23, ఫిబ్రవరి 2015, సోమవారం

"మిత భోజనం , మిత భాషణం , మిత భూషణం " ..
తక్కువ మాట్లాడుతూ ,తక్కువ తింటూ ,తక్కువ అలంకరించుకొని సింపుల్ గా ఉంటూ , ఎదుటి వారికి మర్యాద ఇచ్చి మీరు గౌరవం పుచ్చుకొని , రోజులో ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని "ధ్యాస "( concentration ) పెంచుకొంటూ నోటి మాటను మనసును మీ ఆధీనంలో ఉంచుకోండి.
ఎప్పుడు మాట్లాడాలో , ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసుకొని ఉత్తమమైన మనిషి అని అనిపించుకోండి. 
ఆడంబరాలు ,అధిక భోజనం , ఎక్కువగా మాట్లాడడం మీకు తాత్కాలికంగా గౌరవం లభించచ్చు కాని శాశ్వతంగా ఎవరి మనసులో ఒక అంగుళం చోటైనా సంపాదించలేరు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి