంటాంసుఖస్వప్నం భంగపరుస్తాంఈ జీవిత కేళి గృహంలోసుఖమే ఒక విరిపాన్పైతేమేం కాలసర్పమై వస్తాంవిషజ్వాలల ధార విడుస్తాంమీ నిద్రాసుఖసమయంలోస్వాప్నిక ప్రశాంతి నిలయంలోమేం పీడకలలుగా వస్తాంరౌరవదృశ్యం చూపిస్తాంమీ ప్రణయోత్సుక మధుగీతంమీనృత్యమత్త సంగీతంమీకటుక్షుధారోదనంలోముంచేస్తామొక్క క్షణంలోమీ హేమాసన పాత్రల్లోమీ స్వప్నజగతి యాత్రల్లోమా అశృధార నింపేస్తాంమీబాటను జారుడు చేస్తాం.పానకపు పుడకగా వస్తాంటీకప్‌లో ఈగైచస్తాంమా ప్రాణాలైనా విడుస్తాంమీశాంతిని భగ్నంచేస్తాం.!!

19, డిసెంబర్ 2019, గురువారం

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁబూని తాచిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద ! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా !అరాళకుంతలా !....(1) శ్రీకృష్ణార్జున యుద్దం (1963) ఎన్ఠీఆర్ - వరలక్ష్మీ(2) శ్రీ కృష్ణ తులాభారం (1966 ) ఎన్ఠీఆర్ - జమున (3) శ్రీ కృష్ణ మాయ (1958 ) అక్కినేని - జమున

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.అవును ఇది ఒక చేదు నిజం ।ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. వాళ్ళు...... రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !నడక అలవాటు ఉన్నవాళ్ళు! మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !వాళ్ళు...... ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు! పూజకు పూలు కోసే వాళ్ళు !..వాళ్ళు.....పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !మడిగా వంట వండేవాళ్ళు !దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !వాళ్ళు . అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !తోచిన సాయం చేసేవాళ్ళు !చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !.వాళ్ళు .ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! Xఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు! వాళ్ళు పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! ..వాళ్ళు .... .తీర్థయాత్రలు చేసేవాళ్ళు !ఆచారాలు పాటించే వాళ్ళు !తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !.వాళ్ళు .....చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు !చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు ! .వాళ్ళు ....తలకు నూనె రాసుకునే వాళ్ళు !జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !మీకు తెలుసా ? .వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు..మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి ..లేదంటే ......లేదంటే .....ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది...వాళ్ళ ప్రపంచం వేరు .సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!. స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !.కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది! ద్వేషం, మోసం లేని జీవనం గడిపిన తరం అది!.సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది! లోకానికి భయపడే జీవనం గడిపిన తరం అది !.ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!H.వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది .మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి !!!తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!.సర్కారు చేసే చట్టాలు కాదు 🙏🙏

12, డిసెంబర్ 2019, గురువారం

*వృద్ధాప్యానికి ఆహ్వానం* -శ్రీ గొల్లపూడి మారుతీరావు *వృద్ధాప్యం ఒక మజిలీ*. ప్రతీ వ్యక్తీ కోరుకున్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.ముసిలితనం కొడుకు కంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది. మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది. జీవితమంతా కొరుకుడుపడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది. పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా!'' అంటే కోపం రాదు. ఒక జీవితకాలాన్ని తెలీనితనానికి తాకట్టు పెట్టిన కొడుకుని చూసి నవ్వుకుంటుంది. తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వపడుతుంది. అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది. ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు.వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు. నీ జీవితకాలంలో సాధనల్ని పక్కనపెట్టి కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు. అదొక అంతస్థు. అతని హితవుని నలుగురూ వింటారు. నీ ఆలోచనని గౌరవిస్తారు. దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు. వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది.''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది. ''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది. తన గురించి తన పెద్దలూ అలనాడు -అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది.వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది. చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది. తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయిపోతోందని అర్థమవుతూంటుంది. దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది. ''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది. అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగు వేస్తుంది. దానికి ఊతం వృద్ధాప్యం.జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి. ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది. ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది? ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది? ఏమయినా తనకేం బాధలేదు. ఆ సమయంలో తను ఉండడు. ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం.దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా వుంటాడు? మృత్యువు తరువాత ఏమవుతుంది? సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి. చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం. చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటిలాగే తెల్లారి, వృద్ధులతో కలిసి నడిచి, రెండుముద్దల అన్నం తిని, అరగంట సేదతీరి, వేడి టీ తాగి, సాయంకాలం పార్కు బెంచీ దగ్గర ''ఈ దేశం తగలడిపోతోంద'ని తిట్టుకుని, శాంతపడి -కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ, నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం -వృద్ధాప్యం వ్యసనం.ఇప్పుడు విచారం దగ్గరకు రాదు. వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు. ముగింపు భయపెట్టదు. ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక. అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని -మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం.ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి. చేసిన తప్పిదాలు, మాటతప్పిన కప్పదాట్లూ, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ -అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి. ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు. వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు. విన్న తృప్తిని తానూ నటిస్తాడు. వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు. కాని వృద్ధాప్యం ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు. వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు. జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు. ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.'చమకం' ఏ రుషి, ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో -ఎంత ముందుచూపు, ఎంత వినయసంపద, జీవుని నిస్సహాయత, నిర్వేదం -అందులో నిక్షిప్తమయివుందో -ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది.ఈ దేశపు వేద సంపద, సాంస్కృతిక వైభవం, జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం. చమకంలో 'వృద్ధం చమే' అనే ఒక్క కోరికా ఈ జాతినీ, మతాన్నీ, ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ. వరం. భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం. అదీ వృద్ధాప్యం.🙏🏼

4, డిసెంబర్ 2019, బుధవారం

అధిక దుఖ్ఖమైన,ఆనందమైన,కలసి చెమ్మగిల్లు కనులు రెండు..ఆలు మగలజంట అట్లున్నప్పుడే..సౌఖ్య జీవనంబు సాధ్యమగును..😊

ఘంటసాల సీ।శ్లోకమ్ము చదివెనా లోకాల నన్నిటిన్ మంత్ర ముగ్ధము చేయు మధుర మూర్తి పద్యమెత్తుకొనిన భావాను గుణముగా నవ రసాలొలికించు నటన మూర్తి పాటలు పాడెనా ప్రాణి లోకమునెల్ల పరవశింపగ జేయు ప్రణయ మూర్తి స్వరములు కూర్చెనా సరస మాధుర్యాలు సరసాన్న ములు పెట్టు సరస మూర్తిగీ। వినయ సంపన్న శోభిత విదిత మూర్తి లలిత సంగీత సామ్రాజ్య రమ్య మూర్తి సరస సంగీత సాహిత్య చక్రవర్తి చలనచిత్ర రంగాన సంచలన మూర్తి గాన మాధుర్యముల సీమ ఘంటసాల అతని గొప్పను పొగడ నా కలవి యౌన? డా మీగడ

2, డిసెంబర్ 2019, సోమవారం

కార్యేషు యోగీ, కరణేషు దక్షఃరూపేచ కృష్ణః క్షమయా తు రామఃభోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రంషట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః - (కామందక నీతిశాస్త్రం)కార్యేషుయోగీ:పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.రూపేచ కృష్ణఃరూపంలో కృష్ణుని వలె ఎల్లప్పుడూ ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి.క్షమయా తు రామఃఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.భోజ్యేషు తృప్తఃభార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. సుఖదుఃఖ మిత్రం:సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.ఈ షట్కర్మలు ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.