31, మార్చి 2020, మంగళవారం
ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీలవెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళమరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీనీ బరువూ...నీ పరువూ...మోసేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...రాజనీ...పేదనీ, మంచనీ...చెడ్డనీ...భేదమే ఎరుగదీ యమపాశంకోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ...హద్దులే చెరిపెనీ మరుభూమిమూటలలోని మూలధనం...చేయదు నేడు సహగమనంనీ వెంట...కడకంటా...నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూఅందరూ సుఖపడే...సంఘమే కోరుతూ...మందిలో మార్గమే వేశావూనలుగురు నేడు పదుగురిగా...పదుగురు వేలు వందలుగానీ వెనకే...అనుచరులై ...నడిచారూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావుఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలంబతికిన నాడు బాసటగా...పోయిన నాడు ఊరటగాఅభిమానం...అనురాగం...చాటేదీ....ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీందాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాంశ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాంత్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ప్రతి పదార్ధం: లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం = పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన.తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.**గాయకుడు: ఎం ఎస్ రామారావు సంగీతం : గాలి పెంచల నరసింహ రావుదర్శకుడు: ఎన్ టి ఆర్తెరపై : హరనాధ్, గీతాంజలి, కాంతారావుసినిమా : సీతారామ కల్యాణం 06-01-1961 ఋఎలేసె: 6 ఝనూర్య్ 1960
30, మార్చి 2020, సోమవారం
తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని...తరిమేవాళ్లను హితులుగా తలచి ముందుకెళ్లాలని,కన్నులనీటిని కలల సాగుకై వాడుకోవాలని,కాల్చేనిప్పును ప్రమీదగా మలచి కాంతిపంచాలనీ,గుండెతో ధైర్యం చెప్పెను...చూపుతో మార్గం చెప్పెను,..అడుగుతో గమ్యం చెప్పెను.. నెనున్నాననీ..నేనునున్నాననీ.. నీకేం కాదనీ...నిన్నటిరాతనీ..మార్చేస్తాననీ...చీకటితో వెలుగే చెప్పెను నేనునున్నాననీ..ఓటమితో గెలుపెచెప్పేను.. నెనునున్నాననీ...నీకేంకాదనీ..
27, మార్చి 2020, శుక్రవారం
తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడువెళ్లిపోయెడినాడు – వెంటరాదులక్షాధికారైన – లవణ మన్నమె కానిమెఱుగు బంగారంబు – మ్రింగబోడువిత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కానికూడబెట్టిన సొమ్ము – తోడరాదుపొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టిదానధర్మము లేక – దాచి దాచితుదకు దొంగల కిత్తురో – దొరల కవునొతేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు?భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |దుష్టసంహార | నరసింహ – దురితదూర |నరసింహా! తల్లి గర్భం నుంచి ధనముతేడు ఎవ్వడు. పోయేటప్పుడు ఈ ధనము కూడా రాదు.లక్షాధికారైనా ఉప్పు, అన్నమే టినలిగాని, బంగారం మింగలేడు. తేనెటీగలు తేనెనుపరులకిచ్చినట్లు ధనము కూడ బెట్టి, దానము కూడా చేయక, అనుభవింపని వాడుఆ సొమ్మును దొరల పాలో, దొంగలపాలో చేయును (నరసింహా శతకం)

21, మార్చి 2020, శనివారం
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెనీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా..నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...ముళ్ల తీగమ్మా కంచెమీద చీరావేస్తే రానేరాదమ్మాఆడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మాపెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నోచూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరుపెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నోచూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరుఅటువంటినే అన్ననుగాను చెల్లెమ్మా...నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా...అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా...ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా...మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెచెల్లెమ్మా...అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మాఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా ఆహుమ్ ఆహుమ్అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మాకన్నవాళ్లకే రోకలి పోటమ్మా ఆహుమ్ ఆహుమ్సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మాఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయిసిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మాఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయిఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా....నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా...బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా...నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా...మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెచెల్లెమ్మా...ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్లిభుజం కట్టి చదువు చదివేదెందుకుఆ... కట్నకానుకలిచ్చి సచ్చేటందుకుఆ... కట్నకానుకలిచ్చి సచ్చేటందుకుచదివినంత నిన్ను చదివిస్తనమ్మాఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మానీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పండో కూడబెట్టుతాచదివినంత నిన్ను చదివిస్తనమ్మాఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మానీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పండో కూడబెట్టుతానచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మానా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మారిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మామీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మామల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెనీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా....నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా....తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా....తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.
ఏ మేరె వతన్ కి లోగో . జరా ఆఖ్ మే భర్ లో పానీ ".పాటను రాసిన కవి . వారి జన్మ దినం ఈరోజు... దేశభక్తి మనలో ఉన్నంత కాలమూ నిలిచిపోయే పాట అది.ऐ मेरे वतन के लोगोंतुम खूब लगा लो नाराये शुभ दिन है हम सब कालहरा लो तिरंगा प्यारापर मत भूलो सीमा परवीरों ने है प्राण गँवाएकुछ याद उन्हें भी कर लोकुछ याद उन्हें भी कर लोजो लौट के घर ना आयेजो लौट के घर ना आयेऐ मेरे वतन के लोगोंज़रा आँख में भर लो पानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीऐ मेरे वतन के लोगोंज़रा आँख में भर लो पानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीतुम भूल ना जाओ उनकोइसलिए सुनो ये कहानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीजब घायल हुआ हिमालयखतरे में पड़ी आज़ादीजब तक थी साँस लड़े वोजब तक थी साँस लड़े वोफिर अपनी लाश बिछा दीसंगीन पे धर कर माथासो गये अमर बलिदानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीजब देश में थी दीवालीवो खेल रहे थे होलीजब हम बैठे थे घरों मेंजब हम बैठे थे घरों मेंवो झेल रहे थे गोलीथे धन्य जवान वो अपनेथी धन्य वो उनकी जवानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीकोई सिख कोई जाट मराठाकोई सिख कोई जाट मराठाकोई गुरखा कोई मदरासीकोई गुरखा कोई मदरासीसरहद पर मरनेवालासरहद पर मरनेवालाहर वीर था भारतवासीजो खून गिरा पर्वत परवो खून था हिंदुस्तानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीथी खून से लथ-पथ कायाफिर भी बन्दूक उठाकेदस-दस को एक ने माराफिर गिर गये होश गँवा केजब अन्त-समय आया तोजब अन्त-समय आया तोकह गए के अब मरते हैंखुश रहना देश के प्यारोंखुश रहना देश के प्यारोंअब हम तो सफ़र करते हैंअब हम तो सफ़र करते हैंक्या लोग थे वो दीवानेक्या लोग थे वो अभिमानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीतुम भूल न जाओ उनकोइस लिये कही ये कहानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीजय हिन्द जय हिन्दजय हिन्द की सेनाजय हिन्द जय हिन्दजय हिन्द की सेनाजय हिन्द जय हिन्द जय हिन्दSource: Musixmatchhttps://www.youtube.com/watch?v=DSJ1MMGi_IQ
సత్యహరిశ్చంద్రీయము పంచమాంకము(సతీసుతులతో హరిశ్చంద్రుడు నక్షత్రకుఁడు ప్రవేశించుచున్నారు)హరి: దేవీ కష్టము లెట్లున్నను, బుణ్యక్షేత్రమైన వారణాసి దర్శించితిమి. చూడు.గీ. భక్తయోగ పదన్యాసి వారణాసిభవదురిత శాత్రవఖరాసి వారణాసిస్వర్ణదీ తటసంభాసి వారణాసిపావనక్షేత్రముల వాసి వారణాసి.నక్షత్రకా! విశ్వేశ్వరుని దర్శించి వత్తము. దేవీ! రమ్ము.నక్ష: ఇఁక మాయప్పుమాట నీకుదోచదు. పద. (నడచుచున్నారు)(యవనిక నెత్తఁగా దేవాలయము కాన్పించును. అందఱు విశ్వేశ్వరునకు నమస్కరింతురు)హరి: (ప్రాంజలియై)శ్లో॥ ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే!ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వ మనయోఃత్వయైన క్షంతవ్యా శ్శివ మదపరాధాశ్చ సకలాఃప్రయత్నా త్కర్తవ్యం మదవన మియం బంధుసరణి.శా. ఆపద్బంధుఁడ వీవు సామివి గదా! మాలాటి యాపన్నులం దేపారన్ ప్రముఖుండఁగా మనకుం దండ్రీ? బాంధవం బింక వే ఱే పల్కం బనిలేదుఁ గాననిఁక నీవే సైఁచి నా నేరముల్ కాపాడం దగు నెట్టులైనఁ నిటులే కాయోగ్యబంధుత్వముల్.నక్ష: హరిశ్చంద్రా! ఇంకనెంతకాల మిట్లు ముక్కు పట్టుకొని కూర్చుండెదవు? రమ్ము.చ. అలయక గుళ్ళుగోపురము లన్నియు జూచుచు నప్పుమాటయేతలపవు చేరువయ్యెనుగదా గడువంచు రవంతయేని లోఁదలపవు నా ప్రయాసము వృథాయగుచున్నది వెళ్ళబెట్టుమాపెలుచన మా ఋణంబు నెగ వేయదలంచిన నేను బోయెదన్.హరి: అయ్యా! ఎగవేయవలయునన్న నింత కష్టమున కేల యోర్చితి? తొందర పడకుము.నక్ష: ఏమీ! సొమ్మీయఁ దలఁచిన వాఁడవు నీవు తొందర పడకపోగా బుచ్చుకో వలసిన నన్ను గూడఁ తొందర పడవలదని నీతులు చెప్పుచున్నావుగా? బాగు! అన్నిటికిఁ గాళ్ళు సాచిన నీకేమి తొందర?ఉ. పుట్టెడు నప్పుతోడ దల మున్గితి వింకొక పుట్టెడైన నీపుట్టి మునుంగ దింతయును బ్రొద్దున నీ మొగమింత సూచినన్బుట్టదు యన్నమున్ మునిగి పోక యిఁకేమిటి? దీపముండగానెట్టన జక్కఁ బెట్టుకొన నేరకపోయె గురుండు వెఱ్ఱియై.హరి: అయ్యా! నిష్ఠురము లాడకుము.నక్ష: ఏమీ! మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠురమాయెనుగా? నీ వడుగుకొన్న నలువది దినంబులు నేఁటితోఁ దీరుచున్నవే. ఇంత దనుక నాకిచ్చిన దొక్కకాసైన లేదే? ఇంక నీ విచ్చెదవని మా కెట్లు నమ్మకముండును? ఇప్పుడు మాత్రముశా. ఏలీలన్ సవరింతు మా ఋణము కొంపే గోడియే నింత కూడే లేదేమిటి కింకఁ జంపెదవు పొమ్మీ మీకు నేనాటి బాకీ లన్న నిన్ను గొట్టువాడెవడు? చిక్కెన్నీకు మాజుట్టు పత్రాలా? సాక్ష్యములా? నినున్ బలిమి మీదన్ రచ్చకీడ్పింపగన్.హరి: నక్షత్రకా! పత్రములు సాక్షములు నేల కావలయును? నిత్యస్థిరంబయిన నా వాక్కున కన్యథాత్వ మెప్పటికైన సంభవింపదు గదా!నక్ష: సంభవింపక యిప్పటికి జేసిన దేమున్నది?హరి: అయ్యా! నా దీనదశ యించుక యోచించుము.నక్ష: అలాగయిన నేను యోచించి చెప్పునది గట్టిగా వినుము.శా. నీ కాతం డది యప్పు వెట్టినది కానే కాద యామౌని నిన్నే కైసాచి మదర్థ మిమ్మనిన సొమ్మేకాని, యద్దానికైనీ కన్నుంగవ దుమ్ము సల్లి యిట మున్నే రాజ్య సర్వస్వముంజేకొన్నాడిక నేటి యప్పు నిజముం జింతింప నింతే కదా?హరి: ఇంతియె కాని నెలదినములలో నిచ్చెద నని యమ్మునితో నొప్పుకొంటిని గదా!నక్ష: లేదనిన నా మాటలన్నియు సున్న యగుంగాదే!హరి: అయ్యా! సత్యేతరంబునకు నా మానసం బొప్పదయ్యా!నక్ష: అయ్యో! అమాయకుడా! ఇంతలోఁ జెడ్డప్పుడు గూడ సత్యము సత్యమని యూఁగులాడు చున్నావే హరిశ్చంద్రా! నీ వేమనుకొన్ననుమ. జటినై నేననరాదు కాని విను నీ సత్యంబే నీ కొంప కింతటి చేటౌటకు మూల మిప్పటికినైనన్ మించిపోలేదు తీర్చుట కేనాటి ఋణంబు మీకనిన దీఱున్నీకు మా బాధ! యంతట నూరేగుము సత్తుచిత్త నుచు జింతన్ బాసి బైరాగివై.అట్లుకానిచో నింత ధనము నీ విప్పట్టున నెట్లార్జించెదవు? చెప్పుము.సీ. వైదిక వృత్తి సంపాదింతు నంటివా యుడుగవు రాచపోకడలు నీకురాచఱికంబు శౌర్యమున దెత్తు వటన్న దెసమాలి యేవంక దిక్కులేదువణిజువర్తనముచే గణియింతు నంటివా యరచేత గుడ్డిగవ్వైన లేదువ్యవసాయవృత్తిచే సవరింతు నంటివా లేదు భూవసతి గోష్పాదమంతగీ. ఇందు నేడేని వ్యాపార మందదగినయంత పున్నెంబు పుట్టిన నింత ధనముగంటుకట్టునె యీ స్వల్ప కాలముననుగడచు నీ నాటితోడ మా గడువుదినము.ఇవియేమియుగాక బానిసవృత్తికి బాల్పడినను నిన్నెవరు కొనువారు లేరు. కావున నా యుపదేశవాక్యముల ననుసరించి నీవీ ఋణబాధ తప్పించికొనుము. మా గురువు గారితో నీ దురవస్థ యంతయు జెప్పి యీ సొమ్ము వదిలివేయు తెఱంగొనరించెద. చెప్పుము ఏల నీకీ బాధ?హరి: నక్షత్రకా! నా కంఠము గత్తిరించు చున్నను నసత్యమాడుటకు నామనంబొప్పదు.నక్ష: హరిశ్చంద్రా! నీ మేలు గోరి నేనింత వచించెద వినుము.ఉ. పుట్టిననాఁట నుండియును బొంకి యెఱుంగవు యే నెఱుంగు దిప్పట్టుని గూడులేని దురవస్థల నుంటివి గాన నీ మనంబెట్టిదొ తెంపుచేసికొని యీ యుపదేశము నాలకింపు మేనొట్టిడి కొం దసత్యమున కొప్పితివంచు వచింప నేరికిన్.చంద్ర: నక్షత్రేశ్వరా! నీ వంటి మునికుమారుడు చెప్పవలసిన నీతులా యివి?నక్ష: చంద్రమతీ! నీవును నీ పెన్మిటికిం దగినట్టు దొరికినావు పో,శా. మీనిప్పచ్చరముం దలంచి కరుణన్ మీ బాగుకై యింతగానేనేమో హితమున్ వచించితిని, మీ కే లేని యీ బాధ నాకా? నీ పెన్మిటి నీ వెటైన విను నా కౌనేమీ! పోనేమి నాస్నానంబో జపమో తపంబో సదను ష్ఠానంబొ యోజింపుమా.చంద్రమతీ! నా నీతులు మీరు విననక్కఱ లేదు. ఊరక యడ్డుపుల్లలు వేసినట్లు కాదు. మాకు రావలసిన సొమ్ము గవ్వలతో గూడ లెక్కపెట్టి మా కిప్పింపుము. నేనింక క్షణమాగను, మీమీది మోమాటముచే నేనింకను నాలస్యముచేసినచో సహజముగా ముక్కోపియైన మా గురువుగారు నాగొంతు గొఱుకక మానరు. హరిశ్చంద్రా! నీ పెద్దఱికం బాలోచింపను. మా సొమ్ము గుమ్మరించి మఱి నడువుము.(చేయి పట్టుకొని నిలవేయుచున్నాడు)హరి: (నిట్టూర్పు విడిచి) దేవీ! ఈ ఋణబాధ కడుంగడు దుర్భరము గద! చూడు.మ. సరివారి న్నగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగం, బనంతర మాహారమునం దనిష్ట, మటుమీదన్ దేహజాడ్యం, బటన్మరణంబే శరణంబు, పెక్కు దినము ల్మంచాన జీర్ణించి ఇంతిరొ! యీ ప్రాణులకున్ ఋణవ్యథలకంటెన్ దుస్సహం బేరికిన్.దేవీ! మందభాగ్యుండనైన నే నిప్పుడేమి చేయుదును? నిరవశేషముగా ఋణము దీర్చివేసికొని సంతోషించు భాగ్యము నాకు లేకపోయెనే?చంద్ర: నాథా! మీరిప్పట్టున ధైర్యము వహించి నా మనవి నాలింపుడు.గీ. కాలగతి సర్వసంపద గోలుపోవమిగులు సిరి నాకు మీరును మీకు నేనెబానిసగ నన్ను నే కలవానికేనినమ్ముకొనుఁ డింక మౌని ఋణమ్ము దీఱు.హరి: హా! విధీ! ఈ హరిశ్చంద్రునకు నెంతటి యవస్థ దెచ్చితివి?ఉ. అంతటి రాజచంద్రునకు నాత్మజవై కకుబంతకాంత విశ్రాంతయశోవిశాలుని త్రిశంకు నృపాలుని యిల్లు సొచ్చి భాస్వంతకుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన గేస్తురాండ్ర మేల్బంతిని నిన్ను నొక్కనికి బానిసగా దెగ నమ్ముకొందునే?చంద్ర: ప్రాణేశా! నీచంబని సంకోచించవలదు. సత్యప్రతిష్ఠకై యొనర్చిన నీచ కార్యంబులును సగౌరవంబులేయగు.హరి: హా! జీవితేశ్వరీ! హా! సుగుణసుమవల్లీ! కఠినకర్ముండ నగు నేనెంతకు జాలను? హృదయమా! నేటితో నభిమానము వదలివేయుము. దేవీ! చంద్రమతీ!గీ. హృదయమున నెగ్గు సిగ్గులు వదలివేసిదాసిగా నిన్ను నమ్ముకో దలచినాడవాడవాడల నిన్ గొనువారి నూరవెదకికొన బోవుదుము జనవే లతాంగి!చంద్ర: (నడచుచు) ఓదేవా! కాశీవిశ్వనాథా! నన్ను గొనువారి ద్వరలో గను పఱచి మమ్ము విశ్వామిత్ర ఋణబాధా విముక్తులను జేయుము, తండ్రీ!నక్ష: హరిశ్చంద్రా! ఇదియే అంగడి వీథి. ఇక్కడ ఒక్క కేక వేయుము.హరి: దేవీ! నేనిప్పుడేమి ఘోషించవలయును.చంద్ర: క్రయ ధనమ్ము నమ్ము కొనువారెట్లో యట్లే.హరి: ఓహో! పౌరులారా! (కొంచెమూరకుండి) అయ్యో! యెంత నైచ్యమునకు బాల్పడుచుంటిని?నక్ష: హరిశ్చంద్రా! ధనమిచ్చి కొనదగిన వారంద ఱిక్కడనే యున్నారు? ఇంక నీ యాగడములు చాలించి యందఱు వినున ట్లెలుంగెత్తి కేక వేయుము.హరి: అయ్యా! నేనన్నిటికి దెగించియే యున్నాను.(ద్విపద - రాగము కీరవాణి - తాళము ఆది) అవధారుడయ్య యో యగ్రజులార!సవనదీక్షితులార! క్షత్రియులార!ప్రవిమల గుణగణ్య పాదజులారకడలాక్రమించి యొక్కట భూమి నేలిసడినున్న యీ హరిశ్చంద్రుడ నగుటప్రణుత కౌశిక ఋణగ్రస్తుండ నగుటగుణములదొంతి పల్కులమేలుబంతిపున్నె పింతుల యీలు పున కోజబంతియన్నుల తలకట్టు లందు సేమంతియగు నాదు నిల్లాలి హా! దయమాలితెగ నమ్ముకొందు వీధిని దాసిగానుచేరి రొక్కంబిచ్చి చెల్వను గొనుడివారణాసీ పౌర వరులార! మీరుమఱియు నో సౌభాగ్యమహితాత్ములార!సీ. జవదాటి యెఱుగ దీ యువతీలలామంబు పతిమాట రతనాల పైడిమూటఅడుగుదప్పి యెఱుంగ దత్తమామల యాజ్ఞ కసమానభక్తి దివ్యానురక్తిఅణుమాత్రమైన బొంకనుమాట యెఱుగ దీ కలుష విహీన నవ్వులకు నైనకోపం బెఱుంగ దీ గుణవితాన నితాంత యొరులెంత తన్ను దూఱుచున్న సుంతగీ. ఈ లతాంగి సమస్త భూపాలమకుటభవ్యమణికాంతి శబలిత పాదుడైనసార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్యదాసిగా నీపెఁ గొనరయ్య ధన్యులార!(పిమ్మట గేశవునితో గాల కౌశికుడు ప్రవేశించుచున్నాడు)కాల: ఓరీ! శిష్యా! ఎక్కడరా బానిసల విక్రయించునది?హరి: బ్రాహ్మణోత్తమా! ఇక్కడనే. మందభాగ్యుడనైన నేనే బానిసల విక్రయించు చున్నాడ.కాల: అట్లయిన నీవెవ్వడవు? ముందు చెప్పుము.హరి: నే నెవ్వండనైన మీకేమి?కాల: ఏమోయీ. పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతను నీ వెక్కడనో యెత్తుకొని వచ్చినట్లున్నావే! ఆఁ! నీవే దొంగతనము చేసినను సాగివచ్చుటకు నీ కాశికా పురమంత యరాజకముగ యున్నదనుకొంటివేమి? బోయవానికి రామచిలుక లాగున నీకీకాంత యెక్కడ చిక్కినది? ఫాలాక్షునంత వాడనైన నాకంటంబడి తప్పించుకొని బోవుట కల్ల. (శిష్యునితో) ఓరీ! కేశవా! నీవు పోయి మనయూరి తలారి పెద్ద యగు రామసింగును బిలుచుకొని రమ్ము. ఈ మ్రుచ్చును పట్టి యొప్పగింతము.హరి: అయ్యా! విప్రోత్తమా!గీ. ధరణిలో దొంగతనములో దొరతనములోభాగ్యవంతునకేదైన బాధలేదుపెన్నిధి యదృష్టమున నిరు పేదవానికబ్బినను దొంగసొమ్మంట కబ్బురంబె?కాల: ఏమీ! నీ యదృష్టమునకు దోడు నీకీ కాంత యెక్కడో లభించినదా?హరి: అదృష్టమున లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఈమె నాభార్య చంద్రమతి.కాల: ఏలాగూ! విశ్వామిత్రున కప్పుపడితినని యఱచినది నీవేనా? ఆలాగైన తపోధనుడైన యమ్ముని కీవెట్లు ఋణపడితివి?హరి: నారాజ్యసర్వస్వ మాతనికి ధారవోయునప్పుడు మున్నాతనికి యజ్ఞార్థమై ఇచ్చెదనన్న ధనము ముందు నిరూపింపకపోవుట వలన.కాల: పత్రము వ్రాసి పుచ్చుకొనినగాని యప్పుకాదు గదా! సాక్షులెవరైన నున్నారా?హరి: సత్యశీలమే పత్రము. మా యుభయుల చిత్తములే సాక్ష్యములు.కాల: ఓయీ యమాయకుడా! ప్రాణము లేని యీ పత్రమునకును సాక్ష్యములకును భయపడినిక్షేపము వంటి యిల్లాలి నమ్ముకొను చున్నావా? (ఆలోచించి) ఉండుండుము. నాకిప్పుడుమంచి యుపాయము తోచినది. నన్నా విశ్వామిత్రునొద్దకు దీసికొనిపోయి యీ ధనమునీకీయవలసినది కాదని పోరాడుము. నీ పక్షమున నేను న్యాయవాదిత్వము గైకొని రాయిగ్రుద్దుచు వాదింపగలను. ఓహో! ఒకరికిం బదుగురు సాక్షులుంచిన పత్రములనెగవేయుటలోను ద్రోవఁబ్రోవు వారిపై లేని యప్పులగట్టి ధనము గణించుటలోనునన్ను మించినవాడు మఱొక్కండు నీకు దొరకడు. పద, నేను నీకు సహాయుడనైయుండ విశ్వామిత్రుడును గిశ్వామిత్రుడును నిన్నేమి చేయగలడో చూతము.నక్ష: హరిశ్చంద్రా! నీ కిప్పుడు సహాయ సంపత్తి కూడ లభించినది! ఇంక రమ్ము.హరి: అయ్యలారా! మీ రిరువురును మహాబ్రాహ్మణులు కాని యూరకుండుడు. నా కెవ్వరి సహాయమక్కఱలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలయును గాని,మ. ఇటులెంతైన ధనంబు వచ్చినను రానీ గాధిరాట్సూతి నాకెటు కష్టంబుల దెచ్చెనేనియును దేనీ దివ్యభోగంబు లెన్నిటి నాకాజడదారి యిచ్చినను నీనీ, సత్యముం దప్ప నేనిటు సూర్యుండటుతోచెనేని వినుడోయీ మీరు ముమ్మాటికిన్.కాల: ఓహో! నీ వెంత సత్యవంతుడవైనను ధనము పట్ల గొంచెము సడలు విడవ వచ్చును. అందుకే "సర్వేజనాః కాంచన మాశ్రయంతి" యని పెద్దలు చెప్పు చున్నారు. నా యీ శాస్త్రప్రమాణ మంగీకరించి కౌశికునొద్దకు నడువుడు. చూడుము.క. ఆలాగున గౌశికుఁడేపాలయ్యె, ధనాశకింక వల దుడుగుము నీకేలా! యీ వేదాంతము?పా లొల్లని పిల్లి గలదె పరికింపంగన్?హరి: అయ్యా! ఏల మీకిన్ని మాటలు?కాల: సరి, నీకి బాగుపడు యోగము లేదు. తియ్యని చెఱకుపానకము నోట బోయుచుండ విషమని గ్రక్కువాని కెవ్వరేమి చెప్పగలరు. నీ యిష్టము. నీ భార్యనెంతకమ్మెదవు?హరి: నక్షత్రకా! చెప్పుము.నక్ష: ఓ కాలకౌశికుడా! వినుము.క. దంతావళంబు పయి బలవంతు డొక్కండు నిలిచి పైకిన్ రతనంబెంతటి దవ్వుగ రువ్వునోయంతటి యర్థంబు నిచ్చి యతివం గొనుమీ!కాల: ఓహో! కేశవుడా! ఇదేమి చవుకబేరము గాదురా!నక్ష: మఱి పంచాంగము కట్టకే వచ్చునేమి?కాల: ఏమిరా చెడుగా, మాయాయవారపు జోలె చూచి నన్ను ధనహీనునిగా గణించుచున్నావు కాని, దీనిని మా యింటికి బంపి వేయుము. ధనమిచ్చి వేయుదను. హరిశ్చంద్రా! సరియేగదా!హరి: అయ్యా! అట్లే.కాల: దాసీ! ఇక బద. కుఱ్ఱా! నడువుము. (బెత్తమున నదలించుచు)చంద్ర: అయ్యా! వచ్చుచున్నాను. (పతి పాదములపైఁ బడును)కేశ: దాసీ! నడువమేమి?చంద్ర: హా! మందభాగ్యనైన నేను నేటితో మీ దృష్టినుండి సయితము దొలగింపఁబడి పరాధీననై పోయితినే! ప్రాణపతీ! హరిశ్చంద్రా! నాకింక దిక్కెవరు?చ. పదపద యంచు బెత్తమున బ్రాహ్మణుఁ డిట్లదలించు చుండినన్బదమటు సాగకున్నది భవత్పద సారసభక్తి యందు నెమ్మది వశమౌట, చంద్రకర మర్దన మందుచునుండినన్ బదింబదిగ మరందలోలయయి పద్మముఁ బాయని భృంగికైవడిన్.అకటకటా! మిమ్ముఁ జూచు నవకాశము నాకు లేదు. నా యజమానుఁడింకను దొందరపడుచున్నాడు. ఈ స్వల్పకాలములోనే శుభదాయకం బగు మీమూర్తి గనులారఁ గాంచి పోయెదను. ప్రాణపతీ!సీ. కదలవే యని విప్రుఁడదలించుటకు మున్ను గనులార మీ మోముఁ గాననిండుపదవేమి యని వటుండదలించుటకు మున్నె మీ నోటి నుడి తేనెలాననిండునడువవేమని విప్రుఁడడలు వెట్టకమున్నె పొడము మీ కన్నీరుఁ దుడువనిండుసాగవేమని వటుల్లాగవచ్చుటకు ము న్నింపుగా మిముఁ గౌఁగిలింపనిండుగీ. పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ!కాలగతి మీకు దూరస్థురాల నగుచువెడలు కన్నీట బాదము ల్గడిగి మీకుఁబ్రణుతులిడుచున్న దాన సద్గుణ నిధాన!హరి: (నిర్వేదముతో) ఛీ! ఛీ! హరిశ్చంద్రా! నీవు నిక్కముగా గిరాతునకు జన్మింప వలసిన వాడవుగదా?గీ. గళమునం దాల్పవలసిన యలరుదండపాదమర్దన కొప్పించు భంగిగాగనఖిల సామ్రాజ్యభోగంబు లందఁదగినపట్టపుఁ దేవి నమ్మితే బానిసగను.చంద్ర: హృదయేశ్వరా! నాకై మీరింతగా దుఃఖింపవలదు. విధి విధాన మెవ్వరు తప్పింతురు? దుఃఖ మడంచుకొని యా కాలకౌశికుని సేవావృత్తికి నన్నిఁక సమ్మతించి పంపివేయుడు.హరి: దేవీ! ఇప్పుడనుమతించుటేమి? ఆగర్భశ్రీమంతురాలవైన నిన్ను బరున కెప్పుడు విక్రయించితినో యప్పుడే నా యనుమతులన్నియు దీఱినవి. కాని,మ. కనుసన్నన్ బనికత్తెలెల్ల నిరువంక\న్ గొల్వ రాణించు జీవనమే కాని యెఱుంగ వెప్డుఁ బర సేవాకృత్య మా జన్మమున్వనితా నేటికి నీకు నా వలన బ్రాప్తంబయ్యె నెట్లోపెదో?ఘనదుర్దాంత దురంతదుస్సహమహోగ్ర క్రూర దాస్యంబునన్.మానవతీ! రాణివాసంబు భోగభాగ్యంబులకు జెడి నూతనముగా దాసికావృత్తి నవ లంబింప బోవుచున్న నీకు గొంతచెప్పుచున్నాను. సావధానముగా నాకర్ణింపుము.మ. తల్లి దండ్రుల్ మఱి వేర లే రిక సతీ! తద్దంపతుల్గాక నీకిల, వేమఱపాటు సెందకుసుమీ యీ విప్ర సేవాకృతిన్దొలి నీ వొందిన భోగభాగ్యముల యందున్ జిత్తమున్ నిల్పకేతలలో నాలుకగా మెలంగుము నెలంతీ! పిన్నలన్ బెద్దలన్.మఱియు నో సాధ్వీమణి! నీ స్వామి కడనె బానిసీఁడుగ నుండవలసినవాడు గానఁ గుఱ్ఱవాని లోహితాస్యునెట్లు కాపాడుకొందువో? మనకు నేటితో దురంతమైన వియోగంబు సంభవించినది కదా! (లోహితాస్యునితో) నాయనా! లోహితాస్యా! నీవు కూడా నీ తల్లి ననుసరించి యుండవలసినవాడవే కాన నావెంట రాకుము.లోహి: నాన్నగారూ! మీ రెందుల కేడ్చుచున్నారు? మీ రిప్పుడెక్కడకు బోయెదరు?హరి: నాయనా! నే నెక్కడ బానిసీఁడుగా నుండవలెనో యక్కడికే.(దీనవృత్తము - హిందూస్థానీ భైరవి -ఆది తాళము)లోహి: జనకా! యిపుడెచ్చటి కేగకుమానను నీ వెనువెంటను గొనిపొమ్మాజననిన్ నను నిచ్చట బ్రాహ్మణుఁడేకొనిపోయిన మాకు సుఖంబగునే?హరి: తండ్రీ! (యెత్తుకొని) నీకు రావలసిన కష్టములా ఇవి?మ. కొడుకా! కష్టము లెన్ని వచ్చినను నీకున్నాకు నాకీడులందెడబాటు ల్ఘటింయింపకుండు టొక మేలే యంచు నే సంతసంబడితింగాని యెఱుంగనిన్నుఁ దెగనమ్మంజూపి హా లోహితా!కడ కీనాటికి గాలసర్పమునకుం గైకోలుఁ గావించుటన్.హా! తండ్రీ! నీ కమంగళము ప్రతిహత మగుగాక!(మరల) కడ కీనాటికి గాలకౌశికునకుం గైకోలుఁ గావించుటన్.దేవి నేనెంత దారుణమైన వాక్యము బల్కితిని.చంద్ర: నాథా! మనకు దుఃఖము శాంతించుగాక!గీ. కాలవశమున గల్గిన కష్టచయములెల్ల వెంటనే నిలుచునే యేక రీతిమిహిర మండలమును గప్పు మేఘరీతితూలిపోకుండునే యెల్ల కాలమటుల?అట్లే యచిరకాలమునకు మరల శుభములు వచ్చి పునస్సమాగమ సౌఖ్యము లభించకపోదు.హరి: దేవీ! భవితవ్యమును నెవ్వ రెఱుంగుదురు? చూడు.మ. కలికీ! ఱెక్కలురాని పిల్లలను సాకన్ గూటిలో నుండి మేతలకై పోతొక చెంత బెంటియొక చెంతన్ బాఱ నీలోన బిల్లలఁ బామే గ్రసియించునో వలల పాలన్ జిక్కునో పున్గులీయిలపైఁ బ్రాణులకున్ వియోగమగుచో నెవ్వారి కెవ్వారలో?కేశ: ఏమయ్యా! శుభమస్తు అని మాగురువుగారు దాసిని గొనుటేమి? మీరిట్లశుభముగా నేడ్చుటేమి? పద పద (అదలించును)లోహి: (కోపముతోఁ గేశవునిఁ జూచి) (స్రగ్విణీవృతము: బేహాగ్ - ఆది తాళము)ఏర! మాయమ్మని ట్లీడ్వ నీకేమిరాక్రూర! నిన్నిప్పుడే గ్రుద్దెదన్ జూడరా!దూరమందుండి మా తోడ మాట్లాడరా!శూరునిన్ లోహితున్ జూచి నోర్మూయరా!కేశ: ఓరీ! చెడుగా, దాసిపుత్రా! కూటికి లేకపోయినను నీకెంత రాజసమున్నదిరా? (పడఁద్రోయును)లోహి: (కన్నీరు కార్చుచుఁ దండ్రివంక జూచును)హరి: (దుఃఖముతోఁ గుమారు నెత్తుకొని) తండ్రీ! నీకెంత దురవస్థ వచ్చెనురా!మ: కనుదోయిన్ జడబాష్పము ల్దొరఁగ నాకై యేల వీక్షించెదోతనయా! నేను మహాకిరాతుఁడ సమస్తద్వీప భూమండలీజననాథాళికి సార్వభౌముడవుగా జాల్నిన్ను నీ దాస్యపుంబనికై యమ్మిన నాకు నెచ్చటిదయా ప్రారంభవిస్రంభముల్.కాల: ఓహో! యేమోయీ! నీకొడుకిట్లను చున్నాడే? ఇక మా ఇల్లల్లకల్లోలము చేయునా ఏమి?హరి: అయ్యా! ఇది కేవల బాల్య చాపల్యము. కాని నామనవి యొక్క టాలింపవలయు.కాల: అది యేమి?హరి: గీ. మీరు బిడ్డలఁ గని పెంచువారె యైనఁగడుపు కక్కుఱితిని నింతగా వచింతుఁబ్రేమ నీ బిడ్డలందొక బిడ్డగాఁగనరసి కొనుమయ్య వీనిఁ గృపాంబురాశి!(లోహితు నొప్పగించును)కాల: సరి, నీ యొప్పగింతలన్నియు నైనవా? ఇంక మా దాసినిఁ బంపివేయుము. మాకు జాగగుచున్నది.చంద్ర: (దుఃఖముతో) (సరసాంక వృత్తములు - ఫీలు రాగము)సెలవిచ్చి నన్బంపుడీ క్షితిపాలచంద్రా!నలవంత జెందకిఁక పావన సత్యసాంద్రా!హరి: కలకాల మీ గతిని దుఃఖముతో సుశీలా!తలపెట్టు టూఱడిలు నింతట ముద్దరాలా!చంద్ర: ఇక జాగుచేయదగదో నృపసార్వభౌమా!సకలం బెఱింగి యిటు లెస్సయ పుణ్యధామా!హరి: అకలంకశీల! నిను నిట్లలయించినాఁడన్మొగమెత్తి యెట్లు గననోపుదు సిగ్గు తోడన్.కాల: ఓహో! మీ ఏడ్పుతో మా పనులన్నియు జెడుచున్నవి. దాసీ కదలవేమి? మూటలెత్తుకొని రమ్ము.చంద్ర: (లోహితాస్యునితోఁ దిరిగి తిరిగి పతిం జూచుచుఁ బోవుచున్నది)హరి: హా! హా! నా పుణ్యలక్ష్మి దాఁటి పోయినది.నక్ష: హరిశ్చంద్రా! నీవు విశ్వేశ్వరదేవాలయము నొద్ద నుండుము. నేను ధన మందికొని వత్తును.(కాలకౌశికునితో నిష్క్రమించును. తెర వ్రాలును.)(పిమ్మట యవనిక నెత్తగాఁ గాలకంటకి గృహద్వారముకడఁ బ్రవేశించును)కాలకం: ఓరీ, యెవఁడురా? కేశవా! జనార్దనా! అంగడికిఁ బోయిన మా యాయన యింకను రాలేదుగా? కానీ(కాలకౌశికుడు, కేశవుడు, చంద్రమతి, లోహితాస్యుడును ప్రవేశించుచున్నారు)కాలకౌ: ఓరీ, కేశవా! అదిగో అరచుచున్నదిరో.కేశ: ఈనాఁడు మీ గ్రహచార మంతగా బాగున్నట్లు తోఁచదు.కాలకౌ: ఏమోరా నాయనా! నీవు మాత్రము మాముండతో నామీద గొండెములు చెప్పకేమి.(ఇల్లు చేరుదురు)కాలకం: వచ్చుచున్నావూ? రా, రా. (సమీపించును)చంద్ర: (స్వగతము) అకటకటా! ఏమీ ధూర్తయైన యీ విప్రాంగన వర్తనము! ఈవిడయే నా యజమానురాలు గాబోలు.కాలకం: దుర్మార్గుడా! నీ విల్లు వదలి యెంతసేపయినది? నీ కొఱకై పొయ్యార్పుకొని నేను గనిపెట్టుకొని యుండవలసినదా? ఈమధ్య నీకు బొత్తిగాఁ బ్రాయశ్చిత్త కర్మములు లేకుండ నున్నవి. నేఁడు నీకు మూఁడినది గానీ చెప్పు. (కీర్తన: ఫరజు - త్రిశ్రగతి)ఇంత పొద్దెక్కినదాక నీ వెక్కడ నుంటివి ఇంటికి రాక ॥ఇం॥కాలకౌ: యాయవార మెత్తినాఁడ సంతపోయి శవాలను మోసికొచ్చినాఁడ ॥యా॥కలకం: తెచ్చిన డబ్బేదో తెమ్ము నీ మ్రుచ్చుపోకిళ్ళను మెచ్చ రారమ్ముకాలకౌ: మూడెమాడలం దెచ్చి నాడ నీతోడు నాకింకను దొరకలేదేవాడకాలకం: అట్లైన నే నూరుకోను నీపొట్ట బద్దలుచేసి నెట్టివేయకపోను (కొట్టుచున్నది)కాలకౌ: అబ్బబ్బ నే నోర్వలేను యీ డబ్బునకు రేప యిబ్బడి ఈడ్చెదనేకాలకం: నీ వింక జాగరూకతతో మెలంగకున్న నీగతి యింతియే.కేశ: అమ్మా! కాలకంటకి నే డప్పుడే వదలి పెట్టినావే? ఇక్కడ చూడు.(చంద్రమతిని, లోహితాస్యుని చూపించును)కాలకౌ: ఓరీ, కేశవా! నీ పుణ్యము, నీ వూరుకోరా! (గడ్డముఁ బట్టి బ్రతిమాలును)కాలకం: ఇఁక నేనూరుకోను. ఈ నిర్భాగ్యురాలెవరు? చెప్పు. (కొట్టును)కాలకౌ: (గట్టిఁగాఁ జేతులు పట్టుకొనుచు) నీకడుపుకడ, ఇంక చంపకే!కాలకం: ఓరీ నీ చేతులు కాలిపోను! నీశక్తి మండిపోను! ముసలితనము వచ్చినను నీ కెంత మదమున్నదిరా! ఓ యెవరయ్య! నన్ను నామగఁడు చంపుచున్నాఁడు. రండయ్యా!(కేకలు వేయుచున్నది)కాలకౌ: (నోరుమూయుచు) ఓసీ, నీపుణ్యము. అఱవకే. సుకుమారివి, నీ వింటిలోఁ బనిచేసుకోలేవని దాసిని దెచ్చినాడను.కాలకం: ఆ మాట మొదటనే యేడువరాదా?చంద్ర: అమ్మా! కాలకంటకీ! ఇదియేమి న్యాయమమ్మా!క. పతిఁ గడవ సతికి, లేదొకగతి యాతండెంత మనకుఁ గైవసమైనన్మితి గలదు చనువునకు నీగతిఁ బ్రతికూలతకుఁ బాలు కావలదమ్మా.శా. ప్రత్యూషంబున లేచి నాథుని పదాబ్జాతంబుల్ వ్రాలుటోపత్యుద్దేశ మెఱింగి బోనముల సంబాళించుటో రాకకున్బ్రత్యుత్థాన మొనర్చి మెచ్చఁ దగు సేవల్ సేయుటో కాకిటుల్ప్రత్యాఖ్యాన మొనర్తురమ్మ సతమున్ బత్యాజ్ఞకున్ గేహినుల్?మఱియు,మ. పడతీ! నేనొక పాటిగాను వచియింపన్ నీవిభుండెంత నీయడుగు దాటఁడ యేని బత్తి మిగులన్ హత్తించి బంగారమేయొడలెల్లన్ దిగువేయునట్లుగను నీ వోరంక ప్రొద్దెల్ల మేలడ పాలూనుము, కాళులొత్తు మటుగా దాసీవరుల్ వీచుమా.కాలకం: ఓహో! నీ వెవ్వతివే? నాకు జక్కట్లు దిద్దుటకేనా నా మగండునిన్ను దీసికొనివచ్చినది? ఓహో! నాకు దాసివై వచ్చి దొరసాని వైతివేనీకుఁ దెలిసిన మగనాలి వర్తనాలు మాకు దెలియవేమి? గూటికివచ్చినదానవు చచ్చినట్లు పడియుండక శ్రీరంగనీతులు చెప్పుచు నామాటలోఁ బడియున్న నా మగనిబుద్ధి చెడఁ గొట్టుచున్నావుగా.కాలకౌ: చంద్రమతీ! నీ వెప్పుడు మాయావిదతో నిట్లు మాట్లాడరాదు.(రహస్యముగా) దీని నోటికి నూని కరణాలు, కాపులు గూడ వెఱచుచుచుందురు.చంద్ర: అయ్యా! నే నూఱకున్నాను.కాలకౌ: ఓసీ, యింటిదానా! నీకు నింత నిర్భయముగా మాట్లాడిన యీ దాసికిఁ దగిన పనులు నియమించి నీ కసి దీర్చుకొమ్ము.కాలకం: అట్లయిన పద, నీ పనిన్ చెప్పెద.(అందరు నిష్క్రమింతురు)(పిమ్మట నక్షత్రక ద్వితీయుండై హరిశ్చంద్రుడు ప్రవేశించుచున్నాడు)హరి: నక్షత్రేశ్వరా! నన్నింత యన్యాయము చేసెదవా?నక్ష: అడవులలో నన్నిన్నాళ్ళన్నమునకు నీళ్ళకును మొగము వాచునట్లు చేయుట నీది యన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్తెము నేను తీసికొనుట యన్యాయ మయ్యెనేమి? యెట్లు?ఉ. బత్తెము లేక త్రోవల విపత్తుల కోర్చుచుఁ దిండి కేనియున్బొత్తుగా వాచిపోయి గృహమున్ విడి నీ వెనువెంట రాఁగ నీతొత్తునె యింతకంటెను గతుల్మఱి మాకిఁక లెవె యేరికిన్మెత్తనివానిఁ జూచు నెడ మిక్కిలి మొత్తగఁ జిత్తమౌఁ గదా!హరి: నక్షత్రకా! మీ గురువుగారి పనిమీద నీవు నా వెంట వచ్చితివి కాని, నా కొఱకై వచ్చితివా? నా వలన బత్తెమే నీవు తీసికొనిన నీవు నీ గురువునకు జేసిన యుపకారమేమున్నది?నక్ష: ఓయి దుర్మార్గుడా! ఏమన్నావు? నేను నా గురువునకు జేసిన యుపకారమేమనియా?ఉ. ఆస దొరంగి ప్రాణముల కైన దెగించుచు నిట్టి బత్తెపుంగాసుల నాసచే దరువు కానిగ నీ పయి ఘోరకాననావాస మొనర్చ నొప్పుకొని వచ్చుటె నాయుపకార మాతపోభ్యాసికి నా వలెన్ వటుఁడెవం డిటు నెత్తురుకూటికొప్పెడిన్ఇప్పుడు నా గురుభక్తిని గూడ నధిక్షేపించుచున్నావుగా? నీ వేమైన ననుము. నీ భార్య నమ్మగా వచ్చిన ధనము బత్తెము క్రింద జెల్లవలసినదే. కాన నిక మా గురువుగారి ఋణమిప్పుడే యిచ్చివేయుము.హరి: వటూత్తమా! నేనిప్పుడింత ధనమెక్కడినుండి తెత్తునయ్యా?గీ. విమలశీలను నిల్లాలి విక్రయించిచేర్చిన ధనంబు నీ చేత జిక్కెను గదఅవని స్వశరీరమాత్ర వైభవుఁడ నగుచుబ్రతుకు చున్నట్టి నేనెట్లు బత్తెమిత్తు?నక్ష: నీ విట్టి నిర్భాగ్యుడ వనియే నేను దీపముండగనే చక్కంబెట్టుకొన్నాఁడ. ఓ హరిశ్చంద్రా! ఇటు వినుము.గీ. నీకు రానున్న బత్తెంపు రూకలెటులోస్వీకరించితి నే నిల్లు సేరవచ్చుముని ఋణమునకు మీరు మీరును బెనంగితుదకు నే గంగలోనైన దుముక బొండు(పోవుచున్నాడు)హరి: (చేయి పట్టుకొని) నక్షత్రకా! నీకిది బొత్తుగాఁ దగనిపని.నక్ష: ఏమోయి చేయి పట్టుకొనుచున్నావు? నన్నుఁ గొట్టుదువా యేమి?హరి: అయ్యా! నేనంత సాహసిని గాను.నక్ష: కాకున్న నా చేయి విడువుము.హరి: విడిచితిని. ఇంక నా సొమ్ము మీ గురువున కిచ్చి వేయుము.నక్ష: హరిశ్చంద్రా! నే నిన్ని మాటలవాఁడను గాను.క. అడియాస విడువు మిఁక నాయొడలన్ జీవంబు లున్న వొదమిన్ విడువన్జెడనెంచి తేని నినునాబొడ నీ యడిదమున గోయ మీఁరో గొనుమీ.హరి: నక్షత్రకా! ఇంతకన్న నేఁ జెడునదేమున్నది? నన్ను గూడ నమ్ముకొని మీ గురువు ఋణంబు రాబట్టుకొనుము.నక్ష: నిన్నెవ్వరిచ్చటఁ గొందురు?హరి: ఎవ్వరు గొనకున్న గడకుఁ గడజాతివానికైన నమ్మివేయుము.నక్ష: సరి నిన్ను గాదననేల. (నడచును)(ద్విపద - కీరవాణి రాగము - ఆది తాళము) అవధారుఁడయ్య యో యగ్రజులారసవన దీక్షితులార క్షత్రియులారద్రవిణేశు మించు నుత్తమ వైశ్యులారప్రవిమల గుణగణ్య పాదజులారకడలాక్రమించి యొక్కట భూమి నేలిసడినున్న యా హరిశ్చంద్రుడు నేఁడుబానిసీడుగ నమ్మంబడుచున్న వాఁడుమాననీయుడు సత్యమార్గ ధీరుండుకోరిన ధనమిచ్చి కొనఁ దగుసుండివారణాసి పౌరవరు లార రండి(ఆకసమువంకఁ జూచి) ఏమీ! ఇతఁడెట్టి వాడఁనుచున్నారా?సీ. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్ దాన మిచ్చిన యట్టి ధర్మ మూర్తినిజ యశశ్చంద్రికల్ నిఖిల దిక్కులయందుఁ బాఱఁజల్లిన యట్టి సారగుణుండుముల్లోకములను సమ్మోదింప భేతాళు మద మడంచిన విక్రమస్థిరుండుఅణుమాత్రమైన బొంకను మాట యెఱుగని యసమాన నిత్య సత్య వ్రతుండుగీ. ఏడు దీవుల నవలీల నేలినట్టిసాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తిబానిసీడుగ నమ్మంగఁ బడెడు కొనుఁడుపౌరులార మహాధనోదారులారహరి: ఎవరు కొనకున్నారు. ఇంకెంతని యఱిచెదరు? వీఁడెవఁడో కడజాతి వానివలె నున్నాఁడు. ఇటె వచ్చుచున్నాఁడు. ఉండుము.(పిమ్మట వీర బాహు ప్రవేశించుచున్నాఁడు)వీరబాహు: (గేయము)తొలగిపోనిండయ్య! దొరలు పెద్దింటోణ్ణితెరచి చెప్పకుంటే పలువ పొమ్మంటారు ॥తొ॥పబులు మీకుక్కల కట్టి వేస్కోండయ్యా ॥తొ॥గబగబ బౌవంచు కఱవ వత్తుండయ్యావాదనంటారు సూదోచ మంటారు నేకాచంత కల్లేసి కాటికి పోతుండ ॥తొ॥నక్ష: హరిశ్చంద్రా! ఇంక నిన్నెవ్వరు కొందురు?వీర: దొరా! బానిసోణ్ణి అమ్ముతుండవా? నే గొంటానండీ, ధర చెప్పండి.నక్ష: చెప్పెదను గాని నీవు దూరముగా నుండి మాట్లాడుము. నే నిప్పుడు స్నానము చేయలేను.వీర: దూరంగానే వుండానుండి, చెప్పండి.హరి: నక్షత్రకా! నన్నీ కడజాతి వానికే యమ్మెదవా?వీర: కడజాతియేముంది, పెద్దింటోణ్ణి.నక్ష: హరిశ్చంద్రా! ఎవ్వరు గొనంకున్న నన్నేమి చేయమందువు? మొత్తము మీఁదనీవు నా కిచ్చు బత్తెమునకు దండుగ లేకుండ నా వలన బనిపుచ్చుకొనుచున్నావు.అఱచి యఱచి గొంతు పగిలిపోవుచున్నది. తిరిగి తిరిగి కాళ్ళు పడిపోవుచున్నవి.హరి: అయ్యా! వీనికే విక్రయింపుడు. నే నన్నిటికి సిద్ధుఁడనై యున్నాను.నక్ష: ఓరీ! వీరబాహూ! నీ కీతఁడు కావలయునన్నక. దంతావళంబు పయి బలవంతు డొక్కండు నిలిచి పైకిన్ రతనంబెంతటి దవ్వుగ రువ్వునోయంతటి యర్థం బొసంగుమా కొని పొమ్మా!వీర: ఓరబ్బో! సాలదాకుండదే!నక్ష: ఇఁక నేమనుకున్నావు? వీరబాహూ! నీచేతఁ కాదు పోరా.వీర: అయ్యోరూ! యిట్లుండానని సూత్తుండావు కామసు! డబ్బిత్తా రా, రావయ్యా అరిశ్చంద్రుడా.నక్ష: హరిశ్చంద్రా! ఇఁకబొమ్ము. నీఋణము తీఱినది.హరి: నక్షత్రేశ్వరా! నేఁనిక సెలవు పుచ్చుకొనియెద. ఎక్కడనో నిశ్చింతతోఁ దపం బాచరించుకొను నీవు గూడ నా మూలమున ఘోరారణ్యములఁ బడరాని పాట్లు పడితివి. క్షమింపుఁడు. వటూత్తమా! నమస్కారము.నక్ష: (స్వ) అయ్యో! నే నిప్పుడేమని యీ ధర్మమూర్తికిఁ బ్రత్యుత్తర మిచ్చెదను?ఇట్టి పరమ శాంతుని సత్యవంతుని నేనెంతఁ జేసితిని.(ప్రకాశముగా) హరిశ్చంద్రా! నేనే నీ కన్ని విధములఁ గష్టములఁ దెచ్చి పెట్టినదుష్టుఁడను. నేను నిన్నడుగు కొనవలసిన క్షమాపణములు నీవు నన్నడుగు కొనుచున్నావు.అయినను బుట్టినదాదిననన్య సామాన్యమైన సత్యనిష్ఠాగరిష్ఠతచేఁ బరిశుద్ధమైననీ మానసమున కింతటి క్షోభ దెచ్చి పెట్టిన నాయట్టి ఘోరకర్ముడు శిక్షార్హుండు గాకక్షమాపణమునకు దగునా?హరి: అయ్యో, విప్రోత్తమా! శిక్షించుటకుఁ గాని, క్షమించుటకుఁ గాని నేనెంతటి వాఁడను. వటుశిఖామణీ! నీకిదే వందనము. (నమస్కరించును)నక్ష: (లేవనెత్తి)చ. కలతఁ వహింపకయ్య కల కాలము కష్టము లుండబోవు కావలసిన కారణార్థము లవంబును దప్పునె? నా యకృత్యముల్దలఁపున నుంచకయ్య విహితమ్ము ననున్ క్షమింపుమయ్య, నాకలుషమె యింత కింత కధికమ్మయి నన్వధియింపకుండునే?హరి: అయ్యా! మీరు చేసిన దేమున్నది? నా పూర్వభవసంచిత పాపఫలమే నన్నీ కష్టంబులకుఁ దెచ్చె.నక్ష: రాజేంద్రా! నిత్య సత్య సంధుడవైన నీ కెప్పటికిని గష్టములు లేవు చూడు.మ. కడకన్ గావలెనంచు సత్యఫలముం గాంక్షించి నీవే యొడంబడి కైకొన్న విపత్తులం బరితపిం పన్ గూడదయ్యా కడుంగడుదోసంబని నేనెఱింగియు వృథా క్రౌర్యంబునన్ నీ యెడన

పాండవోద్యోగ విజయాలుఅర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుని సహాయమర్ధించుటకు వచ్చుటఅర్జునుడు: దృపదుని పంపునన్ జనె పురోహితు డా ధృతరాష్ట్ర సూతి బల్కపటి; వినండు; సంధి జెడగా గమకించెడు గాని; తప్పదా-లపు బని; సర్వమున్ గడప లావు గలండు యశోద పట్టి; యారిపు జన కాలు తోడుత వహించెద, సర్వము నిర్వహించెదన్అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, నయ్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళాభ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్.జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పంక్తుల కెవ్వాని పదాబ్జ పీఠి కడు నిగ్గుల్ గూర్చు దత్సన్నిధిస్థలి గూర్చుండి భవంబు పావనముగా దైవార గావించి నాతొలి జన్మంబున గూడు పాపముల నాందోళింపగా జేసెదన్.కృష్ణుడు (అర్జునునితో): ఎక్కడనుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశోభాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్జక్కగ నున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్దక్కక నిల్చి శాంతుగతి దాను జరించునె తెల్పు మర్జునా!కృష్ణుడు (దుర్యోధనునితో): బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్?నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్దుర్యోధనుడు (కృష్ణునితో): కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ యయ్యె, మాకు నవ్వారికి గూడ నెక్కుడగు బంధు సముద్రుడ వీవు గాన, నీచేరిక మాకు నిర్వురకు సేమము గూర్చెడిదౌట, సాయమున్గోరగ నేగుదెంచితిమి గోపకులైక-శిరో విభూషణా !కృష్ణుడు (దుర్యోధనునితో): ముందుగ వచ్చి తీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్,బందుగులన్న యంశ మది పాయక నిల్చె సహాయ మిర్వురన్జెందుట పాడి, మీకు నయి చేసెద సైన్య విభాగ మందు మీకున్ దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు మున్నుగన్.అన్ని యెడలను నాకు దీటైన వారుగోపకులు పదివేవు రకుంఠ బలులుగలరు నారాయణాఖ్య జెన్నలరువారు,వార లొకవైపు నేనొక్క వైపు మరియు.యుద్ధ మొనరింత్రు వార లబద్ధ మ్మెందులకు ? నేను బరమాప్తుడనైయుద్ధమ్ము త్రోవ బోవకబుద్ధికి దోచిన సహాయమును బొనరింతున్.దుర్యోధనుడు (స్వగతం): ఆయుధము పట్టడట! యనిసేయండట! "కంచి గరుడ సేవ" యితనిచేనేయుపకృతి యుద్ధార్థికినేయెడ నగు! నిట్టి వాని నెవ్వండు గొనున్.కృష్ణుడు (అర్జునునితో): ఆయుధమున్ ధరింప నని కగ్గముగా నొకపట్ల నూరకేసాయము సేయువాడ, బెలుచన్ నను బిమ్మట నెగ్గు లాడినన్దోయిలి యొగ్గుదున్, నిజము, తొల్త వచించితి గోరికొమ్ము నీకేయది యిష్టమో, కడమ యీతని పాలగు బాండునందనా.అర్జునుడు (కృష్ణునితో): నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ-ధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి జేసి నాస్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము దప్పు గాక, నీవెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా !రథము నందెన్ని చిత్రంపు బ్రతిమ లుండవందు శివుడును విష్ణువు నజుడు నెల్లదేవతలు నుండవచ్చు, నా ఠీవి గృష్ణుడర్జున స్యందన విభూష యగును గాక !కృష్ణుడు (అర్జునునితో): "ఆలము సేయ నే" నని యదార్థము బల్కితి జుమ్మి, యిట్టి గోపాలుని నన్ను గోరితివి, భండన పండితులగ్నితేజు లు-త్తాల ధనుర్ధరుల్, బహుశతప్రమితుల్ యదుసింహు లందఱిన్బాలుగ గైకొనెన్ గురునృపాలుడు, బాలుడవైతి వక్కటా !అర్జునుడు (కృష్ణునితో): "ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ! యాల జాతికిన్దిన్నది పుష్టి" నీ వరుగుదెంచి రథంబున నున్న జాలు, నేసున్నము జేసెదన్ రిపుల చూపఱు లద్భుత మంద, సర్వ లో-కోన్నత! నాకు బేరొసగు, మూరక చూచుచునుండు మచ్యుతా !కృష్ణుడు (అర్జునునితో): ఊరక చూచుచుండు మను టొప్పితి గాని భవద్ రథస్థు నన్బారగ జూచి నీ రిపులు పక్కున నవ్వి యనాదరింతు రాశూరకులంబు మెచ్చ రిపుసూదనతాభర మూను నీకు నేసారధినై, యికన్ విజయసారధి నామమునన్ జరించెదన్అర్జునుడు (కృష్ణునితో): సారధి యంట! వేదముల సారము శౌరి, తదంఘ్రి భక్తి చెన్నారెడు క్రీడి తా రధికుడౌనట! చిందము విల్లు దేరునున్వారువముల్ మొదల్ దివిజవర్గ మొసంగిన వంట ! యస్త్ర వి-స్తార గురుల్ శివాదులట, సంగరమం దెవడాగ జాలెడిన్.కృష్ణుడు (అర్జునునితో): వచ్చెడి వాడు గాడతడు వారికి మీకును గూడ దోడు, వి-వ్వచ్చుడ, యమ్మహామహుని భావము మున్నె యెఱింగినాడ, నాసచ్చరితుండు మీకు దగ సంధి పొసంగిన సంతసించు, నాయిచ్చయు నట్టిదే, మన నరేంద్రుని యిచ్చయు గూడ నట్టిదే.రాయబారనునకు ముందు కృష్ణుడు పాండవులతో సంభాషించుటధర్మరాజు (కృష్ణునితో): ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేఱ కెల్ల చు-ట్టాలును రూపుమాయ కకటా ! యిల దక్కునె ! దక్క నిత్తురే ?చాలును రాజ్యభాగము, ప్రజల్ సుఖియించిన నాకు జాలు, నేజాలక కాదు సూవె ! తిన జాలను నెత్తురు కూడు మాధవా !కృష్ణుడు (ధర్మరాజుతో): మాయదురోదరంబున నమాయికునిన్ నిను గెల్చి కాంతకున్జేయగ రాని యంత పని జేసి యరణ్యములోని కంపియున్హాయిగ నుండనీక బలులై పలునెగ్గులు పన్నుచున్న యాదాయలు చత్తు రంచు దయ దాల్చెద వెంతటి ధర్మరాజవో ?భీముడు: అనుపమ విక్రమ క్రమ సహాయుల కంతటి పాండు రాజనందనులకు నొక్క కూళ భరణం బిడు చాడ్పున నూళులైదు నిచ్చునట ! కటా ! యటుల్ బ్రదుక జూచుట రాచ కొలంబు వారికిన్ఘనతయె ? మంత్ర రుద్ధ భుజగంబ నిసీ ! యిపుడేమి చేయుదున్కృష్ణుడు (భీమునితో): నిదుర వోచుంటివో ! లేక బెదరి పల్కుచుంటివో ? కాక నీవు తొల్లింటి భీమసేనుడవె కావొ ! యెన్న డీ చెవులు వినని,కనులు చూడని శాంతంబు గానవచ్చె."కురుపతి పెందొడల్ విఱుగ గొట్టెద ఱొమ్ము పగిల్చి వెచ్చ నె-త్తురు కడుపార గ్రోలి యని దున్మెద దుష్టుని దుస్ససేను భీకర గదచేత" నంచును బ్రగల్భము లాడితి-వల్ల కొల్వులోమరల నిదేల యీ పిఱికి మానిసి పల్కులు మృష్ట భోజనా !భీముడు (కృష్ణునితో): బకునిం జంపితి, రూపు మాపితి హిడింబా సోదరున్, దుష్ట కీ-చకులం దున్మితి మొన్న నూర్గుర, జరాసంధుం్ దురాసంధు నేనొకడం జంపితి నాకు భీమునకు వేఱొక్కండు తోడేల ! యెన్నక నన్నీగతి బోరికిం బెదరు చున్నాడం చనం బాడియే ?ధర్మరాజు (భీమునితో): తాతయు నొజ్జయున్ గురులు దక్కిన జోదులు చూచుచుండగాబాతకు లీడ బోక మన భార్యను బట్టి పరాభవింప నానాతికి మానరక్షణ మొనర్చిన యట్టి మహోపకారి నిన్నీతడు శౌర్యహీనుడని యీరసిమాడిన లోపమున్నదే.జూదరియై కళత్రమును శోకము పాలొనరించి తల్లి దాయాదుల యింట నుండగ మహాటవి వాలయి తమ్ము-గుఱ్ఱలంగాదిలి పెండ్లమున్ వెతల గ్రాంచిన యీబరి యుండ మాని యిం-దేదియు లేని భీముపయి కేగెద వేల గదా ప్రహారమా !కృష్ణుడు (భీమునితో): భీకరమై యగాధమయి భీష్మ గురు ప్రముఖోపలా-కులంబౌ కురురాట్చమూజలధి కడ్డముగా జనగా భవచ్చమూనౌకను ద్రిప్పగా దగిన నావికు డెవ్వడు ! నీవు లేక యీశోకము తీఱునే ద్రుపద సూతికి నిక్కము వాయునందనా !ద్రౌపది (కృష్ణునితో): (థెసె థ్రీ ఫ్రొం భారతము)*** వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి నందు బాండు భూవరునకు గోడలైతి జనవంద్యుల బొందితి నీతి విక్రమస్థిరులగు పుత్రులం బడసితిన్ సహజన్ముల ప్రాపు గాంచితిన్సరసిజనాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్.*** నీవు సుభద్ర కంటె గడు నెయ్యము గారవముందలిర్ప సం-భావన-సేయుదిట్టినను బంకజనాభ ! యొకండు రాజసూయావబృధంబు నందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీయేవురు జూడగా సభకు నీడ్చె-గులాంగన నిట్లొనర్తురే .*** ఇవి దుస్ససేను వ్రేళ్ళందవిలి సగము ద్రెవ్వి పోయి దక్కినయవి కౌరవులకడ దీరు మాటలయవసరమున దలప వలయు నచ్యుత వీనిన్భీముడు (ధృతరాష్ట్రునికి చెప్పమని): దొర యొక్కండన నేటి మాట ? బలవంతుం డెవ్వడో వాని దీధర, పోరన్ జయమో పరాజయమొ రాదా ? గెల్చి రాజన్యులందరు మెచ్చన్ ధర యేలు కొంద మటు కాదా ? చచ్చి స్వర్గంబునందిరుగన్ వచ్చును మంచి క్షత్రియుల కింతే యొండు లే దెచ్చటన్ఆలములోన నీ సుతుల నందఱి నొక్క గదా భుజంగికిన్బాలొనరించి వచ్చిన నృపాలురు చూడగ నిచ్చువాడ నేనూళులు తిండికిన్ బ్రతికి యుండిన మీకును "దాసి" వంచు బాం-చాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతీ వధూతికిన్ .కృష్ణుడు (ధర్మరాజుతో): నాల్గు పయోధులో యనగ నాలుగు దిక్కరులో యనంగ నీనల్గురు తమ్ములున్ బ్రమథ నాథ సమానులు, యుద్ధ రంగ మం-దల్గిన నెవ్వడోప-గలడయ్య ! భవత్పరిభావ వహ్నికిన్గల్గిన వృద్ధి యింక రిపు కాంతల బాష్పము లార్ప జూడుమా .ఐనను బోయి రావలయు హస్తిన, కచ్చటి సంధిమాట యెట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీమానసమందు గల్గు ననుమానము దీర్పగ వచ్చు దత్సమా-ధానము మీ విధానమును తాతయు నొజ్జయు విందురెల్లరున్ .ధర్మరాజు (కృష్ణునితో): సంధి యొనర్చి మా భరత సంతతి నిల్పుము, లేద యేని గర్వాంధుల ధార్త రాష్ట్రుల సహాయులతో దునిపింపు మో జగద్బాంధవ ! రెండు కర్జముల భారము బెట్టితిమయ్య ! నీ భుజస్కంధమునందు, దారసిలు గావుత మాకు యశంబొ, రాజ్యమో .కృష్ణుడు కౌరవ సభలో చేసిన రాయబారంకృష్ణుడు: తమ్ముని కొడుకులు సగపా-లిమ్మనిరటు లిష్ట పడవదేనియు నైదూళ్ళిమ్మని రైదుగురకు ధ-ర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్తనయుల వినిచెదవో నీతనయులతో నేమి యని స్వతంత్రించెదవోచనుమొక రీతిని లేదే-నని యగు వంశ క్షయంబు నగు కురునాధాపతితులు కారు నీ ఎడల భక్తులు శుంఠలు కారు విద్యలన్చతురులు మంచివారు నృప సంతతికిన్ తల లోని నాల్కల-చ్యుతునికి గూర్చువారు రణ సూరులు పాండవులట్టివారలీగతి నతి దీనులై యడుగగా నిక నేటికి సంశయింపగన్?జండాపై కపి రాజు ముందు సిత వాజి శ్రేణినిం గూర్చి నేదండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడొక్కండున్ నీ మొర నాలకింపడు కురు క్ష్మానాథ సంధింపగాన్ !!చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచి రందరున్తొల్లి గతించె నేడు నను దూతగ వంపిరి సంధి సేయ నీపిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ సంధి సేసెదోయెల్లి రణంబు గూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా !!అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడేయలిగిన నాడు సాగరము లన్నియునేకము కాక పోవు కర్ణులు పది వేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నాపలుకుల విశ్వసింపుము విపన్నుల నార్తుల గావుమెల్లెడన్సంతోషంబున సంధి సేయుదురె వస్త్రంబూడ్చుచొ ద్రౌపదీ-కాంతన్ జూసిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీపొంతన్ నీ సహ జన్ము రొమ్ము రుధిరంబుం ద్రావు నాడేని ని-శ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించు నాడేనియున్
(కృష్ణుడు భీముడితో రాయభారానికి వెళ్లేముందు )నిదురవో చుంటివో ! లేక బెదరి పలుకుచుంటివో! కాక తొల్లింటి భీమసేనుడవే కావో,అవ్వ! ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే, నిదురవో చుంటివో !కురుపతి పెందొడల్ విరుగగొట్టెద, రొమ్ము పగల్చి వెచ్చనెత్తురు కడుపార గ్రోలిదుర్మద దుష్టుని దుస్ససేనును భీకర గధచేత యని ప్రగల్భము లాడితివి అల్ల కొల్వులోమరల ఇదేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్టభోజనానిదురవో చుంటివో ! లేక బెదరి పలుకుచుంటివో ! కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో !(అర్జునుడు కృష్ణునితో రాయభారానికి వెళ్లేముందు )పాలడుగంగ కౌరవ పాలికింబోవ పాలు తెరంగెరింగింపుముభీమ భూపాలుని పాలు తాను, తన పాలిటి రాజ్యము అన్నపాలుభూపాల కుమారవర్గమది ఒక పాలది మా అభిమన్యుపాలునా పాలు సమస్త సైన్యమని తెల్పుము పంకజనాభ అచటన్(కృష్ణుడు పాండవులతో రాయభారానికి వెళ్లేముందు )ఐనను పోయిలావలయు హస్తినకు, అచట సంధి మాట ఎట్లైననుశత్రురాజుల బలాబల సంపద చూడగవచ్చు , మీ విధానము, తత్సమాధానమునుతాతయు, ఒజ్జయు విందు రెల్లరున్. ఐనను పోయిలావలయు హస్తినకు.(కృష్ణుడు కురు సభలో రాయభారానికి వచ్చి )తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్ట పడవరేని ఐదూళ్లిమనిరి ఐదుగురకుధర్మంబుగా నీతోచినట్లనుపుము వారిన్తనయుల వినిచెదవో లేక ఈ తనయులతో యేమియని స్వతంత్రించెదవోచనుమొక దారిని లేదేని అనియగు వంశక్షయంబునగు కురునాధా(ఒకవేళ మీకీ సంధి ఆమోదయోగ్యం కానియెడల జరుగబోవు విపరీత విపత్కర పరిణామములు కూడా తెలియజెప్పెదను వినుము)చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరున్, తొల్లి గతించె, నేడు నను దూతగా బంపిరి సంధిసేయ, మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింప పొందుచేసెదో యెల్లి రణంబె కూర్చెదవో ఏర్పడజెప్పుము కౌరవేశ్వరా.(అటుల సంధికొడంబడని యేని )అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే అలిగిననాడుసాగారములన్నియు ఏకము గాకపోవు హ! ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావుమెల్లరున్జెండాపై కపిరాజు ముందు శ్రితవాజిశ్రేణియున్ పూన్చి నే దండంబుంగొని తోలు శ్యందనముమీదన్ నారిసారించుచును గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మీ మూకన్ చ్చెండుచున్నప్పుడు ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము ఒక్కండును ఒక్కండును నీమొర ఆలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్సంతోషమ్మున సంధి సేయుదురే ! వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ కాంతన్ జూచి చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ నీ సహజన్ము రొమ్ము రుధిరమ్మున్ ద్రావునాడైన సంతోషమ్మున సంధి సేయుదురే ! నిశ్చిన్తన్ తద్గధయున్ ద్వదూరుయుగమున్ చ్చేధించు నాడేనియున్, హహహ.. సంతోషమ్మున సంధి సేయుదురే !(కృష్ణుని రాయభారానికి సుయోధనుని ప్రత్యుత్తరం )(ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్లిమ్మని ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !)సమరము సేయరే బలము చాలిన నల్వురు చూచుచుండ పెండ్లము పెరవారిచేకటకటంబడ చూచుచు ఊరకుందురే ! మమతయు , గొంకు, మానమవమానమునుసిగ్గును లేనివారి నెయ్యం తగునయ్యా , అవ్వ ! భూమిపతులందరూ నవ్వర టయ్యా సంధిచేసినన్.(కృష్ణుడు తనని సాయమడగటానికి వచ్చిన అర్జునిడిని చూసి )అర్జున నీవా ...)ఎక్కడనుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులేకదా ? యశోభాక్కులు నీదు అన్నలును ,భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగా నున్నవారే ? భుజశాలి వృకోడరుడగ్రజాజ్ఞకు దక్కగనిల్చి శాంతిగతి తాను చరింతునే తెల్పుమర్జునా .(కృష్ణుడు తనని సాయమడగటానికి వచ్చిన సుయోధనుడిని చూసి )బావా ఎప్పుడు వచితివీవు ? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ ? నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్(దుర్యోధనుడు కృష్ణుడి తో )కౌరవ పాండవుల్ పెనగుకలము చేరువ అయ్యే మాకును అవ్వారికిని ఎక్కుడగుబంధుసముద్రుడ వీవుగాన సాయముగోరగా యేగుదెంచితిని గోపకులైకశిరోవిభూషణకౌరవ పాండవుల్ పెనగుకలము చేరువ అయ్యే .(కృష్ణుడు సుయోధనుడితో )ముందుగ వచ్చితీవు, మునుముందుగ అర్జుని నేను జూచితినిబందుగులన్న అంశమది పాయకనిల్చె , సహాయమిర్వురున్ చెందుట పాడిమీకునైజేసెద సైన్య విభాగంబు అందు మీకున్ మీకున్ తగు దాని గైకొనుడుబావా, కోరుట బాలుని కొప్పు ముందుగన్ఆయుధమున్ ధరింప అని ఖగ్గముగా ఒకపట్ల ఊరకే సాయముచేయువాడపెలుచన్నను పిమ్మట యెగ్గులాడినన్ దోయిలియొగ్గుదున్ నిజము దొల్త వచించితి కోరికొమ్ము నీకేయది ఇష్టమో కడమ యీతనిపాలగు పాండునందనా.(అర్జునుడు కృష్ణుడి తో)నందకుమార యుద్ధమున నా రధమందు వసింపుమయ్యమధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మిజేసి నా స్యందనమొప్పుదుగాకరిపు సంతతి తేజము తప్పుదుగాక నీ వెందును ఆయుధమ్ము దరికేగమికొప్పుదుగాక కేశవా(కృష్ణుడు కర్ణుడిని పాండవుల పక్షం చేరమని ప్రలోభపెట్టే సన్నివేశంలో )అంచితులయిన బంధుగుల అందరిముందు చెప్పి నిన్ను మెచ్చించెదకుంతిచేత రవిచేత ఇది నిజంబు నిజంబని నీకు సాక్ష్యమిప్పించెదఫల్గుణ ప్రముఖ వీరులు గొల్వగా ఎల్లభూమి యేలించెద అచ్చకీర్తివిమలీకృత సర్వదిగంతంబునన్(బావా ! నీవిక సూతపుత్రుడివిగా సుయోధన దయాలబ్ధమైన అంగ రాజ్యధినేతవుగామనవలసిన అవసరములేదు. పవిత్ర చంద్రవంశోద్భవుడవై చతుసముద్రముద్రిక ధరావలయాన్ని పరిపాలించావలిసిన సమయం ఆసన్నమైనది )యే సతి వహ్నిలోన జనియించెనో జన్న మొనర్చు వేళమున్నేసతి పెండ్లినాడు నృపులెల్ల పరాజితులైరి కిరీటిచేయే సతి మీది మొహమున ఇంతలు జేసిరి రాజు నీవునిన్నాసతి పెండ్లియాడగలదు ఆరవ భర్తగా సూర్యనందన(కర్ణుడు కృష్ణుడితో )(శ్రీకృష్ణ పరమాత్ముడవైన నీకీ చేతలు సాద్యం కావచ్చు కాని మానవమాత్రుడనైననాకు అవుననే సాహసం లేదు )సూతుని చేతికిన్ దొరికి ఆసూతకళత్రము పాలుద్రావిసూతుని అన్నమున్గుడిచి సూత కులాంగన యందు నందనంవ్రాతము గాంచినేటికొక రాజకుమారుడనంచు దెల్ప నా చేతము సమ్మతించునే ఇస్సీ ఎవ్వరేగతి సిన్గ్గుమాలినన్(అతి పవిత్రమైన నడవడిక తో మానవోచిత ధర్మకర్మబద్ధుడనై ఇంతవరకు మనుగడ సాగించాను ఈ వయస్సులో సామాన్య మానవ ప్రలోభాలకు లోనై ధర్మ ద్వంసం చేయలేను. పతివ్రతను మాతృ సమానురాలైన మానవతిని నా మరదలిని, కృష్ణా ! ఆలిగా అంగీకరించలేను )కామము చేతను గాని భయ కంపిత చిత్తము చేతగానిఈ భూమి సమస్తము నేలుకొను పూనిక చేతనెగానినేను నా సేమమెగోరి చుట్టముల, స్నేహితులన్ విడనాడిమత్స్వామి సుయోధనున్ విడచి వత్తునే హహః వచ్చిన మెత్తురే జనుల్కృష్ణావతారం(శ్రీకృష్ణ స్తోత్రం )శృంగారరస సర్వస్వం సిఖిపింఛ విభూషణంఅంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయంఆశ్రయే భువనాశ్రయం(శ్రీకృష్ణుడు అర్జునిడి తో)ఊరక చూచుచుండమనుట ఒప్పుదుగాని భవత్గ్రహస్తు నన్బారగాజూచి నీరిపులు ఫక్కున నవ్వి అనాదరింతురుఆశూరకులంబు మెచ్చ రిపుసూధన తాబరమూను నీకు నే సారధినైవిజయసారధి నామంబునన్ చరించెదన్.. విజయసారధి నామంబునన్ చరించెదన్(శ్రీకృష్ణుడు ఆశ్వత్హామ తో కర్ణుడి గురించి )సేవా ధర్మము సూత ధర్మము రాశీభూతమైవొప్పవాచావాత్సల్యము జూపే కర్ణుడిటు మాత్సర్యంబు మీకేలరాజేవేళన్ మిముగోరునో అనికి నాడే పొండు పోరాడలేదా.. వర్జింపుడు కర్ణు చావువరకో ఆధ్యంతమో యుద్ధమున్వాచావాత్సల్యము జూపే కర్ణుడిటు(భగవత్గీత తెలుగు లో క్లుప్తంగా )తనువుతో కలుగు భాంధవ్యమ్ములెల్ల తనువుతో నశియించి ధరణిలో గలియుతనువనిత్యము నిత్యమ్ము ఆత్మ ఒకటే.చినికి జీర్ణములైన చేలముల్ వదలి క్రొత్త వలువలు గట్టికొన్నట్టి రీతికర్మానుగతి ఒక్క కాయమ్ము వదలి వేరొక్క తనువు ప్రవేశించు నాత్మఆత్మకు ఆదియు అంతమ్ము లేదు అది గాలికెండదు, అంబుతో తెగదు,నీట నానదు అగ్ని నీరైపోదుకరుణా విషాదాలు కలిగించునట్టి అహమ్మును మమకారమావలనెట్టిమోహమ్ము వీడి ప్రబుద్ధుడవగుమాఒక్కడు చంపు వేరొక్కడు చచ్చుననుమాట పొరపాటు, ఆ భ్రాంతి విడువుముపురుషుల ఉత్తమపురుషుండ నేనే కనులకు దోచు జగమ్ము నేనే జగదాత్మను నేనేజగము సృజియించి పోషించి లయమును గావింతు నేనేస్వార్ధమ్మునకు ధర్మమాహుతిజేసి మదమత్సులై పేరు మానవకోటి నాసంము జేయ సంకల్పించినాడ ఈ రణయజ్ఞమ్ము నెవ్వరు ఆపలేరు మృత్యు ముఖమ్ములో మెదగుచున్న రాజలోకమును రక్షింపలేరునాచేత హతులైన నరనాయకులను వందింప నిమిత్త మాత్రుండ వీవు భీష్మాది కౌరవ వీరలోకంబు నా గర్భమున మహానలకీనలందు కాలుచున్నారు ఇదే కనుము కౌంతేయానర్తనశాల(అర్జునుడి ఊర్వశికి ద్రౌపది పాండవుల బంధాన్ని వివిరిస్తూ)ఆడితప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనానపడతికి ఈశ్వరు డొసగిన వరబలాన నడచుచున్నట్టి ధర్మబంధమది వనితా(బృహన్నాల ద్రౌపది కి ధర్మరాజు గొప్పతనాన్ని వివరిస్తూ )ఎవ్వని వాకిట ఇహపర పంఖంబు రాజభూషణ రజోరాజినడగుఎవ్వాని చారిత్రమెల్ల లోకములకు ఒజ్జయై వినయంబు నొరపుగరపుఎవ్వాని కడకంట నిర్వచుల్లెడిచూవె మానిటసంపదలీనుచుండుఎవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకుఅతడు భూరిప్రతాప మహాప్రదీప దూరవికటిత గర్వాంధకార వైరివీర కోటీరమనిగ్రుని వేష్టితాంగితనుడు కేవలమత్యుడే ధర్మసుతుడు(అర్జునుడు ఉత్తర కుమారునికి కౌరవసేనలోని వీరులను చూపిస్తూ )అదిగోకాంచనమయవేదికా కనక్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండుసింహలాంగూల భూషితనభోభాగ కేతు ప్రేంఘనమువాడు ద్రోణసుతుడుకనక గోవృష సాంద్రకాంతి పరిష్కృత ధ్వజ సముల్లాసంబువాడు కృపుడులలిత కంబుప్రభాకలిత పతాకావిహారంబువాడు రాధాత్మజుండుమణిమయోరథ రుతిజాలమహితమైన పడగవాడు కురుక్షితిపతిమహొగ్రశిఖర ఘనతాళతరువగు శిరమువాడు సురనరీసూనుడు ఎర్పడజూచికొనుము(అర్జునుడు సుయోధనుడితో యుద్ధం చేసేముందు)ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల జాలగలరేమణిమయంబైన భూషణజాలములనొప్పి యెడ్దోల గంబున నుండగలరేకర్పూరచందన కస్తూరికాదుల ఇంపుసొంపార భోగింపగలరేఅతిమనోహరలగు చతురాంగనలతోడ సంగతివేడ్కలు సలుపగలరేకయ్యముననోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధిమరలి ఈ తనువు విడచిసుగతివడయుము తొల్లింట చూరగలరే, జూదమిచ్చటనాడంగరాదు సుమ్ము
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే? మదనములకు నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే ? తరంగిణులకు లలితా రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే? కుటజములకు బూర్నేందు చంద్రికా స్పురిత చకోరకమ్మరుగునే? సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనా మృత పాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?వినుత గుణశీల ! మాటలు వేయునేల ?
19, మార్చి 2020, గురువారం
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!గతమెంతో ఘనకీర్తి గలవోడా!వీర రక్తపుధార, వారవోసిన సీమ పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్ర పాపయ గూడ నీవోడోయ్ నాయకి నాగమ్మ, మల్లమాంబా, మొల్ల మగువ మాంచాల నీతోడ బుట్టినవోళ్ళే వీరవనితలగన్న తల్లేరా!ధీరమాతల జన్మభూమేరా! కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మతుంగభద్రా తల్లి, పొంగి బారిన చాలు ధాన్యరాశులె పండు దేశానా!కూడు గుడ్డకు కొదువ లేదోయీ ముక్కోటి బలగమోయ్, ఒక్కటై మనముంటే..ఇరుగు పొరుగులోన, వూరు పేరుంటాది తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!సవతి బిడ్డల పోరు మనకేలా! పెనుగాలి వీచింది – అణగారి పోయిందినట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది చుక్కాని పట్టరా తెలుగోడా!.నావ దరిజేర్చరా – మొనగాడా! చేయెత్తి జైకొట్టు తెలుగోడా!గతమెంతో ఘనకీర్తి గలవోడా!గతమెంతో ఘనకీర్తి గలవోడా!..
18, మార్చి 2020, బుధవారం
వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.వేద ఛందస్సు తెలుగు ఛందస్సు సవరించుపాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.గురువులు, లఘువులు సవరించుఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారుగురువు, లఘువు, విభజించడము సవరించుఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.కొన్ని నియమాలు సవరించుదీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)గణాలు-రకాలు . సవరించుఅక్షరాల గుంపును గణము అని అంటారు.ఇవి నాలుగు రకాలు 1. ఏకాక్షర గణాలు .2. రెండక్షరాల గణాలు 3. మూడక్షరాల గణాలు 4.నాలుగక్షరాల గణాలు.ఏకాక్షర గణాలుఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.U, l, Uఉదా: శ్రీ , ల, సైరెండక్షరాల గణాలు సవరించురెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములులగ లేదా వ IU ఉదా: రమాగల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణగగ UU ఉదా: రంరం, సంతాన్మూడక్షరాల గణాలు సవరించుఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, , గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చుఅన్ని గణాలు:ఆది గురువు భ గణము UIIమధ్య గురువు జ గణము IUIఅంత్య గురువు స గణము lIIUసర్వ లఘువులు న గణము IIIఆది లఘువు య గణము IUUమధ్య లఘువు ర గణము UIUఅంత్య లఘువు త గణము UUIసర్వ గురువులు మ గణము UUUఇవి మూడక్షరముల గణములుఉపగణాలు సవరించుఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములుసూర్య గణములున = న = IIIహ = గల = UIఇంద్ర గణములునగ = IIIUసల = IIUIనల = IIIIభ = UIIర = UIUత = UUIచంద్ర గణములుభల = UIIIభగరు = UIIUతల = UUIIతగ = UUIUమలఘ = UUUIనలల = IIIIIనగగ = IIIUUనవ = IIIIUసహ = IIUUIసవ = IIUIUసగగ = IIUUUనహ = IIIUIరగురు = UIUUనల = IIIIపద్య లక్షణాలు సవరించువృత్తాలు సవరించుగణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.చంపకమాలఉత్పలమాలశార్దూల విక్రీడితముమత్తేభ విక్రీడితముతరళంతరలముతరలిమాలినిమత్తకోకిలఇంద్రవజ్రముఉపేంద్రవజ్రముకవిరాజవిరాజితముతోటకముపంచచామరముభుజంగప్రయాతముమంగళమహశ్రీమానినిమహాస్రగ్ధరలయగ్రాహిలయవిభాతివనమయూరముస్రగ్ధరజాతులు సవరించుజాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.కందంద్విపదతరువోజఅక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)ఉత్సాహముఉప జాతులు సవరించుతేటగీతిఆటవెలదిసీసము (పద్యం)సర్వలఘు సీసము

17, మార్చి 2020, మంగళవారం
ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రా పురవీధుల గ్రాలగలదె మణిమయంబగు భూషణ జాలములనొప్పి ఒడ్డోలగంబున నుండగలదె అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదెగీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె జూదమిచ్చట నాడంగరాదు సుమ్మునర్తనశాల సినిమాలో ఘంటసాల గానం
16, మార్చి 2020, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)