16, ఫిబ్రవరి 2015, సోమవారం

అన్నీ తడిచిపోతాయి..!!
లైఫ్ చాలా చిన్నది.. ఏం చేసినా ఈ కొద్ది లైఫ్‌లోనే చేయాలి..
కసి.. జీవితాంతం ఈ ఒక్క పదాన్ని నరనరానా నింపుకుంటే చాలు... ఎక్కడ దొరుకుతుందో వెదికి వెదికి "కసి"ని పెట్రోల్‌లా ఒంటినిండా నింపుకోండి.. ఏడ్చే జనాల నుండీ... వెనక్కి లాగే జనాల నుండీ... వెకిలిగా నవ్వే జనాల నుండీ... ఓర్వలేని జనాల నుండీ దండిగా దొరికేస్తుంది జీవితానికి సరిపడా కసి! అదొక్కటి చాలు లైఫ్ నథింగ్ నుండి సమ్ థింగ్‌గా మారిపోవడానికి!
ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి పడిపోతున్నాయని డిజప్పాయింట్ అవ్వాల్సిన పనిలేదు.. కొండ చివార్న ఉన్నా పడిపోలేని స్థిరత్వం ఆలోచనల్లోనూ, కాళ్లలోనూ, ఒంట్లోనూ ఉంటే చాలు... ప్రయత్నాలదేముంది.. ఇవ్వాళ కాకపోతే రేపు వందల కొద్దీ సక్సెస్‌లను రుచిచూపిస్తాయి.
భుజం తట్టే వారి నుండి పాజిటివ్ ఎనర్జీని పొందీ మరింత కసి సమకూర్చుకోవచ్చు.. వెన్ను విరిచే మహానుభావుల కళ్లల్లోకి ఒక్కసారి తదేకంగా చూసీ.. ఆ రూపాల్ని పర్మినెంట్‌గా కళ్లల్లోకి నిలుపుకునీ కసిగా ముందుకెళ్లొచ్చు..
ప్రతీ చోటా ఏదేదో చేసి ఎలాగైనా ఆపాలని చూస్తారు గానీ.. చివరకు ఎవ్వరి వల్లా కాదు మన ఎదుగుదలని ఆపడం! ఇది సత్యం. జీవితం మనది, లక్ష్యం మనది, దానికి చేసే కష్టం మనది... ఎవడి వల్లేం అవుతుంది మనల్ని ఆపడానికి? ఎవరికీ మనకు మనం అపకారం చేయనంత వరకూ ఎలాంటి గిల్ట్ ఫీలింగూ మనం carry చెయ్యాల్సిన పనిలేదు. ధైర్యంగా, స్థిరంగా, స్పష్టంగా సాగిపోవడమే.
కుట్రలూ, కుతంత్రాలూ చేసే వాళ్లనీ.. ఓర్వలేని వాళ్లనీ చూసి భయపడిపోతుంటాం గానీ.. అసలు అన్యాయంగా అలాంటి ఓర్వలేనితనం కలిగి ఉన్నందుకూ.. తమ మనస్సులో మిగిలే గిల్టీ ఫీలింగ్ ద్వారా ఏ క్షణం అన్ని కుతంత్రాలూ తమకు చుట్టుకుంటాయోనని వాళ్లెంత వణికిపోతున్నారో మీకు తెలీదు. నరకం అంటే ఇగోయిస్టులది.. నరకం అంటే ఎదుటి వ్యక్తి ఎదుగుదలని ఆపాలనుకునే వాడిది.. వాడిని చూసి మీరు భయపడేదేంటి? మీకు మీరుగా ఎదగండి.. ఎవడి సాయమూ మీకు అవసరం లేదు... నిజాయితీగా సాయం చేసే వారిని గౌరవించండి చాలు.. సాయం చెయ్యని వాళ్లనీ, వెనక్కి లాగే వాళ్లనీ అలాగే వదిలేయండి.. చూద్దాం.. కొన్నాళ్లకు అందరికీ అన్నీ తడిచిపోకపోతే నా మీద ఒట్టు.... ఆఫ్టరాల్ మనలాంటి మనుషులు వీళ్లకు భయపడి మీ ఎదుగుదలని ఆపుకుంటారా?
- నల్లమోతు శ్రీధర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి