23, మార్చి 2017, గురువారం

నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,

అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో.

నాన్న ఎప్పుడూ తుంటరివాడే,

అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో.

కని,పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది,

నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.

కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని

ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?

పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,

కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.

సేవచేయటం అమ్మవంతు,

సరిచేయటం నాన్నతంతు.

అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,

నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు
దోషాలుకూడా కనబడుతాయి.

ప్రేమించటం అమ్మవంతు అయితే,
దీవించటం నాన్నవంతు.

ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం నాన్నవంతు.

అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,

నాన్నదీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.

అమ్మగుండెలో పిల్లల సుఖానికి
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.

నాన్నగుండెలో పిల్లల క్షేమానికి
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.

అమ్మఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,

నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.

కనిపించే ఆరాటం అమ్మది,

కనిపించని పోరాటం నాన్నది.

అమ్మకి లైకులెక్కువ,

నాన్నకి షాకులెక్కువ.

అమ్మ ఏడవటం కనిపిస్తుంది,

నాన్నఎద చెరువవటం కనిపించదు.

గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,

గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.

పిల్లల జీవితానికి అమ్మ ఒకకళ అయితే,
నాన్న తళతళ.

కనిపించే దేవత అమ్మ అయితే,

కనపడని దేవుడు నాన్న.

పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి,

నాన్నకు మాత్రం అన్నీ నాస్తి....

19, మార్చి 2017, ఆదివారం

https://drive.google.com/open?id=0B8VeAg1T0udMLUJmRXJPcGo4V2s.......

చందమామ కథలు pdf

శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా



శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా.. జీవేశ్వరా
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...

చరణం 1 :

ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...

నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
విని తరించరా ...

శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...

చరణం 2 :

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు

పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా

నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..

శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా... శంకరా... శంకరా...
Naveen Kumar:
నిన్నే నీవెరుంగమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి,
ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మ ఫలమొసగు కర్మ భూమి,
గుడి పావురాలకై తొడగోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి,
కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతిపితను గన్న జన్మభూమి.సహజముగ పండు నేలలు చాల గలిగి,జీవధారలు ప్రవహించు చేవ గలిగి
అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి
ధరణి నేలెడు స్వామి నా భరతభూమి!
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై |2|
మల్లెల దారిలో మంచు ఏడారిలో |2|
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై |2|
మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప వూరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తన్మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|


18, మార్చి 2017, శనివారం

చెయ్యెత్తి జే కొట్టు...శ్రీకృష్ణ

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!
                           
సాటిలేని జాతి-ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు-నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి||

వీర రక్తపుధార-వారబోసిన సీమ
పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి||

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనితల గన్న తల్లేరా!
ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి||

నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం
భావాల పుట్టలో-జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు
శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి||

దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు
మనుషులన్నమాట మరువబోకన్నాడు
అమరకవి గురజాడ నీవాడురా
ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి||

రాయలేలిన సీమ-రతనాల సీమరా
దాయగట్టె పరులు-దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా
వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి||

కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు
ధాన్యరాశులే పండు దేశానా!
కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి||

ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే
ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి||

పెనుగాలి వీచింది-అణగారి పోయింది
నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది
చుక్కాని బట్టరా తెలుగోడా!
నావ దరిచేర్చరా మొనగాడా!!
!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||

16, మార్చి 2017, గురువారం

****** శవం ********
    శవమే కదా అని టన్ను కట్టెలలో కాల్చకు
     ఆరడుగుల గోతిలో తోయకు దాన్ని
     శవానికి  విలువ కట్టే గీటురాయి లేదు
      షరాబు దైనా గరీబుదైనా
       శవాల విలువ ఒక్కటే సుమా
       నేత్ర దానం చేసి చూడు
     మీలోని ఇరువురి అంధులకు
         చూపునిచ్చే శవానికి విలువ కట్టే
         షరాబు కలడా
       శవాన్ని వైద్యకళాశాలకు దానం
         చేసిచూడు
        విద్యార్దులకు శవం ఒక ప్రయోగశాల
       కోసి లోనున్న భాగాలను చూసి వారు పొందే
        జ్ఞానానికి  విలువ కట్టే            
             షరాబు కలడా
       చులకనగా చూడకు శవమే కదా అని
 దాని విలువ కట్టే తూకపు రాళ్ళు నివద్ద లేవోయ్
           ******** హరి*********

15, మార్చి 2017, బుధవారం

''సాహితీ సేవ''వారికి నా వందనాలు ....నాకీ అవకాశం ఇచ్చి నన్ను మీ ముందుంచిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు .
ఈ రోజు మీతో పంచుకొనే అంశం ''మనసు కవి ఆత్రేయ గారు ''

ఆచార్య ఆత్రేయ గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత,

నిర్మాత మరియు దర్శకులు. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు

రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు.

విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.

ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించిన ప్రస్తావన ఉండటం వలన ఆయన మనసు కవి, మన 'సుకవి'

అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి,

దర్శకత్వం కూడా చేసాడు.

చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకొని మనసు కవి గా ప్రజల మన్ననలు పొందారు

తెలుగు సినీ సాహిత్య చరిత్రలో భావాన్ని ప్రేక్షకుడి మనసుకి సూటిగా తాకేట్టు చేయడంలో ఆత్రేయ స్థానం అనితర సాధ్యం. భాష చేత భావాలకు ఆయన ఎప్పుడూ వెట్టిచాకిరీ చేయించుకోలేదు. అయినా పదాలు ఆయన చేతిలో అతి అందంగా అమరిపోయాయి. ఒదిగిపోయాయి. ఒదుగు, ఒడుపు, జగి జిలుగులతో అతి చాకచక్యంగా పట్టుకోవడంలోనూ, ఆకట్టుకోవడంలోనూ ఆయన సిద్దహస్తుడే కాదు, ప్రసిద్ధ హస్తుడు కూడా.
ముఖ్యంగా మనిషి, మనసు, మమత, దేవుడు, విధి మీద రకరకాల ప్రయోగాలతో ఆత్రేయ రాసినన్ని పాటలు మరొకరు రాయలేదు.
ఉదాహరణకి ...............

పశువుల కన్నా పక్షుల కన్నా మనషిని మిన్నగ చేశాడు.
బుద్దిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు.
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధే రాక
నరుడే ఈ లోకం నరకం చేశాడు.
(దేవుడనేవాడున్నాడా - 'దాడుగుమూతలు')

మహాత్ములైనా దురాత్ములైనా మనుజుల పేరనే మసలేరయ్యా.
అందరికీ నీ అభయం కలదని అనుకోమందువా

దేవా
(వెలుగు చూపవయ్యా - 'వాగ్దానం')

ఒకడి ఆకలికి అంబలి నీళ్ళు ఒకరికి పాలు పళ్ళు
భలేభలేగా దగాల దేవుడ బాగా పంచేవు
కోతికి బాబనిపించేవు ఓ బ్రహ్మయ్య
నీ లీలలే గడబిడ ఎడపెడ నీ గడాబిడా మా కెడాపెడా
(ఓ బుచ్చిబాబు - 'నాటకాల రాయుడు')

ఇక మనుషుల తత్వాల గురించి:

తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
(దేవుడునే వాడున్నాడా - 'దాగుడుమూతలు')

మాటలలో చిక్కుపడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతిగుండె బాధతో నిండినది
ఒలికే ప్రతి కన్నీటికి చుక్క వెచ్చగా ఉంటుంది
(బ్రతుకు పూలబాట కాదు - 'భార్యాబిడ్డలు')

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి
(నేను పుట్టాను - 'ప్రేమ్_నగర్')

మంచివాడికి, చెడ్డవాడికి తేడా ఒకటే బాబూ
మంచివాడు మనసున అనుకుంటాడు చెడ్డవాడు చేసే చూస్తాడు
(మనిషి మనిషికి తేడా ఉంది - 'పాప కోసం')

ఇక మనసు గురించి ఆత్రేయ మధన పడ్డంతగా మరొకరు కనిపించరు మనకి. ఒకటా... రెండా... ఎన్నో....ఎన్నెన్నో...

ఒక్క క్షణం మనసుకి మాటలు తడితే జలజల జాలువారిపోతాయి ఆయన పాటలు.

ఒకరికిస్తే మరలిరాదు, ఓడిపోతే మరచిపోదు.
గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకుపడదు.
(మనసుగతి ఇంతే - 'ప్రేమ్_నగర్')

ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే
లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
(మౌనమే నీ భాష - 'గుప్పెడు మనుసు')

వలచుట తెలిపిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా
(నీ సుఖమే నే కోరుతున్నా - 'మురళీకృష్ణ')

కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం
(మనసు లేని బ్రతుకొక నరకం - 'సెక్రటరీ')

వయసు కోతి వంటిదీయ మనసు కొమ్మ వంటిదీ
ఊపేసి పోతుంది మొదటిదీ,
ఆ ఊపు మరువనంటుంది రెండవది
(వయసు కోతి వంటిదీ - 'అగ్నిపూలు')

తనువుకు ప్రాణం కాపలా - మనిషికి మనసే కాపలా
ఎవరి ప్రేమకు నోచని నాడు కన్నీరేరా నీకు కాపలా
(ఎవరికి ఎవరు కాపలా - 'ఇంటికి దీపం ఇల్లాలే')

మనిషికి మనిషికి మమత కూడదా
మనసు తెలుసుకొను మనసే లేదా
(ఎవరో జ్వాలను రగిలించారు - 'డాక్టర్ చక్రవర్తి')

మనసు మూగదే కానీ బాసుంటది దానికి
చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ
(ముద్దబంతిపూవులో - 'మూగమనసులు')

మడిసితోటి ఏలాకోలం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా
(మాను మాకును కాను - 'మూగమనసులు')

వయసు పెరిగినా మనిషి ఎదిగినా
మనసు ముదరనంత వరకు మాసిపోదు పసితనం
(వయసు పెరిగినా - 'ప్రాణమిత్రులు')

ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదూ
మోడు కూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం(అటు ఇటు కాని - 'ఇది కథకాదు')

విధి, సమాజం, ఖర్మ, బలహీనతలు వీటి పోకడల మీద ఆత్రేయ ఎన్నో విసుర్లు విసిరాడు. ఒక్కోసారి విరుచుకు పడ్డాడు. మరోసారి విజ్ఞత తెలియజెప్పాడు. అయితే ప్రతిసారీ బాధ్యతను గుర్తు చేశాడు. ఎలా అంటే -

కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచీ
గనులూ తొలిచీ చెమట చలువను చేర్చిరాళ్ళను తీర్చినారు తెలుసుకో.
(కారులో షికారుకెళ్ళే - 'తోడికోడళ్ళు')

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
(నీ సుఖమే నేను కోరుతున్నా - 'మురళీకృష్ణ')

ఇరవైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా?
(సిగలోకి విరులిచ్చి - 'సుమంగళి')

కళా జీవితం లక్కు ఒక ట్రిక్కు ఒకరికి లక్కు - ఒకరికి ట్రిక్కు
(ఓ బుచ్చిబాబు - 'నాటకాల రాయుడు')

తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
(రాయిని ఆడది చేసిన - 'త్రిశూలం')

ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా
(సాపాటు ఎటూ లేదు - 'ఆకలిరాజ్యం')

పిచ్చిపిచ్చిపిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకంటే అది అచ్చమైన పిచ్చీ
(పిచ్చిపిచ్చిపిచ్చీ - 'విచిత్ర వివాహం')

రాతి అందాలన్నీ నాతిలో చెక్కి
తీరని కోర్కెలే తీర్చుకున్నాడేమో
(ఆనాటి మానవుడు - 'సుమంగళి')

ప్రేమనేది ఉన్నదా
అది మానవులకే ఉన్నదా
హృదయముంటే తప్పదా
అది బ్రతుకు కన్నా గొప్పదా
(మనసులేని దేవుడు - 'ప్రేమలు - పెళ్ళిళ్ళు')

కర్మను నమ్మినవారెవరూ కలిమిని స్థిరమనుకోరు, కళ్ళు మూసుకోరు.
కావాలని నిప్పు తాకితే చేయి కాలక మానదు
అలా కాలినందుకు ఖర్మే అంటే గాయమేమీ మానదు.
(కనబడని చెయ్యి ఏదో - 'తాశిల్దారుగారమ్మాయి')

ప్రేమ, పెళ్ళి, రెండు హృదయాల పరస్పర స్పందనపై - ఆత్రేయ అందించిన అనుభూతి తల్చుకున్నప్పుడల్లా మనసు అట్టడగు అంచులు కూడా పులకరించిపోతాయి.

నీ వలపు వాన కురిసి కురిసి తడిసి పోనీ
తడియారని హృదిలో నను మొలకలెత్తనీ
(తెల్లవారనీకు ఈ రేయినీ - 'ఆత్మబలం')

జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
(చిటపటచినుకులు - 'ఆత్మబలం')

పెమిదను తెచ్చి ఒత్తిని యేసి చమురును పోసి బెమసూసేవా
ఇంతా చేసి ఎలిగించేందుకు ఎనక ముందూలాడేవా
(మాను మాకును కాను - 'మూగ మనసులు')

నన్నిడిచి నువ్వెళితె నీ వెంట నేనుంట
నిన్నిడిచి నే వెళితె నువ్వ బ్రతకలేవంట
ఇది నీగొప్పా నాగొప్పా కాదు పిల్లోడా
ప్రేమంటే అంతేరా పిచ్చివాడా
(ఎక్కడికి పోతావు చిన్నవాడా - 'ఆత్మబలం')

ఇక పడుచుదనం, కుర్రతనం మీద ఆత్రేయ పంచకళ్యాణి గుర్రంలా ఎంతగా కదనుతొక్కిందీ, ఎంతగా పదనుచూసిందీ,

ఎంతమందిని వెర్రెక్కించిందీ చెప్పాలంటే ఆ ఉదాహరణలు కోకొల్లలు.

దోరవయసు, అలవికాని భారమయింది.
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది.
(మిడిసి పడకు అత్తకుతురా - 'ఆస్తిపరులు')

బిగదీయకు బిగదీయకు పైట కొంగును
ఎంత బిగదీస్తే బిగువులన్నీ బైటపడేను

(ఓహోహో వయ్యారి - 'సుపుత్రుడు')

పడుచు పిల్ల పయ్యెదలా పలుచని వెలుగే పరిచినదీ
కొండల కోనల వలుపుల్లో కొత్త వంపులే చూపినదీ
(ఈ ఉదయం నా హృదయం - 'కన్నెమనసులు')

ఎవరో చెపితే విన్నాను విన్నది నీతో అన్నాను నాకూ ఇంతే తెలిసినదీ
నీకే తెలియును మిగిలినదీ
(ఎన్నో రాత్రులు వస్తాయి - 'తోడూనీడా')

తేటి ఎగిరిపోతుంది పువ్వు మిగిలిపోతుంది.
తేనె ఉన్న సంగతి తేటి గురుతు చేస్తుంది
(ఇదేనన్న మాట - కొడుకుకోడలు)

ఇది చదువుల్లో ఎక్కడా చెప్పలేదే
చెప్పందీ చేసినా తప్పుకాదే
(పడ్డావటే పిల్లా - 'బ్రతుకే ఒక పండుగ')

పడుచుదనం పందెమెత్తి వలపు జూదం ఆడుకోవాలి.
నాకు నువ్వు నీకు నేను రోజురోజూ ఓడిపోవాలి.
(వెచ్చవెచ్చనీ నీ ఒడిలో - 'శభాష్ వదినా')

నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటీ
వేయించి నేనే ఓడి, పోనీ పొమ్మంటీ
నేనోడి నీవే గెలిచి నీ గెలుపునాదని తలచి
రాగాలే రంజిలు రోజే రాజీ రమ్మంటీ
(రేపంటి రూపం కంటి- 'మంచిచెడు')

మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి.
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి
కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి
తొలినాడే చల్లబడి పోవునమ్మాయి
(గిల్లికజ్జాలు తెచ్చుకునే - 'ఆత్మబలం')

భగ్నప్రేమకు ఆత్రేయ తన పాటలతో ప్రాణం పోసి ప్రేక్షకులను కంటనీరు పెట్టించారు

కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని

(నాలుగు కళ్ళు రెండైనాయి - 'ఆత్మబలం')

కనులున్నవి కన్నీటికి కొలనుల గుటకా
(బంగారు నావా బ్రతుకు - 'వాగ్దానం')

తొలికోడి కూతల్లె వినిపించి తొలిపొద్దు వెలుగల్లే కనిపించి
తొలిజన్మ ఋణమేదో అనిపించి తెరవని తలుపులు తెరిపించి
ఎందుకు వచ్చానో ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు.
నీకైనా తెలుసునా
(ఎందుకు వచ్చానో - 'మనసు-మాంగల్యం')

అగ్గి వంటి వలపంటించి హాయిగా ఉందామనుకోకు
మనసు మంచి మనసుకి పాకి ఆరని గాయం చేస్తుంది.
రాయికన్నా రాయిని నీవు కసాయిని నీవు
(హృదయం లేని ప్రియురాలా - 'కన్నెమనసులు')

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా
(ముంద్దబంతి పూవులో - 'మూగ మనసులు')

చావు పుటక లేనిద్మ్మ నేస్తమన్నదీ
జనమ జనమకది మరీ గట్టిపడతదీ
(పాడుతా తీయగా చల్లగా - 'మూగ మనసులు')

మాటలతో, పదాలతో ఆత్రేయ పడలాస్యం చేశారు

అందుకే నేనది పొందినది అందనిదైనా అందనిది.
పొందిన పిదపే తెలిసినదీ నేనెందుకు నీకు అందినది
(అందరికీ తెలియనదీ - 'ఆస్తిపరులు')

సరిగమ వానికి సగమని తలపోయి
మురిపాలె మన జంట స్వరమైనవి
(ఏ రాగమూ ఇది ఏ తాళమూ - 'అమరదీపం')

వచ్చింది ఎందుకో తెలిసుంటే వెళ్ళవు
వెళ్ళేది తెలిసుంటే అసలొచ్చి ఉండవు
(ఎందుకు వచ్చావో - 'మనసు- మాంగల్యం')

ఇదిలా ఉండగా 'తొలికోడి కూసింది' చిత్రంలో 'పోలిసు వెంకటసామి నీకు పూజరయ్యాడు' పాటలో పూర్తిగా పోలీసు భాషనే ఉపయోగించారాయన.

ఉదహరించాలంటే - పాట మొత్తాన్ని రాయాల్సిందే. అలాగే 'అదృష్టవంతులు' సినిమాలో 'నమ్మరే నేను మారానంటే నమ్మరే' పాటలో సాహిత్యం అంతా ఓ డైలాగు చెప్తున్నట్టే ఉంటుంది.

ఎన్నో చిత్రాలకి ఆయన సంభాషణలు రాసి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసారు
ఉదాహరణకి ...................

''ఎవ్వరికీ ఇవ్వనంత వరకే హృదయం విశాలంగా ఉంటుంది.

ఒకసారి ఇచ్చాక ఇరుకై పోతుంది ఇంకెవ్వరికీ చోటివ్వనంటుంది''

''చినబాబు చెడిపోయాడేమో గాని చెడ్డవాడు మాత్రం కాదమ్మా''

''మనిషి తాను అనుకున్నట్టు బ్రతకనూ లేడు ఇతరులు అనుకున్నట్టు చావనూ లేడు''

''వీటన్నిటినీ భరించాలంటే అసలు మనిషి మీద ప్రేమ ఉండాలి''

" నేను చెడిపోయిన వాళ్ళను చేరదీశానేమో గానీ నాకు నేనుగా ఎవ్వరినీ చెడగొట్టలేదు "

" ఒకటి మీ డబ్బు ఇంకొకటి నా రాజీనామా - అంటే ఒకటి నా అధికారం ఇంకొకటి నీ అహంకారం ... అవునా ?"

" పిరికివాడెక్కడ చస్తాడు లతా ... పిరికివాడు జీవితాన్ని ప్రేమిస్తాడు. గుండె గలవాడు ప్రేమని ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు. రెండూ ఫలించని నాడు మరణిస్తాడు"

"అంతరాత్మ గొంతు ఎంతకాలం నులిమేస్తావు ? "

" సరే ... నువ్వు నీ అహంకారాన్నే కాపాడుకో ... ఎదో ఒక రోజు అది ఆత్మీయత కోసం అలమటిస్తుంది "

"నేనంటే ఏమిటో తెలియనిదాన్ని నాక్కావల్సిందేమిటో ఎలా తెలుస్తుంది ?"

" తెలుసుకున్నాక తెంచుకోవడం తేలిక "''(ప్రేమనగర్)''

''సామాన్యుడికి అందుబాటులో లేని కళ సంకుచితమై సమసిపోతుంది''
(జయభేరి)

''చావు ఎంతమందినో విడదీస్తుంది కాని కొంతమందిని కలుపుతుంది''
(మూగమనసులు)

''కన్నీరే మనిషిని బ్రతికించగలిగితే అమృతం లాగే అదీ కరవైపోయేది''

''చంద్రుడు క్షీణిస్తున్నాడని వెన్నెల వేరే చోట వెతుక్కుంటుందా?''

''కవిత్వం వేరు, జీవితం వేరు. విలువలు తెలుసుకుంటే జీవితమే ఓ మహాకావ్యం అవుతుంది''
(''వెలుగునీడలు'')

ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో .

సూళ్ళురుపేట మంగళంపాడులో 1921వ సంవత్సరం మే ఏడవ తేదీన జన్మించారాయన. మే ఏడవ తేదీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం. 'నిజమా?' అని అడిగితే 'అవును... కావాలనే ఆ తేదీ చూసుకు మరీ పుట్టాను' అంటుండే వాడాయన సరదాగా.
చిన్నప్పుడు చదువు మీదకన్నా, నాటకాల మీదనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. ఓసారి ఓ నాటకంలో మీసాలు గొరిగించుకుని నటించాడని ఇంటికి వచ్చాక గోమూత్రం తాగించి ప్రాయశ్చిత్త సంస్కారం చేశారు. అంత సంప్రదాయబద్ధమైన కుటుంబం ఆయనది. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. గోత్రనామం ఆత్రేయ కనుక ఆ పేరునే తన పేరుగా ధరించాడాయన.
ఓసారి ఓ మిత్రుడు ఆయనకి తను రాసిన కందపద్యాలు తెచ్చిచూడమన్నాడు. ఆత్రేయకు అర్ధం కాలేదు. 'ఏం చేయాలి' అని అడిగాడు మేనమామని. ఆయన కందపద్య లక్షణాలున్న ఓ పుస్తకాన్ని ఆత్రేయకి ఇచ్చి చదివి వంటపట్టించుకోమన్నాడు. ఆత్రేయ ఆ లక్షణాలన్నీ ఆకళింపు చేసుకుని - 'నువ్వు చేసిన తప్పులు ఇవీ' అని ఆ మిత్రుడికి అతని తప్పుల్ని కంద పద్యంలోనే రాసి చూపించాడు.
ఇది తెలుసుకున్న ఆత్రేయ మేనమామ 'ఒరే ....నువ్వు స్కూల్ ఫైనల్ పాసైతే నీకు సైకిల్, రిస్ట్_వాచీ, కొనిస్తాను' అన్నాడు. అంతే... వెంటనే మిత్రుల దగ్గరకెళ్ళి పాఠ్యపుస్తకాలన్నీ కాపీ చేశాడు ఆత్రేయ. అలా రాస్తుండగానే సగం పాఠాలు ఆయనకి కంఠోపాఠంగా వచ్చేశాయి. స్కూల్ ఫైనల్ పాసై మేనమామ ఇచ్చిన రిస్ట్_వాచీ పెట్టుకుని సైకిలెక్కి ఊరంతా గర్వంగా తిరిగాడు.
అయినా సరే 'నాలైను వేరే ఉంది' అని ఎప్పుడూ అనుకునేవాడు మనసులో. ఒకసారి రాజన్ అనే మిత్రుడి సాయంతో ఇంట్లోని వెండిగ్లాసు దొంగిలించి మద్రాసు బండెక్కాడు.
అక్కడ పడరాని అగచాట్లు పడ్డాడు. సబ్బులు అమ్మేవాడు. ఉన్ననాడు భోజనం - లేనినాడు కుళాయి నీళ్ళు. రాత్రిళ్ళు మద్రాసులోని మన్రో విగ్రహం దగ్గర పడుకునేవాడు. ఓసారి ఓ పావలా ఎక్కువ ఉందనిపిస్తే ఓ నోటుబుక్ కొని వీధి దీపం కింద కూర్చొని 'గౌతమబుద్ధ' అనే నాటకం రాసి యాభై రూపాయలకు అమ్మాడు. ఆ రోజుల్లోనే సినీనటుడు రమణారెడ్డితో పరిచయం ఏర్పడింది. టిఫెనుకీ, భోజనానికీ, పావలా, బేడా రమణారెడ్డి ఇచ్చేవాడు ఆత్రేయకి.
ఇలా ఉండగా 'తెనాలి రామకృష్ణ సినిమాలో వేషం ఉంది వేస్తావా' అని అన్నాడో పరిచయస్తుడు. సరేనని వెళ్ళి అక్కడ పడేసిన గుడ్డలు, బకెట్_లో వేసుకోవలసిన రంగునీళ్ళు చూసి నచ్చక వెనక్కి వచ్చేశాడు.
ఆ తర్వాత 'షావుకారు' చిత్రంలో డైలాగులు రాయడానికి కుదిరాడు. కానీ ఆరోగ్యం సహకరించక ఆయనే ఒద్దనుకున్నాడు. కొన్నాళ్ళకు 'మనోహర' చిత్రంలో డైలాగ్ అసిస్టెంట్_గా మాట సాయం చేశాడు. ఎట్టకేలకి 'దీక్ష' చిత్రంలో 'పోరాబాబు పో' పాట రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇక ఆయన చేతికి విశ్రాంతే లేకుండా పోయింది.
కొన్ని వందలు, వేలు పాటలు, మాటలు రాసిన ఆత్రేయ దర్శకుడిగా 'వాగ్దానం' చిత్రానికి దర్శకత్వం వహించాడు. నటుడిగా'కోడెనాగు' చిత్రంలో నటించాడు. ఆత్రేయ మంచి హ్యూమనిస్టే కాదు, చక్కని హ్యూమరిస్ట్ కూడా!

ఓసారి ఓ సినిమా హాల్లోంచి బైటికి వస్తున్న ఆత్రేయను చూసి ఆశ్చర్యపోతూ 'ఆత్రేయగారూ మీరు సినిమా చూశారా?' అని అడిగాడీ వ్యాసకర్త. అంత చెత్త సినిమా అది. దానికి ఆత్రేయ 'లేదు నాయనా... భరించా' అన్నాడు తడుముకోకుండా
మరోసారి ఆత్రేయ ఒక రైటర్ కి తన అడ్రసుని రాసి ఇచ్చేడు. అది చూసి అతను 'అరె... ఇది సుశీలగారు ఉండే వీధే కదండీ... ఆవిడ మీ ఇంటికి దగ్గరేనా?' అని అడిగాడు. 'అవును... ఇది వరకు ఆవిడ మా పక్కింటి అమ్మాయి,ఇప్పుడు ఎదురింటి అమ్మాయి' జవాబిచ్చాడు ఆత్రేయ చమత్కారంగా.
'అంటే.... ఆవిడ మారేరా.. మీరు మారేరా?' తిరిగి ప్రశ్నించాడీ రైటర్
'మారేదెప్పుడు ఆడవాళ్ళే... ఊ...ఊ....ఊ....మ్మగమాళ్ళు మారరు' అని అన్నాడు ఆత్రేయ అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇమిటేట్ చేస్తూ.
ఆత్రేయ అంటే చంద్రుడు అని అర్థం. అది తెలియని ఒకాయన 'ఆత్రేయ అంటే ఏమిటండీ?' అని అడిగాడు. దానికి ఆత్రేయ సమాధానం - రాత్రేయుడు'.
ఆత్రేయ 'వాగ్దానం' చిత్రానికి డైరెక్ట్ చేసే రోజుల్లో ఓసారి సెట్_లో అక్కినేని నాగేశ్వరరావుగారితో సహా అందరూ రెడీ అయి కూర్చున్నారు. ఆత్రేయ మాత్రం ఎక్కడా అయిపులేడు. ఆఖరికి అక్కినేని అటూ ఇటూ తిరిగి ఆత్రేయని పట్టుకున్నారు. ఎవరికీ కనిపించకుండా ఓ మూల కూర్చుని అప్పుడు చిత్రీకరించవలసిన డైలాగులు రాసేసుకుంటున్నాడాయన. 'ఏంటండీ ఇది.... ఏంటీ పని?'' అని మందలించారు అక్కినేని.
''అదికాదు నాగేశ్వరరావు గారూ... అందరికీ లేటుగా ఇచ్చి నా సినిమాకి నేను ముందుగా డైలాగులు రాసేసుకుంటే'స్వార్ధం' అని ప్రొడ్యూసర్లు తిట్టుకోరూ... ఆ పార్షియాలిటీ లేకుండా జాగ్రత్త పడుతున్నానండీ'' అన్నాడాయన వస్తున్న నవ్వుని ఆపుకుని సీరియస్ గా

అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.

శశిబాల
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం

మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

..ధనమేరా అన్నిటికి మూలం..

ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..

ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం

ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం

11, మార్చి 2017, శనివారం

సీ.కారణజన్ముడు కనుకనే అమరావతి నిర్మాణ రాజస తేజుడయ్యె. కారణజన్ముడు కాననే క్రిష్ణను గోదారి సంధింప సాధ్యమయ్యె. కారణజన్ముడు కాననే పోలవరజలాభిషేకాభి రాముడయ్యె. కారణజన్ముడు కాననే త్యాగంబు సలిపిరి రైతులు శంకలేక.           గీ. నింద వేయుటే ప్రతిపక్ష నియమమైన ప్రజల సంక్షేమ కర్తవ్య ప్రతిన మేర.   సకల వర్గాల ప్రజలను సమముజూచు చంద్రబాబన్నె మన నేత శాశ్వతముగ.
చిన్నప్పటి మన ఇరుకిరుకు  ఇళ్లు...
ఆనందాలు  క్రిక్కిరిసిన అందాల  జ్ఞాపకాల పొదరిళ్లు...

సరిపోవడం లేదిప్పుడు ఒక్కొక్కడికీ రెండు మూడిళ్ళు...
ఐనా సరే శరీరానికి కాక మనసుకు పడిపోతున్నాయ్ డిప్రెషన్, టెన్షన్ల పుళ్లు...

వదిలేసి వచ్చాక సంపాదిద్దామని నాలుగు రాళ్లు...
మరచిపోతున్నామిప్పుడు బతుకునిచ్చిన  ఊళ్లు...

సవాలక్ష కారణాలతో వాళ్లు వెళ్ళారని వీళ్లు,వీళ్లు వెళ్లారని వాళ్లు...
అలా వలసలు పెరిగి కళ తప్పిపోతున్నాయ్  పల్లెటూళ్ళు...

మహ గడుసువారండీ కొత్తతరం కోడళ్లు...
సిటీకి మారతానన్నాకే వేయించుకుంటున్నారు మూడు ముళ్ళు...

మొదలయ్యాక గానీ  నొప్పుల కీళ్ళు...
గుర్తుకు రావేమో జన్మనిచ్చిన ఊళ్లు...

నెత్తికెక్కి పూర్తిగా  కళ్లు...
పండక్కెళ్లడాన్నికూడా వాయిదా వేసేస్తున్నాం ఏళ్లకేళ్లు...

పొట్ట రావడమే కాదు నిజంగానే బలిసిందేమో ఒళ్లు...
అందుకే బద్ధకంతో గడిపేస్తున్నాం వెళ్లకుండా  ఏళ్లూ పూళ్ళు...

ఒక్కసారి గుర్తుకొచ్చాయా మనం చదివిన  ఆ స్కూళ్లు...
భూమ్మీద ఆగవింక  మన కాళ్లు...

ఇరవై ఎక్కాలు ఇరవైల దాకా చెప్పడంలో అప్పుడు మనం లేళ్లు...
తేడా వస్తే వెనక్కి తిప్పి కొట్టేవారు వేళ్ళు...

మందమయిపోయాయిప్పుడు మన మెదళ్ళు...
సెల్ఫోన్ కాలిక్యులేటర్లో చూస్తున్నామిప్పుడు ఎంతోనని రెండు మూళ్ళు...

కొరికినట్టు కనబడితే గోళ్ళు...
మాస్టారిచేతిలో అనేది చెంప ఛెళ్లు...

గుర్తున్నాయా పబ్లిక్ పరీక్షలు పదులూ, ఏళ్లు...
మరచిపోడం ధర్మమా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆయన చేసిన మేళ్ళు...

తన పిల్లల చదువును, భవిష్యత్తును పణంగా పెట్టి మాస్టారు మనసులో లేకుండా కుళ్లు...
డేగలా కాస్తూ చదివించేవారు దాటేదాకా అర్థరాత్రుళ్లు...

అప్పుడనిపించేవి అవి కాళరాత్రుళ్లు...
ఇప్పుడు పెడుతున్నాయి మనకూ,బిడ్డలకూ కూళ్ళు...

ఒక్కసారి ఆయనింటికెళ్ళు...
బ్లాక్ బోర్డు లాంటి మన బుర్రలో తెల్లని జ్ఞానాన్ని నింపిన బస్తాలకొద్దీ చాక్ పౌడర్ ఎఫెక్ట్ తో టీబీ వచ్చి దగ్గుతున్నారేమో అవసానదశలో ఖళ్ళూ ఖళ్లు...

గుర్తున్నాయా ఇంట్లోనే పెంచిన గేదెలూ, కోళ్లు...
వేసవిసెలవుల్లో ఆడిన అష్టాచెమ్మా, వైకుంఠపాళి గళ్ళు...

మామిడి కాయల దొంగతనాల కోత గాళ్లు...
కాపు కాసేవాడు చూస్తే చాలు వెనక్కు తిరక్కుండా పరుగెత్తేవాళ్ళు...

కులమతభేదాలెరగక నేస్తాలతోపాటు తిరిగాం చర్చిలు,మసీదులూ గుళ్ళు...
ఇప్పుడు అల్లుకున్నాం ఒకరికొకరం కలవలేని వనభోజనాలక్కూడా కులమతాల సాలె గూళ్ళు...

జంతికలూ, పప్పు బెల్లాలే కదా మనకు తెలిసిన చిరు తిళ్ళు...
మహదానందంతో చప్పరించేవాళ్లం చాక్లెట్లు కొనలేక జీళ్ళు...

ప్రతీరోజూ చెట్టెక్కి మరీ కోసేవాళ్లం జాంపళ్లు...
ఫ్రూట్సంటే తెలిసిందొకటే బయటకొనే అరటి పళ్ళు...

ఎర్రటి ఏప్రిల్ ఎండలో తార్రోడ్డు పై కాల్తున్నా కాళ్లు...
చెట్ల నీడల్లో ఆగుకుంటూ వెళ్ళేవాళ్ళం కొనే స్థోమత లేక జోళ్ళు...

అప్పుడు మా బ్యాచ్ అంతా ఏడిపించేవాళ్ళు...
ఇద్దరు ముగ్గురమున్నామని మరీ పొట్టి పిల్లోళ్ళు...

ఇప్పుడనిపించుకుంటున్నాం  పొడుగాటోళ్లు...
హైటులోనే కాదు తవికలు కూడా రాసేస్తున్నాం మైళ్లకుమైళ్లు...

చిన్నప్పటి  వరసల అల్లరి బావా మరదళ్ళు...
గుర్తొచ్చాయంటే అవి, మనసెంతో ఆనందంతో తుళ్లు...

ఆరుబయట మంచమేస్తే చందమామనూ,చుక్కలనూ చూస్తుంటే నిద్రపట్టేసేది లేకుండానే దుప్పట్లూ, దిళ్లు...
ఇప్పుడు ఏసీ ఇరవైలో ఉన్నా కలత నిద్రే నూటికి నూరు పాళ్లు...

ఎప్పుడయినా చూడాలంటే తిరునాళ్ళు...
దాటి వెళ్లాల్సొచ్చేది ఐదూళ్ళు...

తిరుగు ప్రయాణంలో పొలిమేర దాటగానే దెయ్యాల భయంతో గుంపులు గుంపులుగా యమజోరుగా  తొక్కేవాళ్లం సైకిళ్లు...
భయం పోగొట్టుకోడానికి పాటలు పాడుకుంటూ చేరుకునే వాళ్లం అర్థరాత్రిళ్ళు...

ఒకోసారి నాటకాలు, రికార్డింగ్ డాన్సులు,ఆర్కెస్ట్రాలు వదల్లేక తెల్లారిపోయేది భళ్లు...
ఆనక నాన్న చేతిలో వలిపించుకునేవాళ్లం తోళ్లు...

చుండ్రనే పదం తెలీనీకుండా కాపాడిన, వారానికోసారి బ్రహ్మ ప్రళయం తెచ్చే కుంకుళ్లు...
మరచిపోయి అయ్యింది ఎన్నేళ్ళు...

మధ్యలో వాటిని వదిలేసినందుకు గిఫ్ట్ గా వచ్చిన  బట్టతలపై ప్రతీరోజూ జార్చేస్తున్నాం షాంపూ నీళ్లు...
పిల్లలకూ అలవాటు చేయడం వలన టీనేజిలోనే తెల్లవెంట్రుకల బారిన పడిపోతున్నారు మన బుడ్డోళ్లు...

సీజనొచ్చిందా మొదలయ్యేయి పెళ్ళిళ్ళు...
పక్కూరికైనా కట్టేవాళ్ళు వరసగా ఎడ్ల బళ్ళు...

ఎక్కడ చూసినా ఉండేయి పచ్చిక బైళ్ళు...
చూసేకొద్దీ చూడాలనిపించేవి వరి నారు మళ్లు...

రియల్ వ్యాపారంతో అయిపోతున్నాయవిప్పుడు బీళ్లు...
పచ్చిగడ్డి,ఎండు గడ్లకోసం పాడి పశువులు జాలిగా తెరుస్తున్నాయి నోళ్లు...

గుర్తుకు తెచ్చుకోండి  మొదటి సినిమా చూసిన టూరింగ్ సినిమా హాళ్లు...
నేల టికెట్ కెళ్లి అక్కడ పరచిన ఇసుకలో ఆడిన గుజ్జన గూళ్లు...

ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ వీకెండ్లో మాళ్ళు...
ఉసూరుమంటూ తలనొప్పితో  మళ్లెప్పుడూ పోకూడడదంటూ శపథాలు పడుతూ   తీస్తున్నాం పార్కింగ్ లోంచి బళ్లు...

నెలకోసారైనా వెనక్కెళ్లి తిప్పండి ఆ రీళ్ళు...
ఆ జ్ఞాపకాలే రక్షిస్తాయి కాకుండా మన జీవితాల్ని మోళ్లు...

సరదాగా మొదటిసారి ఎక్కిన రైళ్లు...
పట్టాలపై నాణేలు పెట్టి రైలెళ్లిపోయాక సంబరంతో  అవి తీసి దాచుకున్నాం  ఏళ్లు...

చదూతూ పోతోంటే తిరుగుతున్నాయా జ్ఞాపకాల సుళ్ళు...
చూస్తారే  వేసుకోండిక కమెంట్ల వీరతాళ్లు...

8, మార్చి 2017, బుధవారం

ఓ మూడేళ్ళ కిందట రాసుకున్నా........

దేవుని పక్కకు నెట్టు. అమ్మకు దణ్ణం పెట్టు
అమ్మకు పెట్టిన దణ్ణమే నీకు అన్నం పెట్టు.
అమ్మను చదివితే అవనిని చదివినట్లే..
ఇక కవితలు, కావ్యాలు, ఇతిహాసాలు వృధా..

7, మార్చి 2017, మంగళవారం

మహిళో రక్షతి రక్షితః

కం.తల్లికి  బుడుతై పుడుతూ
     తల్లినొడిననుగ్గు భాష తోడ బెరిగి యా
     తల్లిన్ వృద్ధాశ్రయమున
     తల్లాడ్దుర్గతి జగతిన దాపురమయ్యెన్ !!
Amanikrishna
"భగమంతుని సేతిలో
బాససేసి సెప్తున్నా
బతికి నంతకాలమూ
జాతికి అంకితమౌతా
నీతికి కంకణ మౌతా "
••••••@గుడిసేవ