12, ఆగస్టు 2019, సోమవారం

11, ఆగస్టు 2019, ఆదివారం

ఎవరు వ్రాసారో తెలియదు కానీ చాల బాగుంది. అందుకే మీకు పంపిస్తున్నాను. నేటి సెల్‌ఫోన్ చరవాణి... జేబుల్లో కీరవాణి మాయచేసే మహారాణి వ్యసనాల యువరాణి గుప్పిట్లో ఉండాల్సింది.. అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది అదనపు అవయవంగా మారి.. అవయవాలన్నటినీ ఆడిస్తోంది "ప్రపంచానికి" అవసరమని రూపిస్తే.. తానే "ప్రపంచమై" కూర్చుంది సౌకర్యం కోసం సృష్టిస్తే .. సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది "నట్టింట్లో" మాటలు మాన్చి.. నెట్టింట్లో ఊసులు కలిపింది. చాటింగులు... మీటింగులు... ఆపై రేటింగులు..అంటూ యువతను పెడద్రోవ పట్టిస్తోంది సమాజాన్ని పట్టి పీడిస్తోంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తోంది అయిన వాళ్ళు పక్కప్రక్కనే ఉన్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్ళను చేసింది వ్యసనపరులుగా మార్చింది. ప్రమాదవశాత్తు పడిపోయినా... "ప్రాణం ఉందోలేదో చూసుకోకుండా "ఫోను"ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది. ఎన్నని చెప్పను దీని లీలలు ఓ మిత్రమా...! విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు ఊడిగం చేయించుకో... అంతేగాని బానిసగా మారకు. దేన్నెక్కడుంచాలో అక్కడే ఉంచు. నెత్తినెట్టుకున్నావో .. పాతాళానికి తొక్కేస్తుంది. బి కేర్ ఫుల్ అది మాయల మహరాణి వ్యసనాల యువరాణి చేతిలోని చరవాణి.

10, ఆగస్టు 2019, శనివారం

నాన్నకు ప్రేమతో.... ఏమని చెప్పను.. ఎంతని చెప్పను.. నాన్న ఔన్నత్యం నాన్న ఆకాశమంత...అంతకు మించి...అనంతమంత!! ఆకాశమంత ఔన్నత్యం, వెన్నెల కురిపించే చక్కనయ్య, చంద్రయ్య మోము, చల్లని వెన్నెల లాంటి గుణం, కమ్మని వెన్నలాంటి మనసు, నడకతోపాటు నడత నేర్పే నేర్పరి, సేవా సహన శీలత, కోమలతల త్యాగం... ఏమని చెప్పను!? ఎంతని చెప్పను!? ఎంతచెప్పినా తక్కువే నాన్న గురించి చెప్పడం. నాన్న గొప్పదనాన్ని అక్షరాలుగా మార్చి, వాక్యాలలో ఒదిగింపచేసి నాన్న గుణగణాలను లెక్కిస్తూ పోతే నక్షత్రాల సంఖ్య కూడా తక్కువే పడుతుందేమో! నాన్న ఔన్నత్య విస్తీర్ణం ముందు అంబరమంతా నేలమీద పరచినా చాలా తక్కువనిపిస్తుంది. అలుపెరుగని సూర్యుడు, అనునిత్యం చంద్రుడు, పోరాడే సైనికుడు, కష్టించే శ్రామికుడు... ఇలా చెప్పనలవి కానంత కీర్తి ఆయన సొంతం. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. ప్రేమకు తరగని శిఖరమంత కూర్పులు. మంచికి మానవత్వానికి చెరగని చిరునామా నాన్న. సంతాన అభివద్ధి కోసం తాను రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా తన సాధకబాధకాలను ఎవరికీ చెప్పుకోడు. నిస్వార్థంగా బిడ్డల భవిష్యత్తుకు రాచబాట వేసి , వారిని కీర్తి శిఖరాలను అధిరోహింప చేసి... తాను మాత్రం ఒక అనామకుడిలా మిగిలిపోయే త్యాగనిరతి '' నాన్న ''. నాన్న త్యాగం గురించి కవితా రూపంలో '' పగిలిన కాళ్ళు ప్రశ్నిస్తున్నాయి... అదేమంటే శీతాకాలం కదా అందుకే పగిలాయని నాన్న జవాబు! చీలిన పెదాలు హెచ్చరి స్తున్నాయి ... ఎండన తిరిగి వేడిచేసి చీలాయి లేరా అని నాన్న జవాబు! చిరిగిన చొక్కా పేదరికాన్ని చూపెడుతున్నది... ఈ వయస్సులో నన్నెవరు మెచ్చుకోవాలి లేరా అని నాన్న జవాబు! అలసిన మొహం కష్టాన్ని గుర్తిస్తున్నది... ఎండతాకిడికి మొఖం వాడిందిరా ఎక్కువ పనేమి చేయలేదులేనని నాన్న జవాబు! స్వేదం బొట్లు బొట్లుగా కరుణగా జాలువారుతున్నది... ఉక్కపోతకు అలా వస్తుంది లేరా అని నాన్న జవాబు! తెగిన చెప్పులు ఆర్థిక ఇబ్బందిని చూపెడుతున్నది... వేసుకోవటానికి ఇవే మెత్తగా ఉంటాయని నాన్న జవాబు! కూడులేక దేహం బక్కచిక్కి శల్యమై పోయింది... లావుగా ఉంటే పనిపాటా చేయలేమని ఇలా వున్నానని నాన్న జవాబు! ప్రశ్నలన్నీ నేను సంధించినవే తెలిసీ తెలియని అమాయక సందిగ్ధ వయసులో జవాబులన్నీ నాన్ననుండి వచ్చినవే జీవితాన్ని కాచి వడబోసిన వయసులో! వయసు పెరిగాక మనసు పరిణితి చెందాక నాన్న చెప్పే జవాబులన్నీ అబద్ధాలని గ్రహించాను తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా మోముపై కనపడనీయకుండా నన్ను సంతోష తీరాలకు చేర్చిన నాన్న! తల్లి నవ మాసాలు మోసి కంటే.. మనల్ని నడిపించే దైవం నాన్న. నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే భద్రత, భరోసా.. అంతకుమించిన త్యాగం అతడు. చేయి పట్టి నడిపిస్తూ.. ఆడిస్తూ.. అల్లారుముద్దుగా పెంచుతాడు. ఆటలతో పాటు ఆత్మస్థైర్యమూ నేర్పిస్తాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. వాళ్ల సుఖం కోసం చెమట.. కాదు, కాదు.. రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తానేమైపోయినా పర్వాలేదు అనుకుంటాడు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు నాన్న. తను తిన్నా, తినకపోయినా.. తన దుస్తులు బాలేకపోయినా.. పిల్లలకు మాత్రం ఏ లోటూ రాకుండా ఉండాలని పరితపించే వ్యక్తి నాన్న. పిల్లలు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే ఎంతో సంతోషపడతాడు. వాళ్లు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడే నాన్నకు ఏమిచ్చినా తక్కువే !!

6, ఆగస్టు 2019, మంగళవారం

మూడేళ్ళ క్రితం రాసానని జూకర్ బెర్గ్ గుర్తు చేసాడు... *************************************** *** ఏ పత్రిక చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.? కలం జాతి చరిత్ర సమస్తం ప్రభుత్వ భజన పరాయణత్వం! ప్రసార చరిత్ర సమస్తం పరస్పరారోపణోద్యమం మాధ్యమ జాతి చరిత్ర సమస్తం అధికారానికి దాసోహం! ఏపేజీ చూసినా రేపులు, హత్యలు, యాసిడ్ దాడులు.. ధనవంతులను కీర్తించడం నేతలకు తలవంచడమే! ఉద్యోగులను కాల్చుకు తినడం జీతాలను ఎగవేయడం సంపాదకులు దుర్బల జాతిని బానిసలను కావించారు! కునారిల్లిన సంసారాలు మరణించిన జర్నలిస్టులు అసహాయుల హాహాకారం పత్రికల్లో మూలుగు తున్నవి!!