7, జులై 2018, శనివారం
4, జులై 2018, బుధవారం
తెగుల్ బీరు ఘీ+తం!? మా తెగుల్ తల్ లిక్కీ మద్యపూ దండా? మము పాలించు నే తల్ కూ బీరు హారతులు! కడుపులో బ్రాందీలు కనుచూపులో షాపులు? చిరుపెగ్గులో కైపుల్ దొరలించు మా తల్ లీ! గలగలా బ్రాందీలు తరలిపోతుంటేను? బిరబిరా బీరులూ పరులిడుతుంటేను! బంగారుతో ఖజానాలే నిండుతాయి? బీర్బలులకు రోగాలె ప్రబలుతాయి! మా... అమరావతీ భ్రమల అపురూప పాలనలు? బీర్బలుల గొంతులో తారాడు మద్యాలు! చంద్రన్న పాలనలో నిషాదనాలు? నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక! రుద్రమ్మల భుజ శక్తి? మల్లమ్మల పతిభక్తి ! దోచుకునే మా శక్తి ? బీరుబ్రాందిల కీర్తి ! మా శవాలు మశానంకి సాగనంపేదాక! నీ బీరులే తాగుతాం! మీ జేబులే నింపుతాం? జై బీరు తల్ లీ! జై మద్యం తల్ లీ? దేవీడోస్ By Adavala Seshagiri Rayudu
3, జులై 2018, మంగళవారం
ఘటోత్కచుని introduction మాయా బజార్ 1957 సినిమాలో, పింగళి, ఘంటసాల, మాధవపెద్ది, ఎస్ వి ఆర్. అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై మన శుంభధ్వజము గ్రాల చూడవలదె! గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటులు నాకె మ్రొక్కవలదె! ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి సంభ్రమాశ్చార్యాల జరుగవలదె హై హై ఘటోత్కచ... జైహే ఘటోత్కచ అని దేవగురుడె కొండాడవలదె ఏనె ఈయుర్వినెల్ల శాసించవలదె ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె ఏనె మన బంధు హితులకు ఘనతలన్ని కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదె! https://www.youtube.com/watch?v=-S_IFdrmE5g మాయా బజార్ 1957 లో ఫల శ్రుతి జై సత్యసంకల్ప జై శేషతల్పా! జై దుష్టసంహార జై దీనకల్పా! జై భక్త పరిపాల జై జగజ్జాలా! నీవు జరిపించేటి నీ చిత్ర కథలు వ్రాసినా చూసినా వినిన ఎల్లరును శుభసంపదలు గలిగి వర్థిల్లగలరు సుఖశాంతులను గలిగి శోభిల్లగలరు! https://www.youtube.com/watch?v=bRutvpD5Gwc విన్నాను మాతా విన్నాను, ఇచ్చిన మాటను తప్పుటయేకాక, తుచ్ఛ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విత పరాక్రమవంతులైన మా జనకులనే తూలనాడిరిగా యాదవులు! ఎంత మద మెంత కావరమెంత పొగరు! అంతకంత ప్రతీకార మాచరించి కౌరవుల యాదవుల కట్ట గట్టి నేలమట్టు బెట్టకున్న నా మహిమేల? దురహంకార మదాంధులై ఖలులు విద్రోహంబు కావించిర మాయా బజార్ 1957 క్లైమాక్స్, హ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హా పెదమామగారూ నమో నమః పెద్దలు తమ కెందులకీ శ్రమ ఈ దురాత్ముల మద మణచడానికి నేనున్నాను ఎవడవురా నువ్వు ? నేనా ఎవడనా ఘోషయాత్రలో గంధర్వులు నిన్ను బంధించినప్పుడు వచ్చి విడిపించినే ఆ అర్జున ఫల్గుణ భీభత్స బాబాయిగారి అన్న భీమసేన మహారాజు వారి కుమారుడను ఓరీ నువ్వా ఘటోత్కచా కర్ణా దుశ్శాసనా వీణ్ణి పట్టండి ఓరోరి ధుర్యోధన దుశ్శాసన కర్ణ హతకులారా అతి దురాత్ములు మీరు మీకు సహాయపడక ఆయుధాలు వాటి పరువు దక్కించు కుంటున్నాయి యిక మీకు బుద్ధి చెబుతాను లంబూ జంబూ యిక మీరు విజృంభించండి ఓరీ మూఢ ధుర్యోధనా నీ ఐశ్వర్యం చూచుకొని త్రుళ్ళి పడినావు గదూ ఇప్పుడు చూడు యెవరి ఐశ్వర్యం మోస్తున్నావో చిన్నమయా అం అః ఇం ఇః ఉం ఉః ఆర్తనాదములు శ్రవణానందకరముగ నున్నవి ఛీ ! శరణార్ధులను చంపను లెండిరా పిరికిపందలు లంబూ జంబూ ఈ కౌరవాధములను కట్టగట్టి ఎత్తుకొని పోయి హస్తినాపురిలో పారవేయండి అం అః ఇం ఇః ఉం ఉః ఓరోరీ ! మీ దుష్ట చతుష్టయానికి సమిష్టిగా యిదే నా తుది హెచ్చరిక : స్వాతిశయమున త్రుళ్ళు ఐ - శ్వర్య గర్వ దుర్విదగ్ధులు మీ రెల్ల- దుమ్ము ధూళి కలియు కాలము దగ్గర - కలదటంచు బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు - పొండు పొండు ! ఇంకొక్క మాట : పాండవులె కాదు పాండవ - బంధుకోటి బంధు బంధుల బంధుల - బంధులందు ఎవరి నెదిరింతురేని మీ - కిదియె శాస్తి ఙ్ఞప్తి కలిగుండుడీ ఘటో - త్కచుని మాట ! https://www.youtube.com/watch?v=RWzDdOyljxU
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)