5, మార్చి 2015, గురువారం

*అర్థ మర్థమనుచు అర్రులు చాచక
బ్రతుకునకర్థంబు వెదకు మీవు
వ్యర్థంబు గానీక, దిద్దుకొనుమీజన్మ
మంచి మాట వినర మానవుండ!
*తాను లేకయున్న, తలక్రిందులవునని
మోరవిరచి విర్ర వీగువాడు
తన్ను గాచువాని నెన్నడు గనలేడు
మంచిమాట వినర మానవుండ!

3, మార్చి 2015, మంగళవారం

ఇప్పుడిప్పుడే నిద్దుర వదలి
అడుగులొ అడుగును వేస్తున్నా
తప్పటడుగులతొ తడబడుతూ
ముందుకు ముందుకు పోతున్నా

భావావేశం ముంచుతు వుంటే
భావావేశం ముంచుతు వుంటే
కణకణ మండే మండుటెండలో
నిప్పులు చెరిగే వడగాలుల్లో
హాయిగ నిల్చుని ఆహ్లాదంగా
ఆడుతు పాడుతు తడబడుతూ
నేను అడుగులను వేస్తుంటే
అబ్బుర పడుతూ అనంతవిశ్వం
ఎవ్వడీతడని ఆగింది. !
సంధ్య సుందరిని తొందర చేసి
నా వద్దకు పంపింది
చిక్కని పరిమళ సుగంధాలను
చల్లనిగాలికి పూసింది
సంజ రంగుల చీరచెంగులతొ
వింజామరలను వీచింది
చిలుకలు గువ్వలు
కిలకిల కువకువ రాగాలన్నిటితో
పక్షులు అన్నీ ముక్త కంఠమున
ఆశీర్వచనం చేస్తుంటే
చెట్లు చేమలే దీవిస్తూ
పుష్పాక్షతలను వేస్తుంటే
ఆనందంలో ైమెమరచి
అడుగులొ అడుగును వేస్తున్నా
తప్పటడుగులతొ తడబడుతూ
ముందుకు ముందుకు పోతున్నా

కటిక చీకటి లొ ఒంటరిలో
ఎముకలు కొరికే చలిగాలుల్లో
ఆవేశాల జ్వాలల్లో
వేదన కీలల నేనుంటే
ఆశ్చర్యంతో అనంతవిశ్వం
ఆదరణతొ నను చూసింది
మబ్బుల మూతను పక్కకు తీసి
వెన్నెల నింపిన చంద్ర భాండమును
ఈ నిశీధిలో పోసింది. 
మబ్బుల మూతను పక్కకు తీసి
వెన్నెల నింపిన చంద్ర భాండమును
ఈ నిశీధిలో పోసింది.
ఇక వెన్నెల చినుకుల వర్షంలో
కుంభవృష్టిలో స్నానమాడుతూ
ఆనందంలో తడబ డుతూ
నేను అడుగులను వేస్తుంటే
సాగర సుందరి సంభ్రమంగా
నా రాకకు స్పందించి
శరీరమంతా పులకింతలతో
హోరుహోరునా పాడింది
చలచల్లని అలల చేతులతో
పాల నురుగుల దోసిలితో
తన చల్లని అలల చేతులతో
పాల నురుగుల దోసిలితో
ఇసుక తిన్నెలా పళ్ళెంలో
నా పాదాలను కడిగింది
నన్ను పునీతుని చేసింది.


అడుగు అడుగునా అణువు అణువునా
అనంత విశ్వం రూపాలన్నీ
నాకు తోడుగా వస్తుంటే
మిలమిల తళతళ మెరుస్తువున్న
రత్నరాసులు మణులు వజ్రములు
ఆకసమంతా వెదజల్లీ
వినీల గగనమె వేదికచేసి
సృష్టి సర్వమును ఆహ్వానించి
విశ్వసుందరే నాట్యమాడుతూ
నా కోసం దిగి వచ్చింది
స్వాగతగీతం పాడింది

పాదపద్మముల పద సవ్వడీనీ 
అనంత విశ్వం అందెల రవళిని 
పాదపద్మముల పద సవ్వడీనీ 
అనంత విశ్వం అందెల రవళిని  
తాళ లయలుగా చేసికొనీ 
గళాన్ని పలికిస్తున్నా...
స్వరాన్ని సృష్టిస్తున్నా...
ఆనందంలో మైమరచీ
అడుగులో అడుగును వేస్తున్నా...
తప్పటడుగులతో తడబడుతూ....
ముందుకు ముందుకు పోతున్నా...!!                - గౌతమ్ కశ్యప్ 
ఈ దేహంపై సర్వహక్కులూ వున్న ఆ అనంతవిశ్వమే తల్లై, చెల్లై, భార్యై, బంధువై, నా చుట్టూ చేరి నన్ను ఆడించి, అలరించి, ఆదరించి.. ఆదేశించి.. ఈ దేహ రూపం లోంచి చెప్పిస్తోంది..!!
మనం ఒంటరిగా వున్నామని అనుకుంటాం ఎవరూ మనం చెప్పేది అర్థం చేసుకోవడం లేదని వ్యధ చెందుతాం..కానీ మనం నిజంగా ఒంటరిగా అరక్షణమైనా వున్నామా ? అయినా ఒంటరిగా వున్నామని అనుకుంటాం. ! నిజానికి ఈ ప్రకృతీలో వున్నఈ గాలీ, ఈ చెట్లూ ఈ అడవీ, ఈ సెలయేర్లూ, ఈ ప్రకృతీ నిలబడినంత తోడుగా, అంత నిర్మలంగా అంత సత్యంగా.. అంత దగ్గరగా, అంత ఆత్మీయంగా ఎవరైనా వుంటారా..! వుండలేరు కదా...ఇంత అండవున్నా మనమెందుకో ఒంటరివాళ్లమనుకుంటూ వుంటాం !


2, మార్చి 2015, సోమవారం

 పెళ్ళాల అందాలు కళ్ళకి కనపడతాయా ! మొగుళ్ళంతా ఒకటే - పక్కన పెళ్ళాం వున్నా ఎదుటి వాడి పెళ్ళాం వంకే చూస్తాడు, అదే పెళ్ళాలైతే ఎదుటి వాళ్ళ చీరలు,నగలూ చూస్తారు .

*తన్ను తాను ముందు తెలుసుకొని పిమ్మట
పరులకుపదేశించుటెల్ల లెస్స
తాను గ్రుడ్డియైన దారెట్లు జూపును?
మంచి మాట వినర మానవుండ! !
*ఎక్కువ ధనమున్న, ఎట్లుగాతునను ఏడ్పు,
లేకయున్న, ధనము లేదనేడ్పు
ఏడ్పులేని మనుజులెందును లేరురా
మంచి మాట వినర మానవుండ!!
ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా
ఏంత మాట.. ఏంత మాట..
ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు ఇది కుల పరీక్షఏ యందువా,
నీ తండ్రి భర్ద్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది?
మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులమో? ఇంత ఏల?
ఇంత ఏల?
అస్మధ్ పిథమహుడు కురుకుల వృద్ధుడయిన శాంతనవుడు శివ సముద్ర భార్యయగు గంగా గర్భమున జనియించలేదా?
ఇయనది యె కులము?
నాతో చెప్పింతువేమయ్యా
మా వంశమునకు మూల పురుషుడైన వశిష్తుడు దేవ వేస్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ??
ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని,
ఆ శక్తి చండాలంగన యందు పరాశరుని,
ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్య గంధి యందు మా తాత వ్యాసుని,
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతొ మా తండ్రిని,
పినపితామహి అంబాలికతొ మా పినతంద్రి పాండురాజును,
మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా ?
సందర్భావసరములను బట్టి క్షేత్ర, బీజ ప్రాధాన్యములతొ సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది.
కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థ వాదమెందులకు ?

1, మార్చి 2015, ఆదివారం

అందరూ భార్యాబాధితులలాగా (?) భార్యల మీద అభాండాలు (కార్టూన్స్) వేసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి నా తరపు నుండి ఈ గ్రూప్ సిస్టర్స్ అందరికీ ఆడవారి త్యాగం గురించి ఈ పోస్ట్ grin emoticon
A very intelligent girl was asked the meaning of marriage..
She said- 'sacrificing the admiration of hundred guys, to face the criticism of one idiot'...!!!
-ఒక తెలివైన అమ్మాయిని పెళ్ళికి నిర్వచనం అడిగితే ఇలా అంది "ఒక మూర్ఖుడి విమర్శ కోసం ఎందరో అబ్బాయిల మెప్పులను త్యాగం చెయ్యడం"... విజయకుమారి గారి అనువాదం grin emoticon
-ఓ ప్రబుద్ధుడు ఓ చురుకైన చలాకీ పిల్ల ని పెళ్ళంటే ఏంటని అడిగాడుట బుద్ధి గడ్డి తిని..
ఆ గడసరి సమాధానమిస్తూ
"వందలాది మంది పురుషుల ఆరాధనాభరిత ప్రేమను .పెద్ద త్యాగశీలి లా తోసిరాజని ఒక్క మూర్ఖుడి విమర్శను ఎదుర్కొనడానికి సిద్ధమవడడమే పెళ్ళికి సిసలైనఅర్థం"అందిట... వసంతలక్ష్మి గారి అనువాదం grin emoticon
(ఎవరైనా దయచేసి తెలుగులోకి అనువాదం చేస్తే అది ఇక్కడ అతికించేస్తాను)
— feeling thoughtful.
పంచామృతాలతో పలుకు జనిస్తే అది తెలుగు మాటవుతుంది
చల్లగాలిలో సౌరభాలు ఆడితే అది తెలుగు పాటవుతుంది.
లలిత కళలతో పొదరిల్లు అల్లితే అది తెలుగు చోటవుతుంది 

ఆపదలో ఆత్మీయహస్తం అందితే అది తెలుగు బాటవుతుంది!!!!


అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని తేట తెలుగు నందు
వేనవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములలో వ ని గాంచిన భాష
వేయియేండ్ల నుండివిలసిల్లు నా ‘భాష’
దేశ భాషలందు తెలుగు లెస్స!