25, ఫిబ్రవరి 2015, బుధవారం

జీవితమంటే ఒక సమస్య నుండి ఇంకొక సమస్యకు ప్రయాణమే సమస్యలేని జీవితమంటూ ఉండదు 
సుఖ పడాలని ఎంత ప్రయత్నిచిన ,నీవు సుఖపడటం అసంభవం. నీవే సుఖమని తెలిసినప్పుడే ,
నీవు సుఖపడటం ఖాయం : జీవితం రెండు రకాలు, అవి: ప్రతిదీ అద్బుతం భావించి బ్రతకటం ఒకటి ఏది అద్బుతం కాదనుకొని బ్రతకటం ఒకటి. ఇతరుల జీవితాలతో పోల్చుకోకుండా అనుభవిస్తాను మధురమైన జ్ఞాపకం కన్నా, మరుపురాని బాధకే వయసు ఎక్కువగా వుంటుంది ..... మనతోపాటే వుంది మనకు తోడు రానిది - జీవితం! ఎక్కడికేల్లిన, ఏంచేసినా మనల్ని వదలనిది - చావు `నా` అంటే అహంకారం, `మా` అంటే మమకారం, `మనం` అంటే సహకారం, ` నమః` అనుకొంటే నిర్వికార్యం; నేను, నా అనే అహాలను వదిలి మనం అనే ఇహంగా కదిలితే మనుష్యుల్లో మానవత్వం మొగ్గ తొడుగుతుంది !!
పెంచుకుంటే మనుష్యుల మద్య పెరిగేది మమత ఒక్కటే, నేను దీనిని నమ్ముతాను! ఇంకా నేను సింప్లిసిటీ ని ఇస్తా పడుతాను! ఫ్రెండ్లిగా వుంటాను. ప్రతి మనిషిలోను మంచిని చూడటానికి ప్రయత్నిస్తాను . ఎందుకంటే, అలా చేయటంవల్ల మనలోని మంచి పెరుగుతుంది! కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త విషయాలను తెలుసుకోవటం రోతింకి బిన్నంగా వుంటుంటే నా మనసుకి సంతోషంగా వుంటుంది!క్షమాశీలం వ్యక్తిత్వానికి మణిమకుటం పెడుతుంది.
దానగుణం మానవతకు నిదర్శనం. తాము దానం చేసామన్నది ఎవరికీ తెలియకూడదని గుప్తదానాలు చేసేవారున్నారు. ‘పుచ్చుకున్నవాడు కాదు- ఇచ్చినవాడు ధన్యుడు, నువ్వు దానం చేయదలిస్తే, దానిని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నవారికి నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి’ అనేవి స్మరణీయ సందేశాలు.
జీవితమంటే సమస్యల సంకలనం. ఏదో ఒక సమస్య లేనివారుండరు. ఒక్కోసారి ఒక ఆదర్శానికి కట్టుబడి, స్థిరంగా నిలబడవలసి వచ్చినపుడు ఇలాంటి ‘నడవకయుండెడి’ పరిస్థితులు వస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి