30, మార్చి 2015, సోమవారం

కిట్టూ పద్యాలు
కాలగర్భమందు కలవని ఘనుడేడి
గతముకన్న మిన్నఘనతదేధి
గతము తలచి వలచి కన్నీటి చెంతన
సేదతీరువాడు సాధకుండు
చదువులెల్ల చదివి చనుబాలనొదులుచు
దూరతీరమేగి సిరులకోరి
కన్నవారుపోగ కర్మసేయగరారు
బతుకనేమి వారు చితుకనేమి
పరువు కొరకు నొకడు ప్రాకులాడుచునుండు
పరుల కొరకు నొకడు పాటుబడును
తనదుబతుకునొదలి జనుల బతుకుకోరి
సేవ సేయువాడె జీవనుండు
గతుకు పథము నందు బతుకులు బలియైన
వెతలనన్నిగాచి హితులనొదలి
గులకరాళ్ళనెత్తి గుంతలు పూడ్చుచు
బతుకు చుండె నొకడు భరత సుతుడు
Like ·  · Comment
దేశ విభజన సమయం లో .....
ఒక యుద్దం లో ఎంత మంది చస్తారో,
అంత కంటే ఎక్కువ మందే చనిపోయేరు.
ఒక యుద్దం సమయం లో దుర్మార్గుల చేతిలో ఎంత మంది మహిళలు
చిత్రహింసలకు గురి అవుతారో, అంత కంటే ఎక్కువ స్త్రీలు హింసింపబడ్డారు.
ఒక యుద్దం లో ఎన్ని కుటుంబాలు నిర్వాసితులు అవుతారో
అంత కంటే ఎక్కువ కుటుంబాలు నిర్వాసితులు అయినారు.
కాని
అది యుద్దం కాదు ....కానేకాదు..!
ఆది హింస అసలే కాదు - అహింస..!!
ఆహింస తో సాధించిన స్వాతంత్రము...!!!
అది ఒక "అహింసావాది" ప్రజా శ్రేయస్సు కొరకు తీసుకొన్న
"దేశవిభజన నిర్ణయం"వలన అది అలా జరిగింది....అంతే.
కత్తులు పట్టి ఎవరి తలలు నరకలేదు ..కసాయివాడు కాదు..!
భగత్ సింగు లాగా బాంబులు వేయలేదు... ఉగ్రవాది కాదు..!
గూడ్సే లాగ తుపాకీ గుండుతో ఎవరినీ చంపలేదు..హంతకుడు కాదు..!
అతడు న్యాయాన్యాలు తెలిసిన మహా న్యాయవాది.
అతడు ఒక అహింసావాది. ముమ్మాటికీ అహింసావాది .
రక్తపాతం లేకుండా స్వాతంత్రము సాధించిన అహింసావాది.
అందుకే ఆయన మహాత్ముడు.
కాని
"దేశాన్ని ఎన్ని ముక్కలైనా చేయి ,కాని నన్ను దేశ ప్రధాని చేస్తే ,
నీ వలనే , నీ అహింసావాదం వలనే మన దేశానికి
స్వాతంత్రము వచ్చిందని ప్రపంచానికి చాటి చెప్తాను"
అనే ( match fixing) ఒప్పందాలు , నెహ్రూ గారు తో చేసుకొని ...
మీ ఇరువురి స్వార్ధానికీ సుభష్ చంద్ర బోసు వంటి
అనేక దేశ భక్తులు బలైపోయారని తెలిసినప్పుడు, అహింసావాదం లో
కూడ ఇన్ని హింసలు వుంటాయా అని......
అని ....జనం అనుకొంటుంటే ......
"నిజాలు నిలకడ మీద తెలుస్తాయి.
తొందరపడి ఎవరి మీదా అనుచిత వ్యాఖ్యలు వద్దు "అని
నా మనసు నన్ను హెచ్చరిస్తున్నది.
కాష్మిరీ పండితుల కుటుంబం కాని వారు
"మేక వన్నె పులి" అన్నట్లు , "కాష్మీరీ పండిత" ముసుగు వేసుకొని
హిందూస్తాన్ దేశ పరిపాలన హస్తగతము చేసుకొని
కాష్మీరీ పండితులను ఊచకొత కోసి, వేల కుటుంబాలను సర్వనాశనం చేసి
వారికి నిలువ నీడను లేకుండా చేసేరు ......అని ...
గాంధీలు కాని ఒక కుటుంబానికి "గాంధీ" పేరు
తగిలించుకోవటానికి తన న్యాయవాది తెలివితేటలు అన్నీ
ఉపయోగించి సలహాలు ఇచ్చింది కుడా గాంధి గారే ....అని..
నిజమైన హిందువులు కాని వారి చేతికి
"స్వతంత్ర హిందూస్తాన్" పరిపాలనా పగ్గాలు
అప్పగించటము వలనే ఈ దేశాన్ని అవినీతి ఊబిలో ఇరికించి
దేశాన్ని సకల విధములుగా భ్రష్టు పట్టించటమే కాకుండా ,
హిందూస్తాన్ లో హిందువుల ఆరాధ్య దైవము అయిన
అయోధ్య రామాలయ సమస్యను రోజు రోజుకూ జఠిలము చేసి నారు... అని ....
భారతీయుని చేతికి తమ స్వతంత్ర దేశ పరిపాలన
హక్కు సిద్ధించిన వెంటనే , పరాయి దేశం వాడు పెట్టిన పేరును
తీసి ప్రక్కన పెట్టాలనే తలంపు రాకపోవటము,
వారి దేశ భక్తిని చెప్పకనే చెప్పుతున్న్నది ....అని....
మత సహనానికి పెట్టింది పేరు మన భారత దేశం.
పనికి రాని పరాయి వాళ్ళు వచ్చి దొరికిన కాడికి దోచుకు పోతూ
" సెక్యులర్" పాఠాలు చెప్తుంటే , వారు దోచుకున్న దానిలో వాటాలు కోసం
కొందరు, వారే స్వయం గా దోచుకొనే పదవులు/ హక్కులు పొందాలని కొందరు,
వారికి వంత పాడేస్తున్నారు మన భారత న్యాయశాస్త్ర కోవిధులు ... అని...
నిజమైన ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను త్యాగము చేస్తే
కేవలము ఇద్దరి స్వార్ధము తో వేసిన ఎత్తుగడలకు,
కష్ట పడి సాధించు కొన్న స్వతంత్రము " ఈన గాచి నక్కల పాలు "
అయినట్లుందని నేడు అక్కడక్కడా కొందరు అంటుంటే ....
వింటుంటే,
సగటు సామాన్య అమాయక భారతీయులు కలత చెందుతున్నారు.
ఇటువంటి "అబద్ధాలు" మరింత ప్రసారము కాకుండా ఉండుట కొరకు
ఇప్పటికైనా ప్రభుత్వం వారు నిజ నిర్ధారణ కొరకు
ఒక "ప్రత్యక్ష విచారణ/ నిజ నిర్ధారణ సంఘా" నియమించి ఆ విచారణ నిజాలు
ఎప్పటికప్పుడు ఈ దేశ ప్రజలకు తెలియపర్చవలసిన అవసరము వున్నది.
"నిజాలు నిలకడ మీద తెలుస్తాయి.
అంతర్జాలములో వస్తున్న వివిధ కధనాలు చూసి కలత చెంద వద్దు.
తొందరపడి ఎవరి మీదా అనుచిత వ్యాఖ్యలు వద్దు "అని
నా మనసు హెచ్చరిస్తున్నది.

28, మార్చి 2015, శనివారం


సీతారాములు ఒక్కసారిగా దేవుళ్ళై పోలేదు.!
ఆకాశం నుంచి భూమి మీదకు దిగలేదు.!
వున్నట్టుండి వూడిపడ లేదు
వరాలిచ్చేస్తాం కోరికల్తీర్చేస్తాం అని చెప్పలేదు.!
కొలువులు తీరి పూజలందుకో లేదు.!  

రాముడంటే నాలుగు తలలూ, పది చేతులూ వున్న దేవుడు కాడు.
ఒక మానవుడు.!
వొట్టి సాధారణ మానవుడు.!
ఒక మామూలు మనిషి.!
ఒక యువరాజు.!
దేశంలోని అనేక వందలమంది యువరాజులలో...
ఇంకో యువరాజు.!
అంతే.!!

ఆమె
కేవలం ఒక మహారాజు పుత్రిక.!
ఇంకో యువరాణి అంతే !
అటువంటి సర్వసాధారణులైన యువరాజులూ యువరాణులూ అనేకులు ఈనాడూ వున్నారు ఆనాడూ వున్నారు.

వారు
ఒట్లు పెట్టుకున్నారు.!
బాసలు చేసుకున్నారు.!
యోగి పుంగవులూ కారు.! 
స్థిత ప్రజ్ఞులూ కారు.!
బాధొస్తే ఏడ్చారు.!
ముల్లు గుచ్చుకుంటే
నొప్పితో నడిచారు. కుంటుతూ తిరిగారు.
ఆగ్రహమొస్తే అరుచుకున్నారు
బాధపడితే తిట్టుకున్నారు. వళ్ళుమండితే కొట్టుకున్నారు.  
మొత్తమ్మీద వారు ఈ నేల మీద రక్తమాంసాలతో నడిచిన
మామూలు మనుషులు.!
సాధారణ మానవులు.!
ఇదొక పార్శ్వం.!!
అంతా చారిత్రక సత్యం!!

మరొక పార్శ్వం -  
అయినా వారు -
అనేక వేల సంవత్సరాలుగా
అందరికీ అనుసరణీయులయ్యారు.! ఎందరికో ఆరాధనీయులయ్యారు.!!
ఇదీ ఇంకో చారిత్రక సత్యం.!!
ఎందుకని?
ఎందుకంటె -
- వారు ఎంత ఎదిగినా అంత ఒదిగి వున్నవారు.!
- గురువుల ముందు వినయంతో వొంగి నిలిచిన వారు.!
- అహాన్నివదిలి ఇహాన్ని సొంతం చేసుకున్నవారు.!
- బ్రహ్మములోని బ్రహ్మాండ సౌందర్యాన్నంతా హృదయభాండంలో ప్రతిష్టించుకుని
  ఎదుటి వారిలో వీక్షించి పొంగి పరవశించినవారు.
- ద్వైతంలో అద్వైతాన్నీ, అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించినవారు.
- ఆదిదంపతులై అనుభవించిన వారు.!
- మాట కోసం సుఖసంతోషాన్నింటినీ వొదిలి కదిలిన వారు.
- తమ సర్వస్వాన్నీ త్యజించిన వారు.!
- పద్నాలుగు సంవత్సరాలు పదవులతో కాక, పాదరక్షలతో ప్రజల హృదయాలను పాలించినవారు.
- రాజ్యాన్ని రక్షించినవారు.!

- అసలు రహస్యమెక్కడుందంటే,
- ధర్మం కోసం తాము శూన్యమై ముందుకు నడిచే వారు, పూర్ణమై వెలుస్తారు. సంపూర్ణులై నిలుస్తారు.
- అట్టివారి పాదరక్షలను కూడా, పద్నాలుగు సంవత్సరాలు కాదు పదివేల సంవత్సరాలైనా పూజామందిరంలో పెట్టుకుంటారు.
- అందుకే అ నామధేయం సర్వులకూ శిరోధార్యమైంది.!
- అందుకే ఆ చరిత్ర నిత్యపారాయణ గ్రంధమైంది.!
- అందుకే నిస్సంశయంగా వారిని అనుసరించిన వారు
- కాములై... రాములై... అనురాగ సోములై..,
- ఆదిదంపతులై.., ఆచంద్రతారార్కం వెలుగొందుతారు.!
- సీతారాములై పూజలందుకుంటారు. !!...................... - డా. గౌతమ్ కశ్యప్)


25, మార్చి 2015, బుధవారం

"కులగోత్రాలు మలమూత్రాలు
విసర్జించటం మంచిది
ఒకటి దేశానికి మరొకటి దేహానికి"

కొవ్వు రెండు రకాలు ..ఒకటి మనసుకి రెండోది మనిషికి రెండు ప్రమాదకరమే

"సత్యం బ్రూయాత్,
 ప్రియం బ్రూయాత్
 నబ్రూయాత్ సత్యమప్రియం
 ప్రియంచ న అనృతం బ్రూయాత్
 ఏతత్ ధర్మ సానతనః" - ....................... అంటున్నాయ్ ఉపనిషత్తులు.

 సత్యం చెప్పండి,
 ప్రియాం చెప్పండి
 అప్రియంగా వుండే సత్యాన్ని చెప్పకండి.
 ప్రియంగా వుంటుంది కదా అని అసత్యాన్ని చెప్పకండి.
 ఇది మనకన్నా ఎంతో లోతుగా ఆలోచించిన మహర్షులు

22, మార్చి 2015, ఆదివారం

అలజడులు ....నా అంతరంగపు ఆనవాళ్ళు


నేను రాస్తున్న కవిత్వం పేరు అలజడులు
ఇవి నా గుండెల్లో అలజడుల ఆనవాళ్ళు
***
జీవితం కట్టుకొయ్యకు కట్టేసినట్టు అనిపించిందంటే
కనబడని కట్లను విప్పుకోవడం మొదలెట్టాల్సిందే!!
  ***
జ్ఞానం కోసం బుద్ధుడు సమస్తాన్ని త్యాగం చేసాడు
స్వేచ్చ కోసం నాలుగు గోడల్ని త్యాగం చెయ్యలేమా!!!

***
66 ఏళ్ళ క్రితం ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంట
ఎంత మెల్లగా నడిచి వస్తోందో నా దగ్గరకింకా రానేలేదు.

***
స్వేచ్చ లో ఎంత బాధ్యత
***
జీవితం ఏడు రంగుల ఇంధ్ర ధనుస్సు
ఈ వెలిసిపోయిన రంగు నాకెందుకూ!!

***
 రాత్రి ఎందుకో నాలో భావాలు ఉప్పొంగుతున్నాయ్
నాతో నేనున్నందుకేమో!!!
***
హిమాలయాలు రా రమ్మని పిలుస్తుంటే
ఈ నౌబత్ పహాడ్ నన్నాపగలదా!!!

***
అడవి ఉప్పొంగుతున్న రాత్రి
ఈ జనారణ్యంలో నాకేం పని

***
నీ జ్ఞాపకంనా పెదవి అంచు మీద చిరునవ్వు సంతకం

***
నిద్ర రావడం లేదు
కవిత్వం మాత్రం పొంగుకొస్తోంది.

***
నా కళ్ళు.. నిద్రా ఏం గొడవపడ్డాయో
ఇద్దరూ ఎడ మొఖం పెడమొఖం.

***
నా కళ్ళు నిద్రా రాజీ పడ్డాయ్
నిద్రముంచుకొస్తోంది.
***
పున్నమి వెన్నెల్ని చూసి మురిసిపోతాం కానీ
అబ్బో!!నిన్న అమావాస్య రాత్రి ఎంత అందంగా ఉందో!!
***
అందం తెలుపులో లేదు
నీలాకాశం ఎంత సుందరం

***అమ్మంటే దేవతని కదా అంటారు
మరి...
ఈ అడుక్కునే అమ్మలందరూ ఎవ్వరో??
* * *

నొసటి నిండా బొట్లే
నోరుతెరిస్తే మాత్రం బూతుల పంచాంగమే


* * *
మైండ్సెట్ మారాలి అంటూ ఉద్యమిస్తున్నాం
కానీ...మారాల్సింది హార్ట్ సెట్.

* * *వస్తు ప్రేమల్ని వ్యక్తి ప్రేమల్ని వదిలేస్తే
మిగిలేది విశ్వప్రేమ
***
జనాలెప్పుడూ నిన్నలోనో రేపటిలోనో బతుకుతుంటారు
కళ్ళముందున్న కమనీయాన్ని కాలితో తన్నేస్తుంటారు.
***
ప్రకృతి నేను ప్రతి క్షణం చెట్టపట్టాల్
అందుకే నాకు బోర్ అంటే ఏంటో తెలియదు
***
అతిగా ఆశించడం దుఖ కారకం
మితంగా పొందడం మహానందం
***
మనం  విత్తులు చల్లితే  మొక్కలే వస్తాయి
మనం  భావాలు చిమ్మితే  భావాలే తిరిగొస్తాయి
***
పుస్తకాల నేస్తాలు చుట్టూ కూర్చుని కబుర్లు చెవుతుంటే
మనకు కూడెందుకు...నీళ్ళెందుకు??
***
చేతిలో కలం ఉండాలే కానీ 
అది కాగితాన్ని ముద్దాడకుండా ఉంటుందా??
స్త్రీలని పూజించే దేశమట
అకటా!! అరవై లక్షల అమ్మాయిల్ని చంపేసిందే!!
***
మాతృదేవో భవ
ట్రాఫిక్ కూడళ్ళలో అడుక్కుంటున్న అమ్మలు
***
నాతి చరామి....
దీనిని మించిన అబద్ధం మరోటి లేదు.
***
కన్యాదానం....
దానమియ్యడానికి అమేమైనా వస్తువా???
***
పెళ్ళంటే...
అబ్బో!! పెద్ద తంతు.
***
 రాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికి 
 పెళ్ళైనా అదే ఇరుకు!!
***
పెళ్ళికి ముందు ప్రియుడు
పెళ్ళాయ్యాకా మొగుడు.
***
కట్నాలూ,కుంపట్లూ అని ఏడ్చే కన్నా
ఉన్నదాంట్లొ హక్కుగా సగమిచ్చేస్తే పోలా!!!
***
అమ్మాయిల్ని ఇళ్ళల్లో మగ్గబెట్టకండి
ప్రపంచం మీదకి వదిలేస్తే పులిపిల్లల్లా తిరిగొస్తారు. 
***
కలల్ని సాకారం చేసుకోనిస్తే...
ప్రతి పిల్లా కరణం మల్లీశ్వరి కాదా!!
నువ్వు నేను సమం సమం
నీకూ నాకూ సగం సగం
ఇదేనండీ ఫెమినిజం!!!
***
ప్రపంచమంతా పుషాధిక్యం
ప్రతీచోటా పితృస్వామ్యం****పిడికిలిబిగించి ప్రశ్నించడమే ఫెమినిజం.
***
అన్నింటా అసమానతలు
ఆంక్షలు,వివక్షలు,అడ్డుగోడలు
గోడల్ని కూల్చడమే నా పని
***
హింసలేని సమాజం స్త్రీల హక్కు
***
నేను పదహారణాల ఫెమినిష్ట్ ని 
సగర్వంగా దీనిని ప్రకటిస్తున్నాను
***
 అతీతశక్తులూ నా జీవితంలో లేవు
నాస్తికత్వం నా జీవన విధానం 
***
మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు
మణులూ,మాణిక్యాలు ఏం రాలతాయి??
***
వేలాది బాబాలు,అమ్మలు ఎగబడ్డ దేశం
స్త్రీలపై హింసకు పాల్పడొద్దని ఒక్కరూ చెప్పి చావరే!!
***
ఎంతో చిన్నది జీవితం
ఇంతగా చిందవందర చేసుకోవాలా??
***
అందమున్నది శరీర కొలతల్లో కాదు
అందమున్నది అంతరంగ వైశాల్యంలో
***
తెల్లతోలు చుట్టూ అల్లుకున్న వ్యాపారం విలసిల్లేది
మన శరీరాలని ఎలా ఉన్న వాటిని అలా మనం ప్రేమించుకునే వరకే
***
నిన్ను నువ్వు ప్రేమిస్తే 
ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది.
***
ఎప్పుడూ ఎదుటివాళ్ళు మెచ్చుకోవడం కోసం ఎదురు చూడ్డం కాదు
నిన్ను నువ్వు మెచ్చుకోవడం లోనే నిజమైన ఆత్మగౌరవం ఉంది
***
నిన్ను నువ్వు గౌరవించి చూడు
నిజమైన స్వేచ్చ అక్కడే ఉంది
***
ఎప్పుడూ బయట ప్రపంచంతో బలాదూరేనా
అప్పుడప్పుడూ అంతర్లోకాల చీకటిని చెక్ చేసుకోవాలి కదా!!!
***
బయట ముఖం బహు సుందరం
అంతరంగమంతా అంధకారబంధురం
***
బయట ప్రపంచంలో బహుముఖాలుగా విస్తరిస్తావ్ సరే 
నీ అసలు ముఖమేదో నీకైనా తెలుసునా???
***
దేవుళ్ళ గుళ్ళల్లో తొక్కిసలాటలు 
మనుష్యులకింత అభద్రత ఏంటో!!!
***
టెంపుల్ టూరిజం
టోకున జనాన్ని చంపుతోంది
***
మనిషి నమ్ముకోవాల్సింది తోటి మనిషినే
రంగులేసిన బండరాళ్ళని కాదు
***
రంగు రాళ్ళూ,రుద్రాక్షలూ 
ఎంతెంత మోసం గురువా!!! 
***
వారఫలాల్లో జాతకాలు చూసుకోవడం కాదు
వాస్తవ జీవితం ఎలా ఉందో చూడు మిత్రమా!!
***
అంతర్జాతీయ విమానాశ్రయం ధగ ధగల వెనక 
వందలాది గ్రామాల చీకటి సమాధులున్నాయ్
***
అపారమైన పళ్ళచెట్లని,పూలతోటల్ని పెకలించేసి
ఎడారుల్లో పెరిగే ఖర్జూర చెట్లు వెయ్యడం దేనికి సంకేతమో !!!
***
"
అభివృద్ధిఅంటే కొండచిలువల్లా విస్తరించిన 
ఫ్లై ఓవర్లు,ఆకాశ హర్మ్యాలేనా???
***
కార్పొరెట్ కౄర ముఖానికి
సున్నితమైన తెర సి ఎస్ ఆర్
***
దేశాన్నించి దోచేది కోట్లలో
సి ఎస్ ఆర్ రూపం లో విదిలించేది వందల్లో
***
  టి ల్లో మనవాళ్ళు చదివేది మంది సొమ్ముతో
కొలువు తీరేదిసేవ చేసేది కార్పొరేట్ కంపెనీల్లో
***
హైదరాబాద్ అంటే సైబరాబాద్ అని బుకాయించకు
హైదరాబాద్ అంటే వెయ్యి ముఖాలుగా విస్తరించిన మురికివాడలు
***
"
అభివృద్ధిబాధితులంతా చేరేది నగరాల పేవ్ మెంట్ల మీదకే 
అభివృద్ధిలో బాధితులేంటి చిత్రం కాకపోతే.......
***
ఏలిన వారి "అభివృద్ధినమూనా 
ఏలికల పక్షం వారి సంక్షేమం కోసమే 
***
పోలవరం ప్రాజెక్ట్ ......
కొంతమంది భూస్వాముల భూములకు నీళ్ళు 
గంపెడు గిరిజనుల కొంపా గూడూ నీళ్ళపాలు
***
మనసు ఉద్విగ్నమైనప్పుడల్లా..
అక్షరాలు వెల్లువెత్తుతున్నాయ్.***కధలు రాసే నేనేమిటిలా
కవిత్వం లో కొట్టుకుపోతున్నాను
***
తెలుగుభాషలో అతి నికృష్ట పదం.....
కన్యాదానం
***
మనం వాడే పరం వికృతమైన పదం 
మానభంగం
***
ఒక భయానక అనుభవానికి మనం పెట్టిన పేరు
చెరచడం
***
ఒకానొక బీభత్స అనుభవాన్ని మన పిలిచేది
శృంగారానుభవం
***
బయటి వాడు చేసేది రేప్ 
ఇల్లళ్ళో మొగుళ్ళు చేసేది మారిటల్ రేప్
రెండూ శిక్షార్హమే సుమా!!!
***
కోట్లకి పడగలెత్తడానికి
ఒక బ్యాటూ...ఒక బాలూ చాలు
***
ఎవరో రాసిన డైలాగుల్ని వెండి తెర మీద పేల్చే వీరులే
మన హీరోలూ,హీరోయిన్లూ.
***
కార్పొరేట్లకి కాసుల్ని కురిపించే క్రికెట్ ముందు
సకలజనుల ఆటలన్ని వెలాదిలా పోవాల్సిందే
ప్రకృతి ముందు కుప్పిగంతులొద్దు
పై లాన్ పుచ్చుకు కొడుతుంది..
***
సముద్రం మహా సుందరం
తుపానొస్తే పరమ బీభత్సం
***
ప్రకృతి ముందు ఎవ్వరూ నిలవలేరు
ఆఖరికి నువ్వు నమ్మే దేవుడు కూడా.
***
అనంతమైన ప్రేమని పంచే ప్రకృతి
అలిగిందంటే అలలుపెట్టి కొడుతుంది
***
అందమైన అల
ఆగ్రహిస్తే రాకాసి అల.
***
నీలం నుంచి కోలుకోలేదు జనాలు
ఇంకొక ఇంద్రనీలం ముంచుకొస్తోంది
నాకు తెలియక అడుగుతున్నా...
ప్రళయాన్ని సృష్టించే పెను తుపానులకు 
ఆడ పేర్లెందుకు పెడతారూ.......
లైలా...ఖత్రినా... ఐలా.... ఫాలిన్...
రాబోయే తుపాను పేరు హెలెన్ అట..
దీని భావమేమి మితృలారా?????
Like ·  ·  · 
Names...


Names...