5, డిసెంబర్ 2014, శుక్రవారం

అమ్మంటే తెలుసుకో.....జన్మంతా కొలుచుకో.....
ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మా....
అనుబంధానికి.....అనురాగానికి.....
తొలి తొలి రూపం అమ్మంటే
అమ్మైన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం....
రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం.....
పేగు చీలి ముడతపడిన పొత్తి కడుపు చర్మం.....
స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంధం.....
మమతెరిగిన మాతృత్వం తరగని అందం.....
అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం.....
అతి మధురం తల్లి తండ్రి అయ్యే క్షణం...!!
-----వి.సురేష్ కుమార్...!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి