నాకలోకానికి కోత్తరంగులద్దుతోంది
అంచెలంచెలుగా ఎదిగిన 'బాపు' కుంచె
అంచెలంచెలుగా ఎదిగిన 'బాపు' కుంచె
అప్సరలంతా లైను కట్టేశారు 'బాపు' ముందు
మా బొమ్మలు కూడా అందంగా వేయమంటూ
మా బొమ్మలు కూడా అందంగా వేయమంటూ
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు 'బాపు'ని
దేవలోకానికి ఆస్థాన చిత్రకారునిగా
దేవలోకానికి ఆస్థాన చిత్రకారునిగా
సంపూర్ణ రామాయణాన్ని మళ్ళీ తీస్తున్నారు 'బాపు'
మేకప్పక్కర్లేని దేవతలే పాత్రధారులుగా.
మేకప్పక్కర్లేని దేవతలే పాత్రధారులుగా.
భూలోకంలో దేవకుమారుల వేట మొదలైంది
'బాపు' చూపిన చిత్రాల్లోని (బొ)కొమ్మల కోసం
'బాపు' చూపిన చిత్రాల్లోని (బొ)కొమ్మల కోసం
'బాపు'కే ఇచ్చాడు విశ్వకర్మ...
తాను నిర్మించే భవనాల గోడలపై చిత్రాలు గీసే కాంట్రాక్టు.
తాను నిర్మించే భవనాల గోడలపై చిత్రాలు గీసే కాంట్రాక్టు.
బ్రహ్మ కూడా శిష్యుడయ్యాడు 'బాపు'కి
అందరి నుదిటి రాతలు మరింత అందంగా వ్రాద్దామని
అందరి నుదిటి రాతలు మరింత అందంగా వ్రాద్దామని
పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు...దేవతలు
బాపు కార్టూనుల ప్రదర్శనలు చూసి.
బాపు కార్టూనుల ప్రదర్శనలు చూసి.
సరసన చోటిచ్చారు దేవతలు 'బాపు'కి
తమని...తమకంటే బాగా చిత్రాల్లో చూపాడని.
తమని...తమకంటే బాగా చిత్రాల్లో చూపాడని.
ఒక్కదేవుడైనా ఇవ్వలేదు శతాయుష్షు...
అందరికీ తన రేఖాచిత్రాలలో ప్రాణం పోసిన 'బాపు'కి ... #శ్రీ 07/09/201
అందరికీ తన రేఖాచిత్రాలలో ప్రాణం పోసిన 'బాపు'కి ... #శ్రీ 07/09/201
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి