4, జులై 2018, బుధవారం
తెగుల్ బీరు ఘీ+తం!? మా తెగుల్ తల్ లిక్కీ మద్యపూ దండా? మము పాలించు నే తల్ కూ బీరు హారతులు! కడుపులో బ్రాందీలు కనుచూపులో షాపులు? చిరుపెగ్గులో కైపుల్ దొరలించు మా తల్ లీ! గలగలా బ్రాందీలు తరలిపోతుంటేను? బిరబిరా బీరులూ పరులిడుతుంటేను! బంగారుతో ఖజానాలే నిండుతాయి? బీర్బలులకు రోగాలె ప్రబలుతాయి! మా... అమరావతీ భ్రమల అపురూప పాలనలు? బీర్బలుల గొంతులో తారాడు మద్యాలు! చంద్రన్న పాలనలో నిషాదనాలు? నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక! రుద్రమ్మల భుజ శక్తి? మల్లమ్మల పతిభక్తి ! దోచుకునే మా శక్తి ? బీరుబ్రాందిల కీర్తి ! మా శవాలు మశానంకి సాగనంపేదాక! నీ బీరులే తాగుతాం! మీ జేబులే నింపుతాం? జై బీరు తల్ లీ! జై మద్యం తల్ లీ? దేవీడోస్ By Adavala Seshagiri Rayudu
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి