9, ఫిబ్రవరి 2015, సోమవారం

ఎన్నెన్నో వర్ణాలు
అన్నింట్లో అందాలూ
ఒకటైతే మిగిలేదీ తెలుపేనండీ....
నలుపేమో నాకిష్టం ....ఎందుకంటే ,,
తెల్లకాగితంపై పరుచుకున్నఅక్షరాలు నలుపు
ప్రకృతి ప్రణయ గీతం ఆలపించే కోయిల నలుపు
పచ్చదనన్ని ప్రసవించే నల్ల రేగడి నేల నలుపు
భూమిని నిలువెల్లా ప్రేమతో తడిపే కార్మబ్బు నలుపు
జాబిలి, చుక్కల ప్రణయ కావ్యపు కాన్వాస్ నింగి నలుపు
జలతారు వెండి వెన్నెల కురిసే రేయి రంగు నలుపు
సితార భాను ప్రియ అందమైన కళ్ళ మద్య వంశీ పెట్టిన బొట్టు నలుపు
ప్రియమైన జ్ఞాపకాల తలపులతో మెరిసే నాకళ్ళు నలుపు....smile emoticon

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి