25, సెప్టెంబర్ 2014, గురువారం

ఒకసారి వాయిదా వేసిన పని అసలు భవిష్యత్తులో మళ్లీ చేసే అవకాశమే రాకపోవచ్చు !! వాయిదాలమనస్తత్వం మనల్ని ఒక కంఫర్ట్ జోన్ లోకి నెట్టేస్తుంది , మన అభివృద్ధి కుంటు పడుతుంది

ధనం శాశ్వతం కాదు

*ధనం వా పురుషో రాజన్ పురుషం వా పునర్ధనమ్|
అవశ్యం ప్రజహాత్యేవ తద్విద్వాన్ కో2నుసంజ్వరేత్||
**ధనం శాశ్వతం కాదు. అభిమాన ధనం శాశ్వతం. కొంతవరకు తను అనుభవించాలి. కొంతకు కొంత ఇతరులకు పంచివాళ్ళ అభిమానాన్ని సంపాదించాలి. మొండిగా(మూర్ఖునిలా) తయారు కాకూడదు.
రామాయణం
పుత్రులు జన్మించిన పదకొండు దినముల పిమ్మట దశరథుడు వారికి జాతకర్మనామకరణోత్సవములను నిర్వహించెను. కులపురోహితుడైన వసిష్ఠుడు ఉత్తమ గుణములుగల జ్యేష్ఠకుమారునకు ‘రాముడు’ అనియు, కైకేయి సుతునకు ‘భరతుడు’ అనియు, సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనియు నామకరణములు జేసెను” అని ఉన్నది. రామ అను శబ్ధానికి గల అర్థం సరిగ్గా కుదురుతుందని కులగురువు పెట్టిన పేరు.
ఆ పద్దెనిమిదవ సర్గలోని 8, 9వ శ్లోకాలలోని వివారలను బట్టి ఆయన జన్మలగ్నకుండలిలో రవి మేషంలోనూ, గురుడు కర్కాటకంలో, శని తులారాశిలో, కుజుడు మకరంలో ఉచ్ఛస్థానాల్లో ఉన్నారు. గురు గ్రహానికి ఉన్న పేర్లలో ఆంగీరస ఒకటి – అంగీరసుని పుత్రుడు కాబట్టి. శనిగ్రహానికి మంద అనే పేరు ఉన్నది – మంద గతితో కదులుతాడు కాబట్టి. కుజుడికి ఉన్న ఒక పేరు అంగారకుడు. ఉచ్ఛస్థానాల్లో ఉన్న ఆయా క్రమంలోని గ్రహాలు అంటే ‘రవి’, ‘ఆంగీరస’, ‘మంద’ మరియూ ‘అంగారక’ గ్రహాల పేర్లలోని మొదటి శబ్ధాలను కలిపితే ‘ర్‌‘ + ‘ఆ‘ + ‘మ్‍‘ + ‘అ‘ = రామ. ఇలా కూడా ఆయనకు పెట్టిన ఆ పేరు వెనుకనున్న రహస్యాన్ని కొందరు పండితులు వివరించారు. నమ్మడం నమ్మకపోవడం వేరే విషయం. విషయ పరిజ్ఞానం ఉంటే ముక్కున వేలేసుకోవాల్సిందే! కాబట్టి ఆ పేరు వెనుక ఏ సందేహమూ లేదు.
బల రాముడు, పరశు రాముడూ ఉన్నారు కానీ రాముడు అంటే దశరథ నందనుడైన శ్రీ రాముడే!

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతం

పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతం;
అధవా పున రాయాతి జీర్ణం, భ్రష్టాచ ఖండశః

భావము: పుస్తకం, స్త్రీ, డబ్బు పరాయి చేతుల్లోకి వెళ్ళితే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపో ఖగపతి అమృతము తేగా
బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగమొక్కై జన్మించెను
పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

భావము: గరుత్మంతుడు అమృతం తీసుకొస్తుండగా అది బుగబుగమని భూమిపై పడి పొగాకు మొక్కగా మొలిచింది. అందుకే పొగత్రాగనివాడు దున్నపోతై పుడతాడు అని కవిభావన.యి వస్తుంది, డబ్బు విడతలు విడతలు గా వస్తుంది.
http://www.www.andhrabharati.com/dEshi/strIlapATalu/gOvupATa.html.com/kavitalu/yeMki/index.html

వారిజాక్షులందు వైవాహికములందు

వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంక వచ్చు నఘము వొంద దధిప !!

20, సెప్టెంబర్ 2014, శనివారం

చావును కూడా చంపాలంటే నలుగురికోసం బతికి చూడు

చావును కూడా చంపాలంటే నలుగురికోసం బతికి చూడు... ఓటమిని ఓడించాలంటేగెలిచేవరకూ ఎదురు చూడు

నీవు తినే అన్నాన్ని నువ్వే హరాయించుకోవాలి.

నీవు తినే అన్నాన్ని నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాన్ని నువ్వే భరాయించుకోవాలి !