రోజుకో పద్యం 1946పగవల దెవ్వరి తోడను,వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,దెగ నాడ వలదు సభలనుమగువకు మనసియ్య వలదు మహిలో సుమతీభావం: ఈ లోకంలో ఎవరితోనూ విరోధము మంచిది కాదు. దారిద్ర్యం వచ్చిన తర్వాత బాధపడకూడదు. సభలో ఎవ్వరిని దూషించరాదు. స్త్రీకి తన యొక్క హృదయము తెలియనీయరాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి