19, మే 2015, మంగళవారం

సావిత్రి: ఎవరీ దివ్యమూర్తి..!!చూడగా...నా పతిప్రాణములు గోమ్పోవచ్చిన యమమూర్తి వలె వున్నాడు..
యముడు: ఆహా..ఎమాశ్చ్చార్యము...,బహూక్రుత దానదర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మత్ రూపవిశేషంబు ఈ అన్నుల మిన్నకు కానవచ్చే ...(ప్రకాశముగా) మానినీ...!!హ హ హ ...నిర్నిమిత్త సందేహ డోలాయ మానసివై...ఎలా అటుల దిగాలుగ చూచుచున్నావు ..సామాన్య మనీష అగోచరంబైన మత్ రూపవిశేషంబును గాంచియే,నేనెవర్నో ఊహించి వుండజాలడువు...అయిననూ..వచించేద ...

యముడు:
 క్షీరాభ్దిపై తేలు ...శ్రీహరి పానుపు.. వరిగినా.ఒకప్రక్కకు వరుగు గాక...
వేదాలు వర్ణించు ..విశ్వకర్త ముఖాలు... నాలుగు మూడైన అగునుగాక ..
పరమేశ్వరుని ...దివ్యప్రలయతాండవమందు... తాళము తప్పినా తప్పుగాక..
చదువుల గీర్వాణి ...మ్రుదుతరాంగిణి వీణ...పలికినా అపశృతుల్ పలుకుగాక..

సకలలోకముల ధర్మశాస్త్రములనమలుచేసి, విధివ్రాయు...
వేళతప్పక ప్రాణాలువేలికితీయు.. మోసికోనుపోవుచుండు....యముండ...నబలా...!!!

సావిత్రి: పోవుచున్నావా...ఔరా...యమధర్మరాజ...పోవుచున్నావా...
కొంతయేని కరుణమాని సాత్యకి ప్రాణములను గొని పోవుచున్నావా..!!

యముడు: ఆహా..ఏమి ఈ సాద్వీలలామ... దుర్గమ కీకారణ్యముల సైతముసేవించి,నన్నసరించు ఈమె స్తైర్యమునుసంస్థనీయమైననూ..నిష్ప్రయోజనము గనుక చెప్పి చూచెద గాక...
కాలుమోపిన చాలు.. కస్సున అరికాలు.. కోసుకుపోయేడి బూజురాళ్ళు
అలికిడైనను చాలు.. అదిరి బస్సున లేచి.. పడగెత్తి పైపడు పాపరెండ్లు
అడుగు వేసిన చాలు.. ఒడలు జిల్లునలాగి.. నరములు కుదియించు నదుల నీళ్ళు
గాలి దోలిన చాలు... కదలి" ఘీ" యని కర్నపుటముల పెల్చేడి మునివేదుళ్ళు

పులులు.. సింహాలు.. శలభాలు ..పోవపోవ కటికిచీకటి ..కనరాదు కాలిద్రోవ
మరలిపోమ్మిక విడువుము మగని ఆశ...మాటవినవేల ..ఒ బేల.. మరలవేలా ..!!

చీమలు దూరని చిట్టడవులలో. కాకులు దూరని కారడవులలో .
చీమలు దూరని చిట్టడవులలో. కాకులు దూరని కారడవులలో .
లబోదిబోమనిఅఘోరించినా...లబోదిబోమనిఅఘోరించినా...
పలితము సున్నా.. మరలుము వెనుకకు... ఫో బేల పొమ్మికన్
నావెంట రావలదు.. రాతగదు... ఫో.. ఫో.. బేల... పొమ్మికన్ ..!!
ఆహా...ఏమి ఈ బాల అచంచల మన స్థైర్యము.దుర్గమ కీకార్ణ్యసీమలనదిగమించుటయే గాక,మహోన్నుతపర్వతశిఖరములసైతముఅధిగమించినన్నసుసరించుచున్నదే...మరియిను మరికొంచెము బెదరించి.. చూచెద గాక...

చెప్పిన వినవు చేవుడా గివుడా ..పట్టిన పంతము విడువవుగా...
చెప్పిన వినవు చేవుడా గివుడా ..పట్టిన పంతము విడువవుగా...
ఏమనునకొంటివి...???ఎవరనుకొంటివి...???
ఏమనునకొంటివి...??? ఎవరనుకొంటివి...???
యమున్డను ...కాలయమున్డను ...కాలయముండను...హ... హ.. హ ...ఆ.
ఆహా...ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమా...
సాధ్వీ..!!.నీకార్యదీక్షకు కడున్కడు సంతసించితి..నీ పతి ప్రాణము దక్క ఏదేని ఒకవరము కోరుకొమ్ము ఇచ్చేద..
సావిత్రి: యమధర్మరాజా..!!రాజ్యభ్రస్టులై అంధులై..కారడవుల కటకటంబడు అత్త మామలకు...
యముడు:సరియసరియ..రాజ్యప్రాప్తియూ...నేత్రద్రుష్టియూ..రెండుయూ..యోసంగితి..పొమ్ము...
సావిత్రి: పోవుచున్నావా..ఔరా..యమధార్మరాజ...పోవుచున్నావా...!!
యముడు : వదలకవచ్చున్నదే..ఇట్టి వరములనేన్నియోసగిననూ,నా యమధర్మమునకు భంగము వాటిల్లదుకదా...!!మరోక్కవరబిచ్చి లాలించి బుజ్జగించి,ఊరడించి మరలించెద...
సావిత్రీ...!! అబలవన్న ఆదరమ్మున ,వంటి వరంబీయుట పాదికానందున,మరోక్కవరంబియ్య ఇచ్చగించితి...అదియునూ..నీపతి ప్రాణమ్ముదక్క...
సావిత్రి : సమవర్తీ...!!నపుత్రస్యా గతిర్నాస్తి..అని అలమటించు నా జనకునకు...
యముడు :ఇకచాలుబాబో అనునట్లు శుత శతంబనుగ్రహించితి ,సంతుస్టివై మరలిపోమ్ము...
సావిత్రి : ఒకటి నే కోరితి.. రెండు నీ విచ్చితి,ముచ్చటగా మూడవ కోరిక చేల్లిన్చకపోవుట పాడియే ధర్మమూర్తీ...!!
యముడు :ఇది మా ధర్మస్మృతిలోవున్నట్లు లేదే...అయిననూ ఆఖరి కోరికని వాపోవుచున్నది .అనుగ్రహించెద..
సావిత్రీ !! అడుగుము అదియునూ.. నీ పతి ప్రాణముదక్క ...
సావిత్రి : సంతానము చూసియైననూ సంతసించు భాగ్యము ప్రసాదించుము.
యముడు :ప్రసాదిన్చితి పొమ్ము..
సావిత్రి : ఇంకెక్కడికి పోయేడవు..నా పతి ప్రాణము నీయక అడుగు వేయలేవు
యముడు : ఏమీ అడుగువేయలేనా...మహిశారాజమా ...హూ ...
ఎమాశ్చ్చార్యము...!!అతల.. వితల. సుతల తలాతల, మహాతల, రసాతల. భూతల. పాతాలలోకముల నెందుతిరిగినను..

దేవాసుర,గరుడ గంధర్వ, కిన్నెర కింపురుష, యక్ష, సిద్ద సాధ్య, భూత ప్రేత పిశాచలేత్తి వచ్చిననూ.. విలయరుద్రుని ప్రలయతాండవ ఘోష విన్ననూ.. నేమరాపక.. ,అడుగుతప్పక ,కాలుతిప్పక ,మున్డుకుసాగిపోవు నా మహిశరాజము నేడేలనో తత్తరపాటుతో బిత్తరపోవుచున్నదే...నీవుసాధ్వియేననుకొంటిని .ఇంద్రజాలివికూడా ..
సావిత్రి :ఇది ఇంద్రజాలముకాడు దర్మబద్దము ..
యముడు: ధర్మబద్దమా ...యమదర్మమునకు పైన మరొక ధర్మమా ...ఎటుల...
సావిత్రి :
 అమరులేటులైన సంతాన మందవచ్చు
మనుజ లోకాన సాధ్వులు మగడు లేక
పుత్రా సంతాన మేరీతి పొందగలరు
తమకు తెలియని ధర్మమే ధర్మరాజా...!!
తమకు తెలియని ధర్మమే ధర్మరాజా...!!
యముడు :ఆహా..ప్రతివతాశిరోమణి యను వాత్శల్యమునవచ్చితిని గాని ,తెలివిగలదానివని తెలిసియుండిన నేనురాక నా బటులనే పంపియుండెడివాడను.గతమునకు వగచి బ్రయోజనంబేమి..
సాధ్వీ...సావిత్రీ ...నీ పతిభక్తికి సమయస్పూర్తికి కడుంకడు సంతసించితిని. ఇదిగో ...నీ పతి ప్రాణము .గ్రహించుము .. యమునంతటివానినే,తికమకబెట్టి గెలిచిన నీ చరిత్ర చరితార్ధము ....పతితో చిరకాలము ఇహసౌఖ్యము లనుభవించి తదుపరి నా లోకమున...కాదు కాదు ..స్వర్గలోకమున.. తరింతురుగాక ...తరింతురుగాక ...తరింతురుగాక ...!!!








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి