22, అక్టోబర్ 2020, గురువారం
కమ్యూనిస్టులంటే కుళ్లు ఎందుకు? విషం జల్లుతూ వికృతానందం ఎందుకు? ఓటుకి నోటు కాడ వాళ్లు లేరనా..! పార్లమెంట్ లో నోట్ల కట్టలు జల్లినప్పుడు కనిపించ లేదనా? అవినీతి మచ్చలేని నేతలుగా ఉన్నారనా..! సర్వ అక్రమాలకు సమాధానంగా కనిపిస్తున్నారనా? ప్రలోభాలకు దూరంగా, ప్రజాసేవలో ఉన్నారనా.! ప్రజలకండగా నిలిచి పోరాడుతున్నారనా? ప్రపంచీకరణపై రణం చేస్తున్నారనా..! సరళీకరణ ప్రమాదాన్ని చాటుతున్నారనా? మతోన్మాదుల మనుగడుకు ఆటంకమనా..! మతసామరస్యం పరిఢవిల్లాలని పోరుతున్నారనా? కులవివక్ష అంతానికై పంతం పట్టారనా..! కులం అడ్డుగోడలు పగులగొట్టడానికి అడుగులు వేస్తున్నారనా? దేశభక్తికి, త్యాగనిరతికి నిదర్శనంగా మారుతున్నారనా..! ఎప్పటికైనా మంది గ్రహిస్తే మీ మనుగడకు ముప్పు వాటిల్లుతుందనా? ఎందుకో మీ దుగ్ధ! ఎందుకో మీ కంటగింపు! ఎందుకో కన్నీరు!! ఎందుకో మీ కలవరింపు!! మీరెందుకు పడి ఏడ్చినా ప్రజల పక్షపాతికి అడ్డు ఉండదు ప్రజా సమస్యలపై పోరాడే జెండాకు ఎదురుండదు ఓట్లు, సీట్లు కొలతల్లో మీరు సంతోషపడండి ప్రజాపోరాటాల సారధిగా ఎర్రజెండా రెపరెపలతో కంగారుపడండి!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి