కన్నడ కంటీరవ రాజ్ కుమార్ అపూర్వ నటన...!!గుర్రం జాషువా గారి అపూర్వ పద్య రచన...
కలిపి తెలుగులో చలన చిత్రం నిర్మించి వుంటే.. నభూతో..నభవిష్యతి...!!!(గా వుండి వుండెడిది)
కాబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది-ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు
కాఁబోలు వీరు విగత జీవబాంధవు-లడలుచుండిరి మహార్తారవములఁ
గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్-నెమకుచుండిరి కపాలముల కొఱకు
గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి-పలలంపు బువ్వంపు బంతి సాగెఁ
జిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ-గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి
నెటఁబెడీలను రవములే యొసఁగుచుండు-దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల.
.
గీ. కాటిసుంకంబు చెల్లింపకయె శవాల
మసనమునఁ గాల్పరే కద మనుజులార?
కాఁపు లేదనుకొంటిరేమో పదండు
దళిత ఘోరారి యీ వీరదాసు గలఁడు.
.......
శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్.
..........

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి