ప్రాణికి ప్రాణం నువ్వు,!
ప్రాణ స్వనం నువ్వు..
ముఖ్య ప్రాణం నువ్వు.!
…. నా ప్రాణం నువ్వు.!!
నా పలుకువు నువ్వు, పలుకుల చెలివి నువ్వు.!
సంస్కరించిన గీతం... సంగీతం నువ్వు !
నా హితం నువ్వు, ... సాహిత్య్వం నువ్వు.!
విశాల విశ్వం నువ్వు..! విశ్వ తత్త్వం నువ్వు.!
నా తల్లివై, తండ్రివై, గురువై
...పోషిస్తూ, ...శాసిస్తూ ..బోధిస్తూ...
మిత్రుడై రక్షిస్తూ,.
శతృవై హెచ్చరిస్తూ...
ఈ విశాల విశ్వమై..
నన్ను నిలబెడుతున్న
నా ఆత్మకు ఆహారం నువ్వు.!
ఆత్మరూపం నువ్వు.!
నా అస్థిత్వం నువ్వు.!
అనంత విశ్వం అంచుల దాకా వ్యాపించిన జ్ఞానం నువ్వు. !
విజ్ఞానం నువ్వు, సుజ్ఞానం నువ్వు, ప్రజ్ఞానం నువ్వు.!
నీకు ప్రత్యామ్నాయం నువ్వు!!
నీకు ప్రతి రూపం నువ్వు.!
నీ రూపం నువ్వు.!
నాపేరున వున్న ఈరూపం నువ్వు, !
నువ్వు లేని మరుక్షణం లో
అరక్షణం లో నేను
పసువునో.. కసువునో..
..నుసినో.. మసినో..
పురుగునో నురుగునో..
నేను నీ అంతటి వాడనా ...
పుంభావ సరస్వతినా...
అయ్యో . . .
నీ ముందు, .నీ ముందు
...నీ.. నీ ముందు
నేనెంతటి వాడను.!!
నేనెంత.. నా సాధనెంత..! నా బ్రతుకెంత.!
ఎన్ని వేల లక్షల కోట్ల జన్మల తపస్సు చేసైనా
నీ పాదపద్మ యుగళం చెంతకైనా చేరగలనా..!
నా గళం విప్పగలనా.! వినిపించగలనా..!
నిలబడగలనా...! నీ రూపం చూడగలనా..!
నా స్వరం నీ స్వరంలో పలకగలనా.!
నువ్వు ఎన్ని ఎన్ని ఎన్ని అవమానాలు,
ఎన్నెన్ని బాధలు భరించి భరించి,
ఎన్నికష్టాలు సహించి,
ఎంత శ్రమించి శ్రమించి శ్రమించి
సాధించిన నీ జ్ఞానాన్ని,
సర్వత్రా వున్న నీ ఉనికిని, నీ అస్థిత్వాన్ని,
నీ ఔన్నత్వాన్ని, నీ అమరత్వాన్ని,
నీలోని నీ అనంతత్త్వాన్ని,
నీ దివ్యత్వాన్ని, నీ కోసం...
నీకుగా నువ్వు సాధించుకున్న
... నీ సర్వస్వాన్నీ...
నాలో నిలిపి,
నన్ను నిలబెట్టి,
నువ్వే అన్నీ అని, ఏమీ తెలియని నన్ను పూర్ణం చేస్తూ..
సంతోషంగా శూన్యమైన మౌనానివి నువ్వు.!
నా ఆత్మలో నిలిచి
నీ పలుకును, . . . నా పలుకుగా చేసి పలుకుతున్న అనంత, త్యాగానివి నువ్వు.!
...తల్లివి నువ్వు.!
..తల్లీ తల్లీ తల్లీ నా తల్లీ....!
నీ ముందు నేనెంతటి వాడను..!
నా ఉదయానివి నువ్వు... హృదయ గళానివి నువ్వు.!
వినయానివి నువ్వు, సజల నయనానివి నువ్వు.!
నా శబ్దానివి నువ్వు,
నను శాసిస్తున్న శాస్త్రానివి నువ్వు
సహస్ర కాంతులతో, శతసహస్ర స్వాంతనలతో...
నా చుట్టూ చేరి నన్నావరించి
నా అస్థిత్వం చుట్టూ నిలబడి,
ఈ అనంత విశ్వమై అలరిస్తూ... నను కావలి కాస్తూ...
నా శ్వాసలో శ్వాసవై.. శ్వాసిస్తూ...
నాతో నడుస్తూ, నీతో నడిపిస్తూ..
నిత్యం శుభాన్ని కోరే
మంగళానివి నువ్వు.!
సన్మంగళానివి నువ్వు.!
సహస్రగళ సంగీతానివి నువ్వు.!
విశ్వకళ్యాణం నువ్వు.!
ఈ ఆకాశంలో... అపార అగాథ గహన గగనంలో ఎల్లలు లేని ...ఈ మహా మహా మహా శూన్యంలో,
ప్రతి నిత్యం ప్రతి క్షణం
శత కోటి సూర్యులను సృష్టించే శాస్త్ర జ్ఞానం నువ్వు.! విజ్ఞానం నువ్వు..! సుజ్ఞానం నువ్వు.!!
అనంత కోటి సూర్యప్రభల - ప్రబల ప్రచండ ప్రజ్ఞానం నువ్వు.!.
విశ్వగణిత ఘటనాఘటన సమర్థులే, సామ్రాట్టులే లెక్కించలేని ...
ఈ అనంత కాల ప్రవాహంలో సకల జ్ఞానాలతో నిలుచున్న శక్తి స్వరూపం నువ్వు.!
మరి నేను...
నీ పాదాల మందు పారాడుతున్నరోజుల బిడ్డని..పసిగుడ్డుని.!
అయినా నన్నెత్తుకుని నీ రూపం నా రూపంలో చూసుకుని
మురిసిపోయే అల్పసంతోషివి నువ్వు.!
నా కోసం మబ్బులపత్తి పరుపులు పరచి,
నక్షత్ర కాంతులలో నన్ను పడుకోబెట్టి,
నేనడిగానని నాకు ఆడుకోడానికి
రెండు మెరుపు బంతులు - సూర్యచంద్రుల నిచ్చి,
వెలుగు వెన్నెలల్లో నన్నాడిస్తూ అలరిస్తూ,
నీలోని నీ రక్తాన్నిచ్చి, నీ దివ్యజ్ఞాన స్థన్యాన్నిచ్చి, నన్ను బతికిస్తున్న తల్లివి నువ్వు.!
కరుణ రసార్ద్ర హృదయ రూపం నువ్వు.!
మౌన వినయం నువ్వు.!
అహంకార శూన్యం నువ్వు.!
అఖండ పూర్ణం నువ్వు.! పరిపూర్ణం నువ్వు,!
సర్వ సంపూర్ణం నువ్వు.!
తల్లీ తల్లీ తల్లీ...
తల్లీ..తల్లీ..తల్లీ.. నా తల్లీ.! ...... - గౌతమ్ కశ్యప్

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి