మనిషి కో దేవుడు-
మనం రోజూ చేసే ప్రార్ధన లెలా ఉంటాయంటే పైనున్న దేవుళ్లంతా ఉక్కిరి బిక్కిరై, షాకై, కన్ఫ్యూజ్ అయి పోతూంటారు. ఈ ప్రార్ధనల్లోని కాంప్లికేషన్స్ వల్ల దేవుళ్ళల్లో కూడా రెండు గ్రూప్ లైపోక తప్పదు.
ఏడుకొండలవాడా! వేంకటేశ్వర స్వామీ! నన్నీ ఎలక్షన్స్ లో ఎలాగైనా మల్కాజ్గిరి MP గా గెలిపించు స్వామీ-నా సంగతి నీకు తెలుసుకదా! సంవత్సరానికి పదిసార్లు నీ దర్శనం చేసుకుంటున్నా-అలాంటప్పుడు నా కోరికలు నువ్వుతప్ప ఇంకెవరు తీరుస్తారు స్వామీ- ఇంకో సంగతి స్వామీ-నేను పార్టీలు మారతానుగానీ నిన్నొదిలి ఇంకో దేవుడి వేపు కూడా చూడను స్వామీ-అంత సిన్సియర్!నన్ను గెలిపించావనుకో-నేను నీ ఋణం ఉంచుకునే టైప్ కాదు.వంద కోట్లు ఖరీదు చేసే వజ్ర వైడూర్యాలు పొదిగిన కిరీటం నీకు సమర్పించు కుంటా స్వామీ-
స్వామికి డౌట్ వస్తుంది.
ఒరేయ్ –నీ దగ్గరఅంత డబ్బు లేదు కదురా?
ఒక్క మైనింగ్ కుంభకోణం చాలు స్వామీ –నీకు లక్ష కిరీటాలు చేయించేంత మనీ నొక్కేయ గలను.
సరే-నాకు భక్తులు సమర్పించే కానుకలంటే కొంచెం వీక్నెస్ ఉంది-నేనెప్పుడూ ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లాగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి పట్టించుకోను-నీ కోర్కె తీరుస్తాలే ఫో-
ఇలా ఏడుకొండల వాడి ముందు VIP క్యూలో ఈ సీన్ జరుగుతున్నసమయం లోనే ఇంకో కాన్దేట్ అయ్యప్ప టెంపుల్లో ఎంతో భక్తి తో ప్రార్దిస్తూంటాడు.
అయ్యప్ప స్వామీ-నేను మల్కాజ్ గిరి MP గా పోటీ చేస్తున్నానని నీకు తెలుసుకదా-ఏ ధైర్యంతో చేస్తున్నావ్? అని నన్ను నువ్వు కొశ్చెన్ చేయవచ్చు-నేను నీ భక్తుడైనప్పుడు ఇంకా నాకు ధైర్యానికేమి కొదవ స్వామీ-నన్ను గెలిపించావంటే నీకు గవర్నమెంట్ లాండ్ లో వరల్డ్ క్లాస్ గుడి కట్టిస్తా స్వామీ-
ఆ? గవర్నమెంట్ లాండ్ లో గుడి కడతావా? నీ కేమైనా మెంటలా? పడగొట్టేస్తారు కదరా?
భలే వారే స్వామీ మీరు. నడిరోడ్డు మీద గుళ్ళు కట్టేవాళ్ళు వేలమంది ఉన్నారు గానీ గుళ్ళు పడగొట్టే మగాళ్ళు ఇంతవరకూ ఇండియాలో ఎవడూ పుట్టలేదు స్వామీ-
అలాగా- సరే గానీ గుడి కట్టేంత మనీ నీ దగ్గర ఎక్కడుంది?
రేపు గెలిచాక అంతా మనీయే గదా స్వామీ-నువ్వు జస్ట్ నన్ను గెలిపించు –అంతే –దొంగ కంపెనీలు పెట్టి లక్షల కోట్లు బాంక్ లోన్లు తీసుకుని ఎగ్గోట్టేస్తా -దుమ్ము లేపేస్తా-
ఇప్పుడు వెంకటేశ్వర స్వామికీ అయ్యప్ప స్వామికీ గొడవ మొదలవుతుంది.
నా భక్తుడికి నేను మాటిచ్చా అయ్యప్పా-వాడినే గెలిపించక తప్పదు-
అలా అంటే ఎలా? నేనూ నా భక్తుడికి మాటిచ్చా కదా-
కానీ మా వాడు నాకు కోటి రూపాయల కిరీటం చేయిస్తానని మొక్కాడయ్యా-
మా వాడూ నాకు వరల్డ్ క్లాస్ గుడి కట్టిస్తానని ప్రామిస్ చేసాడు-వాడిని గెలిపించక పోతే ఫీలవుతాడు-
ఇదిగో అయ్యప్పా- ఈ ఒక్కసారికీ నన్ను మాట నిలబెట్టుకోనీ –ప్లీజ్-
నేనూ రిక్వెస్ట్ చేస్తున్నా వెంకట్-ఈ ఒక్క సారికీ నాకు వాడి కోరిక తీర్చే అవకాశo ఇవ్వు-
కుదరదు అయ్యప్పా-అయాం సారీ-
సరే- అయితే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో –నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటా-
అంతే- దేవుళ్ళ యుద్ధం మొదలవుతుంది-
ఏడుకొండల వాడి భక్తుడు పెద్ద మెజారిటీ తో గెలుస్తాడు.
దాంతో అయ్యప్ప భక్తుడు కోపంగా అయ్యప్ప దగ్గరకెళ్ళి స్వామీ శరణం-అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి చెవులు చిల్లులు పడేలా భజనలు చేస్తాడు. ఇక సైలెంట్ గా ఉండటం కుదరదని అయ్యప్ప ఆరాత్రి తన భక్తుడి కలలో కొచ్చి ఓ ఉపాయం చెబుతాడు. ఆ ఉపాయం ప్రకారం భక్తుడు గెలిచిన కాoడిడేట్ ఓటర్లకు రహస్యంగా నోట్లకట్టలు లంచాలుగా ఇచ్చినట్లు చూపే వీడియో కోర్ట్ కి ఇస్తాడు. దాంతో కోర్ట్ ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తుంది.
వెంటనే ఏడుకొండలవాడి భక్తుడు కారేసుకుని తిన్నగా కొండెక్కేస్తాడు.
ఇదేమిటి స్వామీ ఇలా జరిగింది?కావాలంటే ఇంకో కిరీటం ఇస్తా గాని పై కోర్ట్ లో కేస్ వేస్తున్నా-నేను గెలిచేట్లు చూడు స్వామీ అని వేడుకుంటాడు.వెంకటేశ్వరస్వామి జాలిపడి పై కోర్టులో తన భక్తుడిని గెలిపిస్తాడు.గెలవగానే అతనికి మైనింగ్ కాంట్రాక్ట్ కట్ట బెదుతుంది ప్రభుత్వం-ఆ కాంట్రాక్ట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే అతను కోటి రూపాయలు ఖరీదు చేసే వజ్రాల కిరీటాలు రెండు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుoటాడు.
దాంతో అయ్యప్ప భక్తుడికి మండిపోతుంది.
అర్జెంటుగా వెళ్లి అయ్యప్పని నిలదీస్తాడు.
ఆ చిన్న కోర్ట్ లో నన్ను గెలిపించినట్లు గెలిపించి పై కోర్ట్ లో దెబ్బ కొట్టావ్ గదా స్వామీ-ఇది న్యాయమేనా?మనుషులు చెయ్యి ఇస్తారు గాని దేవుళ్ళు చెయ్యిస్తారా ఎక్కడైనా?
అయ్యప్ప ఏమ్చేయ్యాలో తెలీక తల పట్టుకుoటాడు.
నీ గురించి దేవుళ్ళు కూడా కొట్టు కోవాల్సి వస్తుందిరా –అది కరక్ట్ కాదు కదరా-అంటాడు చిరాగ్గా-
స్వామీ- అదంతా నాకు తెలీదు-నువ్వు తలచుకుంటే ఆ ఏడుకొండలవాడు ఎక్కడ నిలబడగలడు?నీలెవలేంటి? ఆ వెంకటేశ్వర స్వామి లెవలేంటి స్వామీ-
అలా రెచ్చగొట్టకురా-నీలాంటి వాళ్ళ వల్లే ఇదివరకు మా దేముళ్ళలోనే ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకునే పరిస్తితు లొచ్చినయ్.
ఇదన్యాయం స్వామీ-నేను చిన్నప్పటినుంచీ నిన్నే నమ్ముకుంది దేనికి? అవసరం వచ్చినప్పుడు నా శత్రువులను దెబ్బ కొడతావనేకదా?
అబ్బా-సరేలే-ఈ ఒక్కసారికీ సాయం చేస్తా-కానీ ఇంకోసారి మాత్రం నన్ను ఇలాంటివి అడగకు-
థాంక్యూ స్వామీ –శరణమయ్యప్పా-
అయ్యప్ప మాయమయి పోయాడు.మర్నాడే అక్రమ మైనింగ్ కేస్ లో ఏడుకొండలవాడి భక్తుడిని ఇంటి మీద సిబిఐ వాళ్ళు రైడ్ చేసి అతని ఫ్రాడ్ ని రెడ్ హాoడెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పడేసారు.
వెంటనే అయ్యప్ప భక్తుడు పాతిక కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పోస్ట్ కొనుక్కున్నాడు. ఇంకో రెండు కోట్లు ముఖ్య మంత్రి కిచ్చేసరికి మంత్రి పదవి ఇచ్చారు.ఇవ్వగానే గానే రాజధాని లోని గవర్నమెంట్లాండ్స్ ప్రైవేట్ వాళ్ళకు కారు చవగ్గా అమ్మేసి లక్షల కోట్లు కాజేశాడు. బినామీ పేర్లతో కోట్లకొద్దీ బాంక్ లోన్లు తీసుకుని గవర్న్ మెంట్ లాండ్ లో అయ్యప్పకు గుడి కట్టించేసాడు-ఇంగ్లండ్ పారిపోయాడు. దాంతో కధ కంచికీ బాంక్ లు కోర్ట్ కీ-
ఇక్కడ మీకో అనుమానం వస్తుంది.
భక్తులు ఆశ పెట్టినా భగవంతుడు ఎందుకు ఆశ పడాలి? ఈ విశ్వమంతా ఆయనదే కదా-డబ్బూ, బంగారం, గుళ్ళూ గోపురాలూ ఆయనకెందుకు?
ఎందుకంటే-
పాలసాగరమున పవ్వళించిన సామి
గొల్ల ఇండ్ల పాలు కోరనేల
ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి
విశ్వ దాభిరామ వినుర వేమ!
******************************************

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి