ముందుగా "స్త్రీ మూర్తి కి పాదాభి వందనాలు"
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ...
రోజూ ఒక గ్లాసు నీళ్ళు పోస్తే ప్రతి రోజూ దోసెడు పువ్వులిస్తుంది మల్లె తీగ....
చిన్న ఆధారం చూపితే గాఢంగా అల్లుకుపోతుంది మనీ ప్లాంటు ....
తను ఎండిపోయాక కూడా గదినంతా పరిమళంలో నింపుతుంది సంపెంగ...
కాని, స్త్రీ తో పోల్చుకుంటే ఇవన్నీ ఏపాటివి ??
రవ్వంత ఆప్యాయత, కాసింత భరోసా చూపిస్తే ... నీకునేనున్నాను అన్న భావం కలిగిస్తే ....
మల్లె కన్నా ఎక్కువగా ప్రేమ పరిమళాన్ని ఇస్తూ ... తీగ కన్నా గాఢంగా జీవితాన్ని అల్లుకుపోదూ ....
ఒక్క మార్చి 8వ తేదీ నాడే మహిళా దినోత్సవం ఎందుకు? ప్రతి రోజూ ఎందుకు జరుపుకోకూడదు?
బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి....
కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....
వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన బార్యవైతివి....
పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.....
కష్టంలో ముందుండి....
సుఖంలో క్రిందుండి....
విజయంలో వెనకుండి ....
ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ.
ఒక తల్లిగా, బిడ్డగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, వదినగా, అత్తగా, పిన్ని గా,
ఇలా రక రకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుచూ సమయంతో పరుగులు తీస్తూ అందరికీ కావాల్సినవి సకాలంలో అందిస్తూ అక్షయపాత్ర లా అందరికీ అన్నీ ఇస్తున్న “స్త్రీ” మూర్తికి నా పాదాభివందనం..
“స్త్రీ” స్వేఛ్చ ..
ఇది ఒకరు ఇచ్చేది కాదు, ఒకరినుంచి పుచ్చుకునేది కాదు.
అయినా ఎక్కడవుంది స్త్రీ కి స్వేఛ్చ ..
ప్రతీ స్త్రీ తన మనుగడకు తాను స్వతంత్రంగా జీవించడానికి చేసే పోరాటమే ఈ స్వేఛ్చ.....
కాలం మారిందంటారు గాని స్త్రీలు ఇప్పటికి బంధితులే...
ఆ భంధనాల స్వభావం మారిందంటే.... ఒకప్పుడు తల్లితండ్రులు అమ్మాయిలకు
బాల్యంలో యెంత స్వేఛ్చ ఇచ్చినా ఒక వయసుకు రాగానే ఆమెను కట్టడి చేసేవాళ్ళు... చూసే చూపు, మాట్లాడే తీరు, నడక, నడత అన్నిటిలోనూ లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టేవారు......
ఇంటిపరువు, ప్రతిష్టా నీ చేతుల్లోనే వున్నాయనేవారు ...
తోబుట్టువుల భవిష్యత్తు నీ నడకమీదే అధారపదివుందనేవారు. ఆమె ఆ మాటలనే వేదంగా పాటించేది. తనకు తాను హద్దులు ఎర్పరుచుకునేది.... ఈ స్త్రీలకు చదువుకూడా ఒక సమస్యే...
ఈ స్వేఛ్చ లేని జీవితంలోనే పుట్టి, పెరిగి, పెళ్లి, సంసారం, భర్త, పిల్లలు, అత్త, మామ, భందువర్గం అంటూ భందాల వలయంలో చిక్కుకునేది. కుటుంబ భాద్యతలు, పిల్లల పెంపకంలో పడి ఎన్నడూ తన అభిప్రాయాలను, ఆలోచనలను, బయటపెట్టే వీలుండేది కాదు....
ఆఖరు నిమిషంవరకు ఆ పరిధిలోనే జీవించేది. ఆ ప్రపంచంలోనే తనువు చాలించేది ....
ఆ కట్టుబాట్లు దాటాలనిగాని, తన సమస్యపై పోరాడాలని కాని ఆమెకు ఆలోచన లేదు. తాను అణిచివేతకు, గృహహింసకూ గురి అవుతున్నా ధైర్యం చేయదుసరికదా, సాటి స్త్రీ ఎవరన్నా ఆ సమస్యపై పోరాటం చేస్తుంటే చులకనగా చూస్తుంది...
జీవితంలో మోసపోయిన మహిళ తన సమస్యలను ధైర్యంగా పోరాడగలిగిన రోజున, వరకట్న చావులు, బలవన్మరణాలు వుండవు....
అలాంటి ఒక రోజు వచ్చిన వేళ ఈ లోకంలో మేము, మగవాల్లలానే సమానం అని స్త్రీ గర్వంగా నింగికేసి చూసిన రోజున ఈ జన్మభూమి ఎంతో పునీతం అవుతుంది....
ఆ నాడే నిజమైన మహిళళ దినోత్సవం వైభవోపేతంగా జరుపుకుంటారు.. అలాంటి రోజు రావాలని మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్దిగా కోరుకుంటూ వున్నాను..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి