17, మార్చి 2016, గురువారం

విభజన అయిపోయింది..ప్రత్యేకత రాదనీ తెలిసిపోయింది. ఇంకా తల రాతల తల పోతలు అవసరమా?.
తెలుగు వారి ..కిదో పిలుపు..వినగలిగితే..వాస్తవం కనగలిగితే..ఇది
గొప్ప మలుపు. భావి లో తప్ప దు మనకి ఘన గెలుపు.
ఓయి తెలుగు వాడ..అడుగడుగో వెలుగు వాడ !
పాతంతా పాతరెయ్యి కొత్త తలపు అడుగడుగో
ఊపందుకు ఉరక లెయ్యి గొప్ప గెలుపు అడుగడుగో
తెగువ చూపు తెలుగు వాడ ఎదన నిలుపు ఆశ శ్వాస
వేటేస్తే లేచొచ్చే తెగని తలపు అడుగడుగో
నరి కారని నలి పారని పాడు తలపు మది నెందుకు
అడ్డు వచ్చు దారులలో నఱుకు కలుపు అడుగడుగో
అలవాట్లను ఆవలేసి తీయు తలుపు నవరీతికి
అగచాట్ల ని అనమాకు జయం పిలుపు అడుగడుగో
తలరాతలు తలపోస్తే అలుపు సొ లుపు కాకేమిటి
ఇక చేతలు పదును పెట్టు మంచి మలుపు అడుగడుగో
ప్రత్యేకత రాదుగాని వేరుతలపు వేడ్క తలువు
నవ్య తెలుగు సీమ మెరుపు పొందు మలుపు అడుగడుగో
వ్యధల, సొ దల కధల గతం అనవసరం అనవరతం
పదిల పరచు పగల బాపు పసిడి తలపు అడుగడుగో
నరికారని నస పెడితే చిగురు పలుకు వినలేవుర
చిదిమారని చిందులాపు మరో గెలుపు అడుగడుగో
మన శక్తి,,ఘన యుక్తి మదిన నిలుపు అనుక్షణం
చరితెరుగని భవితెగసే భూరి గెలుపు అడుగడుగో
బూడిదయిన బతుకు నుండి ఎగిసె పులుగు వినలేదా
గాడి తప్పు బతుకులకూ అందు గెలుపు అడుగడుగో
మన కలిమీ,మన బలిమీ ,చేత లలో చూపు రేపు
కోత కొచ్చు కలల సిరుల ,గెలుపు పంట అడుగడుగో
ఊరుకోక ఊరుకు ముందు వచ్చు గెలుపు జార్చ బోకు
జారిపోకు,పారిపోకు నిత్య గెలుపు అడుగడుగో.
LikeShow more reactions
Comment

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి