.
YOUTUBE.ఆకాశాన సూర్యుడుండడు సందె వేళకే...
చందమామకి రూపముండదు తెల్లవారితే...ఈ మజిలీ... మూడునాళ్ళే ఈ జీవయాత్రలో..
ఒక పూటలోనె రాలు పువ్వులెన్నో
నవ్వవే.. నవ మల్లికా.. ఆశలే.. అందాలుగా..
ఎద లోతుల్లో.. ఒక ముల్లున్నా..
వికసించాలే ఇక రోజాలా.. కన్నీటి మీద నావ సాగనే...ల
నవ్వవే.. నవ మల్లికా.. ఆశలే.. అందాలుగా..
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో...
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే.. చాలులే
చింత పడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా...
పుట్టే ప్రతి మనిషి కనుమూసే.. తీరు
మళ్ళీ తన మనిషై ఓడిలోకే.. చేరు
మమతానురాగ స్వాగతాలు పా...డ
నవ్వవే.. నవ మల్లికా.. ఆశలే.. అందాలుగా..
ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి
జన్మ బంధము ప్రేమ గంధము పూటే... చాలులే
పంజరమై బ్రతుకు మిగులూ... పావురమే బయటికెగురూ...
మైనా క్షణమైనా పలికిందే.. భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ.. ఆశ
విధి రాతకన్న లేదు వింత పా...ట
నవ్వవే.. నవ మల్లికా.. ఆశలే.. అందాలుగా..
ఎద లోతుల్లో.. ఒక ముల్లున్నా..
వికసించాలే ఇక రోజాలా.. కన్నీటి మీద నావ సాగనే...ల
నవ్వవే.. నవ మల్లికా.. ఆశలే.. అందాలుగా..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి