27, ఏప్రిల్ 2017, గురువారం

...ఆధునిక పోకడ.....

ఆధునికత పేరుతో
అవకతవక జ్ఞానంతో
ఆడంబరాలకై అర్రులు చాస్తూ
ఆపదల పాలైపోతున్న నేటి యువత...

చాలీ చాలని వస్ర్రాలే
సంస్కారమని భ్రమిస్తూ
చదువులున్నా తెలివి కొరవడి
దేహాన్ని చూపిస్తూ మోహాలను పెంచేస్తూ
దగా పడ్డామని వాపోతూనే
దారుణాలని ప్రోత్సహిస్తూ
 పెడదోవన నడుస్తున్న
కలికాలపు కాంతలు....

పట్టు పావడాలు రంగురంగుల ఓణీలు
జడకుచ్చుల అందాలు
మల్లెపూల అలంకారాలు
మచ్చుకైనా కానరాక
మగువనొ మగవాడో
గుర్తించలేని రీతిలో
ఆరు బయట సంచరిస్తుంటే
కళ్ళున్నా చూడలేని  కన్నవాళ్ళ గారాబం
కోట్లిచ్చినా కొనలేని తెలుగుతనపు
సాంప్రదాయం కానరాని దృష్యమై
కంటశోష మిగులుస్తోంది...

అసభ్యతను మోస్తూ
అవమానాలపాలవుతూ
విదేశీ మోజులో
స్వాభిమానం వదిలేస్తూ
వంచనలకు లోనై చింతించే కన్నా
తెలివితేటలూ శక్తియుక్తులే
నిజమైన అందాలని గ్రహించి
మేలుకొనుట ఉత్తమం
చాటి చెప్పుట మన ధర్మం.....!!

    అనుశ్రీ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి