24, మే 2015, ఆదివారం

ధర్మాన్నిప్రతిష్టించడానికి 
వ్యాసుడు  భారతం చేపితే 
సాక్షాత్తూ విశ్వ గణనాధుడే వచ్చి
కూర్చుని కలం పట్టి వ్రాశాడు .
పల్లెపడుచుకు జన్మించిన
నిమ్నకులజుడు కూడా
నిఖిల లోకం నుంచి
నీరాజనాలు అందుకున్నాడు

అలా ధర్మాన్ని నిలబెట్టడానికి అక్షరాన్ని ఆశ్రయించినందుకు
అడవిలోని ఒక బోయవాడు ఆదికవి అయ్యాడు.
వాటిని వివరిస్తున్నవారు కూడా 
యోగులై, 
ఋషులై, 
దార్శనికులై,
ప్రాతః స్మరణీయులై.
పాదాభివందనాలు అందుకుంటున్నారు.!!!
ఆ శక్తి అంతటిది.!  
మంచి పని చెయ్యడానికి మంచిరోజు వుందేమో కానీ,
మంచి పని తలపెట్టడానికి చెడ్డ రోజు లేదు.

"కాలం కాన్సర్ కన్నా
భయంకరమైనది ! 
ఆ యాపనలో సమయం 
కరిగిపోతూనే  వుంటుంది...
జీవితం కాలుతూనే వుంటుంది..
ఆయువు అయిపోతూనే వుంటుంది.!!    

చవకబారు సుఖాల కోసం
అల్పానందాల కోసం 
ఈ దేహం పరుగులు పెట్టీ పెట్టీ
అలసిపోయి.. 
ఆయువంతా ఐపోయి..
గొప్పగా అనుకున్నసంతోషాలన్నీ
కుప్పగా మిగిలిపోయి మన ముందు ప్రశ్నిస్తుంటే..
ఏ దివ్యత్వం చూడకుండానే..  
ఏ ఔన్నత్యం పొందకుండానే...
ఆ అనంత ప్రశాంతతను అందుకోకుండానే...
మనం మన చదువూ,
మన సౌందర్యం, 
మన అధికారం 
మనది అనుకున్న మన శరీరంలోని అణువణువూ 
మన ముఖంతో సహా మాడి మసైపోతుంటే  
మన అహం మన ప్రగల్భం,
నిలువునా బూడిదైపోతుంటే 
మన బుద్ది
మన అలసత్వం, మన అల్పత్వం
అన్నీ నిలువెత్తున నిలబడి చూస్తుంటే...
సత్యం సాక్షాత్కరిస్తుంటే..
ధర్మానికీ తన పర భేదం లేదని  
కాలం ఎత్తిన కత్తి కర్కశమనీ,
తెలివికి తెలిసొస్తుంటే మనసుకు అర్థమౌతుంటే,
అవగతమౌతుంటే... 
చివరికి..   
మన ఆత్మ
మన చితి ముందు..నిలబడి
నలుగురితో పాటు 
నిస్తేజంగా చూస్తుంది ! 
తెగిపోయిన అనుబంధాల్నీ..
ఆవిరైపోతున్న ఆశయాల్నీ..
అత్యున్నతమైన ఆనందాల్నీ...
దూరం చేసుకున్న
ఔన్నత్యాల్నీ.! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి