23, డిసెంబర్ 2019, సోమవారం

***** వృద్ధుడు అంటే ..... ******మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడుముంగిట్లో కూచోబెడితేఇంటిని కాచే ఈశ్వరుడు*బతుకుబాటలో గతుకుల్నిముందుగా హెచ్చరించికాపాడే సిద్ధుడు వృద్ధుడువృద్ధులు సారధులైతేయువకులు విజయులౌతారుఅనుభవాల గనులు ఆపాత బంగారాలు*వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడుచేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడునిర్లక్ష్యంగా చూస్తే కేవలంమూడుకాళ్ల ముసలివాడుతగిన గుర్తింపునిస్తేవిజయాన్నిచ్చే త్రివిక్రముడు*ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడుతనను పట్టించుకోకున్నానువ్వు పచ్చగా ఉండాలని తపించేఉదాత్తుడు వృద్ధుడు*పలకరిస్తే చాలు ......పాలకడలిలా పొంగులు వారేపసివాడు వృద్ధుడువృద్ధుడంటే పైపైన చూస్తేజుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడుఅంతర్గతంగాతలపండిన పండితుడు.

20, డిసెంబర్ 2019, శుక్రవారం

బైరాగి -- చీకటి నీడలు లో.. కడుపుమంట...అనురాగం అంబరమైతేఆనందం అర్ణవమైతేమేం తోకచుక్కగా వస్తాంబడబానలమై మండిస్తాంప్రపంచమొక నందనవనమైజీవితమొక గులాబి ఐతేమేం ముళ్ళతొడుగుగా ఉంటాంసుఖస్వప్నం భంగపరుస్తాంఈ జీవిత కేళి గృహంలోసుఖమే ఒక విరిపాన్పైతేమేం కాలసర్పమై వస్తాంవిషజ్వాలల ధార విడుస్తాంమీ నిద్రాసుఖసమయంలోస్వాప్నిక ప్రశాంతి నిలయంలోమేం పీడకలలుగా వస్తాంరౌరవదృశ్యం చూపిస్తాంమీ ప్రణయోత్సుక మధుగీతంమీనృత్యమత్త సంగీతంమీకటుక్షుధారోదనంలోముంచేస్తామొక్క క్షణంలోమీ హేమాసన పాత్రల్లోమీ స్వప్నజగతి యాత్రల్లోమా అశృధార నింపేస్తాంమీబాటను జారుడు చేస్తాం.పానకపు పుడకగా వస్తాంటీకప్‌లో ఈగైచస్తాంమా ప్రాణాలైనా విడుస్తాంమీశాంతిని భగ్నంచేస్తాం.!!

19, డిసెంబర్ 2019, గురువారం

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁబూని తాచిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద ! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా !అరాళకుంతలా !....(1) శ్రీకృష్ణార్జున యుద్దం (1963) ఎన్ఠీఆర్ - వరలక్ష్మీ(2) శ్రీ కృష్ణ తులాభారం (1966 ) ఎన్ఠీఆర్ - జమున (3) శ్రీ కృష్ణ మాయ (1958 ) అక్కినేని - జమున

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.అవును ఇది ఒక చేదు నిజం ।ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. వాళ్ళు...... రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !నడక అలవాటు ఉన్నవాళ్ళు! మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !వాళ్ళు...... ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు! పూజకు పూలు కోసే వాళ్ళు !..వాళ్ళు.....పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !మడిగా వంట వండేవాళ్ళు !దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !వాళ్ళు . అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !తోచిన సాయం చేసేవాళ్ళు !చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !.వాళ్ళు .ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! Xఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు! వాళ్ళు పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! ..వాళ్ళు .... .తీర్థయాత్రలు చేసేవాళ్ళు !ఆచారాలు పాటించే వాళ్ళు !తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !.వాళ్ళు .....చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు !చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు ! .వాళ్ళు ....తలకు నూనె రాసుకునే వాళ్ళు !జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !మీకు తెలుసా ? .వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు..మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి ..లేదంటే ......లేదంటే .....ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది...వాళ్ళ ప్రపంచం వేరు .సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!. స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !.కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది! ద్వేషం, మోసం లేని జీవనం గడిపిన తరం అది!.సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది! లోకానికి భయపడే జీవనం గడిపిన తరం అది !.ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!H.వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది .మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి !!!తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!.సర్కారు చేసే చట్టాలు కాదు 🙏🙏

12, డిసెంబర్ 2019, గురువారం

*వృద్ధాప్యానికి ఆహ్వానం* -శ్రీ గొల్లపూడి మారుతీరావు *వృద్ధాప్యం ఒక మజిలీ*. ప్రతీ వ్యక్తీ కోరుకున్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.ముసిలితనం కొడుకు కంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది. మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది. జీవితమంతా కొరుకుడుపడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది. పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా!'' అంటే కోపం రాదు. ఒక జీవితకాలాన్ని తెలీనితనానికి తాకట్టు పెట్టిన కొడుకుని చూసి నవ్వుకుంటుంది. తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వపడుతుంది. అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది. ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు.వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు. నీ జీవితకాలంలో సాధనల్ని పక్కనపెట్టి కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు. అదొక అంతస్థు. అతని హితవుని నలుగురూ వింటారు. నీ ఆలోచనని గౌరవిస్తారు. దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు. వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది.''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది. ''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది. తన గురించి తన పెద్దలూ అలనాడు -అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది.వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది. చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది. తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయిపోతోందని అర్థమవుతూంటుంది. దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది. ''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది. అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగు వేస్తుంది. దానికి ఊతం వృద్ధాప్యం.జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి. ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది. ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది? ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది? ఏమయినా తనకేం బాధలేదు. ఆ సమయంలో తను ఉండడు. ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం.దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా వుంటాడు? మృత్యువు తరువాత ఏమవుతుంది? సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి. చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం. చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటిలాగే తెల్లారి, వృద్ధులతో కలిసి నడిచి, రెండుముద్దల అన్నం తిని, అరగంట సేదతీరి, వేడి టీ తాగి, సాయంకాలం పార్కు బెంచీ దగ్గర ''ఈ దేశం తగలడిపోతోంద'ని తిట్టుకుని, శాంతపడి -కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ, నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం -వృద్ధాప్యం వ్యసనం.ఇప్పుడు విచారం దగ్గరకు రాదు. వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు. ముగింపు భయపెట్టదు. ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక. అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని -మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం.ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి. చేసిన తప్పిదాలు, మాటతప్పిన కప్పదాట్లూ, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ -అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి. ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు. వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు. విన్న తృప్తిని తానూ నటిస్తాడు. వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు. కాని వృద్ధాప్యం ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు. వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు. జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు. ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.'చమకం' ఏ రుషి, ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో -ఎంత ముందుచూపు, ఎంత వినయసంపద, జీవుని నిస్సహాయత, నిర్వేదం -అందులో నిక్షిప్తమయివుందో -ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది.ఈ దేశపు వేద సంపద, సాంస్కృతిక వైభవం, జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం. చమకంలో 'వృద్ధం చమే' అనే ఒక్క కోరికా ఈ జాతినీ, మతాన్నీ, ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ. వరం. భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం. అదీ వృద్ధాప్యం.🙏🏼

4, డిసెంబర్ 2019, బుధవారం

అధిక దుఖ్ఖమైన,ఆనందమైన,కలసి చెమ్మగిల్లు కనులు రెండు..ఆలు మగలజంట అట్లున్నప్పుడే..సౌఖ్య జీవనంబు సాధ్యమగును..😊

ఘంటసాల సీ।శ్లోకమ్ము చదివెనా లోకాల నన్నిటిన్ మంత్ర ముగ్ధము చేయు మధుర మూర్తి పద్యమెత్తుకొనిన భావాను గుణముగా నవ రసాలొలికించు నటన మూర్తి పాటలు పాడెనా ప్రాణి లోకమునెల్ల పరవశింపగ జేయు ప్రణయ మూర్తి స్వరములు కూర్చెనా సరస మాధుర్యాలు సరసాన్న ములు పెట్టు సరస మూర్తిగీ। వినయ సంపన్న శోభిత విదిత మూర్తి లలిత సంగీత సామ్రాజ్య రమ్య మూర్తి సరస సంగీత సాహిత్య చక్రవర్తి చలనచిత్ర రంగాన సంచలన మూర్తి గాన మాధుర్యముల సీమ ఘంటసాల అతని గొప్పను పొగడ నా కలవి యౌన? డా మీగడ

2, డిసెంబర్ 2019, సోమవారం

కార్యేషు యోగీ, కరణేషు దక్షఃరూపేచ కృష్ణః క్షమయా తు రామఃభోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రంషట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః - (కామందక నీతిశాస్త్రం)కార్యేషుయోగీ:పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.రూపేచ కృష్ణఃరూపంలో కృష్ణుని వలె ఎల్లప్పుడూ ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి.క్షమయా తు రామఃఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.భోజ్యేషు తృప్తఃభార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. సుఖదుఃఖ మిత్రం:సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.ఈ షట్కర్మలు ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

19, నవంబర్ 2019, మంగళవారం

*ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది.**మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ**"ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది.**ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ?**"ఎందుకు అలా అనిపిస్తోంది?" అడిగాను**"అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని . కానీ ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు* *అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.**ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు. కానీ నేను సంతోషంగా లేను**వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు* *చివరికి నా మిత్రుడు డాక్టర్ సురేష్ చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది**ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది**మీ కోసం ఆ వివరాలు :**మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు*1. *ఎండార్ఫిన్స్, Endorphins,*2. *డోపామిన్, Dopamine,*3. *సెరిటోనిన్... Serotonin,*4. *ఆక్సిటోసిన్..... Oxytocin.**ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది.**ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం* Endorphins: *మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి**అప్పుడు మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins**నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియ నిర్వహిస్తారు.**"నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల**ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ, వీడియో లు టిక్ టాక్ లు చూస్తూ ఉండండి.*2. Dopamine:*నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము**ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు**ఆఫీస్ లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది.**అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం* *కాబట్టి మిత్రులారా !**షాపింగ్ బడ్జెట్ పెంచండి.*లేదా *పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు కాదు కదా!* 3. Serotonin: *ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ విడుదల అవుతుంది**మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది**ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?*1. *స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం**(వాళ్లకి ఆనందం కలగడం కోసం ... ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా)*2. *మొక్కలు నాటడం..*3. *రోడ్ల గుంతలు పూడ్చడం*4. * దానం..*5. * సంస్కారం..*6. * సేవ..*7. *యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ.*8. *మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం**ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది*4. Oxytocin: *ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది**స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది (ప్రేమికుల విషయం లో డోసు ఎక్కువ విడుదల అవుతుంది)**మున్నా భాయ్ లో " జాదూ కి జప్పీ" లాగ**అలాగే కరచాలనం**సినిమా ఆక్టర్ ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే !**గుర్తుకు తెచ్చుకోండి . మీ మొదటి స్పర్శను మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.**ఇప్పటికీ మరపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది**అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా* *అందుచేత**మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము*1. *Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి వ్యాయామం చేద్దాము*2. *Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము**మగవారికి ప్రత్యేకం*1. *వంటను రోజూ మెచ్చుకోండి (నేను తిట్లు తినేది ఇందుకే)*2. *డ్రెస్ మెచ్చుకోండి*3. *మేకప్ మెచ్చుకోండి* *ఆడవారికి ప్రత్యేకం*1. *గుర్రు పెట్టారని తిట్టకండి*2. *కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి*3. *మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి* 3. *Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి. రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి గుడిలోదక్షిణ గానో, గుడి బయట దానం గానో ఇవ్వండి* *ఏడాదికి ఒక మొక్కను నాటండి.* *ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి* *పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి* 4. *ఆక్సిటోసిన్ కోసం ఇంతో వాళ్ళని hug చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉంటె హాగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా !**అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులనూ కూడా హాగ్ చేసుకునే అలవాటు చేసుకోండి**ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి* *పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం* 1. *గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి*-Endorphins2. *వాళ్ళు సాధించిన దానికి పొగడండి* -Dopamine3. *పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి* -Serotonin4. *దగ్గరకు తీసుకోండి* -Oxytocin*Have a Happy Life*.😊😊😊

29, అక్టోబర్ 2019, మంగళవారం

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఎదలోతులో ఏ మూలనోనిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఈ గాలిలో ఏ మమతలోమా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిమొదట చూసిన టూరింగ్ సినిమామొదట మొక్కిన దేవుని ప్రతిమరేగు పళ్ళకై పట్టిన కుస్తీరాగి చెంబుతో చేసిన ఇస్త్రీకోతి కొమ్మలో బెణికిన కాలుమేక పొదుగులో తాగిన పాలుదొంగచాటుగా కాల్చిన బీడిసుబ్బుగాడిపై చెప్పిన చాడీమోట బావిలో మిత్రుని మరణంఏకధాటిగా ఏడ్చిన తరుణంగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిమొదటిసారిగా గీసిన మీసంమెదట వేసిన ద్రౌపది వేషంనెల పరీక్షలో వచ్చిన సున్నాగోడ కుర్చి వేయించిన నాన్నపంచుకున్న ఆ పిప్పరమెంటుపీరు సాయిబు పూసిన సెంటుచెడుగుడాటలో గెలిచిన కప్పుషావుకారుకెగవేసిన అప్పుమొదటి ముద్దులో తెలియనితనముమొదటి ప్రేమలో తియ్యందనముగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఎదలోతులో ఏ మూలనోనిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

27, అక్టోబర్ 2019, ఆదివారం

స్టేజ్ మీద మాట్లాడడం ఒక కళ.. ఇక్కడ చాలా ఏళ్ళ నుండి అనేక స్టేజ్ ప్రజంటేషన్లని గమనిస్తూ, ఈ సబ్జెక్టు మీద ఆసక్తి కొద్దీ నేర్చుకున్న అతికీలకమైన పాయింట్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఇంత డీటెయిల్ గా ఎక్కడా దొరకవు. వీటిని జాగ్రత్తగా సేవ్ చేసుకొని అవసరం వచ్చినప్పుడు ఫాలో అవ్వండి.1. సబ్జెక్ట్ ఏదైనా స్టోరీలా చెబితే చాలామంది కనెక్ట్ అవుతారు. టివిలు, రేడియోలు రాక ముందు క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని కధలు వినేటప్పటి నుండి హ్యూమన్ DNAలో ఈ అలవాటు ఉంది.2. మాట్లాడే సబ్జెక్ట్‌కి సంబంధించి చిన్న చిన్న గణాంకాలు, స్టాటిస్టిక్స్ చెబితే ఎఫెక్టివ్‌గా ఉంటుంది.3. చిన్న పిల్లలు పుట్టినప్పుడు పబ్లిక్ స్పీకింగ్‌కి భయపడరు. వాళ్ల పద్ధతిలో వాళ్లు అలా ఓ ఫ్లోలో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక ఏజ్ వచ్చాక అది మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటూ పెద్ద వాళ్లు కంట్రోల్ చెయ్యడం మొదలుపెడతారో అప్పటి నుండి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి.4. అవసరం అయిన చోట ఎగ్జాంపుల్స్ చెబుతూ ఉండాలి. నడవాల్సి వస్తే మెల్లగా నడవాలి. Chin ఎత్తుగా ఉండేలా ఉంచుకుని ఆడియెన్స్ వైపు చూడాలి. అందరు ఆడియెన్స్‌ వైపూ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చెయ్యాలి. ఒక వాక్యం ఒక వైపు చూస్తూ, మరో వాక్యం గానీ, మరో కాన్సెప్ట్ గానీ మరో వైపు చూస్తూ మాట్లాడాలి.5. పబ్లిక్ స్పీకింగ్‌లో మొదటి 90 సెకన్స్ ముఖ్యం. అప్పుడు పీపుల్‌ని కనెక్ట్ చేసే ఫన్నీ, ఇంట్రెస్టింగ్ ఫ్రేజెస్ వాడాలి.6. కూర్చున్నప్పుడు ఎలా ఉంటారో అలా నిలబడకూడదు.7. మాట్లాడేటప్పుడు క్రిందికి చూడడం గానీ, లేదా గాలిలోకి చూడడం గానీ, పరధ్యానంగా ఉన్నట్లు ఉండడం గానీ చెయ్యకూడదు.8. డయాస్ మీదకు వచ్చిన వెంటనే మాట్లాడడం స్టార్ట్ చెయ్యకూడదు, అందర్నీ గ్రీట్ చేసి.. అందరి చిరునవ్వుతో చూస్తూ వారితో కనెక్ట్ అవ్వాలి.9. ఒకే కాలి మీద బరువు పెట్టి నిలబడకూడదు10. ఎట్టి పరిస్థితుల్లో చేతులు కట్టుకోకూడదు11. ఆడియెన్స్ వైపు వేలెత్తి చూపకూడదు12. ఆడియెన్స్ వైపు మన బ్యాక్ చూపించకూడదు13. మన ఎమోషన్స్‌కి తగ్గట్లు మనం మాట్లాడే స్పీచ్ స్పీడ్‌ని మారుస్తూ ఉండాలి.14. స్పీచ్‌ని అవసరాన్నిబట్టి డ్రమటైజ్ చెయ్యాలి.15. కొన్ని పదాలను వత్తి పలికితే ఎఫెక్టివ్‌గా ఉంటుంది.16. మధ్యలో పాజెస్ వాడడం వల్ల క్యూరియాసిటీ, సస్పెన్స్ క్రియేట్ అవుతుంది.17. చివరి వరకూ సరిగా విన్పిస్తుందా లేదా కనుక్కోవాలి. మరీ బిగ్గరగా మాట్లాడకూడదు. మరీ చిన్నగా మాట్లాడకూడదు.18. పబ్లిక్ స్పీకింగ్‌లో చాలా పొడవైన వాక్యాలు వాడకూడదు. చిన్న చిన్న వాక్యాలు అర్థవంతంగా వాడాలి.19. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తే మరీ ఎక్కువ డీటైల్స్, నోట్స్ లా తయారు చెయ్యకూడదు. ముఖ్యమైన పాయింట్లే వాడాలి.20. ప్రజంటేషన్‌కి 10-12 స్లైడ్లకి మించి వాడకూడదు. అలాగే వాటిలో ఎక్కువ ఏనిమేట్ అయ్యేవి ఉండకూడదు. టైటిల్, చిన్న చిన్న ముఖ్యమైన పాయింట్లు ఉంటే చాలు.21. పబ్లిక్ స్పీకింగ్‌లో కాళ్లతో గానీ, చేతులతో గానీ చిన్న చిన్న మూమెంట్స్ కూడా చెయ్యకూడదు. చేతులతో జెశ్చర్స్ వాడొచ్చు గానీ కాళ్లు ఎక్కువ అటూ ఇటూ కదిలించడం, మూమెంట్స్ లాంటివి చెయ్యకూడదు.22. సాధ్యమైనంత వరకూ స్టేజ్‌కి మధ్యలోనే నిలబడాలి.23. మధ్యలో ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండకూడదు24. ఎప్పుడూ టాపిక్‌ని దాటి మర్చిపోయి వేరే అంశాల్లోకి వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా.. ఏ ఆలోచన నుండి ఎక్కడికి వెళ్లాం, తిరిగి ఎప్పుడు ఆ సెకండ్ థాట్ ముగించాలి, ఎప్పుడు వెనక్కి మెయిన్ టాపిక్‌కి రావాలి అన్నది ట్రాక్ చేసుకుంటూ వెళ్లాలి.- Nallamothu Sridhar

24, అక్టోబర్ 2019, గురువారం

పల్లవి:నేను పుట్టాను,లేండ్ లైన్ వచ్చిందీ ...నేను ఏడ్చాను,సెల్ పోన్ వచ్చిందీ ...నేను నవ్వాను,స్మార్ట్ ఫోన్ వచ్చింది.నాకింకా లోకంతో పని ఏముంది.డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ॥ 1వ. చరణం:మనిషిని మనిషిని కలిపేటందుకు లేండ్ లైన్ వచ్చిందీ ... ఎవరికి దొరకక తిరిగేటందుకెసెల్ ఫోన్ వచ్చిందీ ... ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై స్మార్ట్ ఫోన్ పుట్టిందీ ... అందరి బుర్రలు నమలడానికేవాట్సాప్ వెలిసింది.డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ॥ 2వ చరణం:లేండ్ లైన్ మ్రోగితే,అందరి గుండెలు ఆనందించాయీ ... సెల్ ఫోన్ మ్రోగితే,అందరి మనసులు చిరాకు పడ్డాయీ ...స్మార్ట్ ఫోన్ తో,అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ ...తెల్లవారినా అవి,కొంచెం కూడా బాగవ కున్నాయి.డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ...॥ 3వ చరణం:వాట్సాపులో వసతులతోటీ,షరతులు వున్నాయీ ...హద్దు మీరితే అంతు తెలియనీ,శిక్షలు పడతాయీ ...స్మార్ట్ ఫోనులో భాషల కుండే,సొగసులు తగ్గాయీ ...ఎమోజీ(emoji) లతో,ఎవరికి తెలియని భాషలు పుట్టాయి.డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ॥ 4వ చరణం:మనుషుల మనసులు,కలిపేటందుకె ఫోనులు వున్నాయీ ...ఏ ఫోనైనా,మంచిగ వాడే మార్గాలున్నాయీ ...మంచిగ వాడని,ఫోనుల కెపుడూ వైరస్ లొస్తాయీ ...వాట్సాపులో,పెట్టేటందుకె నీతులు వున్నాయి.డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ॥ 5వ చరణం (ఆఖరి చరణం):గంటలు రోజులు స్మార్ట్ ఫోనులో,వాగుతు గడిపేసెయ్ ...ఫోన్లో వున్న బేటరి తీసి,బయటకు పారేసెయ్ ...వైఫై సిగ్నల్ ఆపేసెయ్ ...సిమ్ము కార్డును విసిరేసెయ్ ...డ్రైవ్ ద డేటాకార్డ్ ఔట్ ... హహ్హహ్హహ్హహ్హ !!!॥నేను పుట్టాను ...॥

19, అక్టోబర్ 2019, శనివారం

ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులైపరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమైసిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియైవరుసన్ నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!

. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ నుఱికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేఁగున జగతి గదలఁ జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ బైనున్న పచ్చని పటము జాఱ నమ్మితి నాలావు నగుఁబాటు సేయక మన్నింపు మని క్రీడి మఱల దిగువఁతే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.తాత్పర్యం సవరించురథం మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నది. ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో జగత్తు అదిరిపోయిందట. చక్రాన్ని చేపట్టి వేగంతో పరుగెత్తే ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. అనూహ్యమైన ఈ చర్యకు అర్జునుడికి రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేసి రోషంతో-నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘించే సింహంలా ఉరకలు వేస్తూ – ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా’ అంటూ – ముందుకొస్తున్న ఆ దేవుడు – నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు – నాకు దిక్కు అగు గాక!

💐💐పురుషుడు ఎలా ఉండాలో ధర్మ శాస్త్రంలో చెప్పబడింది 💐💐 స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀ పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚 కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు: కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖ 1.కార్యేషు యోగీ 💰: పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹 2. కరణేషు దక్షః 🤺:- కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾 3. రూపేచ కృష్ణః🙏:- రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.👌 4. క్షమయా తు రామః🏹:- ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి 5. భోజ్యేషు తృప్తః🍲🥘🍛 భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. 6. సుఖ దుఃఖ మిత్రం🤼‍♂:- సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻 ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి
            గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
    నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
            జగముల వ్రేఁగున జగతి గదలఁ
    జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
            బైనున్న పచ్చని పటము జాఱ
    నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
            మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ

తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
    నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
    విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
    దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

తాత్పర్యంసవరించు

రథం మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నది. ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో జగత్తు అదిరిపోయిందట. చక్రాన్ని చేపట్టి వేగంతో పరుగెత్తే ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. అనూహ్యమైన ఈ చర్యకు అర్జునుడికి రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేసి రోషంతో-నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘించే సింహంలా ఉరకలు వేస్తూ – ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా’ అంటూ – ముందుకొస్తున్న ఆ దేవుడు – నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు – నాకు దిక్కు అగు గాక!

5, అక్టోబర్ 2019, శనివారం

బహురూపి - భండారు శ్రీనివాసరావు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు ....... డబ్బు ఒక్కటే. కానీ ఒక్కోచోట అది ఒక్కో నామం ధరిస్తుంది. గుళ్ళో హుండీలో వేస్తే ‘మొక్కుబడి’ పెళ్ళిలో చదివిస్తే ‘కానుక’ వరుడికి ముట్టచెబితే ‘కట్నం’ మనం ఇవాల్సివస్తే వస్తే ‘అప్పు’ మనకు రావాల్సి వుంటే ‘బాకీ’ కోర్టులో కడితే ‘జరిమానా’ సర్వరుకు ఇస్తే ‘టిప్పు’ ఉద్యోగులకు చెల్లిస్తే ‘జీతం’ పనివాళ్లకు ఇస్తే ‘కూలీ’ పనిచేయడానికి తీసుకుంటే ‘లంచం’ పని చేయడానికి ఇస్తే ‘ఆమ్యామ్యా’ నడిరోడ్డు మీద పోలీసుకు ఇస్తే ‘మునుపటి జన్మ ఋణం’రొడీలకు భయంతో ఇస్తే...మామూలు😊ఉచితంగా దయతో ఇస్తే దానం...😊

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ) . శ్రీశ్రీ తన మహప్రస్ధానము లో ఒకచోట అంటాడు కుక్కపిల్ల,సబ్బుబిళ్ల,అగ్గిపుల్ల.... కాదేది కవిత కనర్హం..."'. అంతకు కొన్ని దశాబ్దాలముందే ,అవునవును శ్మశానం కవితకు అర్హం అంటూ జాషువా ఈ ఖండకావ్యాన్ని లిఖించాడు. ఈ కావ్యంలోని పద్యాలలోని పదభావం సూటిగా పాఠకుని హ్రుదయం లోతుల్లోనికి చొచ్చుకెళ్లి,గుండె బరువెక్కుతుంది,వైరాగ్యభావం దోబుచులాడుతుంది.జీవిత చరమాంకసత్యాన్ని కళ్లెదట నిలుపుతుంది.ఈ ఖండకావ్యంలో 8 పద్యాలున్నాయి. అన్ని అణిముత్యాలాంటి పద్యాలే. దువ్వురి వారి పానశాలలో ఒకచోట కవి...అంతం లేని ఈభువనమంతయు ఒకవిశాల పాంధశాల, విశ్రాంతి గృహం,అందు ఇరుసంజెలు రంగుల వాకిలిల్.........కొంత సుఖించి పోయిరెటకో , అంటాడు. . జాషువ ఈకావ్యం మొదటీ పద్యంలో ఈవిషయాన్నే ప్రస్తావిస్తు,ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటు ప్రారంభించాడు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు. ఈ రుద్రభూమిలో తమబిడ్దలును పొగొట్తుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నిళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాదు. కవిహృదయం చూడండి. . ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా! యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో! కన్నిటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ . ప్రకృతిగతి తప్పి,ఆకాశంలో కారుమబ్బులు కమ్మిచిమ్మచీకటీ నిండి,దయ్యాలు,గూడ్లగూబలు చెరలాడుచు,కాకులు ముకమ్మిడిగా గోలచేసిన జనవాసం భితిల్లుతుంది.కాని ఈ శ్మశానవాటికలో భీతికి తావేలేదు.అంతా నిశ్సబ్దం....శ్మాశాన నిశ్సబ్దం..... . కవికలం ఎమంటున్నది.? ఆకాశంబున కారుమబ్బుగము లాహారించె,దయ్యాలతో ఘూకంబుల్ చెరలాడసాఁగినవి;వ్యాఘోషించె నల్దిక్కులన్ గాకోలంబులు ; గుండెఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం దా కల్లాడిన జాడలే;దిచ్చట సౌఖ్యం బెంత క్రీడించునో! . ఈ రుద్రభూమికి చెడ్డవాడు,మంచివాడనే తేడాలేదు.యాజమాని,సేవకుడనే వ్యత్యాసంలేదు.హతుడు హంతకుడు యిద్దరు సమానమే ఈ నేలలో.కవి,రాజు,లేత యిల్లాలి మాంగల్యం ,చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయ్యుస్సు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!.సృష్టికి లయకారుడు శివుడు.ఆయనకిష్టమైనది తాండవం.అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచఅనుచరగణంతో నాట్యమాడు రంగస్ధలమంటున్నడు కవి. అంతేకాదు ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడితతో చేసిన సింహసనమట! ఎంతలోతు భావం కవిది. . కవిహృదయం ఏమంటుందో చూడండి. . ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె ! యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె! యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ సలసౌరు,గంగలోఁగలిసిపోయె! యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియ,నశించె! . ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు; ఇది మరణదూత తీక్షమౌ దృష్టు లొలయ నవనిఁ బాలించు భస్మసింహాసనంబు . రాత్రి సమయం...తిమిరం నిండిన శ్మశానం....నిశ్శభ్దం రాజ్యమేలు వేళ....ఆ మూల కొత్తసమాధి....సమాధిపై ఆముదపుదీపం, కదులుతున్న మిణుగురులా రెపరెపలాడుచూ వెలుగు చున్నది. అరే! అదేమిటి? ప్రమిదలో అముదం నిండుకున్నను ఇంకా దివ్వె వెలుగుచున్నదేమి?! ఆ సమాధిలో నిద్రిస్తున్న అభాగ్యురాలు యొక్కహృదయం కాబోలు ఆ దివ్వె వెలుగు!?....పాఠకుని గుండెను సూటిగా తాకి ఆర్ధ్రమైయ్యే భావం.ఈలాంటి భావన చెయ్యడం చేయ్యితిరిగిన కవికే సాధ్యం. . ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధిమీదఁ బై బొదలు మిణుంగురుబురువు పోలిక వెల్గుచున్నదివ్వె,ఆ ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా? హృదయము సుమ్మి,నిల్పిచనియె న్గతపుత్రిక,యే యభాగ్యయో . కవితా సుధలొలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి.పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవల్సినదే.అందులో మమైకం కావలసినదే.పుట్టుక కూడా తల్లిగర్భం నుంచే అయ్యినను,తల్లికూడా ప్రకృతి జనీతమే కదా.మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంది.మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును.ఔను నిక్కమే కదా!.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు,భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!. . మరి కవిమనస్సు ఏమంటున్నది. . కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై. . శ్మశానవాటిక వాకిటనుంచొని ఒకపర్యాయం పరికించి చూచిన మనగుండెలు తర్కుపోతాయి.మన మనస్సు కరిగినీరై పోతుంది ఆమూలనున్న అన్నెం పున్నెం ఎరుగని వయస్సులోనే మృత్యువు గర్భంలో చేరిన చిన్నారుల గోరిలను చూస్తే.ఆ పిల్లల సమాధులలో ఏచిన్నారి పొన్నారిరూపసి తనువు చాలించిందో? ఏ ముద్దులు మూటలుకట్టు రూపసి అలసిసొలసి నిద్రిస్తున్నదో.ఏ తల్లి లీలావతి కడుపుతీపి దాగున్నదో? . ఆలోకించిన గుండిల్గరగు; నాయా పిల్ల గోరీలలో నే లేబుగ్గల సౌరు రూపరియెనో!యేముద్దు నిద్రించెనో! యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో? యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో? . వల్లకాడులో అస్పృశ్యతకు తావు లేదు.ఏ మతమైన,ఏ కులమైన,ఏ వర్ణమైన ఇక్కడ ఒక్కటే. అందరిని స్వీకరించడంలో సమతా భావం.పులిపక్కన సాధుజంతువు మేకను జేర్చి బుజ్జగించి ,వూరడించు అభేదభావనావని ఈ శ్మశానభూమి. ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్ . మారుతున్న ,పరిగెడుతున్న కలికాలంలో ఆర్ధికఅవసరాలు,ధనవ్యామోహం-రక్తబంధాలను,పాశాలను త్రెంచుతున్నాయి.తమను కని,అల్లారు ముద్దుగా పెంచి,పోషించిన తల్లిదండ్రులను వృధ్యాపంలో,బ్రతికి వుండగానే వల్లకాటిలో అర్ధరాత్రి వదలివెళ్ళూచున్న రోజులివి.ఆలాంటప్పుడు అనాధ పేదవాని మృతశరీరాన్ని పట్టించుకొని,ఖననముచెయ్యు దాతలెందరు?.అన్నింటికన్న దారుణమైనది,భయంకరమైనది దరిద్రం/పేదరికం. శ్మశానంలో ఖననానికి నోచుకోని ఒక అనాధపీనుగను గూర్చి కవి ఎంత హృదయఆర్తితో వర్ణించాడో.అది కవి వేదనకాదు...పాఠకుని హృదయ ఘోష...కాదందురా? . వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలరాతి గో రీకడఁ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే యాకటి చిచ్చునన్ గుమిలి,యార్చి,గతించిన పేదవాని దౌ నో కద! వానికై వగవఁ డొక్కదండు; దాఁచదు కాటినేలయున్

24, సెప్టెంబర్ 2019, మంగళవారం

*చెల్లియొ చెల్లకో తమకు జేసినయెగ్గులు సైచిరందరున్ తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో యెల్లి రణంబు గూర్చెదవో? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా! *జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ !!

*చెల్లియొ చెల్లకో తమకు జేసినయెగ్గులు సైచిరందరున్ తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో యెల్లి రణంబు గూర్చెదవో? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా! *జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ !!

22, సెప్టెంబర్ 2019, ఆదివారం

చెప్పండి చూద్దాం... క్షమ గలిగిన సిరి గలుగును క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్ క్షమ గలుగఁ దోన కలుగును క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుఁడు దండ్రీ! పోతన భాగవతం నవమ స్కందం 463 వ పద్యమిది. పరశురాముని చరిత్రం లోని పద్యం. పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి కామ ధేనువును ఆశ్రమానికి తీసుకు వచ్చి తన పరాక్రమాన్ని తండ్రికి చెపుతాడు. అపుడు పరశురాముడి తండ్రి జమదగ్ని , కుమారుడితో అన్న మాటలీ కంద పద్యం. క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ ఉంటే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. మూడవ పాదంలో దోన అంటే ఏమిటో ఒక పట్టాన అర్ధం కాదు. ఆఖరి పాదం - క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీ హరి సంతోషిస్తాడు. ఇప్పుడు చెప్పండి క్షమ కలుగ దోన కలుగును అన్న వాక్యంలో దోన కు అర్థం ఏమిటి?

16, సెప్టెంబర్ 2019, సోమవారం

ఏతమేసి తోడినా ఏరు ఎండదు  పొగిలిపొగిలి ఏడ్చినా పొంత నిండదు  దేవుడి గుడిలోదైనా పూరిగుడిసెలోదైనా గాలి యిసిరి కొడితే..  ఆ దీపముండదు.. ఆ దీపముండదు..!!ఏతమేసి!! పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా  పసుపుతాడు ముడులేస్తే ఆడదాయిరా కుడితి నీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాదీ కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాదీ బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుచుకో గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో..!!ఏతమేసి!! అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే సీము నెత్తురులు పారే తూము ఒక్కటే మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా నిదర ముదరపడినాక పాడె ఒక్కటే ఒల్లకాడు ఒక్కటే కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా..!!ఏతమేసి!! జాలాది గారి

       కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?              వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ               బేరైనం గలదే? శిబిప్రముఖులుంబ్రీతిన్ యశః కాములై               యీరే కోర్కులు? వారలన్ మఱచిరేయి క్కాలమున్? భార్గవా!         భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.          వామనునికి దానం ఇవ్వద్దు అన్న శుక్రాచార్యులకు సమాధానం చెప్పే సందర్భంలో బలి చక్రవర్తిచే పోతన పలికించిన జగత్రసిద్ధ మైన పద్య మిది.          కారే = కలుగరా; రాజులు = రాజులు;రాజ్యముల్ = రాజ్యములు; గలుగవే -కలుగవే = పొందలేదా ఏమి;గర్వోన్నతింబొందరే - గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = విర్రవీగుటను;పొందరే = చెందలేదా ఏమి; వారేరీ - వారు = వాళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరి -సిరిని = సంపదలను; మూటఁగట్టుకొని -మూటగట్టుకొని = కూడగొట్టుకొని;పోవంజాలిరే = తీసుకెళ్ళగలిగిరా, లేదు;భూమిపైఁబేరైనంగలదే - భూమి = నేలపైన;పేరైనన్ = కనీసము పేరైన; కలదే = ఉన్నదా, లేదు; శిబిప్రముఖులుంబ్రీతిన్ - శిబి = శిబిచక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగువారు;ప్రీతిన్ = కోరి; యశఃకాములై - యశః = కీర్తి;కాములు = కోరువారు; ఐ = అయ్యి; యీరే -ఈరే = ఇవ్వలేదా; కోర్కులు = దానములను;వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; యిక్కాలమున్ - ఈ= ఇప్పటి; కాలమున్ = కాలమునందును;

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

నేనొక విశ్వప్రేమికురాలను ఈ విశ్వమంతా నేను వ్యాపించాను నేనొక నదీ ప్రేమికురాలను అన్ని నదుల్లోను నేను ప్రవహిస్తాను నేనొక అరణ్య ప్రేమికురాలను ప్రతి చెట్టు మీద పుప్పొడిలా రాలుతుంటాను నేనొక సముద్ర ప్రేమికురాలను ప్రతి కెరటం మీద నాట్యం చేస్తుంటాను నేనొక పున్నమి ప్రేమికురాలను వెన్నెల జలతారుల్లో ఊయలూగుతుంటాను నేనొక నలుపు రంగు ప్రేమికురాలను అమావాశ్య రోజు ఆకాశం లో కలిసిపోతాను నేనొక మనిషి ప్రేమికురాలను ఆడా మగా హద్దులను కూలగొడుతుంటాను నాకు కులం, మతం,ప్రాంతం ఏమి లేవు నాది విశ్వ ప్రేమ,ప్రకృతి ప్రేమ... మనిషి మీద అనంతమైన ప్రేమ నాకు.

11, సెప్టెంబర్ 2019, బుధవారం

పాఠము మఱియు అర్థముసవరించు ౧. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్ - అరణ్యమును పోలు జటాజూటము నుంచి స్రవించు గంగానదీ ప్రవాహముచేత శుద్ధి చెందినా కంఠసీమను మాలవలె అలంకరించిన సర్పము కలిగినవాడు, తన డమరుకము నుండి డమ డమ శబ్దములు వెల్వడిరాగా ఆనంద తాండవమొనర్చుచున్నవాడు అయిన పరమశివుడుమనకు సమస్త శుభములను కలిగించుగాక ౨. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ - (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటము నందు సురనదీ ప్రవాహమును కలిగినవాడు, ఆ ప్రవాహము పైకి ఎగబ్రాకుతున్న తీగలవంటి కురులు కలిగిన శిరోభాగము కలిగినవాడు, జ్వాలలతో వెలుగొందు అగ్నిని తన ఫాలప్రదేశమునందున్నవాడు, బాలచంద్రప్రభతో శోభిల్లునట్టివాడు అయిన పరమశివుని యందు నా మనస్సు ప్రతిక్షణమూ రమించుచున్నది. ౩. ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ - (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) విలాసమైన పర్వతరాజపుత్రిక కు మగడు, ఎవని మనస్సు దిగంతములలోని సమస్త జనుల ఉనికితో నిండియున్నదో, ఎవని కృపాకటాక్షవీక్షణములు సోకితే సమస్త ఆపదలూ నశించునో, అట్టి దిక్కులే అంబరములుగా ఉన్నవానిపైన నా మనస్సు రంజించుచున్నది. ౪. జటాభుజంగపింగళ స్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి - (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటమును అలంకరించిన పచ్చని సర్పముయొక్క ఫణి మణికాంతులతో విరాజిల్లుచూ, దిక్కులను కదంబకుంకుమ కాంతులతో నింపుచుండగా, పైని గజచర్మముతో చేయబడిన ఉత్తరీయము ఎగసి మదపుటేనుగును పోలగా సమస్త భూతపతిగా శోభించుచున్న వాడు నా మనస్సును ఆనందముతో నింపుగాత ౫. సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూః భుజంగరాజమాలయానిబద్ధజాటజూటకః శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరః - అశేషమైన ఇంద్రాది దేవతలయొక్క పంక్తి మొక్కుటచే ప్రభవించిన ధూళిచేత కప్పబడిన పాదపీఠముకలిగి, వాసుకి అనెడు సర్పరాజముచేత బంధింపబడిన జటాజూటము కలిగి, చకోట పక్షులకు ప్రియుడైన చంద్రుని శిఖయందు ధరించినవాడు మాకు శ్రియములనొసగుగాక. ౬. లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్ సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్ మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః - హోమాగ్నివలె ప్రజ్వరిల్లుచున్న లలాటాగ్ని కలిగి, ఆ అగ్నిలో పంచబాణుడైన మన్మథుని ధగ్ధము చేసినవాడు, లోకనాయకుడు, అమృతకిరణముల పంక్తిచేత విరాజిల్లుచున్న శిఖకలిగినవాడు మహాకపాలమును ధరించువాడు అయిన పరమేశ్వరునికి మ్రొక్కి మేము ఆయన శిఖలోని సంపదలకు ప్రాప్తులు కాగలము. ౭. కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైకశిల్పినీ త్రిలోచనే రతిర్మమ - భీకరమైన ఫాలప్రదేశమున ధగద్ధగాయమాన జ్వాలలతో వెలుగొందు అగ్నిచేత మన్మథుని దాహించినవాడు, పార్వతీదేవియొక్క కుచములపైని చిత్రములు రచించువాడు (ఆమె యందు అనురక్తి కలవాడు), మాహాశిల్పి (లోకసృష్టియందు) అయిన త్రిలోచనునియందు నా మనస్సున్నది. ౮. నవీనమేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్ కుహూనిశీధినీతమః ప్రబంధబద్ధకంధరః నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః - క్రొత్త మేఘముల సమూహము వంటిది, దురాపదలను నిర్మూలింపదగినదయి స్ఫురించునది, కుహూరాత్రియందు చీకటి మాదిరి భాసించు నల్లని కంఠము కలిగినవాడు, గంగానదిని ధరించువాడు, గజచర్మాంబరధారీ, చంద్రకళాధరుడు, జగత్కళ్యాణకర్త మాకు శ్రియములు చేకూర్చుగాక ౯.ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా వలంబికంఠకందలీ రుచిప్రబద్ధకంధరమ్ స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదమ్ గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే - వికసించిన నీలసరోజ సమూహమువలె నల్లని ప్రభ తోచు కంఠసీమను అవలంబించినడి అను భ్రాంతి కలిగించువిధముగా సర్పాలన్కృత కంఠముచేత భాసిల్లువాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను. ౧౦. అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ రసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతమ్ స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకమ్ గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే - సమస్త మంగళములనూ పొడిగించువాడు, కదిమిపూల తేనెయందు అనురక్తి కలిగినవాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను. ౧౧. జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళఫాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళ ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః - భుజంగోచ్చ్వాసనిశ్వ్వాసలు ఆకాశముచేయు జయజయధ్వానములు కాగా, బయటికి వెల్వడు ఫాలప్రదేశ విస్ఫులింగములు క్రమముగా చేకూర, ధిమిధిమి నాదములతో ఢమరుకము ఉచ్చమంగళరీతి మ్రోగగా వాటికి అనుగుణముగా ప్రచండతాండవము చేయు పరమశివుని ... ౧౨. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో ర్గరిష్ఠరత్నలోష్టయోః సహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్ - చూడగా, విచిత్రములైన లోకరీతులు - భుజంగహారము కానీ, ముత్యపుసరము కానీ, అమూల్యరత్నము కానీ, లేక మట్టి గానీ, తనవాడు కానీ లేక పెరవాడు కానీ, గడ్డివంటి కనులుండనీ, లేక అరవిందలోచనుడు కానీ, సామాన్యుడు కానీ మహారాజు కానీ, నేను సమముగా తలచి ఎప్పుడు మహేశ్వరున్ని సేవించగలను. ౧౩. కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్ విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలింవహన్ విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః శివేతిమంత్రముచ్ఛరన్ కదా సుఖీ భవామ్యహమ్ - ఎప్పుడు నేను సురనదీతీరమున గల సుందరవనములయందు వసించి దుర్మతిని వీడి, సదా శిరస్సుపైన అంజలి చేర్చి, వికలమైన చూపు లేక, ఫాలలలామునియందు మనస్సు చేర్చి, "శివ" అను మంత్రము జపించుచూ సుఖించెదను?

***బట్టతలపై పద్యము.*** తలనూనె రాసెడు తగులాటముండదు- క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు పేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును- చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ- జుట్టింత దొరకదు పట్టుకొనగ అద్దంబు దువ్వెన లవసరమే లేదు- పర వనితలు వెంటబడుట కల్ల తేటగీతి. కడకు కుంకుడు, శీకాయ ఖర్చు మిగులు తలకు స్నానంబు చేయుట సులభమౌను ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ బట్టతల గల్గు వాడె పో భాగ్యశాలి.

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

వాట్సాప్ మెసేజ్ ల పై పేరడీ పాట: _*పల్లవి:*_ నేను పుట్టాను, లేండ్ లైన్ వచ్చిందీ ... ... ... నేను ఏడ్చాను, సెల్ ఫోన్ వచ్చిందీ ... ... ... నేను నవ్వాను, స్మార్ట్ ఫోన్ వచ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥ _*1వ. చరణం:*_ మనిషిని మనిషిని కలిపేటందుకు లేండ్ లైన్ వచ్చిందీ ... ఎవరికి దొరకక తిరిగేటందుకె సెల్ ఫోన్ వచ్చిందీ ... ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై స్మార్ట్ ఫోన్ పుట్టిందీ ... అందరి బుర్రలు నమలడానికే వాట్సాప్ వెలిసింది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥ _*2వ చరణం:*_ లేండ్ లైన్ మ్రోగితే, అందరి గుండెలు ఆనందించాయీ ... సెల్ ఫోన్ మ్రోగితే, అందరి మనసులు చిరాకు పడ్డాయీ ... స్మార్ట్ ఫోన్ తో, అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ ... తెల్లవారినా అవి, కొంచెం కూడా బాగవ కున్నాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*3వ చరణం:*_ వాట్సాపులో వసతులతోటీ, షరతులు వున్నాయీ ... హద్దు మీరితే అంతు తెలియనీ, శిక్షలు పడతాయీ ... స్మార్ట్ ఫోనులో భాషల కుండే, సొగసులు తగ్గాయీ ... ఎమోజీ(emoji) లతో, ఎవరికి తెలియని భాషలు పుట్టాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*4వ చరణం:*_ మనుషుల మనసులు, కలిపేటందుకె ఫోనులు వున్నాయీ ... ఏ ఫోనైనా, మంచిగ వాడే మార్గాలున్నాయీ ... మంచిగ వాడని, ఫోనుల కెపుడూ వైరస్ లొస్తాయీ ... వాట్సాపులో, పెట్టేటందుకె నీతులు వున్నాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*5వ చరణం (ఆఖరి చరణం):*_ గంటలు రోజులు స్మార్ట్ ఫోనులో, వాగుతు గడిపేసెయ్ ... ఫోన్లో వున్న బేటరి తీసి, బయటకు పారేసెయ్ ... వైఫై సిగ్నల్ ఆపేసెయ్ ... సిమ్ము కార్డును విసిరేసెయ్ ... డ్రైవ్ ద డేటాకార్డ్ ఔట్ ... ... ... హహ్హహ్హహ్హహ్హ !!! ॥నేను పుట్టాను ... ... ... ॥ _*ప్రేమ్ నగర్*_ సినిమా లోని _*ఘంటసాల మాస్టారు*_ పాడిన _*నేను పుట్టాను ... ... ... *_ పాటకు

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

కరచాలనాలు వద్దు...నమస్కారాలే ముద్దు -------------------------------------------- తలలోని పోలుసులై జిలపెట్టు చుండ్రును.. గోరార హాయిగా గోకు చేయి కళ్ళలో పుసులను వేళ్ళతో తొలగించి ...వాల్చూపు సొగసు కాపాడు చేయి జలుబుతో నాసిక జలపాత మవువేళ.. ,చీమిడి బర్రు బర్రునా చీదు చేయి ముక్కులో కొలువైన పోక్కుల్ని నేర్పుగా... కెలికి కెలికి వెలికి వలుచు చేయి చేవిలోతు లోతుల్లో చేరినా గులిమిని.... .....చిటికినవేలితో చెణకు చేయి గజ్జలసందులో ఘనమైన మట్టిని.......... నలుగుపెట్టినట్టు నలుపుచేయి కురుపులు ,గాయాల,దురదల్నికడతేర్చ.. బర బరా బర మని బరకు చేయి మలమూత్రముల కంపు చెలరేగిపోకుండ... చెంబుడు నీళ్ళతో కడుగు చేయి అట్టి ఆ చేయి మర్యాద యుట్టిపడగ ...నిన్ను తాకంగా ఇటువచ్చుచున్నదోయి ఎవరిచేతులో ఏముందో ఎవరికెరుక ......కోటి రోగాల పుట్ట ఈ చేయి గనక చాలు చాలింక.. కరచాలనాలు చాలు ........దండమేట్టినవాడేరా..ధన్యజీవి ..!!

6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

కిన్నేరమ్మసొగసులు...కూనలమ్మ కులుకులు...ఎంకి తీయని కలలు...మనతెలుగు పలుకులు....:కి : నన్నయ తిక్కన కవుల పదభందాలూ...సాహితీ ప్రియులకూ సుమగంధాలూ...:న: శ్రీనాధుని సీసం ...పోతన మకరందం...సరసహృదయవర్యులకూ నవరస నైవేద్యం....:కి: కృష్ణరాయ ఫ్రౌడత్వం...పెద్దన నవసీసం....తెలుగు భాషకంతటికీ దేదీప్య మణిమకుటం.. నాయకరాజుల చరితం.. చేమకూరిప్రతి పద్యం..తెలుగు వెలుగు జిలుగులకు కనకాభిషేకం....:కి; కవివరేన్యులందరికీ కవితారస చందనం..వాగ్గేయకారులకూ పదేపదే వందనం ... నవ్యకవులు.భవ్యకవులు.. అందుకోండి స్వాగతం!!...తెలుగుజాతికంతటికీ ఈ గీతం అంకితం..!!..: కి;

29, ఆగస్టు 2019, గురువారం

*ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది.* *మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ* *"ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది.* *ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ?* *"ఎందుకు అలా అనిపిస్తోంది?" అడిగాను* *"అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని . కానీ ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు* *అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.* *ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు. కానీ నేను సంతోషంగా లేను* *వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు* *చివరికి నా మిత్రుడు డాక్టర్ సురేష్ చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది* *ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది* *మీ కోసం ఆ వివరాలు :* *మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు* 1. *ఎండార్ఫిన్స్, Endorphins,* 2. *డోపామిన్, Dopamine,* 3. *సెరిటోనిన్... Serotonin,* 4. *ఆక్సిటోసిన్..... Oxytocin.* *ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది.* *ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం* Endorphins: *మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి* *అప్పుడు మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins* *నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియ నిర్వహిస్తారు.* *"నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల* *ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ, వీడియో లు టిక్ టాక్ లు చూస్తూ ఉండండి.* 2. Dopamine: *నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము* *ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు* *ఆఫీస్ లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది.* *అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం* *కాబట్టి మిత్రులారా !* *షాపింగ్ బడ్జెట్ పెంచండి.* లేదా *పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు కాదు కదా!* 3. Serotonin: *ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ విడుదల అవుతుంది* *మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది* *ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?* 1. *స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం* *(వాళ్లకి ఆనందం కలగడం కోసం ... ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా)* 2. *మొక్కలు నాటడం..* 3. *రోడ్ల గుంతలు పూడ్చడం* 4. *రక్త దానం..* 5. *అనాధ ప్రేత సంస్కారం..* 6. *అనాధ సేవ..* 7. *యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ.* 8. *మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం* *ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది* 4. Oxytocin: *ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది* *స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది (ప్రేమికుల విషయం లో డోసు ఎక్కువ విడుదల అవుతుంది)* *మున్నా భాయ్ లో " జాదూ కి జప్పీ" లాగ* *అలాగే కరచాలనం* *సినిమా ఆక్టర్ ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే !* *గుర్తుకు తెచ్చుకోండి . మీ మొదటి స్పర్శను మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.* *ఇప్పటికీ మరపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది* *అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా* *అందుచేత* *మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము* 1. *Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి వ్యాయామం చేద్దాము* 2. *Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము* *మగవారికి ప్రత్యేకం* 1. *వంటను రోజూ మెచ్చుకోండి (నేను తిట్లు తినేది ఇందుకే)* 2. *డ్రెస్ మెచ్చుకోండి* 3. *మేకప్ మెచ్చుకోండి* *ఆడవారికి ప్రత్యేకం* 1. *గుర్రు పెట్టారని తిట్టకండి* 2. *కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి* 3. *మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి* 3. *Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి. రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి గుడిలోదక్షిణ గానో, గుడి బయట బిచ్చగాళ్ళకు దానం గానో ఇవ్వండి* *ఏడాదికి ఒక మొక్కను నాటండి.* *ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి* *పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి* 4. *ఆక్సిటోసిన్ కోసం ఇంతో వాళ్ళని hug చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉంటె హాగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా !* *అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులనూ కూడా హాగ్ చేసుకునే అలవాటు చేసుకోండి* *ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి* *పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం* 1. *గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి* -Endorphins 2. *వాళ్ళు సాధించిన దానికి పొగడండి* -Dopamine 3. *పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి* -Serotonin 4. *దగ్గరకు తీసుకోండి* -Oxytocin *Have a Happy Life*. 😊😊😊 *ఓ మిత్రమా మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందకరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా..* సేకరణ:watsup messege

26, ఆగస్టు 2019, సోమవారం

సినీ వాలి- కుహూ రాత్రి. ఆధునిక సాహిత్యంతో పరిచయం ఉన్న మిత్రులందరికీ సినీవాలి అనగానే సినీ కవి ఆరుద్ర గారి ఆధునిక కావ్యం గుర్తుకొస్తుంది. ఈ కావ్యానికా పేరు పెట్టడం కూడా తమాషాగా జరిగిందట. మన కేంద్ర సాహిత్య అకాడెమీ తరఫున ఒక కావ్యమాల తయారు చేస్తూ దానిలో మన తెలుగు కవి ఆరుద్ర గారి పద్యాలు కూడా చేర్చిన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు ఆ గ్రంథాంతంలో కవుల వివరాలు ఇస్తూ పొరపాటున శ్రీ ఆరుద్ర గారు అంతకు ముందే సినీవాలి అనే కావ్యాన్ని వ్రాసినట్లుగా పేర్కొన్నారట. అప్పటికి శ్రీ ఆరుద్ర గారు అటు వంటి కావ్యాన్ని దేన్నీ వ్రాసి ఉండలేదు. అందు చేత తర్వాతి కాలంలో శ్రీ ఆరుద్ర వ్రాసిన తన ఆధునిక కావ్యా నికి సినీ వాలి అని పేరు పెట్టారు. నేడమావాస్య.. అంటూ ప్రారంభమయ్యే ఈ కావ్యానికి ఈ పేరు చక్కగా సరిపోతుంది. ఇంతకీ సినీవాలి అంటే అర్థం – చంద్ర కళ కనిపించే అమావాస్య అని.( సాహితీ పరిచయం ఉన్న నా మిత్రులకీ విషయం తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసమే ఈ వివరణ). ఎంత నిరాశా నిస్పృహల్లోనూ ఆశా లేశం ఉంటుందనే విషయాన్ని సూచిస్తుందీ సినీవాలి అన్న పదం. ఇంగ్లీషులో చెప్పాలంటే there is light at the end of the tunnel అంటాము. ఇది సరే .మరి అసలు ఏ చంద్ర కళా కనిపించని అమావాస్యనేమంటారు? కాళ రాత్రి అనేనా? ఏ చీకటి రాత్రినైనా కాళ రాత్రి అనేయవచ్చును కాని చంద్ర కళ కనిపించని అమావాస్య రాత్రికి ప్రత్యేకంగా ఒక పేరుంది. అది కుహూరాత్రి. కుహూ రాత్రి అంటే ఏ చంద్ర కళా కనిపించని కటిక అమావాస్య అన్నమాట. మరి ఇటు వంటి మాటలు ఏ కవుల ప్రయోగాలలోనైనా కనిపిస్తాయా అంటే అరుదుగా అని చెప్పవచ్చు. జాను తెనుగు కు పెద్ద పీట వేసే శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు 1947 లో విడుదలైన పల్నాటి యుధ్దం సినిమాకు వ్రాసిన ఒక పాటలో ఈ పదం వాడేరు. మాంచాల తన ప్రియుని రాక కోసం ఎదురు చూస్తూ నిస్పృహతో ఈ కుహూ రాత్రి నా రాజు వేం చేయునా, నా జీవితమ్ము రసీభూతమ్ము చేయునా అని పాడుకుంటుంది. ( అయితే ఈ పాట సినిమాలో అప్పటి వారి ఒప్పందం ప్రకారం శ్రీ సముద్రాల రాఘవాచారి గారి పేరుతో ఉంటుంది.) సినిమా పాటలలోనూ తన కథల్లోనూ కూడా కుహూ రాత్రి వెలది వెన్నెల వంటి పదాలను ప్రయోగించిన శ్రీ శాస్త్రిగారిని కొనియాడకుండా ఉండగలమా? (నిరుడు ఇదే రోజు ఈ గోడ మీదే ప్రచురించిన ఈ ముచ్చట అప్పుడు చూడని వారి కోసం మరోసారి)

Steve Jobs' last words........ He died a billionaire at 56 y.o. of Pancreatic Cancer and here are his last words on the sick bed: "I reached the pinnacle of success in the business world. In others’ eyes, my life is an epitome of success. However, aside from work, I have little joy. In the end, wealth is only a fact of life that I am accustomed to. At this moment, lying on the sick bed and recalling my whole life, I realize that all the recognition and wealth that I took so much pride in, have paled and become meaningless in the face of impending death. You can employ someone to drive the car for you, make money for you but you cannot have someone to bear the sickness for you. Material things lost can be found. But there is one thing that can never be found when it is lost – "Life". When a person goes into the operating room, he will realize that there is one book that he has yet to finish reading – "Book of Healthy Life". Whichever stage in life we are at right now, with time, we will face the day when the curtain comes down. Treasure love for your family, love for your spouse, love for your friends... Treat yourself well. Cherish others. As we grow older, and hence wiser, we slowly realize that wearing a $300 or $30 watch - they both tell the same time... Whether we carry a $300 or $30 wallet/handbag - the amount of money inside is the same; Whether we drive a $150,000 car or a $30,000 car, the road and distance are the same, and we get to the same destination. Whether we drink a bottle of $300 or $10 wine - the hangover is the same; Whether the house we live in is 300 or 3000 sq ft - loneliness is the same. You will realize, your true inner happiness does not come from the material things of this world. Whether you fly first or economy class, if the plane goes down - you go down with it... Therefore.. I hope you realize, when you have mates, buddies and old friends, brothers and sisters, who you chat with, laugh with, talk with, have sing songs with, talk about north-south-east-west or heaven and earth,... That is true happiness!! Five Undeniable Facts of Life : 1. Don't educate your children to be rich. Educate them to be happy. So when they grow up they will know the value of things, not the price. 2. Best awarded words in London ... "Eat your food as your medicines. Otherwise, you have to eat medicines as your food." 3. The One who loves you will never leave you for another because even if there are 100 reasons to give up he or she will find one reason to hold on. 4. There is a big difference between a human being and being human. Only a FEW really understand it. 5. You are loved when you are born. You will be loved when you die. In between, you have to manage! NOTE: If you just want to Walk Fast, Walk Alone! But if you want to Walk Far, Walk Together! Six Best Doctors in the World 1. Sunlight 2. Rest 3. Exercise 4. Diet 5. Self Confidence and 6. Friends Maintain them in all stages of Life and enjoy a healthy life.”

14, ఆగస్టు 2019, బుధవారం

జీవితాన్ని అనుభవించు వయసే "అరవై" వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే "దొర"వై.. హోంవర్కు దిగులు లేదు పసివాళ్ళలా.. వొత్తిడుల గుబులు లేదు పడుచువాళ్ళలా.. 'నడికారు' లాగ లేదు కలవరం.. వొడిదొడుకులు లేకుండుటె ఒక వరం.. అసలు.. జీవితాన్ని అనుభవించు వయసే అరవై.. వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై.. బడి కెళ్ళాలని లేదు గడబిడ.. హడావిడి పడుట లేదు పని కడ.. బస్సు కొరకు వెయిటింగు బెరుకు లేదు.. ఉస్సురుస్సురనే ట్రాఫిక్ ఉలుకు లేదు.. ఉదయం రాందేవ్ యోగా, ధ్యానం మధ్యాహ్నం ఎండ తగులని విరామం.. సాయంకాలాలు సమవయస్కులతో చర్చోపచర్చలు, చతుర సంభాషణలు.. అసలు.. జీవితాన్ని అనుభవించు వయసే అరవై.. వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై.. అమ్మా నాన్నల పోరు లేదు.. ఆఫీసు, బాసు జోరు లేదు.. మనుమలు, మనుమరాళ్ళ ఆటపాటలు, కొడుకులూ, కోడళ్ళు.. కూతుర్లూ అల్లుళ్ళ హర్షాతిరేకాలు, ఆహ్లాదపూరితాలు.. ఆశీస్సులకై శిరసువంచే ఆనందమయ సన్నివేశాలు.. అసలు.. జీవితాన్ని అనుభవించు వయసే అరవై.. వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై.. పాఠశాల, క్రమశిక్షణ వంటివి లేవు.. పరిమితులు, అనుమతుల బాధలు లేవు.. పెద్దవారు అడ్డుకునే సందేహం, ఎవరేమంటారోననే అనుమానం మచ్చుకైన కానరావు, మరియాదలు తప్పవు.. ఏదైనా అనొచ్చు.. ఏమైనా కనొచ్చు.. మనసుకు తోచిన రీతి మాట్లాడడమే పద్ధతి.. అసలు.. జీవితాన్ని అనుభవించు వయసే అరవై. . వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..

12, ఆగస్టు 2019, సోమవారం

11, ఆగస్టు 2019, ఆదివారం

ఎవరు వ్రాసారో తెలియదు కానీ చాల బాగుంది. అందుకే మీకు పంపిస్తున్నాను. నేటి సెల్‌ఫోన్ చరవాణి... జేబుల్లో కీరవాణి మాయచేసే మహారాణి వ్యసనాల యువరాణి గుప్పిట్లో ఉండాల్సింది.. అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది అదనపు అవయవంగా మారి.. అవయవాలన్నటినీ ఆడిస్తోంది "ప్రపంచానికి" అవసరమని రూపిస్తే.. తానే "ప్రపంచమై" కూర్చుంది సౌకర్యం కోసం సృష్టిస్తే .. సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది "నట్టింట్లో" మాటలు మాన్చి.. నెట్టింట్లో ఊసులు కలిపింది. చాటింగులు... మీటింగులు... ఆపై రేటింగులు..అంటూ యువతను పెడద్రోవ పట్టిస్తోంది సమాజాన్ని పట్టి పీడిస్తోంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తోంది అయిన వాళ్ళు పక్కప్రక్కనే ఉన్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్ళను చేసింది వ్యసనపరులుగా మార్చింది. ప్రమాదవశాత్తు పడిపోయినా... "ప్రాణం ఉందోలేదో చూసుకోకుండా "ఫోను"ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది. ఎన్నని చెప్పను దీని లీలలు ఓ మిత్రమా...! విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు ఊడిగం చేయించుకో... అంతేగాని బానిసగా మారకు. దేన్నెక్కడుంచాలో అక్కడే ఉంచు. నెత్తినెట్టుకున్నావో .. పాతాళానికి తొక్కేస్తుంది. బి కేర్ ఫుల్ అది మాయల మహరాణి వ్యసనాల యువరాణి చేతిలోని చరవాణి.

10, ఆగస్టు 2019, శనివారం

నాన్నకు ప్రేమతో.... ఏమని చెప్పను.. ఎంతని చెప్పను.. నాన్న ఔన్నత్యం నాన్న ఆకాశమంత...అంతకు మించి...అనంతమంత!! ఆకాశమంత ఔన్నత్యం, వెన్నెల కురిపించే చక్కనయ్య, చంద్రయ్య మోము, చల్లని వెన్నెల లాంటి గుణం, కమ్మని వెన్నలాంటి మనసు, నడకతోపాటు నడత నేర్పే నేర్పరి, సేవా సహన శీలత, కోమలతల త్యాగం... ఏమని చెప్పను!? ఎంతని చెప్పను!? ఎంతచెప్పినా తక్కువే నాన్న గురించి చెప్పడం. నాన్న గొప్పదనాన్ని అక్షరాలుగా మార్చి, వాక్యాలలో ఒదిగింపచేసి నాన్న గుణగణాలను లెక్కిస్తూ పోతే నక్షత్రాల సంఖ్య కూడా తక్కువే పడుతుందేమో! నాన్న ఔన్నత్య విస్తీర్ణం ముందు అంబరమంతా నేలమీద పరచినా చాలా తక్కువనిపిస్తుంది. అలుపెరుగని సూర్యుడు, అనునిత్యం చంద్రుడు, పోరాడే సైనికుడు, కష్టించే శ్రామికుడు... ఇలా చెప్పనలవి కానంత కీర్తి ఆయన సొంతం. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. ప్రేమకు తరగని శిఖరమంత కూర్పులు. మంచికి మానవత్వానికి చెరగని చిరునామా నాన్న. సంతాన అభివద్ధి కోసం తాను రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా తన సాధకబాధకాలను ఎవరికీ చెప్పుకోడు. నిస్వార్థంగా బిడ్డల భవిష్యత్తుకు రాచబాట వేసి , వారిని కీర్తి శిఖరాలను అధిరోహింప చేసి... తాను మాత్రం ఒక అనామకుడిలా మిగిలిపోయే త్యాగనిరతి '' నాన్న ''. నాన్న త్యాగం గురించి కవితా రూపంలో '' పగిలిన కాళ్ళు ప్రశ్నిస్తున్నాయి... అదేమంటే శీతాకాలం కదా అందుకే పగిలాయని నాన్న జవాబు! చీలిన పెదాలు హెచ్చరి స్తున్నాయి ... ఎండన తిరిగి వేడిచేసి చీలాయి లేరా అని నాన్న జవాబు! చిరిగిన చొక్కా పేదరికాన్ని చూపెడుతున్నది... ఈ వయస్సులో నన్నెవరు మెచ్చుకోవాలి లేరా అని నాన్న జవాబు! అలసిన మొహం కష్టాన్ని గుర్తిస్తున్నది... ఎండతాకిడికి మొఖం వాడిందిరా ఎక్కువ పనేమి చేయలేదులేనని నాన్న జవాబు! స్వేదం బొట్లు బొట్లుగా కరుణగా జాలువారుతున్నది... ఉక్కపోతకు అలా వస్తుంది లేరా అని నాన్న జవాబు! తెగిన చెప్పులు ఆర్థిక ఇబ్బందిని చూపెడుతున్నది... వేసుకోవటానికి ఇవే మెత్తగా ఉంటాయని నాన్న జవాబు! కూడులేక దేహం బక్కచిక్కి శల్యమై పోయింది... లావుగా ఉంటే పనిపాటా చేయలేమని ఇలా వున్నానని నాన్న జవాబు! ప్రశ్నలన్నీ నేను సంధించినవే తెలిసీ తెలియని అమాయక సందిగ్ధ వయసులో జవాబులన్నీ నాన్ననుండి వచ్చినవే జీవితాన్ని కాచి వడబోసిన వయసులో! వయసు పెరిగాక మనసు పరిణితి చెందాక నాన్న చెప్పే జవాబులన్నీ అబద్ధాలని గ్రహించాను తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా మోముపై కనపడనీయకుండా నన్ను సంతోష తీరాలకు చేర్చిన నాన్న! తల్లి నవ మాసాలు మోసి కంటే.. మనల్ని నడిపించే దైవం నాన్న. నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే భద్రత, భరోసా.. అంతకుమించిన త్యాగం అతడు. చేయి పట్టి నడిపిస్తూ.. ఆడిస్తూ.. అల్లారుముద్దుగా పెంచుతాడు. ఆటలతో పాటు ఆత్మస్థైర్యమూ నేర్పిస్తాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. వాళ్ల సుఖం కోసం చెమట.. కాదు, కాదు.. రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తానేమైపోయినా పర్వాలేదు అనుకుంటాడు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు నాన్న. తను తిన్నా, తినకపోయినా.. తన దుస్తులు బాలేకపోయినా.. పిల్లలకు మాత్రం ఏ లోటూ రాకుండా ఉండాలని పరితపించే వ్యక్తి నాన్న. పిల్లలు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే ఎంతో సంతోషపడతాడు. వాళ్లు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడే నాన్నకు ఏమిచ్చినా తక్కువే !!

6, ఆగస్టు 2019, మంగళవారం

మూడేళ్ళ క్రితం రాసానని జూకర్ బెర్గ్ గుర్తు చేసాడు... *************************************** *** ఏ పత్రిక చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.? కలం జాతి చరిత్ర సమస్తం ప్రభుత్వ భజన పరాయణత్వం! ప్రసార చరిత్ర సమస్తం పరస్పరారోపణోద్యమం మాధ్యమ జాతి చరిత్ర సమస్తం అధికారానికి దాసోహం! ఏపేజీ చూసినా రేపులు, హత్యలు, యాసిడ్ దాడులు.. ధనవంతులను కీర్తించడం నేతలకు తలవంచడమే! ఉద్యోగులను కాల్చుకు తినడం జీతాలను ఎగవేయడం సంపాదకులు దుర్బల జాతిని బానిసలను కావించారు! కునారిల్లిన సంసారాలు మరణించిన జర్నలిస్టులు అసహాయుల హాహాకారం పత్రికల్లో మూలుగు తున్నవి!!

23, జూన్ 2019, ఆదివారం

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. .... ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో.. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో...ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠం లెన్నో.. శ్రమజీవుల పచ్చి నెత్తురు తాగని ధనవంతులెందరో...అన్నార్తులు అనాధ లుండని ఆ నవయుగ మదెంత దూరమో.... కరువంటూ,కాటకమంటూ కనిపించని కాలాలేపుడో...అణగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో.... ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో...కులమతాల సుడి "గుండా"లకు బలియైన పవిత్రులెందరో... భారతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాళ్ళో.....

17, జూన్ 2019, సోమవారం

మంత్రికి తెలివుండాలి*** బంటుకి భక్తుండాలి*** గుర్రానికి వేగముండాలి** ఏనుగుకి బలముండాలి*** సేనాధిపతికి వ్యూహముండాలి** సైనికుడికితెగింపుండాలి* యుద్ధం నెగ్గాలంటే, వీళ్ళందరి వెనుక కసి వున్న ఒక రాజుండాలి**** 👉#మనందరిలో_ఒక_రాజుంటాడు కానీ మనమే** #రాజులా *ఆలోచించడం ఎప్పుడో ఆపేశాం! 👉 *"మన కసి -అడవులని చీల్చయినా సరే, *సముద్రాలని కోసయినా సరే, కొత్త దారులు కనుక్కోగలదు" అని మనకి తెలుసు. అయినా... భయానికి బానిసయ్యాం. ఓటమికి తలొంచేసాం ! 👉చరిత్రలో... చాలా మంది రాజులు... 🌺ఓడిపోయారు 🌺పారిపోయారు 🌺దాక్కున్నారు 🌺దాసోహమయ్యారు. కానీ కొందరే... అన్నీ పోగొట్టుకున్నా కసితో మళ్ళీ తిరిగొచ్చి యుద్ధం చేశారు. 'రాజంటే స్థానం కాదు, రాజంటే స్థాయి' అని నిరూపించారు. 👉 డబ్బొచ్చినా, పోయినా వ్యక్తిత్వం కోల్పోకు... రాజ్యాలున్నా, చేజారినా రాజసం కోల్పోకు... 👉�రాజంటే.. కిరీటం, కోట, పరివారం కాదు..‌ రాజంటే ధైర్యం... రాజంటే ధర్మం... రాజంటేయుద్ధం...! 👉ఒకరోజు విందుభోజనం చేస్తావు.. ఇంకోరోజు అడుక్కుతింటావు- పాండవుల్లా...! 👉ఒక రాత్రి బంగారు దుప్పటి కప్పుకుంటావు‌.. మరో రాత్రి చలికి వణికిపోతావు- శ్రీరాముడిలా...! 👉ఎత్తు నుండి నేర్చుకో, లోతు నుండి నేర్చుకో... రెండింటి నుండి ఎంతో కొంత తీసుకో...! 👉 రాజంటే స్థానం కాదు రాజంటే స్థాయి... 👉స్థానం - భౌతికం.. కళ్ళకు కనపడుతుంది. స్థాయి - మానసికం.. మనసుకు తెలుస్తుంది...! మనందరిలో ఒక రాజుంటాడు... బ్రతికిస్తావో... *చంపేసుకుంటావో...నీ ఇష్టం..!

11, జూన్ 2019, మంగళవారం

ఆహా.. ఏమి రా"సినారె". ------------------------ సినారె అచ్చంగా తెలుగు వాడు.. అందుకే.. నాకు బాగా నచ్చుతాడు.. గజళ్ళకు గజ్జెకట్టి నాట్యమాడించాడు... ..... శాతవాహనుల వ౦శాన పుట్టిన వాడు కాకతీయుల పొతుగడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు డిల్లీలొ సైతమ్ము పెద్దగద్దెలనేలి పేరుకెక్కినవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు ప౦చె కట్టుట లొ ప్రప౦చాన మొనగాడు క౦డువాలేనిదే గడపదాటనివాడు ప౦చబక్ష్యాలు తన క౦చాన వడ్డి౦చ గో౦గూర కొసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు నేల నల్దెసల డెరాలు దాటిన వాడు అన్ని మూసలలొల్న అట్టె ఒదిగిన వాడు “ఏ దేశమేగినా ఎ౦దుకాలిడినా” ఆవకాయ వియోగమసలె సైపని వాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు మ౦చి మనసెదురైన మాలలిచ్చెవాడు భాయి భాయి అన్న చెయి కలిపేవాడు తిక్కరేగి౦ద౦టే డొక్క చీల్చేవాడు చిక్కులెరగనివాడు చిత్తాన పసివాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు!

3, జూన్ 2019, సోమవారం

వాట్సాప్ మెసేజ్ ల పై పేరడీ పాట: _*పల్లవి:*_ నేను పుట్టాను, లేండ్ లైన్ వచ్చిందీ ... ... ... నేను ఏడ్చాను, సెల్ ఫోన్ వచ్చిందీ ... ... ... నేను నవ్వాను, స్మార్ట్ ఫోన్ వచ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥ _*1వ. చరణం:*_ మనిషిని మనిషిని కలిపేటందుకు లేండ్ లైన్ వచ్చిందీ ... ఎవరికి దొరకక తిరిగేటందుకె సెల్ ఫోన్ వచ్చిందీ ... ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై స్మార్ట్ ఫోన్ పుట్టిందీ ... అందరి బుర్రలు నమలడానికే వాట్సాప్ వెలిసింది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥ _*2వ చరణం:*_ లేండ్ లైన్ మ్రోగితే, అందరి గుండెలు ఆనందించాయీ ... సెల్ ఫోన్ మ్రోగితే, అందరి మనసులు చిరాకు పడ్డాయీ ... స్మార్ట్ ఫోన్ తో, అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ ... తెల్లవారినా అవి, కొంచెం కూడా బాగవ కున్నాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*3వ చరణం:*_ వాట్సాపులో వసతులతోటీ, షరతులు వున్నాయీ ... హద్దు మీరితే అంతు తెలియనీ, శిక్షలు పడతాయీ ... స్మార్ట్ ఫోనులో భాషల కుండే, సొగసులు తగ్గాయీ ... ఎమోజీ(emoji) లతో, ఎవరికి తెలియని భాషలు పుట్టాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*4వ చరణం:*_ మనుషుల మనసులు, కలిపేటందుకె ఫోనులు వున్నాయీ ... ఏ ఫోనైనా, మంచిగ వాడే మార్గాలున్నాయీ ... మంచిగ వాడని, ఫోనుల కెపుడూ వైరస్ లొస్తాయీ ... వాట్సాపులో, పెట్టేటందుకె నీతులు వున్నాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*5వ చరణం (ఆఖరి చరణం):*_ గంటలు రోజులు స్మార్ట్ ఫోనులో, వాగుతు గడిపేసెయ్ ... ఫోన్లో వున్న బేటరి తీసి, బయటకు పారేసెయ్ ... వైఫై సిగ్నల్ ఆపేసెయ్ ... సిమ్ము కార్డును విసిరేసెయ్ ... డ్రైవ్ ద డేటాకార్డ్ ఔట్ ... ... ... హహ్హహ్హహ్హహ్హ !!! ॥నేను పుట్టాను ... ... ... ॥ _*ప్రేమ్ నగర్*_ సినిమా లోని _*ఘంటసాల మాస్టారు*_ పాడిన _*నేను పుట్టాను ... ... ... *_ పాటకు వరుస అన్వయం. *# ఇదీ మొత్తం పాట. #*

31, మే 2019, శుక్రవారం

తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా...! అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు, నాన్ననే డాడీకి డమ్మీని చేసావు... నీ బిడ్డ అఆలు దిద్దనే లేదు, తన భాష చదవడం రాయడం రాదు... తెలుగునే వెలివేసె మన బడులు, తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ... తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా...! లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెద పట్టినాయి, బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు మన తెలుగు సామెతలు మంట గలిసాయి...! రామాయణం లేదు, భారతం లేదు, భాగవత పద్యాల్లొ ఒకటైన రాదు...! కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి? కదలరే టీవీల చుట్టూత చేరి...! మమ్మీకి ఎల్ కే జి ర్యాంకులే ముఖ్యం, డాడీకి లైఫులో విజయమే లక్ష్యం...! తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా...! మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు, దాన్ని చేసిన తెలుగువాడెవడొ తెలుసా? వెండి తెర హీరోలను వీరులంటున్నావు, నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా? గుడి గుడీ గుంచాలు... కోతి కొమ్మచ్ఛీ, ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి... పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి, పెంచావు వీడియో గేమ్సుపై పిచ్చి... పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ, ఉనికినే మరచింది... అది అసలు బాధ...! తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా...! కూడుపెట్టని భాషని 'భాష' కాదన్నావు, డాలర్లు తెచ్చేదె అసలు చదువన్నావు... తెలుగు పండగలన్ని మొక్కుబడి చేసావు, కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు... గ్లోబునే గెలిచాము చూడమన్నావు, తల్లి వేరును మటుకు తెగనరికినావు... తెలుగు మొనగాణ్ణి అని తొడచరిచినావు, తల్లి పేరడిగితే తెల్లబోయావు...! నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా? సెంటిమెంటల్ స్టంటు చాలు, నీ బొందా...! తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారె తెలుగోడా...! వెంకీ ---

తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు,
నాన్ననే డాడీకి డమ్మీని చేసావు...
నీ బిడ్డ అఆలు దిద్దనే లేదు,
తన భాష చదవడం రాయడం రాదు...
తెలుగునే వెలివేసె మన బడులు,
తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ...

తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

లేత మనసుల్లోన
నీతులే ముద్రించు శతకాలు
అటకెక్కి చెద పట్టినాయి,
బతుకు పుటలను తెరచి
వ్యాఖ్యానమొనరించు మన తెలుగు సామెతలు
మంట గలిసాయి...!

రామాయణం లేదు, భారతం లేదు,
భాగవత పద్యాల్లొ ఒకటైన రాదు...!
కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి?
కదలరే టీవీల చుట్టూత చేరి...!
మమ్మీకి ఎల్ కే జి ర్యాంకులే ముఖ్యం,
డాడీకి లైఫులో విజయమే లక్ష్యం...!

తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు,
దాన్ని చేసిన తెలుగువాడెవడొ తెలుసా?
వెండి తెర హీరోలను వీరులంటున్నావు,
నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా?

గుడి గుడీ గుంచాలు... కోతి కొమ్మచ్ఛీ,
ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి...
పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి,
పెంచావు వీడియో గేమ్సుపై పిచ్చి...
పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ,
ఉనికినే మరచింది... అది అసలు బాధ...!

తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

కూడుపెట్టని భాషని 'భాష' కాదన్నావు,
డాలర్లు తెచ్చేదె అసలు చదువన్నావు...
తెలుగు పండగలన్ని మొక్కుబడి చేసావు,
కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు...
గ్లోబునే గెలిచాము చూడమన్నావు,
తల్లి వేరును మటుకు తెగనరికినావు...
తెలుగు మొనగాణ్ణి అని తొడచరిచినావు,
తల్లి పేరడిగితే తెల్లబోయావు...!

నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా?
సెంటిమెంటల్ స్టంటు చాలు, నీ బొందా...!

తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!
వెంకీ
---

30, మే 2019, గురువారం

Legend NTR  Archived This topic is now archived and is closed to further replies. DVSK dialogues script By srinivas1827, July 8, 2011 in Legend NTR  srinivas1827     64  Posted July 8, 2011 Hi brithers, I want dialogues script of DANA VEERA SURA KARNA. esp maya sabha and emantivi emantivi etc., I need to give practice for party in college.. so i want link or direct script whatever u have.. pervez     450  Posted July 8, 2011   On 7/8/2011 at 10:34 PM, srinivas1827 said: Hi brithers, I want dialogues script of DANA VEERA SURA KARNA. esp maya sabha and emantivi emantivi etc., I need to give practice for party in college.. so i want link or direct script whatever u have.. Read more     Check back pages/history...I remember someone posting the whole dialogue...the one's you wanted....go back about 3-4 months. Vvnspsnrntr     268  Posted July 9, 2011   On 7/8/2011 at 10:34 PM, srinivas1827 said: Hi brithers, I want dialogues script of DANA VEERA SURA KARNA. esp maya sabha and emantivi emantivi etc., I need to give practice for party in college.. so i want link or direct script whatever u have.. Read more     1.సుయోధనుడు ద్రోణుడి జాత్యాహంకారాన్ని వ్యతిరేకించుట ఆగాగు! ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి ?   జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా !   ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ?   కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా !   నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ? మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము?   ఇంతయేల, అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ! ఈయన దే కులము ?   నాతోనే చెప్పింతువేమయా , మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా ? ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా?   సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు?     2.కర్ణుడి పట్టాభిషేకం     ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది. అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదవిరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.   సోదరా.. దుశ్శాసన ! అనఘ్రనవరత్న కిరీటమును వేగముగా గొనితెమ్ము,   మామా.. గాంధారసార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము,   పరిజనులారా ! పుణ్య భాగీరథీనదీతోయములనందుకొనుడు,   కళ్యాణభట్టులారా ! మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,   వంధిమాగధులారా ! కర్ణ మహారాజును కైవారము గావింపుడు,   పుణ్యాంగనలారా ! ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది బహుజన్మసుకృతప్రదీపాదిసౌలబ్ద సహజకవచకచవైడూర్యప్రభాదిత్యోలికి వాంచ్చలుచెలరేగ వీరగంధమువిదరాల్పుడు.   నేడీ సకలమహాజనసమక్షమున, పండితపరిషన్మధ్యమున సర్వదా సర్వదా, శతదా సహస్రదా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను .   హితుడా ! అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమేకాదు.. నా అర్థ సింహాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను.     3.సుయోధనుడికి పాండవుల రాజసూయాగం ఆహ్వానం వచ్చినప్పుడు   ఊం.. ఉ.. హహహహ   విరాగియై పాండురాజుకు సరాగినియై కులప్రవర్తనాసక్తయైన కుంతికి జనియించిన పాండవులు !   ఆబాల్యమున ఆటపాటలలో మమ్ము అలమటపెట్టిన పాండవులు !     లాక్కాగృహములో నిశీధిని నిట్టనిలువునా ధహించివేసారన్న నీలాపనిందను మామీద వేసిన పాండవులు !   ఏకచక్రపురమున విప్రవేషములతో ఇల్లిల్లు తిరిపమెత్తి పలుకు వళ్ళుమెక్కిన పాండవులు !   అంతకుతగ్గగంతగా అతుకులబొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు !   స్నాయువతా సంకలిత శల్యము సంప్రాప్తించిన సుంకంమ్మన్నటుల మా పిత్రుదేవదయాలభ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేడీ యాగకార్యదుర్వహుగులగుటయా !   నరకలోకముననున్న తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు జేర్చుట దీని ఆంతర్యమట ! ఏమి కల్పనాచాతుర్యము ? ఏమి కల్పనాచాతుర్యము ?   ఐనను కుంతీ మూలమున స్వర్గనరకాధిపతులిరవురు పాండురాజునకు తమ్ములేగదా ! ఐన ఇందు జరుగనిదేమి ? లోపమేమి ?   అయ్యారే ! సకలరాజన్యులోకమూ సోహోనినాదములు సలుప భారతభారతీ శుభాస్సీసులతో పరిపాలనసాగించెడి మాకు మారాటుగా సార్వభౌమత్వము సాదింపగోరి పాండవుల దుష్ప్రయత్నమా ఇది !   సాటిరాజులలో రారాజు కావలెననియెడు ధర్మజుని దుష్టంతరమా ఇది ! ఐనచో కుతంత్రముతో కుచ్చితబుద్ధితో సేయనెంచిన ఈ రాజసూయము సాగరాదు, మేమేగరాదు.     4.మయసభ ఘట్టం     అహొ ! అమ్లానభావసంభావితమైన ఈ దివ్యప్రసూనమాలికారాజమును కురుసింహుని గళసీమనలనలంకరించిన వారెవ్వరు ? అ.. హహహ ..   అనిమిషయామినీ అతిధిసత్కార దివ్యసేవాప్రభావమౌనా ! ఔ,, ఔ,,   ఆ.. హహ్హహ,, ఓ.. ఆ.. ఏమా సుమధుర సుస్వరము ! కాకలీకలకంటికంటి కూకూఉకారసుతిహిత దివ్యసురకామినీ కామినీయక సుస్వాగతమౌనా ! హాహ్హహ.. అహా . సొబగు సొబగు.. సొబగు సొబగు..   ఔరా.. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా ! హాహ్హహ.. ఔ.. ఔ..   అయ్యారే ! భ్రమ.. ఇదినా భ్రమ .. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..   భళా ! సముచితసత్కారస్వీకారసంత్రుప్తస్వాంతుడనగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణాభూషణములచే ఈ సభాభవనము ధన్యము..ధన్యము..   అకుంచితనిర్మాణచాతురీదుర్యుడవగు ఓ మయబ్రహ్మా.. నీ శిల్పచాతురీమధురిమ ఆ బ్రహ్మకుగాని విశ్వబ్రహ్మకుగాని లేదు.. లేదు.. లేదు ..   ఆ.. లేవచ్చును, లేకపోవచ్చును.. కాని పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుటమాత్రం మానధనులమైన మాబోంట్లకు దుస్సహము.   విశ్వవిశ్వంబరావినుతశాశ్వతమహైశ్వరీమహైశ్వరులము కావచ్చు..   అఖిల నదీనదసాగరవారిదర్గర భూకృత అనఘ్రముక్తామణీమ్రాతమ్ములు మాకుండిన ఉండవచ్చు..   సాగరమేఘరాసతీకరగ్రహణంబోనర్చి సార్వభౌమత్వమందిన అందవచ్చు..   కాని ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము.   చతుర్కృతాపచారములకంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయములకు దావాలనసధృశము. ఇక మేమిందుండరాదు.   ఏమీ ! నిరాఘాటపదట్టనకు నాకీ కవాటఘట్టనమా ! పరులేవ్వరు లేరుకదా ! మా భంగాపాటును పరికించలేదుకదా!   ఇస్సీ! ఈమయసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్ము అవమానిచుటకే.   ఆ.. ఏమీ ! సభాభవన గర్భమున సుందర జలచరసంతియైన జలాశయమా ! ఆహ్   అంతయు మయామోహితముగా ఉన్నదే !   ఉ.. అహ్హహ్హ.. ఇదియును అట్టిదియే.. అహహ్హహ...   పాంచాలీ... పంచభర్త్రుక ...   వదరుపోతా.. వాయునందనా ...   పాంచాలి.. పంచభర్త్రుక.. ఏమే.. ఎమేమే.. నీ ఉన్మత్తవికటాట్టహాసము ? ఎంత మరువయత్నించినను మరపునకురాక హృదయ శల్యాభిమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.   అహొ ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహొత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యదౌరేయుండనై ...   నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై ...   పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాత్రవిద్యాపారియుండైన రాధేయునకు మిత్రుండనై..   మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికా పరీవృతయై పగులబడి నవ్వుటయా ?   అహొ ! తన పతులతో తుల్యుడనగు నను భావగా సంభావింపక, సమ్మానింపక.. గృహిణిధర్మ పరిగ్దగ్ధయై.. లజ్జావిముక్తయై.. ఆ పంతకి పాంచాలి ఎట్టఎదుట యేల గేలి సేయవలె ?   అవునులే.. ఆ బైసిమాలిన భామకు ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున మగలముందొక మగనిని వచ్చనపర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చిపచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ?   ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా ! ఆ.. అని సరిపెట్టుకొందున ! ఈ లోకమును మూయ మూకుడుండునా !   ఐనను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి మేమేల రావలె ... వచ్చితిమి పో !   నిజరత్నప్రభాసమపేతమై సర్వర్త్రు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలె.. అయినది పో !   అందు చిత్రచిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినది పో !   సజీవ జలచర సంతాలవితాలములకు ఆలవాలమగు ఆ జలాశాయములో మేమల కాలు మోపవలె .. మోపితిమి పో !   సకల రాజన్యుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం చెందవలె.. ఏకత్సమయమునకే పరిచారికాపరీవృతయై ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ?   ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..   ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబానలా జ్వాలలు ధగ్ధమోనర్చుచున్నవి మామా..   విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా ?   పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా..   ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా...   ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా ?       5.మాయాజూదంలో సుయోధనుడు గెలిచినపుడు     మాయురే మామా.. మాయురే హహహః చరిత మరువదు నీ చతురత.. మాట చెల్లించిన నీకే దక్కును యెనలేని ఘనత మా ఎద సదా మెదలును మామ యెడ కృతజ్ఞత .   ప్రాతిగామి ! ఆ వంచకి పాంచాలిని ఈ సభకు ..   ఓహో వయోవృ ద్దులు , గురువృ ద్దులు ధర్మబుద్ధులమనుకొను ప్రబుద్ధుల బుద్ధి ఇంత దనుక నిదురబోవుచున్నదా ఏమి ? హహ్హ.. హహ్హ.. ఇప్పుడే లేచి అధర్మము అధర్మమని ఆవులించుచున్నది.   జూతం ధర్మవిరుద్ధము సప్త మహా వ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసియు ఇంతదనుకా మీరేల వీక్షించితిరి?   ఐనను జూతక్రీడారతుడగు ధర్మసుతునితో మామను సరిజోదునుచేసి ఆడించితినే కాని చతుషష్టి కళా విశారదుడనగు నేనాడలేదే ! ఆట తెలియకనా ? హహహ.. ధర్మమూ తెలియును గనుక.   కాని ధర్మాధర్మములు విచారింపక తన తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తే ఐనటుల ఈ పాండు సుతుడు ఒడ్డినపుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదపిరా ?   తమనొడ్డినపుడైన తమ్ములు నోరు మెదపిరా ?   ఆలిని ఓలిగా పెట్టినప్పుడైన ఆ మగువను మగటిమితో మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకొన్న వాడను నేను పాంచాలిపై మీకేమి అధికారమున్నదని అర్జునుడైన అన్న నడిగెన ?   చతుర్విధ పురుషార్ధములలో సహధర్మచారిణి ఐన ధారను దయారహితముగా పందెము వైచునప్పుడైనను, అవ్వ ! ఇది అమానుషమన్నవారులేరే ?   అ.. ఆ.. నేను గెలచుటచే మయా తిరోతరమైనది , ధర్మజుడే గెలచిన ధర్మమే జయించినదని మీరు జేజేలు కొట్టిఉండెడి వారు కాదా !   మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మ దేవతను ఖండించి అధర్మ దేవతను ప్రళయ తాండవ మాడింపకుడు ..   తాతా! అలనాడు స్వయంవర సమయమున నా కూర్మి మిత్రుడగు కర్ణుని సూతకుల ప్రసూతుడని వదరి వర బహిష్కారము చేసిన ద్రుపదునకు బుద్ధి చెప్పుటకు ఇది ఒక ప్రయత్నం.   నాడు నను అతిధిగా ఆహ్వానించి పరిహసించిన పంచ భర్త్రుక పాంచాలి పై పగ సాధించుటే దీని ఆంతర్యం.   అంతియేకాని మా పితృ దేవ దయాలబ్ధమైన ఎంగిలి కూటికాశపడు అల్పుడను కాను, అందునా జూతార్జితమగు విత్తము పై చిత్తము నుసిగొల్పు అధముడను కాను.   నా హృదయాగ్నిజ్వాలా ప్రతిరూపమే ఈ జూతము తాతా, ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి. మర్మ ధర్మములతో, పక్షపాత బుద్ధులతో పాతక కర్మలతో మనుగడ సాగించు మీరీ మహాసభలో మాట్లాడ అనర్హులు. మీ హితోపదేశం కట్టిపెట్టండి, కూర్చోండి.       6.కృష్ణ రాయభారానికి సుయోధనుడి ప్రత్యుత్తరం     రాయభారీ... చాలించు నీ దుష్ప్రసంగం..   పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా.. సభ్యమహాజనులారా.. నా క్షేమము కోరి పలికిన మీ హిత వాక్యములకు కృతజ్ఞుడను.   రాయభారీ.. గోకులవిహారి .. హహహ్హ.. నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరార్ధమును తెలియని అజ్ఞానిని కాదు..   మా గురుదేవునకు సోదరుడవని, కుంతీ దేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనాలతో , సమస్త సత్కారాలతో అతిధిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయభారిగా ప్రకటించు కొంటివి. పగతుర కూడు కుడువనున్నదని నిన్ననే మమ్ము పగవానినిగా భావించితివి .   ఐనను, రాయభారి వచ్చునపుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితరీతినే గౌరవించితిని.   ఊం.. రాయాభారిగా వచ్చినవాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక , ఆపైన మా అభిమతము గ్రహింపక ఇంతః ప్రల్లదనముగా ప్రవర్తించితివి.   ఇప్పుడు నేను సంధికొడంబడినచో హహ్హ.. హహ్హ.. సౌజన్యముతో డాయాదులకు పాలుపంచి ఇచ్చినట్లా ? లేక, నీవు వంధిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు లకు బెదరి ఇచ్చినట్లా ?   దూతగా వచ్చినవాడవు దూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు కదంగితివి, మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి   హ..హహ.. ఐదూల్లైనా ఇవ్వని పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనెంచితివి కృష్ణా ! నీ కోరిన కోర్కె సరియే ఐనచో, నిజమే ఐనచో నేనీయుటకీ సువిశాల సామ్రాజ్యములో ఐదూళ్ళు లేకపోవునా !   ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావికానివి, నేను ఇతరులకు దానమిచ్చిన ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్ట గలను? ఆ .. ఇది సాధ్యమా ? సంధి పొసగు మార్గమా ? హ..హహ..   ఇది గాక ... మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి.. ఎవరు నాకు పినతండ్రి ?   పాండురాజా ? యమధర్మరాజా ? వాయువా ? ఇంద్రుడా ? అస్వనీదేవతలా ? కృష్ణా ! శ్రత శృంగపర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమొందుటకు హ..హహ నేనంత వెర్రివాడిననుకుంటివా ?   ఒకవేళ భాగమే పంచవలసివచ్చిన, ఈ గంగా తనయుడు పాలు వదలుకొన్నను ..   మా పిన పితామహులగు భాహ్లిక సోమదత్తులకు అందు భాగము లేదందుమా ?   అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో హ..హహ.. ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును.   అసలీ అవిభాజ్య కురుమహాసామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా ?   భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ?   ప్రజలందరు ఒకే కుటుంబముగా ఒకే పాలన క్రింద ఉండుట క్షేమము కాదా? కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీవెరుగవా?   అందులకే జూతమునకా నియమము పెట్టితిమి కాని, మతిమాలి కాదు.   అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు .. మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి రెండవది తన నలుగురు భర్తల దాస్యవిముక్తి , అంతియే కాని .. నాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూలేదు మా తండ్రిగారీయనూలేదు . కనుక ఆమె ఇప్పటికి మా దాసియే . కృష్ణా! వారీనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించ గలరా ? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని , ఎగ్గులేక నీవంగీకరించి రావచ్చునా ?   ఇక నీ బెదరింపులందువా ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్ళ కొరకు ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !   కృష్ణా ! ఇంతయేల , ఆ కౌంతేయులకు వాడిసూది మొనమోపినంత భూమికూడా ఈయను . ఇదియే నా తుది నిర్ణయము . GO TO TOPIC LISTING              Recently Browsing   0 members No registered users viewing this page. IPS Theme by IPSFocus Theme    Contact Us Youtube Twitter Facebook Nandamurifans.comPowered by Invision Community

21, మే 2019, మంగళవారం

ఆకు పచ్చ చందా మామా నువ్వులే నువ్వులే నీకూ మచ్చా లేడా లేనే లెవ్వ్వులె లెవ్వులె మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నదీ ? మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నదీ ? మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ మింట సుక్కలల్ల వాడూ మింట సుక్కలల్ల వాడూ - సెమట సుక్కలల్ల నువ్వూ ...... ॥ ఆకు పచ్చ ॥ వానాకాల మోస్తే మబ్బు కప్పి పోయి మరుగయ్యే జాబిల్లి నవ్వు వానాకాల మోస్తే మబ్బు కప్పి పోయి మరుగయ్యే జాబిల్లి నవ్వు వానల్ల వరదల్ల బురద జిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు వానల్ల వరదల్ల బురద జిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు మేఘాల సొగసు వాడూ మేఘాల సొగసు వాడూ - మాగాణి తేజస్సు నువ్వూ ........... ॥ ఆకు పచ్చ ॥ కలువ రేడు పేరు కాని కలువను వాడు చేరలేడు ఎంత పాపం ? కలువ రేడు పేరు కాని కలువను వాడు చేరలేడు ఎంత పాపం ? కట్టుకున్నదాని ముద్దుముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం ? కట్టుకున్నదాని ముద్దుముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం ? రాత్రి పూటకు వాడు కాపూ రాత్రి పూటకు వాడు కాపూ - రాత్రి తోటకు నువ్వు కాపూ ..... ॥ ఆకు పచ్చ ॥ కాకమ్మ కధలోన రాహు కేతులకు ఏడాది కోసారి గ్రహణం కాకమ్మ కధలోన రాహు కేతులకు ఏడాది కోసారి గ్రహణం పంట సేతికి వస్తే చుట్టూరా రాహూలె ఏడాది కేడాది గ్రహణం పంట సేతికి వస్తే చుట్టూరా రాహూలె ఏడాది కేడాది గ్రహణం విడుదలున్నది వాడికైతే విడుదలున్నది వాడికైతే - నువ్వేమో జీవిత ఖైదే ............ ॥ ఆకు పచ్చ ॥ పాల సముద్రాన వాడు పుట్టిందని పంతులయ్య తల్లి సెప్పింది పాల సముద్రాన వాడు పుట్టిందని పంతులయ్య తల్లి సెప్పింది కన్నీటి సంసార సాగరంల నిన్ను కన్నానని మీ అమ్మ సెప్పింది కన్నీటి సంసార సాగరంల నిన్ను కన్నానని మీ అమ్మ సెప్పింది ఎన్నెల్ల నిస్తారు మాకూ ఎన్నెల్ల నిస్తారు మాకూ - ఎలుగన్నదె లేదు మీకూ ............. ॥ ఆకు పచ్చ ॥ కష్ట జీవులయ్య భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు కష్ట జీవులయ్య భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు ఫలము చేతికి రాక పోయినా అలుపు లేని కర్మ యోగులయ్య మీరూ ఫలము చేతికి రాక పోయినా అలుపు లేని కర్మ యోగులయ్య మీరూ నింగి ఎన్న పూసా వాడూ నింగి ఎన్న పూసా వాడూ - నేల ఎన్ను పూస నువ్వూ ......... ॥ ఆకు పచ్చ ॥ ఆకు పచ్చ చందా మామా నువ్వులే నువ్వులే నీకూ మచ్చా లేడా లేనే లెవ్వ్వులె లెవ్వులె మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నదీ ? మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నదీ ? మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ మింట సుక్కలల్ల వాడూ మింట సుక్కలల్ల వాడూ - సెమట సుక్కలల్ల నువ్వూ . ఈ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ .

14, మే 2019, మంగళవారం

*భార్య....* *అంటే*... *అసలైన చదువు!* ********************* నా గురించి.... నాకే తెలియని విషయాలెన్నో తనకు (నా భార్యకు) తెలుసు! అందుకు నాకు.... ఆశ్చర్యం, ఆనందమూనూ! తన గురించి.... తెలుసుకోదగ్గ విశేషాలు చాలా తెలీదు నాకు!? అందుకు సిగ్గుగానూ, చిన్నతనంగాను ఉంటుంది ఇల్లు గడియారమనుకుంటే... చిన్న ముల్లు నేను, పెద్ద ముల్లు తను అంకెకీ అంకెకీ మద్య నిదానం నా వ్యవహారం! చకచకా అంకెల్ని దాటుతుంది ఆమె శతావదానం! వంటింటి సామ్రాజ్యంలో అడుగుపెట్టే అర్హత... నాకు లేదట, ఎప్పటికీ రాదట! కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే చీపురు సిగ్గుపడుతుందని నవ్వుతుంది! భోజనానంతరం కంచమన్నా కడుగుదామనుకుంటే పుణ్యం నాకు దక్కకుండా చేయడానికా అని కళ్ళ నీరు నింపుకుంటుంది చదువునేర్పి (మా ఆవిడ ఇంగ్లీషులో వీక్ ) బదులు తీర్చుకుందామని విద్యలేనివారిని వింతపశువంటారని అంటే... పశువుల్లేనిదే... పాడీ పంట ఎలాగా అంటుంది! అక్షరం దీపం కదా అంటే... ఒకగదిలో రెండు దీపాలుండాలా! అని తిరిగి ప్రశ్నిస్తుంది నేనూ విద్యనేర్చిన దాన్నే అందొకసారి అక్షరాలను రూపాయలుగా మార్చే చదువు మీదయితే... ఆ రూపాయలతో... ఇల్లు నడిపే విద్య నాదంది! పుస్తకాల్ని చదువుతారు మీరు మిమ్మల్ని చదువుతాను నేను! మనిద్దరిలో ఎవరుగొప్ఫ? అని నన్ను అమాయకంగానే నిలదీస్తుంది! ఇంటిల్లపాదిని తన హస్తరేఖలుగా మలచుకొన్న తన నేర్పు ముందు తల వంచుతూనే ఉంటుంది నా సంస్కారం! సంసారంలో... గెలుపోటములు సహజం. ఓడి గెలుస్తుంటాను నేను! గెలిచి ఓడుతుంది తను !! తన పనిలో ఏదో సాయం చేద్దామనుకుంటే.... గింజలు నలిగి పిండి రాలాలంటే తిరగలి పాపి ఒకటి తిరగుతుండాలి ఇంకొకటి కదలకుండా ఉండాలని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది నాకు! పనిమనిషిని పెట్టకుందామంటే పనిచేయని ఒళ్ళు రోగాల గంపని ఆరోగ్య చిట్కాలు చెబుతుంది! అసలైన చదువు తనదేనని అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది! 💐💐💐💐

11, మే 2019, శనివారం

అన్నంపెట్టె అన్నదాతకు అబ్బో ఎంతటి చక్కటి శిక్షయో... కడుపును నింపే కాపుదనానికి అబ్బో ఎంతటి చక్కటి రక్షయో... అన్నపూర్ణ మన దేశం అంటూ.... అన్నదాతలకిది నిలయం అంటూ.... మైకులదరగా మైకం కమ్మి, స్పీచులు దంచే నాయకులారా.... కాలం కలువక,వర్షం కురియక... ఆరుగాలము చెమటతొ తడిసి... కడుపులు నింపే ప్రయత్నమొకటి... చేసే దేవుడు ఈ రైతు మానవుడు... నమ్మిన భూమిని వదులు కోలేడు... కష్టము చేయగ వెనకకు పోడు.... పంటలు పోతే వేరే పంటలు.... వేయకుండగా నిద్దుర పోడు... అప్పులు అయితే తిప్పలు పడుతూ... చెప్పులరగగా కొత్త అప్పులకు.... రాత్రింబవళ్ళు తిరుగుతు ఉంటడు.... పెళ్ళాం పిల్లలు... తల్లిదండ్రులు... చేను చెలకన కాపురముంటరు... మూలకు ఉన్న ముసలవ్వలను.... కాటికి జాపిన కాలును మరచి... ఇంటిలో బెట్టి పనిచేయిస్తడు.... ఎంతటి అప్పులు ఉన్నా గానీ... ఏరువాక అతని పండుగ దినము... కడుపులు కాలిగ ఉన్నా గానీ.... కల్లము* అతనికి కమ్మని దనము... ధాన్యపు రాసులె సిరుల రాసులని... మురిసిపోయేటి ముత్యము అతడు... జగతికి ఆకలి తీర్చగ పుట్టిన.... అన్నదాతయను దేవుండాతడు.... ఆపదగొన్న వాళ్ళనాదుకొన... అవతరించినవి ఎన్నో సంస్థలు... హక్కులకోసం సంఘాలెన్నో... లా... బుక్కులు తెరచి రోడ్డుకెక్కినవి... భారత మాత ముద్దు బిడ్డలను... వర్గపు పేరుతొ విడగొట్టేసి.... గల్లీ కొక్క సంఘం బెట్టి.... హక్కులక్కులని అరుస్తువున్నవి... కష్టం నమ్మిన రైతులకెప్పుడు.... సంఘపు గోలలు పట్టనె పట్టవు.... కష్టం వస్తే దుక్కిని దున్నె... ఎద్దులకే అతని వ్యథలూ, కథలూ.... నీడను ఇచ్చే చెట్టు కొమ్మనే.... శాశ్వత సుఖముకు ఆధారాలు... అఖండ భారత సోదరులారా... ఆలోచించుడి ఈ ఒక్క క్షణంబు... అన్నదాతను ఆదుకొంటేనే... అన్నము గిన్నము మనకు అందును... అతడిని జంపిన పాపము మనకును... ఆకలిరూపున అవతరించును... అన్నదాతను ఆదుకొనేడీ... ఆలోచనలను చేయుడి ఇంకా.... -ప్రమదం(౮౧౭౯౧౯౨౯౯౯)

1, మే 2019, బుధవారం

*🌹మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.🌹* *(మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి }* *_ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని,_* *_నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను > అదుపులో ఉంచు కోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది._* *_నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి._* *_నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది._* *_చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి._* *_మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే._* *_వాగ్భూషణం భూషణం_* *_కేయూరాణి న భూషయంతి పురుషం_* *_హారా న చన్ద్రోజ్జ్వలా_* *_న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః_* *_వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయన్తే ఖలు భూషణాని * సతతం వాగ్భూషణం భూషణం._* *_ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి.* *వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం* *అన్నాడు భర్తృహరి._* *_సంభాషణం_* *_మిత భాషణం,_* *_హిత భాషణం,_* *_స్మిత భాషణం,_* *_ప్రియ భాషణం,_* *_పూర్వ భాషణం,_* *_సత్య భాషణం_* *_అయినప్పుడు-_* *_అంతకన్నా భూషణం మరొకటి లేదు._* *_‘మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ._* *_ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం._* *_శ్రీరాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నాముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది._* *_సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి._* *_ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి._* *_‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద._* *_ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు._* *_ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి._* *_మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి._* *_మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది._* *_నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు._* *_అలాంటివారికి శత్రువులే ఉండరు. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు._* *_మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో అతి మధురమైన పదాలు, మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి._* *_ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి._* _*మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి.* *ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది._* *_భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది._* 🌹 🌹 🌹 🌹 🌹

భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధజలాభిషేకముల్ భూషలు గావు,పురుషుని భూషితు జేయుఁ బవిత్రవాణి, వా గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియుంచు నన్నియున్

24, ఏప్రిల్ 2019, బుధవారం

కలిమి కలిగినట్టి కడు లోభి యాతండు తేనెటీగవోలె తెచ్చి జేర్చు అనుభవించలేని యా సంపదేలరా? నారసింహ తనయ! సార హృదయ! కష్టములకు నోర్చి కార్యశీలివి గమ్ము ఫలము గోరకుండ పదము కదుపు కాలగతియె యిచ్చు మేలగు గుర్తింపు నారసింహ తనయ! సార హృదయ! స్థిరత కలిగియుండు సరళరేఖ యెపుడు వేల మీర దెపుడు వృత్తరేఖ పగిదిలేని దెపుడు వక్రంపురేఖయే నారసింహ తనయ! సార హృదయ! చెవుల పొందు జేరి చెలగు వాక్కును బట్టి పరిహరింత్రు కంటపడ్డ యదియు చూపు కంటె మాట చుట్టమాయెను గదా! నారసింహ తనయ! సార హృదయ! సహనవంతుడెపుడు సాధించు సర్వమ్ము యోర్మి లేని వాడు యోడి పోవు సహన మొకటె కూర్చు సర్వార్థ సిద్థిని నారసింహ తనయ! సార హృదయ!

9, ఏప్రిల్ 2019, మంగళవారం

ఎవరో ఒకరు...ఎపుడో అప్పుడూ


ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ

వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా

అనుకుని కోడి కూత నిదరపోదుగా

జగతికి మేలుకొల్పు మానుకోదుగా 

మొదటి చినుకు సూటిగా దూకిరానిదే

మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే

వానధార రాదుగా నేలదారికీ

ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి

మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి

దానికి లెక్కలేదు కాళరాతిరీ

పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ

రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ

సాగలేక ఆగితే దారి తరుగునా?

జాలిచూపి తీరమే దరికి చేరునా 

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా నింగిని తాకక

ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా

ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా

ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే

అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా

అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా

నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

1, ఏప్రిల్ 2019, సోమవారం

కుర్చీల మహిమలు ఆ కుర్చీ లంటే అంత మోజు అందుకే మరి! ఆ కుర్చీ లెక్కగానే ఎన్ని మహిమ లొస్తాయో! ఉత్త ఇసుకనుండి ఎంత తైల మొస్తుందో, గాలిలో మేడలు కడితే ఎంత డబ్బు ఒళ్లో వాలిపడుతుందో... ఎవడు రోడ్లు వేసినా అందులోంచి నాలుగు రాళ్లు వాళ్ళవే, ఎవడు ఇల్లు కట్టుకున్నా అందులోంచి నాలుగు ఇటుకలు వాళ్ళవే, ఎవడు ఏ పని చేసినా, ఏమని ఏ "మనీ" తీసుకున్నా అందులోంచి కొంత అదృశ్యంగా వాళ్లనే వరిస్తుంది... నదులు వాడి పెంపుడు కుక్కలవుతాయి, కొండలు వాడు కాళ్ళు తుడుచుకొనే పట్ట లవుతాయి, గాలి వాడి చుట్ట మవుతుంది, నిప్పు వాడి నేస్త మవుతుంది... ఆ కుర్చీ లంటే అంత మోజు అందుకే మరి! ఆ కుర్చీ లెక్కగానే అన్నీ వాడి సొంత మవుతాయి... నీ వోటును వాడు నోటుగా మార్చేసాడు, పైగా వా డంటాడు నీ ఓటు రేటు పెంచటానికే పంచభూతాల్ని నోట్లుగా మార్చుకుంటున్నా డట! ఒరే నాయనా, అది నోటు కాదు- నీ నోట్లో కుక్కుతున్న మత్తు బిస్కెట్టు, నీ బుర్రను చెడగొట్టే ఒక తియ్యని విషం బొట్టు... నాలుగు రోజులు పొతే చాలు నీవు నిలబడటానికి నేల కనబడదు, తాగటానికి నీరు దొరకదు, పీల్చటానికి గాలిలో ఆక్సిజన్ ఉండదు, తినబోతే పరమాన్నంలా కనిపించే గరళం, చావబోతే చంపకుండా నరకం చూపించే కల్తీ ఔషధం... మన కళ్ళ ముందే వెధవలు ఎలా కొట్టుకుంటున్నారో చూడు, ఆ కుర్చీల కోసం ఆ మహిమల కోసం మనల్ని నోటులా మడత పెట్టి ఎలా పర్సులో పెట్టుకుంటున్నారో చూడు... ఒక్కసారి కళ్ళను పీకి సరిగ్గా నాటుకోవడం నేర్చుకో నీకు, నీ ముందు తరాలకు చూపు జాగ్రత్తగా పెంచుకో ఓటును మాంఛి పదునైన కత్తిలా మార్చు, వాడిని వాడి గణాల్ని వాడి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తెగటార్చు!

5, మార్చి 2019, మంగళవారం

దయచేసి సభలలో ముఖ్య అతిథి,ప్రధాన అతిథి అని పిలవకండి. అకస్మాద్గృహ మాయాతః - సోఽతిథిః ప్రోచ్యతే బుధైః' -- ఊరుపేరు తెలియనివాడు, ఆకస్మికముగా (భోజనార్థము) ఇంటికి వచ్చినవాడిని అతిథి అంటారు.కాలనియమము లేక అన్నార్థియై వచ్చినవాడు అని అతిథి పదానికి ఇంకొక అర్థం. మన సభలకు వచ్చే ప్రముఖుడు తిండికి లేనివాడు కాడు.ఆకస్మికంగా వచ్చిన వాడు కాడు. అన్నార్థి కాడు.మనం ఆహ్వానిస్తే వచ్చినవాడు.కనుక దయచేసి సభలలో ముఖ్య అతిథి,ప్రధాన అతిథి అని పిలవకండి.భాషను అవమానించకండి. ముఖ్య వ్యక్తి, ప్రధాన వ్యక్తి అని పిలుచుకోవచ్చు.

2, మార్చి 2019, శనివారం

నిజమైన స్నేహం అనేది ధృఢమైన ఆరోగ్యం వంటిది, పోగోట్టుకున్నాక గాని దాని విలువ మనకు అర్ధం కాదు. నా స్నేహితులే నా సమస్తం,ప్రపంచం,ఐశ్వర్యం,జీవన పరమార్ధం . ప్రపంచమంతా నిన్నొదిలి వదిలి ఒంటరిని చేసి వెళ్ళిపోయినప్పుడు నీ చెంత నిలబడి, అక్కున చేర్చుకొని అభయం ఇచ్చి, కన్నీరు తుడిచేవాడే నిజమైన స్నేహితుడు. నీ హృదయం లో పలికే అనురాగపూరిత ,స్నేహమయ సంగీతాన్ని అర్ధం చేసుకొని,ఆస్వాదిస్తూ, నువ్వు మర్చిపోయి,మాటల కోసం తడబడుతున్నప్పుడు,అందుకునేవాడే నిజమైన స్నేహితుడు. నిన్ను నువ్వు నమ్మడం మానేసాక కూడా నిన్ను నమ్మేవాడే నిజమైన స్నేహితుడు. ప్రేమతో కూడిన ఆలింగనం లక్ష మాటల కంటే గొప్పది. స్నేహితుడు అంతకంటే గొప్పవాడు. మనలో ఎంతమంది నిజమైన స్నేహితులుగా వున్నామో,ఎంతమందికి నిజమైన స్నేహితులు వున్నారో ఆత్మ పరిశీలన చేసుకుందాం.

21, ఫిబ్రవరి 2019, గురువారం

సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో పరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై శ్రీమన్నారయణుండు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖియైన లక్ష్మీదేవికి కూడా జెప్పక, శంఖ చక్ర గదాది ఆయుధములను జేపట్టక, పరివారంబును పిలువక, తనవాహనమైన గరుడునిపై గూడ నధిరోహింపక, జారిన జుట్టును గమనింపక, వేడుకలో లక్ష్మీదేవి కొంగుతో ముడివేసిన యామె పైటకొంగునుకూడ గమనింపక తొందరపాటుతో యీడ్చుచునే బయలుదేరెను. అట్టి భక్తజనోద్ధారుకుడైన శ్రీమన్నారాయణుడిట్లు సమస్త జంతుకోటి హృదయములందు అమరియున్నవాడై, ఆకాశంబు వేంచేయుచున్న సమయంబున కారణము తెలియక పతిని వెంబడించుచు లక్ష్మీదేవియు, ఆమెనుగూడి యామె అంత:పురజనుంబులు, వారివెనుక గరుత్మంతుడు, యాతని వెనుక విల్లును, కౌమాదకీ, శంఖచక్రగదాధి ఆయుధంబులునూ, నారద మహర్షియునూ, విష్వక్సేనుడును తోడుగా వచ్చిరి. వైకుంఠపురమందలి ఆబాలగోపాలమంతయు అబ్బురపడుచు అరుదెంచిరి.

కలియుగ ధర్మం దాతా దరిద్రః కృపణో ధనాఢ్యః పాపీ చిరాయుః సుకృతీ గతాయుః రాజా అకులీనః సకులీనసేవ్యః షడౌగుణో కలియుగమాశ్రయంతీ దాత అయినవాడు దరిద్రుడు అవుతాడు, లోభి ధనవంతుడవుతాడు పాపి చిరాయువు, పుణ్యము చేసినవాడు అర్ధాయుష్షు వాడవుతాడు చదువురానివాడు గద్దె ఎక్కి పాలకుడు అవుతాడు, పండితుడు సేవకుడవుతాడు ఈ ఆరుగుణాలు కలియుగాన్ని ఆశ్రయించివుంటవి

20, ఫిబ్రవరి 2019, బుధవారం

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది .🎶💞 జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది❤️❤️ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది🎵❤️ కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై🎶💞 మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల💞 నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని🎵❤️ రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని❤️❤️ జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై🎶❤️ మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిసినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల❤️❤️ చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది🎵❤️ గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హ్రుదయమే నా లోగిలి❤️❤️ నా హ్రుదయమే నా పాటకి తల్లి నా హ్రుదయమే నాకు ఆలి నా హ్రుదయములో ఇది సినీవాలి జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది❤️❤️ జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది Movie : Chakram Lyrics : Sirivennela Music : Chakri Singer : Sri Kommineni