16, ఆగస్టు 2015, ఆదివారం

నా జీవితం లో కొన్ని పదాలు లేకుండా ఏమైపోయాయి??
పొద్దున్న లేస్తూనే బెదిరించే గడియారం లేదు
...ఇంటి పక్కనే ఆఫీస్ కదా...
టెన్షన్ ,స్ట్రెస్స్, మానసిక వొత్తిడి అస్సలు లేవు
ఉన్నా ఓ పువ్వో,ఎగిరే పిట్టో,నీలిరంగు ఆకాశమో కంటపడితే చాలు
మనసు గాల్లో ఎగురుతుంది...
ప్రకృతిని మించిన రిలాక్షేషన్ వేరే ఉందా ??
మనశ్శాంతి లేదంటూ చాలా నిట్టూరుస్తారు...
నా లోపలెప్పుడూ శాంతి గానే ఉంటుంది...
నేను చేసే పని నాకు మనశ్శాంతినిస్తుంది...
కష్టాల్లేవా...కన్నీళ్ళేవా...ఎందుకుండవు?
గుండె కొట్టుకున్నంత సేపు సమస్యలే కదా....
అభద్రత ఎందుకు లేదు నాకు...ఎందుకుండాలి ....
ప్రపంచానికి జరిగేదే నాకూ జరుగుతుంది..భయమేల...
ఇప్పటికిప్పుడు భూకంపమొస్తే ...అందరితో పాటు నేనూ పోతాను....
జరిగేది జరగక మానదు...జరిగితీరుతుంది ....జరిగినప్పుడు చూద్దాం కదా...
ఫ్రేముల్లో చిక్కున్న వాళ్ళకి అన్నీ చిక్కులే.....
ఫ్రేముల్ని బద్దలు కొట్టి చూడు పైరగాలంత ప్రాణవాయువు....
సొంతం చుట్టూ అల్లుకుంటే చిన్న పరిధిలో ఉక్కిరిబిక్కిరి....
విశాలమైన మనసుతో విశ్వం వేపు చూడు ఒక్క సారి..
వ్యక్తి ప్రేమల్లోంచి విశ్వ ప్రేమవేపు పయనం
ఎపుడో మొదలైంది...ఎప్పుడు ముగుస్తుందో తెలియదు....సత్యవతి కొండవీటి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి