మగవారికి మాత్రమే - భండారు శ్రీనివాసరావు
(కొందరు ఆడవాళ్ళను గురించి మరికొందరు మగవాళ్లు సరదాగా చెప్పిన మాటలు ఇవి. వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు అందరు ఆడవాళ్ళకు వర్తించాలని రూలేమీ లేదు)
“పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు గా వుంటారు. కలసివున్నట్టుగా కనిపిస్తారు కానీ ఎన్నటికీ కలవలేరు.”- అల్ గోరె
“మగవాళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మంచి భార్య దొరికిందా సుఖపడతారు. లేకపోతే నష్టం లేదు. పెద్ద వేదాంతి గా మారే అవకాశాలు పెరుగుతాయి.”- సోక్రటీస్
“తన భర్త గొప్పగొప్ప పనులు చేసి విజయాలు సాధించాలని ప్రతి భార్యా ఉత్సాహపడుతుంది. అతడిని ఆవైపుగా ప్రోత్సహిస్తుంది. కానీ, అంతవరకే. మొగుడు వాటిని సాధించడం మాత్రం ఇష్టపడదు.” - మైక్ టైసన్
“బహుశా ఎవ్వరూ జవాబు చెప్పలేని ప్రశ్న ఏదయినా వుందా అని నన్నడిగితే నా మెదడుకు ఒక్కటే తడుతోంది- ఆడది కోరుకునేది ఏమిటి ? అన్నదే ఆ ప్రశ్న.” – జార్జ్ క్లూనీ
“నేను మా ఆవిడతో మాట్లాడింది కేవలం మూడంటే మూడే ముక్కలు. బదులుగా ఆమె ఏకంగా ఒక దండకమే చదివింది.” – బిల్ క్లింటన్
“మీరూ మీ ఆవిడా ఇన్నేళ్ళుగా కలసి కలతలు లేని కాపురం చేస్తున్నారు. ఏమిటి ఇందులో రహస్యం అని నా మిత్రులు అడుగుతుంటారు.ఇందులో పెద్దగా దాచుకోవాల్సింది ఏమీ లేదు. ఎన్ని పని వొత్తిడులు వున్నా వీలు చేసుకుని వారానికి రెండు సార్లు ఏదయినా రెస్టారెంటుకు వెళ్లి మంచి సంగీతం వింటూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తుంటాము. కాకపొతే ఆవిడ ప్రతి మంగళవారం శుక్రవారం వెడుతుంది. నేను మాత్రం శని, ఆదివారాల్లో వెడుతుంటాను.” – జార్జ్ డబ్ల్యు. బుష్
“ఉగ్రవాదం అన్నా ఉగ్రవాదులన్నా నాకు భయమనిపించదు. నేను పెళ్లి చేసుకుని రెండేళ్ళయింది.”- -రూడీ గిలానీ
“ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్ ట్రంప్
“కాపురం పది కాలాలపాటు సజావుగా సాగాలంటే భర్తలకు నేను చెప్పే సలహాలు రెండే రెండు.
ఒకటి. మీరు చెప్పేది రైట్ కాదని తెలిసినప్పుడు నిజాయితీగా దాన్ని భార్యముందు వొప్పుకోండి. రెండు. మీరే రైట్ అనుకున్నప్పుడు దాన్ని మీ ఆవిడతో చెప్పకుండా నోరుమూసుకోండి.” - షాక్విల్ ఓ’ నీల్
“భార్య పుట్టినరోజు మరచిపోకుండా గట్టిగా గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఒక మార్గం వుంది. ఓ ఏడాది దాన్ని గురించి మరచిపోయి చూడండి. ఆ తర్వాత గుర్తుంచుకోవడం ఎలాగో ఆవిడే నేర్పుతుంది.” - కోబె బ్రియాంట్
“పెళ్ళికి ముందు ఏం చేసానో తెలుసా ? జీవితంలో ఏవేం కావాలనుకున్నానో అన్నీ చేసికూర్చున్నాను.”.- డేవిడ్ హాసెల్ హాఫ్
“నేనూ మా ఆవిడా ఇరవై ఏళ్ళపాటు హాయిగా, నిశ్చింతగా వున్నాము. ఆ తర్వాతే ఇద్దరం కలుసుకోవడం, పెళ్ళిచేసుకోవడం జరిగింది.”- అలెక్ బాల్డ్విన్
“మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది. తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”-బరాక్ ఒబామా
“వివాహం అనేది ఒక యుద్ధం లాటిది. కాకపొతే ఈ యుద్ధరంగంలో శత్రువులిద్దరూ కలసి ఒకే చోట నిద్రిస్తారు.” – టమ్మీ లీ
ఒకడు చెప్పాడు.
" నా భార్య దేవత”
“అంత అదృష్టం అందరికీ వుంటుందా. మా ఆవిడ బతికే వుంది.” – జిమ్మీ కిమ్మెల్
“లేడీస్ ఫస్ట్ అంటారు ఎందుకని ?”
“దేవుడు కూడా ఆ మాటనే నమ్ముకుని ఆడవాళ్లనే ముందు లోకంలోకి పంపాడు. వాళ్లు మొత్తం ప్రపంచాన్ని ఒక మెస్ చేసికూర్చుంటారని ఆయనకూ తెలియదు” – డేవిడ్ లెటర్ మాన్
“ముందు ఎంగేజ్ మెంట్ రింగ్. తరువాత మ్యారేజ్ రింగ్. ఆ తరువాత ...”
“ఇంకేం రింగ్. మిగిలేది ఒక్కటే. సఫరింగ్” - జే లెనో

NOTE: Courtesy Cartoonist
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి