బృందం.. చాలా అందమైన పదం.. బృందావనం లాంటిది..అందరూ కలసి ఉంటారు..ఫేస్‌బుక్‌లో తొలుత అందమైన.. స్వచ్చమైన, అచ్చమైన బృందాలుండేవి.. ఆత్మీయ పలకరింపులుండేవి. సాహిత్య సంభాషణల విందులుండేవి. రానురాను అవి అహంకార, అహంభావ సామ్రాజ్యాలయ్యాయి.
తొండముదిరి ఊసరవెల్లులైనట్లు బృందం ముదిరి "ముఠా"లు ఏర్పడి, అతిశయం, ఆడంబరం పెరగడం మొదలైంది. సాహిత్య బృందాలే కాదు, రాజకీయ, ఆత్మీయ, ఆధ్యాత్మిక బృందాల తల(లు)పులూ మూసుకు పొయ్యాయి.
ఈ ప్రపంచం నుండి. నా కోడి లేకుంటే తెల్ల వారదని.. నా పొయ్యి వెలగకపోతే ఊరంతా పస్తుంటుందనుకునే అమాయకులు ఎక్కువయ్యారు... ఆ (అ)కారణంగా అద్భుత పాటవం, ప్రేమానురాగాలున్న పలువురు అదృశ్యులయ్యారు. గ్రూపుల్లేకుంటే లోకంలో మిత్రులుండరా? సాహిత్యపు చీకట్లు కమ్ముకుంటాయా?? ప్రపంచం నడవదా!! నిజాలు ఎవరి అంతరంగానికి వారికి తెలుసు..చూడండి ప్రపంచమే ఒక బృందమై.. అపరిచితులు కూడా అత్మీయ బంధువులవుతున్నారు. గడ్దం గీత గారన్నట్లు ఈ అంతర్జాలపు కత్తితో పండ్లు కోసుకుంటారో..పంతాలతో గొంతుకలు కోసుకుంటారో! విచక్షణ ప్రదర్శించాలి.
UnlikeUnlike · Share

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి