23, జనవరి 2018, మంగళవారం

కండువా లేదా ఉత్తరీయం

సంప్రదాయం ప్రకారం ఈ ఉత్తరీయం నేతతో చేసినదై అంచు కలిగి ఉండాలి.

వివాహం జరిగిన పురుషులు ఎడమ వైపున ధరించాలి అని నియమం

ఎడమ వైపున ధరించడం వల్ల ఎదుట వారిని గౌరవం ఇచ్చినట్లు తెలుస్తోంది

వివాహం నిశ్చయమైన సమయంలో ఉత్తరీయం మార్చుకునే సంప్రదాయ విధానం ఉంది

పూజా సమయంలో పురుషుడు ఖచ్చితంగా ఉత్తరీయం ఎడమ వైపున ధరించాలి

10, జనవరి 2018, బుధవారం

వేమన ఏమన్నడో విన్నారా?

స్త్రీ నెత్తిని రుద్రునకు
స్త్రీ నోటను బ్రహ్మకెపుడు సిరి గుల్కంగా,
స్త్రీ నెరి రొమ్మున హరికిని,
స్త్రీ నెడపగ గురుడవీవు దేవర వేమా!

శివుని తలపైన గంగ, బ్రహ్మ్ నాలుకపై సరస్వతి, ఇక నేరుగా హరి వక్షస్థలంపైనే లక్ష్మీదేవి నర్తిస్తుంతారు. స్త్రీకి ఎంత గౌరవమివ్వాలో ఆ దేవరలకు బాగా తెలుసు..