17, మార్చి 2016, గురువారం

ఓయి  తెలుగువాడ పద అదే వెలుగువాడ 
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ 
ఓయీ  తెలుగువాడ పద అదే వెలుగువాడ  
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ 
అన్నా కష్టాల్లెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి  కినుక రేచి   
అన్నా కష్టాల్లెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి  కినుక రేచి   
సత్యాగ్రహ్రణం చేసి ఒక తండ్రిని దారబోసి 
దాయదుల వెన్ను వంచి  
సొంతగడ్డ సమార్జించి
తెలుగు జాతి పరువు పెంచి   
సమైఖ్యతను నిర్వచించి 
ఇపుడు రాష్ట్ర పటం చించి చించి , ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది  
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ 
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ 
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ 
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ 
ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా 
ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా 
మనదే ఈ పెద్ద చెట్టు, ఈ చల్లని నీడ 
మనదే ఈ పెద్ద చెట్టు, ఈ చల్లని నీడ 
ఆంధ్ర సీమ, తెలంగాణ ఒక్కొకటొక ఊడ 
ప్రతి ఊరు ప్రతి పల్లే తెలుగు చెట్టు కాడ 
పట్టిచ్హావనుకో   ఇపుడు వేరుపాటు చీడ ఇంకేమున్నది  ... ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది   
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ 
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ 
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ 
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ 
జాతి మహా యాత్ర ఇలా సాగే పోవాలిగాని 
జాతి మహా యాత్ర ఇలా సాగే పోవాలిగాని 
నడుమన మన అడుగులు తడపడిపోతే, 
నడకలలో వడిపోతే ,
మనకు మనకు చెడిపోతే 
గొంతుల శృతి విడిపోతే 
కలయిక సందడిపోతే  
ఒక స్నేహపు ముడిపోతే , తడిపోతే ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది ... ఏమున్నది  
ఓయ్ తెలుగువాడ పద అదే వెలుగువాడ 
మన కలల పసిడి మేడ తగదింటి నడుమ గోడ 
ఓయ్ తెలుగువాడ ఓయ్ తెలుగువాడ
తగదింటి నడుమ గోడ తగదింటి నడుమ గోడ  తగదింటి నడుమ గోడ  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి