2, జనవరి 2020, గురువారం

నరసింహ శతకం: సీ!! ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు ధనమెప్పటికి- శాశ్వతంబుగాదు దారాసుతాదులా- తనవెంట రాలేరు భృత్యులు మృతిని త-ప్పింపలేరు బంధుజాలము తన్ను-బ్రతికించుకో లేరు బలపరాక్రమమేమి -పనికిరాదు ఘనమైన సకల భా-గ్యము లెంతకల్గియు గోచిమాత్రంబైన -గొనుచుబోడు తే!! వెఱ్రి కుక్కల భ్రమలన్ని-విడచి నిన్ను భజనచేసెడి వారికి-బరమసుఖము భూషణ వికాస! శ్రీ ధర్మ-పుర నివాస దుష్ట సంహార! నరసింహ! దురిత దూర!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి