21, మార్చి 2016, సోమవారం


“అలిగిన నలుగక యొగ్గులు
పలికిన మరి విననియట్లు ప్రతివచనంబుల్
పలుకక బన్నయు వడి యెడ
దలపక యున్నతడె చూవె ధర్మఙ్ఞుడిలన్”
నన్నయగారి పద్యం ఇది. ధర్మఙ్ఞుడెలా ఉండాలో శుక్రాచార్యుడు చెప్తున్నాడు.

శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. ఆయన చెప్పిన నీతి ఇలా ఉంది: “ఎవడికైనా కోపం వచ్చినప్పుడు ప్రతిగా కోపం తెచ్చుకోకుండా ఉండే వాడు, ఎవడైనా తిడితే, విననట్టే ఉండి మారుమాట్లాడని వాడు, ఎవడు ఎంత అవమానించినా ఆ సంగతే మనసులో పెట్టుకోనివాడే ధర్మఙ్ఞుడు” అని శుక్రాచార్యుడు అన్నట్టు ఈ పద్యం చెప్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి