చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ తినేసేయాలని చూస్తాయి.
అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి.
ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పట్టబోతాయి.
ఐనా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.
మనిషి ఎదుగుదలా సరిగ్గా ఇలాంటిదే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి