తిరిగిచ్చేత్తా నాన్నా//
------------------------
నే పదోక్లాసు పాసైనపుడు పైసల్లేక
నువ్ జరంతో రమిత్తూ కూడా కూడు
లేకుండా రాతిరంతా రాయుడు గారి
మెట్టపొలంలో మట్టి తట్టలు మోసేటి
కూలికెల్లి సంపాదించిన సిల్లరంతా పోగేసి
కొనిచ్చిన నల్లని పర్సునీ పర్సులోపల
నువ్వెట్టిన నీసెమటతో మాసిన నూరునోటునీ
సోసున్నంతకాలం దాస్కోమని నువ్
సెప్పిన మాటనీ ఇంకా ఇస్మరించలేదు
నేను..స్మరిస్తూనే ఉన్నాన్నాన్నా
------------------------
నే పదోక్లాసు పాసైనపుడు పైసల్లేక
నువ్ జరంతో రమిత్తూ కూడా కూడు
లేకుండా రాతిరంతా రాయుడు గారి
మెట్టపొలంలో మట్టి తట్టలు మోసేటి
కూలికెల్లి సంపాదించిన సిల్లరంతా పోగేసి
కొనిచ్చిన నల్లని పర్సునీ పర్సులోపల
నువ్వెట్టిన నీసెమటతో మాసిన నూరునోటునీ
సోసున్నంతకాలం దాస్కోమని నువ్
సెప్పిన మాటనీ ఇంకా ఇస్మరించలేదు
నేను..స్మరిస్తూనే ఉన్నాన్నాన్నా
అందుకే అకాలంగా ఆకలేసినపుడు
పర్సులో పైసాకూడా లేదని తెలిసీ
ఆదమరుపులో ఆపర్సు తెర్సి సూసిన
పతిసారీ నువ్వే కనపడతావ్ నాన్నా
నాకు నవ్వుతూ ఫొటోలో నీటుగా
నూరు నోటు మాటుగా..
అప్పుడేంటో గానీ సప్పుడే లేకుండా
ఐపోద్ది నా ఆకలంతా ఆరోజంతా.
కానీ నేనేమో ఆగకుండా మూగగా
ఏడుస్తూనే ఉంటాను ఆకలికోసమూ
కాదూ అన్నం కోసమూ కాదూ బిడ్డకై
గొడ్డులా కట్టపడిన అయ్యను సూడ్డం కోసం..
పొగిలి పొగిలి ఏడ్వగా మిగిలిన
కన్నీల్లన్నీ నాకంఠాన్నంటుకున్న
ఆపూట తలనిండా పొలమారింది నాకు
అపుడు నువ్నన్ను పలువరించావేమోనని
కలవరిస్తూ నేన్నీకు ఫోన్ చేసడిగేశా
తడబడిన నీ గొంతులోని దుఃఖపు జీరని
నా కర్ణాలినగానే మెడబడింది నాకు..
అదిన్న దగ్గర్నుంచీ కాళ్ళూకళ్ళూ ఆగక
నిన్న మనూరొచ్చినపుడు మొన్నెందుకు
నొచ్చుకున్నావని నిన్నడిగితే కన్నుకుంచెడు
కన్నీళ్ళు కార్చావ్..ఎట్టకేలకు నన్నేమార్చావ్..
నీకు తెల్వదా నాన్నా నేనూ నీ కొడుకునే
నిన్నీది నుంచి ఇంటిలోకొచ్చే ముందే
నాకన్నీళ్ళతోటే కాళ్ళుకడుక్కునొచ్చేశా..
నువ్ ఆదీ కాదూ నేనంతమూ కాదు నాన్నా
మన గాధ ఏఅవధినో ముగిసేదీ కాదు నాన్నా
నాన్నగా నువ్ చాలా ఇచ్చావ్ నాకు తిరిగిచ్చేత్తా
నేను ఉత్తచేతులతో ఎల్లేలోపులోనే మొత్తంగా..
పాతికోళ్ళొచ్చాక్కూడా పిల్లాడల్లే నువ్ నాకు
అల్లి కట్టిన ఎర్ర మొలతాడు సాక్షిగా.....
...............................#విట్టు!!
పర్సులో పైసాకూడా లేదని తెలిసీ
ఆదమరుపులో ఆపర్సు తెర్సి సూసిన
పతిసారీ నువ్వే కనపడతావ్ నాన్నా
నాకు నవ్వుతూ ఫొటోలో నీటుగా
నూరు నోటు మాటుగా..
అప్పుడేంటో గానీ సప్పుడే లేకుండా
ఐపోద్ది నా ఆకలంతా ఆరోజంతా.
కానీ నేనేమో ఆగకుండా మూగగా
ఏడుస్తూనే ఉంటాను ఆకలికోసమూ
కాదూ అన్నం కోసమూ కాదూ బిడ్డకై
గొడ్డులా కట్టపడిన అయ్యను సూడ్డం కోసం..
పొగిలి పొగిలి ఏడ్వగా మిగిలిన
కన్నీల్లన్నీ నాకంఠాన్నంటుకున్న
ఆపూట తలనిండా పొలమారింది నాకు
అపుడు నువ్నన్ను పలువరించావేమోనని
కలవరిస్తూ నేన్నీకు ఫోన్ చేసడిగేశా
తడబడిన నీ గొంతులోని దుఃఖపు జీరని
నా కర్ణాలినగానే మెడబడింది నాకు..
అదిన్న దగ్గర్నుంచీ కాళ్ళూకళ్ళూ ఆగక
నిన్న మనూరొచ్చినపుడు మొన్నెందుకు
నొచ్చుకున్నావని నిన్నడిగితే కన్నుకుంచెడు
కన్నీళ్ళు కార్చావ్..ఎట్టకేలకు నన్నేమార్చావ్..
నీకు తెల్వదా నాన్నా నేనూ నీ కొడుకునే
నిన్నీది నుంచి ఇంటిలోకొచ్చే ముందే
నాకన్నీళ్ళతోటే కాళ్ళుకడుక్కునొచ్చేశా..
నువ్ ఆదీ కాదూ నేనంతమూ కాదు నాన్నా
మన గాధ ఏఅవధినో ముగిసేదీ కాదు నాన్నా
నాన్నగా నువ్ చాలా ఇచ్చావ్ నాకు తిరిగిచ్చేత్తా
నేను ఉత్తచేతులతో ఎల్లేలోపులోనే మొత్తంగా..
పాతికోళ్ళొచ్చాక్కూడా పిల్లాడల్లే నువ్ నాకు
అల్లి కట్టిన ఎర్ర మొలతాడు సాక్షిగా.....
...............................#విట్టు!!
Araja Anok Naidu ఏ
స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ… మన నుంచి ఎలాంటి
ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న…. అలాంటి మన
అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం …. జీవితాంతం వారికీ ప్రేమని
పంచడం తప్ప…. వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా….. ఒక చిన్న
పల్లెటూరు లో పుట్టినా … ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దిన
మా అమ్మ,నాన్నలకి నా పాధభీవంధనలు
Sambasivarao Nulu అమ్మ
మీద అమోఘమైన కవితలు ..సాహిత్యాన్ని.చదివాను.కానీ నాన్న మీద ఇలాంటి అద్భుత
కవితలతో ,గుండెల్ని పిండే అనుబంధాల పదబంధాలతో సమాజలో నాన్నలన్దరినీ
కట్టిపడె స్థున్నావ్...అద్భుతం ...కిట్టు ...!!!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి