తెలుగు భాష తియ్యదనం
తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్న వాళ్ళకి
తెలుగే ఒక మూలధనంతల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే
వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా ||తెలుగు||
చరణం : ౧
అమ్మా అన్న పిలుపులోన
అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదములోన
అభిమానం జనిస్తుంది
మమ్మీ డాడీలోన
ఆ మాధుర్యం ఎక్కడుందీ
మామ అన్న మాట
మనసులోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు
మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన
ఆ ఆప్యాయత ఎక్కడుందీ
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు
||తల్లి తండ్రి||
తెలుగు మాట్లాడి
నువ్వు వాళ్ళ రుణం తీర్చరా
కొంత రుణం తీర్చరా
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారుతులు
చరణం : ౨
కొమ్మల్లోన పక్షులన్ని
తమ కూతను మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్ని
తమ భాషను మరువలేదు
మనుషులమై మన భాషకు
ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు
మన పలుకులు మెచ్చినారు
పొరుగురాష్ట్ర కవులు కూడ
తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు
అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాష ఆచారాలను మింగేయొద్దు
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు
సిగ్గుపడకురా... వెనక్కి తగ్గమాకురా
||తెలుగు||
మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా
అమ్మా నాన్నా అంటూ నేటి నుండి
పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి