25, సెప్టెంబర్ 2014, గురువారం

రామాయణం
పుత్రులు జన్మించిన పదకొండు దినముల పిమ్మట దశరథుడు వారికి జాతకర్మనామకరణోత్సవములను నిర్వహించెను. కులపురోహితుడైన వసిష్ఠుడు ఉత్తమ గుణములుగల జ్యేష్ఠకుమారునకు ‘రాముడు’ అనియు, కైకేయి సుతునకు ‘భరతుడు’ అనియు, సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనియు నామకరణములు జేసెను” అని ఉన్నది. రామ అను శబ్ధానికి గల అర్థం సరిగ్గా కుదురుతుందని కులగురువు పెట్టిన పేరు.
ఆ పద్దెనిమిదవ సర్గలోని 8, 9వ శ్లోకాలలోని వివారలను బట్టి ఆయన జన్మలగ్నకుండలిలో రవి మేషంలోనూ, గురుడు కర్కాటకంలో, శని తులారాశిలో, కుజుడు మకరంలో ఉచ్ఛస్థానాల్లో ఉన్నారు. గురు గ్రహానికి ఉన్న పేర్లలో ఆంగీరస ఒకటి – అంగీరసుని పుత్రుడు కాబట్టి. శనిగ్రహానికి మంద అనే పేరు ఉన్నది – మంద గతితో కదులుతాడు కాబట్టి. కుజుడికి ఉన్న ఒక పేరు అంగారకుడు. ఉచ్ఛస్థానాల్లో ఉన్న ఆయా క్రమంలోని గ్రహాలు అంటే ‘రవి’, ‘ఆంగీరస’, ‘మంద’ మరియూ ‘అంగారక’ గ్రహాల పేర్లలోని మొదటి శబ్ధాలను కలిపితే ‘ర్‌‘ + ‘ఆ‘ + ‘మ్‍‘ + ‘అ‘ = రామ. ఇలా కూడా ఆయనకు పెట్టిన ఆ పేరు వెనుకనున్న రహస్యాన్ని కొందరు పండితులు వివరించారు. నమ్మడం నమ్మకపోవడం వేరే విషయం. విషయ పరిజ్ఞానం ఉంటే ముక్కున వేలేసుకోవాల్సిందే! కాబట్టి ఆ పేరు వెనుక ఏ సందేహమూ లేదు.
బల రాముడు, పరశు రాముడూ ఉన్నారు కానీ రాముడు అంటే దశరథ నందనుడైన శ్రీ రాముడే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి