22, ఏప్రిల్ 2017, శనివారం

// గౙల్ //

తానే  మేలిముసుగు తీసి ఒక జవ్వని పువ్వులాగా నవ్వుతుంటే ఏంచేయను?
నవ్వే ఆ నవ్వుతోనే మెలమెల్లగా పిడుగులే రువ్వుతుంటే ఏంచేయను?

నేను అనుకొంటినా మరి కలగంటినా? నాలో అనురాగమేదో మ్రోగేనని
అందమే నన్ను చేరి కొనగోటితో గుండెలో మీటుతుంటే ఏంచేయను?

చేత మధుపాత్ర లేదు నాకిప్పుడు అయినా అంటారు నన్నే తాగానని
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై కైపులో ముంచుతుంటే ఏంచేయను?

నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా? కాని అంటారు నన్నే కవిరాజని
ప్రేయసి మధుర రూపం మహా కావ్యమై ఊహలో పొంగుతుంటే ఏంచేయను?

// సి.నారాయణ రెడ్డి //

చలన చిత్రంలో వచ్చిన తొలి తెలుగు గౙల్ ఇది. 1979 లో వచ్చిన ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రంలో మొహమ్మద్ రఫీ, సి.రామచంద్ర సంగీతం లో పాడిన గౙల్ ఇది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి