26, ఏప్రిల్ 2016, మంగళవారం

పసి తనంలో గుడిలో నాన్న భజాల పైకి ఎక్కి దేముడిని చూసాననుకున్నానుగాని....సాక్షాత్ దేముడి భుజాల పైకి ఎక్కి రాతిబొమ్మను చూస్తున్నానని తెలుసుకోలేకపోయాను....వయసువచ్చి తెలిచే తప్పటకిి నాన్న దూరమయ్యారు....
అదే నాన్న దూరమైతే...ఏ వ్యక్తి నీ నాన్నా అనిపిలువలేము...లోకం వప్పుకోదు.....ఆ పిలుపు ఒక్క రక్తం పంచి ఇచ్చిన నాన్నకే సొంతం...ఇదే   లోకంలో ఏతల్లికి లేని ... కన్నతండ్రి కి మాత్రమే ప్రత్యేకం....అటువంటి తండ్రిని బ్రతికుండగా...గుర్తించక ...వ్యవహరించే వారు ,పిదప బాధ పడినా ప్రయోజనం శూన్యం... ------------------ఇది ఒక నాన్న ఆవేదనకు అక్షర రూపం....
నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,

అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో.

అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో.
నాన్న ఎప్పుడూ తుంటరివాడే

కని,పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది,

నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.

కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని

ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?

పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,

కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.

సేవచేయటం అమ్మవంతు,

సరిచేయటం నాన్నతంతు.

అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,

నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు
దోషాలుకూడా కనబడుతాయి.

ప్రేమించటం అమ్మవంతు అయితే,
దీవించటం నాన్నవంతు.

ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం నాన్నవంతు.

అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,

నాన్నదీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.

అమ్మగుండెలో పిల్లల సుఖానికి
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.

నాన్నగుండెలో పిల్లల క్షేమానికి
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.

అమ్మఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,

నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.

కనిపించే ఆరాటం అమ్మది,

కనిపించని పోరాటం నాన్నది.

అమ్మకి లైకులెక్కువ,

నాన్నకి షాకులెక్కువ.

అమ్మ ఏడవటం కనిపిస్తుంది,

నాన్నఎద చెరువవటం కనిపించదు.

గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,

గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.
పిల్లలకోసం కన్నీరు పెడుతుంది అమ్మ.    తన కన్నీరును కూడా దాచి చెమటగామార్చికష్టించి పిల్లలకు జీవితాన్ని ఇస్తాడునాన్న....
పిల్లల జీవితానికి అమ్మ ఒకకళ అయితే,
నాన్న వెల వెల

నాన్న ఎప్పుడూ తుంటరివాడేకనిపించే

 దేవత అమ్మ అయితే,

కనపడని దేవుడు నాన్న.

పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి,

నాన్నకు మాత్రం అన్నీ నాస్తి.

 ( నాన్న ).

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

లోకవాక్యం:
-----------
మిత్రుని విపత్తునందు గ
ళత్రమును దరిద్రదశను భ్రాతలగుణమున్
బాత్రాది విభక్తంబున
గోత్రను గనుగొనగవలయు గువ్వలచెన్నా!!

భావం:- అసలు సిసలు మిత్రుల గుణం విపత్తులు వచ్చునప్పుడు కనిపిస్తుంది. దరిద్ర దేవత గుమ్మంలో ఉన్నప్పుడు పెళ్ళాం గుణం కనిపిస్తుంది.అన్నదమ్ముల గుణాలు పంపకాలప్పుడు బయట పడతాయి.
సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా ||సిగలోకి||
పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసి మమతలు రోసి మనుగడ మసిచేస్తావా
తనువు చిక్కి శల్యంబైనా తలుపులణగిపోయేనా
ఇరువైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా ||సిగలోకి||
తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
కోరినది చేతికి చిక్కి ఆరుతున్నదొక దీపం
కోరినది చేతికి రాక ఆరకున్నదొక తాపం
ఆరకున్నదొక తాపం ||సిగలోకి||
అంధుని ఎదుట అందాలేలా?
అడవికి పున్నమి వెన్నెలలేలా?
అసమర్ధునికవకాశాలేలా?
వృధా వృధా బ్రతుకు వృధా
--ఆత్రేయ,ఘంటసాల,కేవిమహదేవన్,సుమంగళి 1965

9, ఏప్రిల్ 2016, శనివారం

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా      
   
 వీర రక్తపుధార వార వోసిన సీమ                                    
 పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
 బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్
 తాండ్ర పాపయ కూడ నీవోడోయ్

 నాయకి నాగమ్మ,మల్లమాంబ ,మొల్ల
 మగువ మాంచాల నీ తోడ పుట్టిన వొళ్ళే
 వీర వనితల కన్న  తల్లేరా థీరమాతల జన్మభూమేరా

 కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ
 తుంగభద్రా తల్లి పొంగి పారిన చాలు
 ధాన్యరాశులు పండు దేశాన
 కూడు గుడ్డకు కొదవ  లేదోయి

 ముక్కోటి బలగమొయ్ ఒక్కటై మనముంటే
 ఇరుగు పొరుగూలోన ఊరు పేరు౦టాది
 తల్లి ఒక్కటే నీకు తెలుగోడా
 సవతి బిడ్డల పోరు మనకేలా

 పెనుగాలి వీచింది అణగారి పోయింది
 నట్టునడి సంద్రాన నావ నిలుచుండాది
 చుక్కాని బట్టరా తెలుగోడా
 నావదరి చేర్చరా మొనగాడా
--- వేములపల్లి శ్రీకృష్ణ ,ఘంటసాల,పల్లెటూరు 1952