23, మే 2016, సోమవారం



రాయలు మా కాపు అంటారు వేరొకరు
బ్రహ్మన్న మావాడు అంటారు ఇంకొకరు
కవిదిగ్గజాలు మా వారు అని ఒకరు
వేమన్న మావాడు అని వేరొకరు
వీరబ్రహ్మము మావాడు అని మరి ఒక్కరు
అంబేద్కరు మావాడు అంటారు మరి ఒకరు
జాతికే వన్నె తెచ్చిన వజ్రాలు వారు
కులము పేరు చెప్పి తుళ్ళి పడబోకు
నీ వెనుకబాటుతనము వారికెందుకయ్యో
అంట బోకు వారి పేర్లను కలలోన
వీర విక్రమ దీక్షా స్పూర్తులతోడ
జాతి తేజము వెలుగంగ జేసిన
ఘనులకు కులమన్నది లేదాయె ఎపుడు
జాతి రత్నాలకు కులగజ్జి అంటిచబోకయ్యొ

10, మే 2016, మంగళవారం



" చెల్లియో చెల్లకో తమకు సేసిన యెగ్గులు సైచిరందరున్ ,
తొల్లి , గతించె; నను దూతగఁ బంపిరి సంధిసేయ , నీ
పిల్లలు పాపలున్ బ్రజలు పెంపు వహింపఁగ సంధిసేసెదో,
యెల్లి ,రణంబెఁ గూర్చెదవొ , యేర్పడఁ జెప్పుము? కౌరవేశ్వరా!
.
" అలుఁగుటయే యెఱుంగని మహా మహితాత్ముఁ డజాత శత్రువే
యలిగిన నాడు సాగరములన్నియు యేకముఁ గాక పోవు; క
ర్ణులు పదివేవురైన యని జత్తురు ,నొత్తురు ,రాజరాజ! నా
పలుకుల విశ్వసింపుము! విపన్నుల లోకులఁ గావు మెల్లరన్;
.
" జండాపై కపిరాజు ముందు శితవాజి శ్రేణియుం బూన్చి నే
దండంబున్ గొని దోల స్యందనము మీదన్నారి సారించుచున్
గాండీవంబు ధరించి ఫల్గుణుఁడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱలాలకిపడు ; కురుక్ష్మానాధ! సంధింపఁగన్ !
నను దూతగఁ బంపిరి సంధిసేయ!

4, మే 2016, బుధవారం



 సృష్టికర్త ఒక బ్రహ్మ
 అతనిని సృష్టించినదొక అమ్మ  ॥
 ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
 ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో  ॥

 చరణం : 1

 బొట్టుపెట్టి పూజచేసి
 గడ్డి మేపి పాలు తాగి
 వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోతకోత  ॥
 విత్తునాటి చెట్టు పెంచితే...
 చెట్టు పెరిగి పళ్ళు పంచితే...
 తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మితే
 లోకమా ఇది న్యాయమా? (2)  ॥

 చరణం : 2

 ఆకుచాటు పిందె ముద్దు
 తల్లిచాటు బిడ్డ ముద్దు
 బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు  ॥
 ఉగ్గుపోసి ఊసు నేర్పితే...
 చేయిబట్టి నడక నేర్పితే...
 పరుగు తీసి పారిపోతే
 చేయిమార్చి చిందులేస్తే
 లోకమా ఇది న్యాయమా? (2)  ॥
డ్