21, డిసెంబర్ 2020, సోమవారం

శ్మశానవాటిక (జాషువా )

శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ)
జాషువా కవీంద్రుని కలంనుండి జాలువారిన మరో అద్భుత ఖండకావ్యం శ్మశానవాటిక.

మానవులు జీవించి వుండగా వెళ్ళటానికి చూడటానికి యిష్టపడని ప్రదేశాలు రెండు.ఒకటి వైద్యశాల.రెండు శ్మశానం,/వల్లకాడు,/రుద్రభూమి.జాతస్య హి ద్రువం మృత్యు. పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు.చావును తప్పించుకున్న వాడెవ్వడూ లేడు ధరణిలో.అందరు ప్రస్దానముకేగవలసిన వారే.అయినను శ్మశానం అనే పేరు వినగానే మనస్సు కీడు శంకిస్తుంది.ఏదో భీతి,మదిలో గుబులు. రాత్రుళ్ళూ, మధ్యాహ్నం అటువైపు వెళ్ళటానికే జంకు. అట్టి శ్మశానాన్ని తన కవితా వస్తువుగా ఎంచుకున్నాడు జాషువా కవి. కవి ఎప్పుడూ తనచుట్టూ ఉన్న లోకాన్ని ఇతరులకన్న భిన్నంగా, లోతుగా గమనిస్తాడు, అర్ధం చేసుకుంటాడు. తన భావాలను అక్షరరూపంలో పాఠకుల ముందుంచుతాడు.

శ్రీశ్రీ తన మహప్రస్ధానములో ఒకచోట అంటాడు కుక్కపిల్ల,సబ్బుబిళ్ల,అగ్గిపుల్ల.... కాదేది కవిత కనర్హం..."'.

అంతకు కొన్ని దశాబ్దాలముందే,అవునవును శ్మశానం కవితకు అర్హం అంటూ జాషువా ఈ ఖండకావ్యాన్ని లిఖించాడు.ఈ కావ్యంలోని పద్యాలలోని పదభావం సూటిగా పాఠకుని హ్రుదయం లోతుల్లోనికి చొచ్చుకెళ్లి,గుండె బరువెక్కుతుంది,వైరాగ్యభావం దోబుచులాడుతుంది.జీవిత చరమాంకసత్యాన్ని కళ్ళెదుట నిలుపుతుంది.ఈ ఖండకావ్యంలో 8 పద్యాలున్నాయి.అన్ని అణిముత్యాలాంటి పద్యాలే.

దువ్వురి వారి పానశాలలో ఒకచోట కవి...అంతం లేని ఈభువనమంతయు ఒకవిశాల పాంధశాల, విశ్రాంతి గృహం,అందు ఇరుసంజెలు రంగుల వాకిలిల్.........కొంత సుఖించి పోయిరెటకో , అంటాడు.

జాషువ ఈకావ్యం మొదటీ పద్యంలో ఈవిషయాన్నే ప్రస్తావిస్తు,ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటు ప్రారంభించాడు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు.ఈ రుద్రభూమిలో తమబిడ్దలను పొగొట్టుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాడు. కవిహృదయం చూడండి.

   ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
   గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
   యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
   కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

ప్రకృతిగతి తప్పి,ఆకాశంలో కారుమబ్బులు కమ్మిచిమ్మచీకటీ నిండి,దయ్యాలు,గూడ్లగూబలు చెరలాడుచు,కాకులు ముకమ్మిడిగా గోలచేసిన జనవాసం భితిల్లుతుంది.కాని ఈ శ్మశానవాటికలో భీతికి తావేలేదు.అంతా నిశ్సబ్దం....శ్మాశాన నిశ్సబ్దం.....

కవికలం ఎమంటున్నది.?

   ఆకాశంబున కారుమబ్బుగము లాహారించె,దయ్యాలతో
   ఘూకంబుల్ చెరలాడసాఁగినవి;వ్యాఘోషించె నల్దిక్కులన్
   గాకోలంబులు ; గుండెఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం
   దా కల్లాడిన జాడలే;దిచ్చట సౌఖ్యం బెంత క్రీడించునో!

ఈ రుద్రభూమికి చెడ్డవాడు,మంచివాడనే తేడాలేదు.యాజమాని,సేవకుడనే వ్యత్యాసంలేదు.హతుడు హంతకుడు యిద్దరు సమానమే ఈ నేలలో.కవి,రాజు,లేత యిల్లాలి మాంగల్యం,చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయ్యుస్సు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!.సృష్టికి లయకారుడు శివుడు.ఆయనకిష్టమైనది తాండవం.అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచఅనుచరగణంతో నాట్యమాడు రంగస్ధలమంటున్నడు కవి. అంతేకాదు ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడితతో చేసిన సింహసనమట! ఎంతలోతు భావం కవిది.

కవిహృదయం ఏమంటుందో చూడండి.

  ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
     కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
  యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
    యధికారముద్రిక లంతరించె!
  యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
    సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
  యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
    చిత్రలేఖకుని కుంచియ,నశించె!

  ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
  గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
  ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ
  నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

రాత్రి సమయం...తిమిరం నిండిన శ్మశానం....నిశ్శభ్దం రాజ్యమేలు వేళ....ఆ మూల కొత్తసమాధి....సమాధిపై ఆముదపుదీపం, కదులుతున్న మిణుగురులా రెపరెపలాడుచూ వెలుగు చున్నది. అరే! అదేమిటి? ప్రమిదలో అముదం నిండుకున్నను ఇంకా దివ్వె వెలుగుచున్నదేమి?! ఆ సమాధిలో నిద్రిస్తున్న అభాగ్యురాల యొక్కహృదయం కాబోలు ఆ దివ్వె వెలుగు!?....పాఠకుని గుండెను సూటిగా తాకి ఆర్ధ్రమైయ్యే భావం.ఈలాంటి భావన చెయ్యడం చేయ్యితిరిగిన కవికే సాధ్యం.

  ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధిమీదఁ బై
  బొదలు మిణుంగురుబురువు పోలిక వెల్గుచున్నదివ్వె,ఆ
  ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా?
  హృదయము సుమ్మి,నిల్పిచనియె న్గతపుత్రిక,యే యభాగ్యయో

కవితా సుధలోలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి.పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవల్సినదే.అందులో మమైకం కావలసినదే.పుట్టుక కూడా తల్లిగర్భం నుంచే అయ్యినను,తల్లికూడా ప్రకృతి జనీతమే కదా.మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంది.మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును.ఔను నిక్కమే కదా!.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు,భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!.

మరి కవిమనస్సు ఏమంటున్నది.

  కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం
  గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా
  రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
  ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై.

శ్మశానవాటిక వాకిటనుంచొని ఒకపర్యాయం పరికించి చూచిన మనగుండెలు తర్కుపోతాయి.మన మనస్సు కరిగినీరై పోతుంది ఆమూలనున్న అన్నెం పున్నెం ఎరుగని వయస్సులోనే మృత్యువు గర్భంలో చేరిన చిన్నారుల గోరిలను చూస్తే.ఆ పిల్లల సమాధులలో ఏచిన్నారి పొన్నారిరూపసి తనువు చాలించిందో? ఏ ముద్దులు మూటలుకట్టు రూపసి అలసిసొలసి నిద్రిస్తున్నదో.ఏ తల్లి లీలావతి కడుపుతీపి దాగున్నదో?

  ఆలోకించిన గుండిల్గరగు; నాయా పిల్ల గోరీలలో
  నే లేబుగ్గల సౌరు రూపరియెనో!యేముద్దు నిద్రించెనో!
  యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?
  యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?

వల్లకాడులో అస్పృశ్యతకు తావు లేదు.ఏ మతమైన,ఏ కులమైన,ఏ వర్ణమైన ఇక్కడ ఒక్కటే. అందరిని స్వీకరించడంలో సమతా భావం.పులిపక్కన సాధుజంతువు మేకను జేర్చి బుజ్జగించి,వూరడించు అభేదభావనావని ఈ శ్మశానభూమి.

  ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా
  నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య
  త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ
  ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్

మారుతున్న,పరిగెడుతున్న కలికాలంలో ఆర్థికఅవసరాలు,ధనవ్యామోహం-రక్తబంధాలను,పాశాలను త్రెంచుతున్నాయి.తమను కని,అల్లారు ముద్దుగా పెంచి,పోషించిన తల్లిదండ్రులను వృధ్యాపంలో,బ్రతికి వుండగానే వల్లకాటిలో అర్ధరాత్రి వదలివెళ్ళూచున్న రోజులివి.ఆలాంటప్పుడు అనాథ పేదవాని మృతశరీరాన్ని పట్టించుకొని,ఖననముచెయ్యు దాతలెందరు?.అన్నింటికన్న దారుణమైనది,భయంకరమైనది దరిద్రం/పేదరికం. శ్మశానంలో ఖననానికి నోచుకోని ఒక అనాథపీనుగను గూర్చి కవి ఎంత హృదయఆర్తితో వర్ణించాడో.అది కవి వేదనకాదు...పాఠకుని హృదయ ఘోష...కాదందురా?

  వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలరాతి గో
  రీకడఁ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే
  యాకటి చిచ్చునన్ గుమిలి,యార్చి,గతించిన పేదవాని దౌ
  నో కద! వానికై వగవఁ డొక్కదండు; దాఁచదు కాటినేలయున్

20, డిసెంబర్ 2020, ఆదివారం

తిన్నవా లేదా అనిఅడిగానా ఎపుడైనా..

శ్రీమతి గారికి జన్మదిన శుభాకాంక్షలు
పన్నెండేండ్ల మన జీవన ప్రయాణంలో నేను...

తిన్నవా లేదా అనిఅడిగానా ఎపుడైనా..
నడుం వాల్చలేదేమని అన్నానా ఎపుడైనా..

ముసురువేళ వేడివంట తిన్నానేగానీ
నీ ప్రేమకింత రుచిఉందని అన్నానా ఎపుడైనా..

జడలో మల్లెల వాసన పీల్చానే గానీ
తన మనసులోని పరిమళాన్ని చూసానా ఎపుడైనా..

బండచాకిరీ నీదని భావించానే గానీ
తన అలసట తుడిచి ముద్దు పెట్టానా ఎపుడైనా..

అర్దాంగివి కావు నీవు అనురాగ దేవతవు
రసరాజై ఈ నిజాన్ని రాస్తానా ఎపుడైనా..
ఈ గజలును నేనై కూస్తానా ఎపుడైనా...

రచన: శ్రీ రసరాజు

జన్మదిన సందర్భంగా గురువుగారు రచించిన ఈ గజల్ నా ప్రేమ కానుకగా నీకోసం...

13, డిసెంబర్ 2020, ఆదివారం

తెలుగు వాడు.. వెలుగు వాడు..

తెలుగు వాడు.. వెలుగు వాడు..
అరయ తెలుగువాడు – వరి వంగడము వోలె
వేరు చోట నాట వృద్దిచెందు
అభ్యుదయము నందు –అన్యదేశము నందు 
ఆంధ్ర ప్రతిభ వేగ  అతిశయించు!!

(---నండూరి రామకృష్ణమాచార్య)

12, డిసెంబర్ 2020, శనివారం

వీరగంధముఁ దెచ్చినారము

న భూతో న భ భవిష్యతి.......                                                         'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి

వీరగంధము....

వీరగంధముఁ దెచ్చినారము
వీరుఁ డెవ్వఁడొ తెల్పుఁడీ!
పూసి పోదుము, మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

తెలుఁగు బావుట కన్ను చెదరఁగ
కొండవీఁటను నెగిరినప్పుడు
తెలుఁగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు

తెలుఁగువారల వేఁడినెత్తురు
తుంగభద్రను గలసినప్పుడు
దూరమందున నున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు

ఇట్టి సందియ మెన్నఁడేనియుఁ
బుట్టలేదు రవంతయున్‌!
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్‌.

నడుముగట్టిన తెలుఁగుబాలుఁడు
వెనుక తిరుగం డెన్నఁడున్‌,
బాసయిచ్చిన తెలుఁగుబాలుఁడు
పాఱిపోవం డెన్నఁడున్‌.

ఇదిగొ! యున్నది వీరగంధము
మై నలందుము మైనలందుము;
శాంతిపర్వముఁ జదువవచ్చును
శాంతిసమరం బైనపిమ్మట.

తెలుఁగునాఁటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగి రమ్మిఁక,
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాకతప్పవు

వీరగంధముఁ దెచ్చినారము
వీరుఁ డెవ్వఁడొ తెల్పుఁడీ!
పూసిపోదుము, మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

(ఏవీ నాటి ఆ సౌరభాలు ?)

8, డిసెంబర్ 2020, మంగళవారం

శ్యామలా దండకం

మాణిక్యవీణా.. ముఫలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్
మాతంగకన్యామ్ మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే.. ఏ..
కుచోన్నతే కుంకుమరాగశోణే.. ఏ..
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే... జగదేకమాతః... జగదేకమాతః
మాతా.. మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
జయ మాతంగతనయే.. జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే.. జయ లీలాశుకప్రియే
జయ జనని...
సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ
బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప
కాదంబ కాంతారవాసప్రియే... కృత్తివాసప్రియే
సాదరారబ్ధ సంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే
కామలీలా ధనుస్సన్నిభ భ్రూ లతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీ లలామాభిరామే.. సురామే.. రమే
సర్వ యంత్రాత్మికే.. సర్వ తంత్రాత్మికే
సర్వ మంత్రాత్మికే.. సర్వా ముద్రాత్మికే
సర్వ శక్త్యాత్మికే.. సర్వ చక్రాత్మికే
సర్వ వర్ణాత్మికే.. సర్వ రూపే
జగన్మాతృకే... హే... జగన్మాతృకే
పాహి మాం.. పాహి మాం.. పాహి... పాహి

2, డిసెంబర్ 2020, బుధవారం

స్నేహితుండులేని జీవితంబు/

*మిత్రాయనమః* 

"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /
అనెడి మిత్రుండొకడుండిన చాలు/
వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/
మిత్రాయనమః/(1)

స్నేహితుండులేని జీవితంబు/
తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/
దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/
మిత్రాయనమః!/(2)

"ఔషధంబుకానౌషధౌంబు/
మనంబునకు శాంతినొసంగు/
తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/
మిత్రాయనమః/(3)

"దేశంబులనున్న, దేవళంబుననున్న/
సంతలోననున్న, సభలలోననున్న/
'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/
మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/
మిత్రాయనమః/(4)

"పూర్వజనమ పుణ్యంబున దొరకు/
ఏరాయను బాల్యమిత్రుండు,/
వృద్ధాప్యంబున పలుకరించ/
అమృతము చిలకరించు పలుకు/
అదిలేని జనమంబు దరిద్రమ్ము/
మిత్రాయనమః/(5)॥

"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/
సగము ప్రాణంబులు పోవు/
తీపి గురుతులే మిగులు/
దిగులు చెంద దినంబులు భారంబుగ/
మిత్రాయనమః!"(6).

 మితృలందరికీ అంకితం! 🙏

స్నేహితుండులేని జీవితంబు/

*మిత్రాయనమః* 

"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /
అనెడి మిత్రుండొకడుండిన చాలు/
వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/
మిత్రాయనమః/(1)

స్నేహితుండులేని జీవితంబు/
తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/
దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/
మిత్రాయనమః!/(2)

"ఔషధంబుకానౌషధౌంబు/
మనంబునకు శాంతినొసంగు/
తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/
మిత్రాయనమః/(3)

"దేశంబులనున్న, దేవళంబుననున్న/
సంతలోననున్న, సభలలోననున్న/
'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/
మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/
మిత్రాయనమః/(4)

"పూర్వజనమ పుణ్యంబున దొరకు/
ఏరాయను బాల్యమిత్రుండు,/
వృద్ధాప్యంబున పలుకరించ/
అమృతము చిలకరించు పలుకు/
అదిలేని జనమంబు దరిద్రమ్ము/
మిత్రాయనమః/(5)॥

"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/
సగము ప్రాణంబులు పోవు/
తీపి గురుతులే మిగులు/
దిగులు చెంద దినంబులు భారంబుగ/
మిత్రాయనమః!"(6).

 మితృలందరికీ అంకితం! 🙏

28, నవంబర్ 2020, శనివారం

జిడ్డు కృష్ణమూర్తి గారి పై బుర్రకధ

జిడ్డుకృష్ణమూర్తి గారి కథని బుర్రకథగా రాశాను.  రాజశేఖర్ (మా ఆయన) పాట బీట్ కి లేదా ట్యూన్ కి  తగినట్లుగా కొంత మార్చాడు పాటలని.  కొద్దిగా సంగీతం తెలిసిన వారికి వీటిని పాడటం చాలా ఈజీ.  తెలియకపోయినా పాడుతూ బుర్రకథని రక్తి కట్టించవచ్చు.

ఆ పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి గురించి ఈనాటి తరం పిల్లలు అందరికీ తెలియాలి.  టీచర్లూ, మీ స్కూల్లో పిల్లల చేత ఈ  బుర్రకథని చెప్పించాలని కోరుకుంటున్నాను.      

కళాకారులందరికీ ఈ బుర్రకథని షేర్ చేయండి ఫ్రెండ్స్!      - మీ రాధ మండువ 

******************************************** 

పరిపూర్ణ మానవతామూర్తి - జిడ్డు కృష్ణమూర్తి  
బుర్రకథ – రచన : రాధ మండువ

పాత్రలు : 
కథకురాలు - రాధక్క
వంతలు    -  రమ, రాజు ("తందాన తాన" ఇంకా "సై" అని అంటూ ఉంటారు)

***

రాధక్క :  జయము జయము తెలుగుతల్లీ జయము జయమూ నీకమ్మా - తందాన తాన
               జయము జయము ఆంధ్రమాతా జయము శుభములనివ్వమ్మా - తందాన తాన
               చదువులనిచ్చేటి దయగలతల్లీ - జ్ఞానము నీవమ్మా - తందాన తాన
               సంపదలిచ్చేటి శ్రీ మహాలక్ష్మి కరుణజూపవమ్మా  తందాన తాన 
               తరికిట ఝం తరిత .. త.. త.. త..

రమ,రాజు :  తందాన  తానా దేవనందనా,  దేవనందనానా 
                   తందాన తానా  దేవనందనా,  దేవనందనానా
                   తరికిట ఝం తరిత .. త.. త.. త..

రాజు :  రాధక్కా,  ఈరోజు ఏం కథ చెప్పబోతున్నావు?
రమ :  మదనపల్లి లో పేరొందిన ఒక బడి ఉంది కదా తమ్ముడూ, ఆ బడి పేరేమిటో తెలుసా?  
రాజు :  తెలియదు.  ఏం పేరు?
రమ :  చిత్తూరు జిల్లాకి గౌరవాన్ని తెచ్చిన బడి - రిషీవ్యాలీ బడి.
రాజు :  హేమిటీ!?  ప్రేమ కార్యాలు జరిపే మదనుడి పేరు పెట్టుకున్న మదనపల్లిలో రుషుల పేరుతో రిషీవ్యాలీ స్కూలా?  అదెట్లా కుదురుతుందీ?  ఏందక్కా, చెల్లి అనేది?

రాధక్క :  మంచి జోక్ తమ్ముడూ.  నిజంగానే మన చెల్లి చెప్పింది నిజం.  ఆ బడి చిత్తూరు జిల్లాకే గర్వకారణం.  భారతదేశం నించే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఆ బడిలో చదువుకుంటారు.   అదే రిషీవ్యాలీ బడి.  దాన్ని ‘World Teacher’ అని పిలవబడే పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించారు.  

పుణ్యక్షేత్రమైన తిరుపతి నుండి మదనపల్లి గుండా అనంతపురం వరకు వ్యాపించిన కొండలు, ఆ కొండల మధ్య లోయలు - ఆ లోయల్లో ఒక లోయ రిషీవ్యాలీ లోయ.  అక్కడ చింత, కానుగ, మద్ది, తంగేడు, పలవరేణి, ఆకాశమల్లి లాంటి అనేక రకాలైన చెట్లు చిక్కటి ఛాయలను పరచి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి.  అక్కడ గడ్డిపువ్వులు కూడా వివిధ వర్ణాలతో అలరారుతుంటాయి.  ఆ ప్రదేశంలో ఉన్న ఓ బ్రహ్మాండమైన మర్రిచెట్టుని చూసిన కృష్ణమూర్తిగారు బడికి అదే అనువైన ప్రదేశం అనుకున్నారు.  అక్కడ రిషీవ్యాలీ బడిని స్థాపించారు.  

రాజు :  నువ్వు చెప్తుంటేనే ఆ ప్రదేశాన్ని చూడాలనిపిస్తోందక్కా.   ఆ ప్రేమమూర్తి కథ చెప్తావా వింటాము.

రాధక్క :  అలాగే తమ్ముడూ,
               బంగరుఛాయల బిడ్డల్లారా - బిడ్డలగన్న తల్లుల్లారా
               అయ్యల్లారా అమ్మల్లారా - వింటారా ఈ కథనూ...  వింటారా ఈ కథనూ...
          
రమ, రాజు :  ఊఁ ఎందుకు వినం ?  

రాధక్క :  మీరు కూడా వినండి ప్రజలారా ఆ కరుణామూర్తి కృష్ణమూర్తి గాథ - జిడ్డు కృష్ణమూర్తి గాథ //తందాన తానా// 

రాధక్క :  దక్షిణభారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఉన్నది.  ఆ జిల్లాలో అతి పురాతన శిలారూపాలుగా భావించబడుతున్న రాతికొండల మధ్య ఒదిగి ఉండే ఊరు మదనపల్లి.   మదనపల్లిలో కాపురముంటున్న నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు మన కృష్ణమూర్తి.

రమ :  దేవకీ వసుదేవులకి అష్టమసంతానం సాక్షాత్తూ శ్రీ కృష్ణుడు, అందుకేనేమో ఈయనకి కూడా కృష్ణమూర్తి అని పేరు పెట్టుకున్నారు.  

రాజు: ఆ కృష్ణుడు భగవద్గీతను బోధించి మనుషులకి మోక్షాన్ని ప్రసాదించాడు.  మరి ఈయనో...!?

రాధక్క :  ఈయన కూడా అంతటి గొప్పవాడే తమ్ముడూ.  మనుషులకుండే అనేక రకాలైన బాధల్నించి, భయాల్నించి - తమ ఆలోచనలతో తామే తయారుచేసుకున్న పంజరాల నించి - వారిని విముక్తులని చేయాలన్నదే లక్ష్యంగా బ్రతికారు.  

రాజు :  ఎంత గొప్ప విషయం అక్కా!  ఇప్పుడు, ఆయన్ని గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

రమ :  అయితే శ్రద్ధగా విను.  వసపిట్టలా ఒకటే ప్రశ్నలు అడుగుతుంటివి.  కథ సాగేదెలా?

రాజు :  నువ్వే కదా కృష్ణుడు - కృష్ణమూర్తి అని పేర్లు ఎత్తి మధ్యలో అడ్డుపడిందీ?  నన్నంటావు అదేమంటే.  (బుంగమూతి పెట్టుకుంటాడు.  రమ ఏదో చెప్పబోతుంటే రాధక్క అడ్డుపడి) - 

రాధక్క :  ఊరుకో చెల్లీ!  తమ్ముడూ, మీరిట్లా వాదులాడుకుంటుంటే ఎలా?  మీరు ఆపితే కథ చెప్పడం మొదలుపెట్టుకుందాం!  

(సరే అక్కా అంటూ ఇద్దరూ తలలు ఊపుతారు)

రాధక్క : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా //తందాన తానా//
మానవ జాతికి మంచిని చెప్పిన  తత్త్వవేత్త గాథా //తందాన తానా//
తరికిట ఝం తరిత!

ఆ నారాయణయ్య సంజీవమ్మ దంపతులకు మే 11, 1895 న కృష్ణమూర్తి గారు జన్మించారు.  ఆ తర్వాత వాళ్ళకి మరో అబ్బాయి పుట్టాడు.  అతని పేరు నిత్యానంద.  కృష్ణమూర్తిగారికి పదేళ్ళ వయసు ఉన్నప్పుడు పాపం తల్లి సంజీవమ్మ మరణించింది.

రమ, రాజు :  అయ్యో పాపం!

రాధక్క :  గొప్పా ఇంటా పుట్టిన బిడ్డా...  //ఆఁ...//
               అభం శుభం ఎరుగని బిడ్డా...  //ఆయ్ ...//
               ముందు వెనకా చూడకుండా...  //ఆఁ...//
               చేతిన ఉన్నది ఇచ్చే బిడ్డా...  //ఆయ్ ...// 
               
అలాంటి ఆ బిడ్డకి అంత చిన్న వయసులోనే తల్లి మరణించడం - ఎంత కష్టం తండ్రీ!

రమ, రాజు :  అయ్యో, అయ్యొయ్యో!  ఎంత కష్టం వచ్చింది తండ్రీ!!

రాధక్క : తండ్రి సంరక్షణలోనే బిడ్డలందరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు.   తమ్ముడు నిత్యానందని కృష్ణమూర్తి ఎప్పుడూ విడిచి ఉండేవాడు కాడు.  ఇద్దరూ కలసిమెలసి ఆడుకునేవారు.  ఇలా ఉండగా కొన్నాళ్ళకి తహసిల్దారైన నారాయణయ్య  రిటైరై పోయారు.  

పిల్లలు చూస్తే చిన్నపిల్లలాయె.  బాధ్యతలు తీరలేదయ్యే.  అందుకని నారాయణయ్య మద్రాసు లోని థియోసాఫికల్ సొసైటీలో చిరుద్యోగిగా చేరాడు.

రాజు :  థియోసాఫికల్ సొసైటీనా?  ఏమిటక్కా అది?

రాధక్క :  అదొక ఆధ్యాత్మిక సంస్థ నాయనా.  ఒకే ఆలోచన కలిగిన వాళ్ళంతా పెట్టుకున్న సంస్థ.  దాన్నే దివ్యజ్ఞాన సమాజం అని కూడా పిలుస్తారు.  నారాయణయ్య అక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు ఆ సంస్థకి అధ్యక్షురాలు అనిబిసెంట్ అనే ఆవిడ.  ఆవిడ గురించి కూడా మనం చెప్పుకోవాలి రా తమ్ముడూ...   

ఆమె బ్రిటీష్ దేశ వనిత.  అయినా కూడా...
             
     భారతదేశం క్షేమం కోరెను  // తళాంగు తకథిమి తకిట తకిట తకతా//
     తెల్లదొరలకి ఎదురు తిరిగెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా// 
     తిలక్ గారితో కలిసి నడిచెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా//
     హోమ్ రూలును ప్రారంభించెను //తళాంగు తకథిమి తకిట తకిట తకతా//

అంతకంటే ముఖ్యంగా ఈమె గొప్ప తాత్త్వికవేత్త.  నిరంతరం యోగసాధన, ధ్యానసాధన చేసుకుంటూ ఉండటమే కాక దేశదేశాల్లో ఉపన్యాసాలు ఇస్తూ ఉండేది.  చురుకైన మహిళ.  కృష్ణమూర్తిని పెంచిన తల్లి.  

రాజు :  అవునవును ఈమె నాకు తెలుసు.  స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా హోమ్ రూల్ ఉద్యమాన్ని చేపట్టిన వనిత అని చదువుకున్నాను.  అయితే ఈమేనా కృష్ణమూర్తిగారిని పెంచిందీ!?

రాధక్క :  అవును తమ్ముడూ.  అందరి కష్టాలూ తీర్చే జగద్గురువు లోకంలోకి రాబోతున్నాడనీ, అతన్ని దివ్యజ్ఞాన సమాజం వెతికి, గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయాలని అనిబిసెంట్ నమ్మింది.  ఈ సంస్థలోనే మరో ప్రముఖవ్యక్తి లెడ్ బీటర్ అనే అతను.  ఇతను చాలా అద్భుత శక్తులు కలవాడు అని అందరూ అనుకునేవారు.  అనిబిసెంట్ తో పాటు లెడ్ బీటర్ ఇంకా ఇతర సభ్యులు - అందరూ కూడా రాబోయే జగద్గురువు కోసం చూస్తున్న తరుణం అది.

ఆ సమయంలో లెడ్ బీటర్ - చూశాడండీ కృష్ణమూర్తిని.  ఆ బంగారు తండ్రి ని చూడగానే ఎలా అనిపించదయ్యా లెడ్ బీటర్ గారికి - 
            
 విశాలమైనా ఫాలభాగము // థిమికిట థిమికిట థిమికిట థా //
 అనంతమైన నిర్మలత్వమూ // కిటథిమి కిటథిమి కిటథిమి థా //
            సున్నితమైన శరీర తత్త్వం // థిమికిట థిమికిట థిమికిట థా // 
            లోక మనోహర చిద్వీ లాసం // కిటథిమి కిటథిమి కిటథిమి థా //

రాజు : అయితే చూడ్డానికి ముద్దుగా, మురిపెంగా ఉన్నాడంటావ్...అంతేనా

రాధక్క :  అంతేనా అంటే అంతే కాదు... అసలు విషయం వినండి మరి...
 
               వెలుగులీనుతున్న కాంతి // సై // 
               వేరే లోకపు భ్రాంతి // సై //
               మెరిసిపోతున్నా తేజస్సూ కల్మషం లేని ఓజస్సూ
               // తరికిట ఝం తరిత//

బీచ్ లో తమ్ముడు నిత్యానందతో కలిసి ఆడుకుంటున్న కృష్ణమూర్తిని చూశాడు లెడ్ బీటర్. చూడగానే ఈ బాలుడు సామాన్యుడు కాదని అనుకున్నాడు.  ఇతడే లోకానికి వచ్చిన జగద్గురువు అని నిర్ణయం చేసేశాడు.  సభ్యులందరికీ ఈ బాలుని చూపించి విషయం చెప్పాడు.  

రాజు :  తర్వాతేం జరిగిందక్కా? 

రాధక్క :  ఎంతో కాలంగా ఎదురు చూసి చూసి ఇప్పటికి దొరికిన ఈ ప్రపంచగురువుని అనిబిసెంట్ తల్లిలా ఆదరించింది.  ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుని, నారాయణయ్య గారి అనుమతితో కృష్ణమూర్తిని, నిత్యానందని దత్తత తీసుకుంది.   

జగద్గురువు అవబోతున్న కృష్ణమూర్తి లోకానికి తన బోధలని వినిపించాలంటే అతను శక్తివంతమైన, అపురూపమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని అనిబిసెంట్ అనుకుంది.  

రాజు :  ఆధ్యాత్మిక శిక్షణ అంటే ఏమిటక్కా

రాధక్క :  పూర్వం లోకంలో ఉండే యోగుల గురించీ, వారి జీవన విధానాల గురించీ, ధ్యాన యోగ సాధనల గురించి  - ఇలా ఎన్నో తాత్త్విక విషయాల గురించి తెలియచెప్పడం తమ్ముడూ.

శిక్షణ మొదలైంది.  ఈలోపు, జగద్గురువు తన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక సంస్థని, ఆయన బోధనలని ప్రజలు వసతిగా కూర్చుని వినడానికి గాను  అనేక నగరాల్లో సభాప్రాంగణాలను నిర్మించాలని అనిబిసెంట్ నిర్ణయించుకుంది.  'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' అనే పేరుతో ఒక సంస్థని స్థాపించింది.  

రమ :  ముందు చూపున్న స్త్రీ.  ఎంత చురుకైన మనిషి!?  మదనపల్లిలో ఆమె నిర్మించినదే కదక్కా బెసెంట్ కాలేజీ?  

రాధక్క :  అవును చెల్లీ.  'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' సంస్థకి  వేల రూపాయల విరాళాలు సేకరించింది.  కృష్ణమూర్తిగారిని ఆ సంస్థకి అధిపతిని చేసింది.  

రాజు :  ఆహా, ఏమదృష్టం! వంద సంవత్సరాలకి ముందే వేల రూపాయలంటే, ఈ నాడు కోట్ల లెక్కన్నమాట!!

రమ, రాజు :  వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా  //తందాన తానా//
                    మానవ జాతికి మంచిని చెప్పిన  తత్త్వవేత్త గాథా   //తందాన తానా//
                    తరికిట ఝం తరిత!

రాధక్క :  ఇక మద్రాస్ లో థియోసాఫికల్ సొసైటీలో కృష్ణమూర్తి -        
                
                శిక్షణాపూర్తి చేసెరా //సై//
                జ్ఞానమూర్తీ  ఆయెరా //సై//
                ప్రగతి మార్గము పట్టెరా //సై//
                మార్గదర్శిగా మారెరా //సై//
                               
రాజు :  తర్వాతేమైందో తెలిసిపోయిందిగా అక్కా.  ప్రపంచానికి గొప్ప గురువు అయ్యాడు.  మదనపల్లిలో రిషీవ్యాలీ బడి స్థాపించాడు.  అంతేగా.

రాధక్క :  (నవ్వి)  అయ్యాడు తమ్ముడూ.  అయితే దివ్యజ్ఞాన సమాజం అనుకున్నట్లుగా కాదు.  ఆ సమాజాన్ని, సంస్థలనీ, ఆ వ్యక్తులనీ కాదని, తను అధిపతి గా ఉన్న సంస్థ 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ని రద్దు చేసేసి కట్టుబట్టలతో బయటకి వచ్చేశారు.   

రాజు : ఆఁ ...  (ఆశ్చర్యపోతాడు)

రాధక్క :  అవును.  జగద్గురువు అంటే మంత్రతంత్రాలు తెలిసి ఉంటాయనీ తద్వారా ఆ అదృశ్యశక్తులు, అద్భుత శక్తులు ప్రదర్శించి తన భక్తులకు ముక్తి, మోక్షం ప్రసాదిస్తాడనీ దివ్యజ్ఞాన సమాజం నమ్ముతుంది.  ఈ ధోరణి, భావజాలం కృష్ణమూర్తికి నచ్చలేదు.

ఆయన ధ్యానసాధనలో ఒక్కో మెట్టూ ఎక్కుతున్నకొద్దీ ఈ సంస్థ వారి తీరు, విధానాలు నచ్చక విపరీతంగా బాధపడేవారు.  సరిగ్గా ఆ సమయంలోనే ఆయనకి ధ్యానంలో అనేక దివ్య అనుభూతులు కలిగాయి.  ఓర్చుకోలేనంతగా శారీరక బాధలు కూడా కలిగాయి.  అతని లోలోపల మానసిక క్షేత్రంలో తీవ్రమైన మార్పులు కలిగాయి.  

రమ :  ఎంత అదృష్టం అక్కా!  పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ అనుభవాలు కలుగుతాయి అంటారు.
రాజు :  అయ్యో పాపం.  శారీరక బాధలు కూడానా?  అప్పుడేమైందో త్వరగా చెప్పక్కా.

రాధక్క :  ఈ మానసిక స్థితిలో ఉన్నప్పుడే తనకి ఎంతో ఇష్టుడైన తమ్ముడు నిత్యానందకి జబ్బుచేసి మరణించాడు.

రాజు :  అయ్యో, రామా,  అయ్యొయ్యో!! // తందాన తానా //  
            ఏమిటీ కష్టాలు తండ్రీ!! // తందాన తానా//

రాధక్క :  ఇక అప్పుడు -  

               గురువులు, మంత్రాలు, పూజలు నిన్ను
               రక్షించాలేవూ  //తందా...నా  దేవనందనాన//

               సంస్థలు, ఆస్తులు, హోదాలు, పదవులు
               ఎందుకూ కొరగావు //తందా...నా  దేవనందనాన//

రమ, రాజు :  ఆ ఇంకా....

(వేగంగా)
రాధక్క :        మనసులలోన మాయలు జూడు - మారేదానికి గోడలు జూడు  

రమ, రాజు :  భళా భళా రోయ్ తమ్ముడా మేలు భళారోయ్ తందానా

రాధక్క :       గురువుల లోనా మోసము జూడు - మాటచేతలకు తేడా జూడు

రమ, రాజు :  భళా భళా రోయ్ తమ్ముడా మేలు భళారోయ్ తందానా
                   
అందరూ :  వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా  //తందాన తానా//
                   మానవ జాతికి మంచిని చెప్పిన  తత్త్వవేత్త గాథా   //తందాన తానా//
                   తరికిట ఝం తరిత!

రాధక్క :  ఇంకా ఏం చెప్పాడయ్యా అంటే - 'ఎవరికి వారు తమంతట తాము సత్యాన్ని కనుగొంటేనే విముక్తి లభిస్తుంది. అప్పుడే ఈ దేశాల విభజనలూ, జాతి విభజనలూ మాయమవుతాయి' అన్నారు.  

స్వతంత్రంగా నీలాకాశంలో పక్షిలా ఆనందంగా జీవించాలంటే గురువులు, శక్తులు, మహత్తులు, సంస్థలు మీద ఆధారపడకుండా ఎవరికి వారు స్వీయజ్ఞానాన్ని పొందితేనే సాధ్యమవుతుంది అని గ్రహించారు.  

(నిదానంగా)  ఆహాహా....
మనసుని నమ్మీ చేసే సాధన 
మార్గము చూపదూ  //తందాన తానా//

మనసు మాయమై మర్మము ఎరిగితె
ముక్తి కలుగు నీకు  //తందాన తానా//

తలపుల వల్లే కాలభావనలు 
ఏర్పడుతున్నాయీ //తందాన తానా//

రమ, రాజు : తరికిట ఝం తరితా

రమ :  అది కదా నిజమైన మోక్ష మార్గం!

రాధక్క :  అవును చెల్లీ.  ఇక అయన వెంటనే తన అభిప్రాయాన్ని సభ్యులందరికీ తెలియచేశారు.  ఎవరికీ ఆయన ధోరణి నచ్చలేదు.  అతన్ని వ్యతిరేకించారు.  అయినా సరే తను నమ్మినది ఆచరణలో పెట్టడానికే నిర్ణయించుకున్న ఆయన తన ఆధిపత్యం లో ఉన్న సంస్థ - 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ని రద్దు చేసేశారు.  ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉపన్యాసం చాలా గొప్పది.  తర్వాత చదువుకోండి చెల్లీ, తమ్ముడూ. 

రమ, రాజు : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా తందాన తానా
                   మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా తందాన తానా
                   తరికిట ఝం తరిత!

రాజు : అలాగే అక్కా.  అనిబిసెంట్ గారు కూడా ఆయన్ని వ్యతిరేకించారా?  

రాధక్క :  మంచి ప్రశ్న తమ్ముడూ...  మొదట వ్యతిరేకించినా తర్వాత ఆయన మాటల్లో నిజాన్ని గ్రహించి ఆయన్ని ఎంతో గౌరవించింది. 

"నిజమైన విద్య అంటే ఎవరి గురించి వారు తెలుసుకోవడం తద్వారా జీవితాన్ని గురించి అర్థం చేసుకోవడం.  అప్పుడే విద్యార్థులు సమగ్ర వికాసం చెంది పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు" అని అనుకున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలను స్థాపించారు.

వాటిని ప్రకృతి ఒడిలో విశాలమైన స్థలాలలో నెలకొల్పి,  విద్యార్థులు భయరహిత వాతావరణం లో 
పెరుగుతూ స్వీయజ్ఙానంతో ఎదగాలని కోరుకున్నారు. 

రమ, రాజు  : వినరా సోదరా వీర కుమారా కృష్ణమూర్తి గాథా
                     తందాన తాన

రాధక్క : మానవులంతా ఒక్కటేననీ //తందాన తానా//
              జాతీమతాలూ వద్దు పొమ్మనీ //తందాన తానా//
             
              సత్యం కోసం అన్వేషిస్తే //తందాన తానా//
              ఎవరికి వారికె దొరుకుతుందనీ //తందాన తానా//
             
              కాలమనేదే లేదు పొమ్మనీ //తందాన తానా//
              ఉన్నదున్నట్టే చూడాలనీ //తందాన తానా//
              
              దేశదేశాల ఖండాంతరాల మానవులందరి క్షేమం కోసం
              హితవు పలికాడు, వెలుగై నిలిచాడు - తరికట ఝం తరిత

ఈ విధంగా తన ఆఖరి శ్వాస విడిచేవరకూ దేశ దేశాలు తిరిగి ఈ విషయాలని గురించి పదే పదే నొక్కి చెప్తూ అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. 

రమ, రాజు : వినరా సోదరా ఈ పుణ్యమూర్తి,  కృష్ణమూర్తి గాథా తందాన తానా
                   మానవ జాతికి మంచిని చెప్పిన తత్త్వవేత్త గాథా తందాన తానా తరికిట ఝం తరిత!

రాజు :  ఇంతకంటే మంచి పని ఇంకేం ఉంటుంది అక్కా?  నేటి విద్యార్థులే రేపటి మంచి పౌరులు అవుతారు కదా!?   అక్కా,  ఆయన ఎప్పుడు మరణించారు?  

రాధక్క :  జిడ్డు కృష్ణమూర్తి ఫిబ్రవరి 17, 1986 న అమెరికాలో లో మరణించారు.  తను జీవించినంత కాలం ఆయన మిత్రులూ, అభిమానులూ ఆయన బాగోగులు చూసుకున్నారు.  

కోటానుకోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులని, వేల మంది అనుయాయులని త్యజించి 'సత్యానికి ఇది మార్గం కాదు' అంటూ ఒంటరిగా నిలబడిన అతన్ని చూసి అనేకమంది ఆశ్చర్యపోయారు.  అయితేనేం ఆయన ఇప్పుడు నిజమైన "ప్రపంచ గురువు - The World Teacher”.

ప్రకృతిని ముఖ్యంగా మానవ నైజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారికున్న అన్ని బాధలనించీ విముక్తి కలిగించాలని తపన పడిన ఏకైక వ్యక్తి.  ఆధునిక యుగపు తత్త్వవేత్త.  జీవన్ముక్తుడు.  ధార్మిక జీవనానికి మార్గదర్శి, పరిపూర్ణ మానవతామూర్తి జిడ్డు కృష్ణమూర్తి.

అందరు :                  మంగళంబగు నిత్యంబు మంగళంబగు
                                  ఆదర్శమూర్తి కృష్ణమూర్తికి మంగళంబగు
                                  మంగళం జయ మంగళం - తరికిట తరికిట ఝం తరిత
                                  మంగళం జయ మంగళం - మంగళం జయ మంగళం

                                                        ***

24, నవంబర్ 2020, మంగళవారం

జొన్నవిత్తుల వారి కాఫీ దండకం

కలియుగామృత సేవనం సర్వరోగ పాప హరణం. జయహో కాఫీ మాతరం శరణం.....జయోస్తు, దిగ్విజయోస్తు.. 

జొన్నవిత్తుల వారి కాఫీ దండకం.
----------------------------------

అనుదిన్నమ్మును కాఫీ ఎ అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు
అమృతమన్నది హంబక్కు అయ్యలారా... జై కాఫీ
విష్వంతరమ్ములొ ఉన్న బ్రహ్మాండ గోలాలలొ నీకు సాటైన పానీయమే లెదు ముమ్మాటికీ...
అందుకె నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ
నాలుకతో నీకు జే జేలు పలికేము నానాటికీ...
ఎర్లి మార్నింగులొ లేవగానె పాచి పన్లైనయున్ తొమగ బెడ్ కాఫీ
కోసము పెన్లాముపై రంకెలేయించకే బెస్టు టెస్టిశ్వరీ.
బ్రష్ కాఫీష్వరి లెఫ్సు కెఫీష్వరి జిహ్వకున్ షుద్ది చేకూర్చవే బ్రూకుబండేష్వరీ...
లోక ప్రాణేష్వరీ ప్రాణ దానెష్వరీ గంట గంటా ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్న పానెష్వరీ...
స్టీలు ఫిల్టర్ల పల్లెంబులోనున్న రంద్రాలలోనుండి నీ సారమంత సుతారంగ
జారంగ నొరూరుచూడంగ నాసామి రంగా నిజంగానె చచ్చే విదంగా...
కాస్త తాగంగ పునర్జన్మ వచ్చేవిదంగా...
ప్రొద్దు పొద్దున్ననే నీ పొందులేకున్న మూడంత పాడయ్యి
టైమంత వేస్టయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అస్లీల సంభాషనల్
చేసి కాంటాక్ట్సు సర్వమ్ము నాషమ్ము కావించుకుంటారుగా...
అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా
దాచుకొంటారుగ కాచుకొంటారుగ చచ్చినట్టింక ఇచ్చేంత
సేపింక అందరున్ వేచివుంటారుగా...
కాఫీనంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులోనుంచి
ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా
గిలక్కొట్టుచు నురుగు ఉప్పొంగగా ఇస్తారుగా...
గొప్పనిష్టాగరిష్ఠుల్ భరిస్తాలలొ కనిష్ఠమంబుగా
కాఫీ తాగెందుకిష్టంబుగా పొవుగా...
షాపు మూసెయ వాపొవుగా
సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ సుభంగీ ప్రభంగీ. నమస్తే నమస్తే... నమహా!!
------ [ ప్రాతః కాలంలో కాఫీ ప్రియులందరికీ అంకితం..]

15, నవంబర్ 2020, ఆదివారం

నిగ్గదీసి అడుగు..ఈ సిగ్గులేని జనాన్ని


నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
 
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

9, నవంబర్ 2020, సోమవారం

*అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్*

30, అక్టోబర్ 2020, శుక్రవారం

.పాట..
శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా…

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌన విచక్షణ గాన విలక్షణ రాగమె యోగమనీ

నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించరా
విని తరించరా

శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు

పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా

నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా

శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా...

22, అక్టోబర్ 2020, గురువారం

అన్నంపెట్టె అన్నదాతకు
అబ్బో ఎంతటి చక్కటి శిక్షయో...
కడుపును నింపే కాపుదనానికి
అబ్బో ఎంతటి చక్కటి రక్షయో...
అన్నపూర్ణ మన దేశం అంటూ....
అన్నదాతలకిది నిలయం అంటూ....
మైకులదరగా మైకం కమ్మి,
 స్పీచులు దంచే  నాయకులారా....
కాలం కలువక,వర్షం కురియక...
ఆరుగాలము చెమటతొ తడిసి...
కడుపులు నింపే ప్రయత్నమొకటి...
చేసే దేవుడు ఈ రైతు మానవుడు...
నమ్మిన భూమిని వదులు కోలేడు...
కష్టము చేయగ వెనకకు పోడు....
పంటలు పోతే వేరే పంటలు....
వేయకుండగా నిద్దుర పోడు...
అప్పులు అయితే తిప్పలు పడుతూ...
చెప్పులరగగా కొత్త అప్పులకు....
రాత్రింబవళ్ళు తిరుగుతు ఉంటడు....
పెళ్ళాం పిల్లలు... తల్లిదండ్రులు...
చేను చెలకన కాపురముంటరు...
మూలకు ఉన్న ముసలవ్వలను....
కాటికి జాపిన కాలును మరచి...
ఇంటిలో బెట్టి  పనిచేయిస్తడు....
ఎంతటి అప్పులు ఉన్నా గానీ...
ఏరువాక అతని పండుగ దినము...
కడుపులు కాలిగ ఉన్నా గానీ....
కల్లము* అతనికి కమ్మని దనము...
ధాన్యపు రాసులె సిరుల రాసులని...
మురిసిపోయేటి ముత్యము అతడు...
జగతికి ఆకలి తీర్చగ పుట్టిన....
అన్నదాతయను దేవుండాతడు....
ఆపదగొన్న వాళ్ళనాదుకొన...
అవతరించినవి ఎన్నో సంస్థలు...
హక్కులకోసం సంఘాలెన్నో...
లా... బుక్కులు తెరచి రోడ్డుకెక్కినవి...
భారత మాత ముద్దు బిడ్డలను...
వర్గపు పేరుతొ విడగొట్టేసి....
గల్లీ కొక్క సంఘం బెట్టి....
హక్కులక్కులని అరుస్తువున్నవి...
కష్టం నమ్మిన రైతులకెప్పుడు....
సంఘపు గోలలు పట్టనె పట్టవు....
కష్టం వస్తే దుక్కిని దున్నె...
ఎద్దులకే అతని వ్యథలూ, కథలూ....
నీడను ఇచ్చే చెట్టు కొమ్మనే....
శాశ్వత సుఖముకు ఆధారాలు...
అఖండ భారత సోదరులారా...
ఆలోచించుడి ఈ ఒక్క క్షణంబు...
అన్నదాతను ఆదుకొంటేనే...
అన్నము గిన్నము మనకు అందును...
అతడిని జంపిన పాపము మనకును...
ఆకలిరూపున అవతరించును...
అన్నదాతను ఆదుకొనేడీ...
ఆలోచనలను చేయుడి ఇంకా....
-ప్రమదం(౮౧౭౯౧౯౨౯౯౯)

*ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్ గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ.*

అన్నంపెట్టె అన్నదాతకు
అబ్బో ఎంతటి చక్కటి శిక్షయో...
కడుపును నింపే కాపుదనానికి
అబ్బో ఎంతటి చక్కటి రక్షయో...
అన్నపూర్ణ మన దేశం అంటూ....
అన్నదాతలకిది నిలయం అంటూ....
మైకులదరగా మైకం కమ్మి,
 స్పీచులు దంచే  నాయకులారా....
కాలం కలువక,వర్షం కురియక...
ఆరుగాలము చెమటతొ తడిసి...
కడుపులు నింపే ప్రయత్నమొకటి...
చేసే దేవుడు ఈ రైతు మానవుడు...
నమ్మిన భూమిని వదులు కోలేడు...
కష్టము చేయగ వెనకకు పోడు....
పంటలు పోతే వేరే పంటలు....
వేయకుండగా నిద్దుర పోడు...
అప్పులు అయితే తిప్పలు పడుతూ...
చెప్పులరగగా కొత్త అప్పులకు....
రాత్రింబవళ్ళు తిరుగుతు ఉంటడు....
పెళ్ళాం పిల్లలు... తల్లిదండ్రులు...
చేను చెలకన కాపురముంటరు...
మూలకు ఉన్న ముసలవ్వలను....
కాటికి జాపిన కాలును మరచి...
ఇంటిలో బెట్టి  పనిచేయిస్తడు....
ఎంతటి అప్పులు ఉన్నా గానీ...
ఏరువాక అతని పండుగ దినము...
కడుపులు కాలిగ ఉన్నా గానీ....
కల్లము* అతనికి కమ్మని దనము...
ధాన్యపు రాసులె సిరుల రాసులని...
మురిసిపోయేటి ముత్యము అతడు...
జగతికి ఆకలి తీర్చగ పుట్టిన....
అన్నదాతయను దేవుండాతడు....
ఆపదగొన్న వాళ్ళనాదుకొన...
అవతరించినవి ఎన్నో సంస్థలు...
హక్కులకోసం సంఘాలెన్నో...
లా... బుక్కులు తెరచి రోడ్డుకెక్కినవి...
భారత మాత ముద్దు బిడ్డలను...
వర్గపు పేరుతొ విడగొట్టేసి....
గల్లీ కొక్క సంఘం బెట్టి....
హక్కులక్కులని అరుస్తువున్నవి...
కష్టం నమ్మిన రైతులకెప్పుడు....
సంఘపు గోలలు పట్టనె పట్టవు....
కష్టం వస్తే దుక్కిని దున్నె...
ఎద్దులకే అతని వ్యథలూ, కథలూ....
నీడను ఇచ్చే చెట్టు కొమ్మనే....
శాశ్వత సుఖముకు ఆధారాలు...
అఖండ భారత సోదరులారా...
ఆలోచించుడి ఈ ఒక్క క్షణంబు...
అన్నదాతను ఆదుకొంటేనే...
అన్నము గిన్నము మనకు అందును...
అతడిని జంపిన పాపము మనకును...
ఆకలిరూపున అవతరించును...
అన్నదాతను ఆదుకొనేడీ...
ఆలోచనలను చేయుడి ఇంకా....
-ప్రమదం(౮౧౭౯౧౯౨౯౯౯)
మనిషి కో దేవుడు-
మనం రోజూ చేసే ప్రార్ధన లెలా ఉంటాయంటే పైనున్న దేవుళ్లంతా ఉక్కిరి బిక్కిరై, షాకై, కన్ఫ్యూజ్ అయి పోతూంటారు. ఈ ప్రార్ధనల్లోని  కాంప్లికేషన్స్ వల్ల దేవుళ్ళల్లో కూడా రెండు గ్రూప్ లైపోక తప్పదు.
ఏడుకొండలవాడా! వేంకటేశ్వర స్వామీ! నన్నీ ఎలక్షన్స్ లో ఎలాగైనా మల్కాజ్గిరి MP గా గెలిపించు స్వామీ-నా సంగతి నీకు తెలుసుకదా! సంవత్సరానికి పదిసార్లు నీ దర్శనం చేసుకుంటున్నా-అలాంటప్పుడు నా కోరికలు నువ్వుతప్ప ఇంకెవరు తీరుస్తారు స్వామీ- ఇంకో సంగతి స్వామీ-నేను పార్టీలు మారతానుగానీ నిన్నొదిలి ఇంకో దేవుడి వేపు కూడా చూడను స్వామీ-అంత సిన్సియర్!నన్ను గెలిపించావనుకో-నేను నీ ఋణం ఉంచుకునే టైప్ కాదు.వంద కోట్లు ఖరీదు చేసే వజ్ర వైడూర్యాలు పొదిగిన కిరీటం నీకు సమర్పించు కుంటా స్వామీ-
స్వామికి డౌట్ వస్తుంది.
ఒరేయ్ –నీ దగ్గరఅంత డబ్బు లేదు కదురా?
ఒక్క మైనింగ్ కుంభకోణం చాలు స్వామీ –నీకు లక్ష కిరీటాలు చేయించేంత మనీ నొక్కేయ గలను.
సరే-నాకు భక్తులు సమర్పించే కానుకలంటే కొంచెం వీక్నెస్ ఉంది-నేనెప్పుడూ ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లాగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి పట్టించుకోను-నీ కోర్కె తీరుస్తాలే ఫో-      
 ఇలా ఏడుకొండల వాడి ముందు VIP క్యూలో ఈ సీన్ జరుగుతున్నసమయం లోనే  ఇంకో కాన్దేట్ అయ్యప్ప టెంపుల్లో ఎంతో భక్తి తో ప్రార్దిస్తూంటాడు.
అయ్యప్ప స్వామీ-నేను మల్కాజ్ గిరి MP గా పోటీ చేస్తున్నానని నీకు తెలుసుకదా-ఏ ధైర్యంతో చేస్తున్నావ్? అని నన్ను నువ్వు కొశ్చెన్ చేయవచ్చు-నేను నీ భక్తుడైనప్పుడు ఇంకా నాకు ధైర్యానికేమి కొదవ స్వామీ-నన్ను గెలిపించావంటే నీకు గవర్నమెంట్ లాండ్ లో వరల్డ్ క్లాస్ గుడి కట్టిస్తా స్వామీ-
ఆ? గవర్నమెంట్ లాండ్ లో గుడి కడతావా? నీ కేమైనా మెంటలా? పడగొట్టేస్తారు కదరా?
భలే వారే స్వామీ మీరు. నడిరోడ్డు మీద గుళ్ళు కట్టేవాళ్ళు వేలమంది ఉన్నారు గానీ  గుళ్ళు పడగొట్టే మగాళ్ళు ఇంతవరకూ ఇండియాలో ఎవడూ పుట్టలేదు స్వామీ-
అలాగా- సరే గానీ గుడి కట్టేంత మనీ నీ దగ్గర ఎక్కడుంది?
రేపు గెలిచాక అంతా మనీయే గదా స్వామీ-నువ్వు జస్ట్ నన్ను గెలిపించు –అంతే –దొంగ కంపెనీలు పెట్టి లక్షల కోట్లు బాంక్ లోన్లు తీసుకుని ఎగ్గోట్టేస్తా -దుమ్ము లేపేస్తా-
ఇప్పుడు వెంకటేశ్వర స్వామికీ అయ్యప్ప స్వామికీ గొడవ మొదలవుతుంది.
నా భక్తుడికి నేను మాటిచ్చా అయ్యప్పా-వాడినే గెలిపించక తప్పదు-
అలా అంటే ఎలా? నేనూ నా భక్తుడికి మాటిచ్చా కదా-
కానీ మా వాడు నాకు కోటి రూపాయల కిరీటం చేయిస్తానని మొక్కాడయ్యా-
మా వాడూ నాకు వరల్డ్ క్లాస్ గుడి కట్టిస్తానని ప్రామిస్ చేసాడు-వాడిని గెలిపించక పోతే ఫీలవుతాడు-
ఇదిగో అయ్యప్పా- ఈ ఒక్కసారికీ నన్ను మాట నిలబెట్టుకోనీ –ప్లీజ్-
నేనూ రిక్వెస్ట్ చేస్తున్నా వెంకట్-ఈ ఒక్క సారికీ నాకు వాడి కోరిక తీర్చే అవకాశo ఇవ్వు-
కుదరదు అయ్యప్పా-అయాం సారీ-
సరే- అయితే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో –నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటా-
అంతే- దేవుళ్ళ యుద్ధం మొదలవుతుంది-
ఏడుకొండల వాడి భక్తుడు పెద్ద మెజారిటీ తో గెలుస్తాడు.
దాంతో అయ్యప్ప భక్తుడు కోపంగా అయ్యప్ప దగ్గరకెళ్ళి స్వామీ శరణం-అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి చెవులు చిల్లులు పడేలా భజనలు చేస్తాడు. ఇక సైలెంట్ గా ఉండటం కుదరదని అయ్యప్ప ఆరాత్రి తన భక్తుడి కలలో కొచ్చి ఓ ఉపాయం చెబుతాడు. ఆ ఉపాయం ప్రకారం భక్తుడు గెలిచిన కాoడిడేట్ ఓటర్లకు రహస్యంగా నోట్లకట్టలు లంచాలుగా ఇచ్చినట్లు చూపే వీడియో కోర్ట్ కి ఇస్తాడు. దాంతో కోర్ట్ ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తుంది.
వెంటనే ఏడుకొండలవాడి భక్తుడు కారేసుకుని తిన్నగా కొండెక్కేస్తాడు.
ఇదేమిటి స్వామీ ఇలా జరిగింది?కావాలంటే ఇంకో కిరీటం ఇస్తా గాని పై కోర్ట్ లో కేస్ వేస్తున్నా-నేను గెలిచేట్లు చూడు స్వామీ అని వేడుకుంటాడు.వెంకటేశ్వరస్వామి జాలిపడి పై కోర్టులో తన భక్తుడిని గెలిపిస్తాడు.గెలవగానే అతనికి మైనింగ్ కాంట్రాక్ట్ కట్ట బెదుతుంది ప్రభుత్వం-ఆ కాంట్రాక్ట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే అతను కోటి రూపాయలు ఖరీదు చేసే వజ్రాల కిరీటాలు రెండు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుoటాడు.
దాంతో అయ్యప్ప భక్తుడికి మండిపోతుంది.
అర్జెంటుగా వెళ్లి అయ్యప్పని నిలదీస్తాడు.
ఆ చిన్న కోర్ట్ లో నన్ను గెలిపించినట్లు గెలిపించి పై కోర్ట్ లో దెబ్బ కొట్టావ్ గదా స్వామీ-ఇది న్యాయమేనా?మనుషులు చెయ్యి ఇస్తారు గాని దేవుళ్ళు చెయ్యిస్తారా ఎక్కడైనా?
అయ్యప్ప ఏమ్చేయ్యాలో తెలీక తల పట్టుకుoటాడు.
నీ గురించి దేవుళ్ళు కూడా కొట్టు కోవాల్సి వస్తుందిరా –అది కరక్ట్ కాదు కదరా-అంటాడు చిరాగ్గా-
స్వామీ- అదంతా నాకు తెలీదు-నువ్వు తలచుకుంటే ఆ ఏడుకొండలవాడు ఎక్కడ నిలబడగలడు?నీలెవలేంటి? ఆ వెంకటేశ్వర స్వామి లెవలేంటి స్వామీ-
అలా రెచ్చగొట్టకురా-నీలాంటి వాళ్ళ వల్లే ఇదివరకు మా దేముళ్ళలోనే ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకునే పరిస్తితు     లొచ్చినయ్.
ఇదన్యాయం స్వామీ-నేను చిన్నప్పటినుంచీ నిన్నే నమ్ముకుంది దేనికి? అవసరం వచ్చినప్పుడు నా శత్రువులను దెబ్బ కొడతావనేకదా?
అబ్బా-సరేలే-ఈ ఒక్కసారికీ సాయం చేస్తా-కానీ ఇంకోసారి మాత్రం నన్ను ఇలాంటివి అడగకు-
థాంక్యూ స్వామీ –శరణమయ్యప్పా-
అయ్యప్ప మాయమయి పోయాడు.మర్నాడే అక్రమ మైనింగ్ కేస్ లో ఏడుకొండలవాడి భక్తుడిని ఇంటి మీద సిబిఐ వాళ్ళు రైడ్ చేసి అతని ఫ్రాడ్ ని రెడ్ హాoడెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పడేసారు.
వెంటనే అయ్యప్ప భక్తుడు పాతిక కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పోస్ట్ కొనుక్కున్నాడు. ఇంకో రెండు కోట్లు ముఖ్య మంత్రి కిచ్చేసరికి మంత్రి పదవి ఇచ్చారు.ఇవ్వగానే గానే రాజధాని లోని గవర్నమెంట్లాండ్స్ ప్రైవేట్ వాళ్ళకు కారు చవగ్గా అమ్మేసి లక్షల కోట్లు కాజేశాడు. బినామీ పేర్లతో కోట్లకొద్దీ బాంక్ లోన్లు తీసుకుని గవర్న్ మెంట్ లాండ్ లో అయ్యప్పకు గుడి కట్టించేసాడు-ఇంగ్లండ్ పారిపోయాడు. దాంతో కధ కంచికీ బాంక్ లు కోర్ట్ కీ-
ఇక్కడ మీకో అనుమానం వస్తుంది.
భక్తులు ఆశ పెట్టినా భగవంతుడు ఎందుకు ఆశ పడాలి? ఈ విశ్వమంతా ఆయనదే కదా-డబ్బూ, బంగారం, గుళ్ళూ గోపురాలూ ఆయనకెందుకు?
ఎందుకంటే-
పాలసాగరమున పవ్వళించిన సామి
గొల్ల ఇండ్ల పాలు కోరనేల
ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి
విశ్వ దాభిరామ వినుర వేమ!  

                          ******************************************


కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై(
బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
ఈ కాలంలో అంటూ ఆ కాలంలోనే ఈ కాలం గురించి పోతనగారు చెప్పిన గొప్ప పద్యాలలో ఇదొకటి. అన్నీ ప్రశ్నలే! సమాధానాలను మనం కాలం లోంచి వెదుక్కోవాలి. ఈ కాలంలో రాజులెక్కడున్నారయ్యా అనుకోనవసరం లేదు, ఈ కాలం పాలకుల్లో తామే రాజులం అనీ, తమదే ఈ రాజ్యం అనే భావన గూడు కట్టుకుని ఉంది కాబట్టి! రాచరికం పోయిందిగానీ రాజాధిరాజ భావన పోలేదు రాజ్యం చేస్తున్న వారిలో! అన్ని పార్టీల వాళ్ళలోనూ ఇదే ధోరణి నేటి ప్రజాస్వ్యామ్యంలో ప్రముఖం అయ్యింది,
దుర్యోధనుడికి తట్టలేదు గానీ ప్రజాస్వామ్యంలో పాలిస్తానని ఒక్క మాట అని ఉంటే, ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు. తనూ, తన సోదరులు కలిసి దుర్యోధనుడికి వంద వోట్లు పడతాయి. పాండవులకు ఐదు వోట్లతో డిపాజిట్ గల్లంతై ఉండేది. ఇలాంటి ప్రజాస్వామ్య ప్రమాదాన్ని శంకించే కాబోలు, ధర్మరాజు ముందు జాగ్రత్తగా `మేం నూటైదుగురం’ అంటూ ఉండేవాడు…
దుర్యోధనుడు కూడా పాండవులు అఙ్ఞాతవాసం నుండి తిరిగొచ్చే సమయానికి విపరీతంగా దాన ధర్మాలు చేసి, ప్రజాభిమానం పెంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నాడట! కానీ ఒక ప్రపంచ యుద్ధాన్ని తలపించే యుద్ధం జరగటాన, ఎన్నికలప్రహసనం జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇదంతా విషయాంతరం.
“దానం అడగటానికి వచ్చినవాడు మారువేషంలో ఉన్న విష్ణువే! జాగ్రత్తగా ఉండకపోతే ఓడతావు” అని గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని హెచ్చరించినప్పుడు బలి చెప్పిన సమాధానం ఈ పద్యం! ఇది నాటి రాచరికానికీ, నేటి దొంగ ప్రజాస్వామానిక్కూడా వర్తించే సమాధానం.
కారే రాజులు?: ఈ కాలంలో ఎవరైనా,ఎలాంటి వాడైనా రాజు కావటం లేదా?
రాజ్యముల్ గలుగవే?: వాళ్ళకి రాజ్యాలు దక్కటం లేదా?
గర్వోన్నతిం బొందరే?: వొళ్ళు పొగరెక్కి వ్యవహరించట్లేదా?
వారేరీ?: అలాంటి రాజకీయ దురంధరులుగా తమని చిత్రించుకున్న వాళ్ళు ఏవయ్యారు? ఈ లోకంలోంచే పోయారు
సిరి మూటగట్టుకుని పోవంజాలిరే?: అధికారంలో ఉన్న కాలంలో మూటగట్టుకున్న సిరినంతా పోయేటప్పుడు పట్టుకు పోగలిగారా?
భూమిపై పేరైనంగలదే?: ఈ నేలపైన వాళ్ళ పేరైనా ఉందా? కనీసం వాళ్లను తలుచుకునే వాడున్నాడా?
శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై: శిబిచక్రవర్తి లాంటివాళ్ళు ప్రజాదరణ పొంది కీర్తిమంతులై నిలిచారు.
యీరే కోర్కులు: ఎందుకంటే మనఃస్ఫూర్తిగా అడిగింది అడిగినంతగా ఇచ్చారు కాబట్టి! ఈ ప్రజలకోసం ఎంతో కొంత చేశారు కాబట్టి.
వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా?: ఇంత కాలం తరువాత కూడా అలాంటి వాళ్ళని ప్రజలు మరిచారా గురుదేవా?
రాజుమరణిస్తే శిల్పంలో జీవిస్తాడు, సుకవి మరణిస్తే జనం నాలుకలమీద జీవిస్తాడన్న జాషువా మాటలు ఇక్కడ గుర్తుకొస్తాయి. రోడ్లను ఆక్రమించి శిల్పాలు నిలబెట్టేవాళ్ళకిది చురక! లోకోపకారి చిరంజీవి అవుతాడనేది దీని సారాంశం.
వామనుడు సత్యలోకం కంటే ఎత్తికు పెరిగి బ్రహ్మాండం అంతా నిండి, ఇదంతా తనకు దానంగా కావాలని అడిగాడంటే అదంతా బలి చక్రవర్తి ఆధీనంలోని రాజ్యం అన్నట్టే కదా! వామనుడు అడిగింది భూమికి పైన ఉన్న రాజ్యాన్నే! ఇంకా అంత రాజ్యం బలి చక్రవర్తికి భూమికి అడుగున పాతాళాది లోకాల్లో ఉంది. తనవి ఇచ్చే చేతులని చాటటమే తనకు నిజమైన ఆస్తి, కీర్తి అని గుర్తించిన రాజు కాబట్టి, తనను తాను బలి చేసుకోవటానికే సిద్ధపడ్డాడు బలి చక్రవర్తి.

మచ్చుకు ఒక్క ప్రధాని, ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి అలాంటి వాడు ఉంటాడేమోనని ప్రజలు ఒక్క ఆశతో ప్రతిసారీ తమ ఓటుని బలి ఇచ్చుకుంటూ ఉంటారు... ప్రజా‘బలి’స్వామ్యంలో!

***మనిషిడక్Dడ్ జీవితంలో లక్ష్మీదేవి ఎలాస్డ్ వడ్స్తుందో , తిరిగి ఎలా వెళ్ళిపోతుందో చూడండి...*** 🌼🌺🌾🌼🌺🌾🌼🌺🌾🌼🌺🌾🌼🌺🌾🌼🌺🌾🌼 శ్లోకం : "ఆజగామ యదా లక్ష్మీః! నారికేళఫలలాంబువత్ !! నిర్జగామ యదా లక్ష్మీః ! గజభుక్త కపిత్థవత్ " !! 🌾🌾🌾 ......సిరిసంపదలు మనకు వచ్చేటప్పుడు , కొబ్బరికాయలోకి నీరు లాగా తెలియకుండా వచ్చేస్తాయట , అలాగే సంపదలు పోయినప్పుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుజ్జవలె కనబడకుండా మాయమైపోతుందట.....🌾🌾🌾 సిరిదా వచ్చిన వచ్చును ! సలలితముగ నారికేళ సలిలము భంగిన్ !! సిరిదా బోయిన బోవును ! కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ !! అంటాడు భద్రభూపాల కవి " బద్దెన " ... 🌾🌾🌾 .......దీనికి మంచి ఉదాహరణగా కొబ్బరికాయలోని నీరు గురించి చెబుతారు..... ఆ నీరు ఎలా వచ్చి చేరుతుందో నిజంగానే ఎవరికి తెలియదు ....ఇది ప్రకృతి రహస్యం ..... కొబ్బరికాయలోని నీరులా లక్ష్మీదేవి కూడా నిశ్శబ్దంగా వస్తుంది .....🌾🌾🌾 🌾🌾🌾......ఆమె వచ్చిన తర్వాత శబ్దాలు చేయడం ప్రారంభిస్తుంది....ఎలా అనుకున్నారు..?? కొత్త చుట్టాలు , కొత్త కొత్త బంధువులు , మిత్రులు ఇలా అనేక రూపాలతో వచ్చి శబ్దాలు చేయడం ప్రారంభిస్తుంది.... ఆమె ఉన్నంత వరకు శబ్దాల మయమే ..... ఇంకా దీనికి ఆ ఇంట్లో ఎవరికైన అధికారము వచ్చి అది కూడా తోడైతే ఇంక చేప్పేదేముంటుంది.....🌾🌾🌾 .🌾🌾🌾🌾......అలా లక్ష్మీదేవి సత్యధర్మాలు లేని చోట , అబద్ధాలు రాజ్యమేలే చోట , ముఖస్తుతి చేసేవారి దగ్గర , స్వార్ధపరులు , అవినీతి పరులు దగ్గర , సంచిత కర్మఫలం పూర్తయ్యే వరకు ఉంటుంది .....తిరిగి వారిలో స్వార్ధం , అన్యాయం , అధర్మం పెరిగి , .......ప్రారంభంలో కూడా అలాగే ఉండి , ధర్మకార్యాలు వదలి , అధర్మ కార్యాలు చేపడతాడో , అక్కడ నుంచి మెల్ల మెల్లగా , చల్లగా కరిమ్రింగిన వెలగపండులోని గుజ్జు లాగా వెళ్ళిపోతుంది.....🌾🌾🌾 🌾🌾🌾 ........ఆమె వెళ్ళిపోయిన మరుక్షణం , వైభవ చిహ్నాలన్నీ మటుమాయమై కేవలం ఏడుపు ముఖాలు మాత్రమే మిగులుతాయి ..... డబ్బునప్పుడు పోగరుతో ఇతరులను అనవసరముగా దూషించి , వారిపై అసత్యాలు అబద్దాలు ప్రచారం చేసినందు వల్ల పలకరించే వారు లేకుండా పతనమైపోతారు......🌾🌾🌾 🌾 🌾 🌾 ..........ఒక్కోసారి ధనలక్ష్మి ఉన్నా , ఆరోగ్య లక్ష్మీ దగ్గర లేకుంటే అంతా వృథా ....అందుచేత అష్టలక్ష్ములు నివాసముండె లాగా జీవనం సాగించాలి.....అయితే ఆనంద లక్ష్మీదేవి దయ కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి....🌾🌾🌾 .🌾🌾🌾 ..........ఉన్నదాంట్లో అనుభవించి , తృప్తి చెంది ఇతరులను కూడా ఆనందింపచేయాలి.....మానవ జన్మసార్థకత ఇందులోనే ఉంది.... మనకు కలిగిన దానిలో దానలు చేయాలి.... చేయగలచోట చేతిని వెనక్కి తీయకూడదు..... పోయేటప్పుడు మనతో ఏమీ రాదు .... ఎదుట వారికి మాట సహాయం చేసైనా ఆనందం ఇవ్వగలిగితే మన జీవితం ధన్యమవుతుంది......🌾🌾🌾 🌾🌾🌾..... ఇవ్వడంలో ఉన్న ఆనందం మనం అనుభవిస్తే కాని తెలియదు ...ఆనందలక్ష్మిని మన దగ్గరే ఉండమని అభ్యర్థిద్దాం , అనుభవిద్దాం సంతృప్తితో జీవిద్దాం.....🌾🌾🌾 🌺🌺🌺ఓం లక్ష్మీదేవియై నమః 🌺🌺🌺🌺🌺

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం

వేములపల్లి శ్రీకృష్ణ ఎవరో తెలుసా..? వామపక్ష రాజకీయ వాసనలున్న కొందరికైతే ఆయన కమ్యూనిస్టు గా తెలుసు. మరికొందరికి ప్రజాప్రతినిధిగా ఎరుక. బాపట్ల, మంగళగిరి నియోజక వర్గాలనుండి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బహుకొద్దిమందికి ఆయన ఒక పాత్రికేయునిగా గుర్తు. విశాలంధ్ర ఎడిటర్‌గా రాష్ట్రంలో పాతకాలం పత్రికా పాఠకులకు తెలిసుండచ్చు. ఆయన గొప్ప కవి అని చాలామందికి తెలీక పోవచ్చు. అందులోనూ ఆయన రాసిన ఒక గేయం దశాబ్దాలపాటు తెలుగునేల నాలుగు దిక్కులా పిక్కటిల్లింది. అన్ని భావాలు, అన్ని వాదాలు కలగలిపి సువిశాలాంధ్ర గలం వినిపించారు. తెలుగు పటిమను, ధైర్య సాహసాలను, పాండిత్య ప్రతిభను, తెలుగు సంస్కృతీ వెలుగుజిలుగులను వేనోళ్ళ కొనియాడారు. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవస్థ వాతావరణంలో ఈపాటకు ఎంతో విలువ ఉంది. 50 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా శ్రీకృష్ణ గేయం గుర్తుండకపోవచ్చు. గతంలో వినిపించిన దేశభక్తిపూరిత గేయాలలో ఇది ప్రముఖంగా ఉండేది. శ్రీకృష్ణ ఎలా ఉండేవారో పాత కమ్యూనిస్టు తరానికి; తలపండి, చేయితిరిగిన పాత్రికేయ మిత్రులకు మాత్రమే స్ఫురణకు వస్తారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!! అన్న ఆయన పిలుపునకు యువత పౌరుషంతో పరుగులెత్తింది ఆ రోజుల్లో. ఆ దేదీప్య, దివ్య గీతిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కంచుకాగడా పెట్టివెతికినా ఎక్కడా కాగితాల్లో (పాఠ్యపుస్తకాల్లో) కలాల్లో, గళాల్లో కనిపించదు, వినిపించదు. ఒక్క సారి ఆ గీతాన్ని మననం చేసుకుందామా!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి కలవోడా! సాటిలేని జాతి-ఓటమెరుగని కోట నివురుగప్పి నేడు-నిదురపోతుండాది జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి|| వీర రక్తపుధార-వారబోసిన సీమ పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయి! తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి|| కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే వీరవనితల గన్న తల్లేరా! ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి|| నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం భావాల పుట్టలో-జీవకళ పొదిగావు అల్పుడను కావంచు తెల్పావు నీవు శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి|| దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు మనుషులన్నమాట మరువబోకన్నాడు అమరకవి గురజాడ నీవాడురా ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి|| రాయలేలిన సీమ-రతనాల సీమరా దాయగట్టె పరులు-దారి తీస్తుండారు నోరెత్తి యడగరా దానోడా వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి|| కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు ధాన్యరాశులే పండు దేశానా! కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి|| ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది తల్లి ఒక్కతే నీకు తెలుగోడా! సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి|| పెనుగాలి వీచింది-అణగారి పోయింది నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది చుక్కాని బట్టరా తెలుగోడా! నావ దరిచేర్చరా మొనగాడా!! !! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||

*కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతింబొందరే వారేరీ? సిరిమూట గట్టుకుని పోవంజాలిరే భూమిపై పెరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై యీరే కోర్కులు వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా?*

॥తెలుగు గజల్ ॥ పిడకెడంత గుండెకదా భావాలకు ఆవాసం! చేరెడంత కళ్ళు కదా కన్నీళ్ళకు ఆవాసం ! గుప్పెడంత బువ్వలేక గిలగిలమను కడుపులెన్ని విసిరేసే నాణాలే ప్రాణాలకు ఆవాసం! జానెడంత పొట్టనిండ జారిణిగా మారెనేమొ అనామికలు ఉన్నవాడి కోరికలకు ఆవాసం ! ముత్యమంత నవ్వులేక ముక్కిపోవు మనసులెన్ని ? ఓర్వలేని బుద్ధికదా ద్వేషాలకు ఆవాసం ! బోలెడంత ధనమున్నా సుఖంలేదు మిత్రమా భోగాలే అంతులేని రోగాలకు ఆవాసం ! పుట్టెడంత దుఃఖానికి పుట్టనేల గిట్టనేల ఉదయించిన జ్ఞానంకద త్యాగాలకు ఆవాసం! పట్టెడంత పెట్టిచూడు జంధ్యాలా ఎంతతృప్తి విచ్చుకున్న హృదయాలే మానవతకు ఆవాసం ! డా. ఉమాదేవి జంధ్యాల 2019 జూన్ 3

క‌మ్యూనిస్టులంటే కుళ్లు ఎందుకు? విషం జ‌ల్లుతూ వికృతానందం ఎందుకు? ఓటుకి నోటు కాడ వాళ్లు లేర‌నా..! పార్ల‌మెంట్ లో నోట్ల క‌ట్ట‌లు జ‌ల్లిన‌ప్పుడు క‌నిపించ లేద‌నా? అవినీతి మ‌చ్చలేని నేత‌లుగా ఉన్నారనా..! సర్వ అక్ర‌మాల‌కు స‌మాధానంగా క‌నిపిస్తున్నార‌నా? ప్ర‌లోభాల‌కు దూరంగా, ప్ర‌జాసేవ‌లో ఉన్నార‌నా.! ప్ర‌జ‌ల‌కండ‌గా నిలిచి పోరాడుతున్నార‌నా? ప్ర‌పంచీక‌ర‌ణ‌పై ర‌ణం చేస్తున్నార‌నా..! స‌ర‌ళీక‌ర‌ణ ప్ర‌మాదాన్ని చాటుతున్నార‌నా? మతోన్మాదుల మ‌నుగ‌డుకు ఆటంకమ‌నా..! మ‌త‌సామ‌ర‌స్యం ప‌రిఢ‌విల్లాల‌ని పోరుతున్నార‌నా? కుల‌వివ‌క్ష అంతానికై పంతం ప‌ట్టార‌నా..! కులం అడ్డుగోడ‌లు ప‌గుల‌గొట్ట‌డానికి అడుగులు వేస్తున్నార‌నా? దేశ‌భ‌క్తికి, త్యాగ‌నిర‌తికి నిద‌ర్శ‌నంగా మారుతున్నార‌నా..! ఎప్ప‌టికైనా మంది గ్ర‌హిస్తే మీ మ‌నుగ‌డకు ముప్పు వాటిల్లుతుంద‌నా? ఎందుకో మీ దుగ్ధ‌! ఎందుకో మీ కంట‌గింపు! ఎందుకో క‌న్నీరు!! ఎందుకో మీ క‌ల‌వ‌రింపు!! మీరెందుకు ప‌డి ఏడ్చినా ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతికి అడ్డు ఉండ‌దు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే జెండాకు ఎదురుండ‌దు ఓట్లు, సీట్లు కొల‌త‌ల్లో మీరు సంతోష‌ప‌డండి ప్ర‌జాపోరాటాల సార‌ధిగా ఎర్ర‌జెండా రెప‌రెప‌ల‌తో కంగారుప‌డండి!!

మగవాళ్ళ మన్ కీ బాత్ - భండారు శ్రీనివాసరావు (కొందరు ఆడవాళ్ళను గురించి మరికొందరు మగవాళ్లు సరదాగా చెప్పిన మాటలు ఇవి. వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు అందరు ఆడవాళ్ళకు వర్తించాలని రూలేమీ లేదు) “పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు గా వుంటారు. కలసివున్నట్టుగా కనిపిస్తారు కానీ ఎన్నటికీ కలవలేరు.”- అల్ గోరె “మగవాళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మంచి భార్య దొరికిందా సుఖపడతారు. లేకపోతే నష్టం లేదు. పెద్ద వేదాంతిగా మారే అవకాశాలు పెరుగుతాయి.”- సోక్రటీస్ “తన భర్త గొప్పగొప్ప పనులు చేసి విజయాలు సాధించాలని ప్రతి భార్యా ఉత్సాహపడుతుంది. అతడిని ఆవైపుగా ప్రోత్సహిస్తుంది. కానీ, అంతవరకే. మొగుడు వాటిని సాధించడం మాత్రం ఇష్టపడదు.” - మైక్ టైసన్ “బహుశా ఎవ్వరూ జవాబు చెప్పలేని ప్రశ్న ఏదయినా వుందా అని నన్నడిగితే నా మెదడుకు ఒక్కటే తడుతోంది- ఆడది కోరుకునేది ఏమిటి ? అన్నదే ఆ ప్రశ్న.” – జార్జ్ క్లూనీ “నేను మా ఆవిడతో మాట్లాడింది కేవలం మూడంటే మూడే ముక్కలు. బదులుగా ఆమె ఏకంగా ఒక దండకమే చదివింది.” – బిల్ క్లింటన్ “మీరూ మీ ఆవిడా ఇన్నేళ్ళుగా కలసి కలతలు లేని కాపురం చేస్తున్నారు. ఏమిటి ఇందులో రహస్యం అని నా మిత్రులు అడుగుతుంటారు.ఇందులో పెద్దగా దాచుకోవాల్సింది ఏమీ లేదు. ఎన్ని పని వొత్తిడులు వున్నా వీలు చేసుకుని వారానికి రెండు సార్లు ఏదయినా రెస్టారెంటుకు వెళ్లి మంచి సంగీతం వింటూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తుంటాము. కాకపొతే ఆవిడ ప్రతి మంగళవారం శుక్రవారం వెడుతుంది. నేను మాత్రం శని, ఆదివారాల్లో వెడుతుంటాను.” – జార్జ్ డబ్ల్యు. బుష్ “ఉగ్రవాదం అన్నా ఉగ్రవాదులన్నా నాకు భయమనిపించదు. నేను పెళ్లి చేసుకుని రెండేళ్ళయింది.”- -రూడీ గిలానీ “ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్ ట్రంప్ “కాపురం పది కాలాలపాటు సజావుగా సాగాలంటే భర్తలకు నేను చెప్పే సలహాలు రెండే రెండు. ఒకటి. మీరు చెప్పేది రైట్ కాదని తెలిసినప్పుడు నిజాయితీగా దాన్ని భార్యముందు వొప్పుకోండి. రెండు. మీరే రైట్ అనుకున్నప్పుడు దాన్ని మీ ఆవిడతో చెప్పకుండా నోరుమూసుకోండి.” - షాక్విల్ ఓ’ నీల్ “భార్య పుట్టినరోజు మరచిపోకుండా గట్టిగా గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఒక మార్గం వుంది. ఓ ఏడాది దాన్ని గురించి మరచిపోయి చూడండి. ఆ తర్వాత గుర్తుంచుకోవడం ఎలాగో ఆవిడే నేర్పుతుంది.” - కోబె బ్రియాంట్ “పెళ్ళికి ముందు ఏం చేసానో తెలుసా ? జీవితంలో ఏవేం కావాలనుకున్నానో అన్నీ చేసికూర్చున్నాను.”.- డేవిడ్ హాసెల్ హాఫ్ “నేనూ మా ఆవిడా ఇరవై ఏళ్ళపాటు హాయిగా, నిశ్చింతగా వున్నాము. ఆ తర్వాతే ఇద్దరం కలుసుకోవడం, పెళ్ళిచేసుకోవడం జరిగింది.”- అలెక్ బాల్డ్విన్ “మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది. తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”-బరాక్ ఒబామా “వివాహం అనేది ఒక యుద్ధం లాటిది. కాకపొతే ఈ యుద్ధరంగంలో శత్రువులిద్దరూ కలసి ఒకే చోట నిద్రిస్తారు.” – టమ్మీ లీ ఒకడు చెప్పాడు. " నా భార్య దేవత” “అంత అదృష్టం అందరికీ వుంటుందా. మా ఆవిడ బతికే వుంది.” – జిమ్మీ కిమ్మెల్ “లేడీస్ ఫస్ట్ అంటారు ఎందుకని ?” “దేవుడు కూడా ఆ మాటనే నమ్ముకుని ఆడవాళ్లనే ముందు లోకంలోకి పంపాడు. వాళ్లు మొత్తం ప్రపంచాన్ని ఒక మెస్ చేసికూర్చుంటారని ఆయనకూ తెలియదు” – డేవిడ్ లెటర్ మాన్ “ముందు ఎంగేజ్ మెంట్ రింగ్. తరువాత మ్యారేజ్ రింగ్. ఆ తరువాత ...” “ఇంకేం రింగ్. మిగిలేది ఒక్కటే. సఫరింగ్” - జే లెనో

మనసు, మాట, క్రియ సమైక్యమ్ములగు శిష్టమానవులకు, దుష్టమానవులకుతలపు వేరు, భాషితము వేరు, క్రియవేరులలితసుగుణజాల! తెలుగుబాల!! మాంద్యమెల్ల దీర్చు, మంచి పేరు వెలార్చుమనసు కలక దేర్చు, ఘనత కూర్చుసాధుమైత్రి సకల సౌభాగ్య సంధాత్రిలలితసుగుణజాల! తెలుగుబాల!! నష్టమధికమైన, కష్టాలు కలిగిన,సిరి తొలంగి చనిన, మరణమైన,ధర్మపథ మొకింత తప్ప రుత్తమజనుల్లలితసుగుణజాల! తెలుగుబాల!!

ఎవరు వ్రాసారో తెలియదు కానీ చాల బాగుంది. అందుకే మీకు పంపిస్తున్నాను. నేటి సెల్‌ఫోన్ చరవాణి... జేబుల్లో కీరవాణి మాయచేసే మహారాణి వ్యసనాల యువరాణి గుప్పిట్లో ఉండాల్సింది.. అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది అదనపు అవయవంగా మారి.. అవయవాలన్నటినీ ఆడిస్తోంది "ప్రపంచానికి" అవసరమని రూపిస్తే.. తానే "ప్రపంచమై" కూర్చుంది సౌకర్యం కోసం సృష్టిస్తే .. సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది "నట్టింట్లో" మాటలు మాన్చి.. నెట్టింట్లో ఊసులు కలిపింది. చాటింగులు... మీటింగులు... ఆపై రేటింగులు..అంటూ యువతను పెడద్రోవ పట్టిస్తోంది సమాజాన్ని పట్టి పీడిస్తోంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తోంది అయిన వాళ్ళు పక్కప్రక్కనే ఉన్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్ళను చేసింది వ్యసనపరులుగా మార్చింది. ప్రమాదవశాత్తు పడిపోయినా... "ప్రాణం ఉందోలేదో చూసుకోకుండా "ఫోను"ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది. ఎన్నని చెప్పను దీని లీలలు ఓ మిత్రమా...! విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు ఊడిగం చేయించుకో... అంతేగాని బానిసగా మారకు. దేన్నెక్కడుంచాలో అక్కడే ఉంచు. నెత్తినెట్టుకున్నావో .. పాతాళానికి తొక్కేస్తుంది. బి కేర్ ఫుల్ అది మాయల మహరాణి వ్యసనాల యువరాణి చేతిలోని చరవాణి.

*ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై యెవ్వని యందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూలకరణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వా డెవ్వడు, వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్.*

ఊఉ ..
.
పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని / 2/
మూగ నేలకు ... నీరందివ్వని వాగు పరుగు దేనికని "
.
.

 తాతలు తాగిన నేతుల సంగతి - 4 నీతులుగా . . .
పలికెను మన సంసకృతి
జల్లుకు నిలవని  ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని -  / / పరుల//
.
.

ఆ ఆ ఆ ఆఅ ఆఅ ఆఆఅ ఆఆఅ
.

ఆదర్శాలకు  నోళ్ళు చాలవు , ఆశయాలకు ఫైళ్ళు  చాలవు
పదపద మంటూ పలుకులేగాని కదలని అడుగు దేనికని -- / / పరుల//
.
.

 జలవిద్యుతుకు కరువేలేదు , జనసంపత్తికి  కొరవే లేదు
అవసరానికి  మీట నొక్కితే అందని వెలుగు దేనికని-- / / పరుల//
.
.

శిశు  హృదయానికి కల్లలు లేవ్ు, రసరాజ్యానికి ఎల్లలు  లేవు
లోపలి నలుపు సినారే కు తెలుసు, పై పై  తొడుగు దేనికని  / / పరుల//

ఒక యోగి ఆత్మకధఅప్పటికి నా స్కూలు ఫైనల్ కూడా కాలేదు. ఎవరిచ్చారో తెలియదు. ఒక యోగి ఆత్మ కధ పుస్తకాన్ని ఆమూలాగ్రం ఒక్క పెట్టున చదివేశాను. అది చదివి అర్ధం చేసుకునే వయసు కూడా కాదు. కానీ అది చదివిన తరవాత చాలాకాలం గుర్తుండిపోయింది. మానవ జీవితంలో ఇటువంటివి అసాధ్యం అనే నమ్మకాలు కొద్దికొద్దిగా బలపడుతున్న రోజులు. నమ్మకాలకు అపనమ్మకాలకు నడుమ గుంజాటన పడుతున్న వయసు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. ఆ సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతూ చదివిన పుస్తకం అది. శ్రీ కాళహస్తీశ్వర శతకంలో కవి ధూర్జటి ఇలా అంటాడు.(ఈ పుస్తకాన్ని గురించి గుర్తు చేసిన Rajani Putcha గారికి కృతజ్ఞతలతో )

"సీస పద్యము"----------------------రచన : డా. ఆచార్య ఫణీంద్ర~~~~~~~~~~~~~~~~~~పాలుగారెడునట్టి పసిబుగ్గలనుగల్గుబాల్యమ్ములోపల ‘పాల సీస’-బుడిబుడి యడుగుల నడకలు సాగించుడింభక దశను ‘కూల్ డ్రింకు సీస’-మెత్తని నూనూగు మీసాలు మొలిచెడియవ్వనంబున ‘ఆల్కహాలు సీస’-ఆరోగ్యమే కొంత అటునిటై, నడిమి ప్రాయమ్మునందున ‘ఔషధమ్ము సీస’- ముదిమి వయసునందు ముదిరిన జబ్బులోప్రాణ రక్షకై ‘సెలైను సీస’-చిత్రమగును నరుని సీసాల బంధమ్ము!‘సీస’ పద్యమె నర జీవితమ్ము! *

పల్లవి:
విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం...
ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ...
కనుల కొలను లో ప్రతిబింబించిన విశ్వారూప విన్యాసం
యదకనుమలలో, ప్రతిధ్వనించిన విరించి పంచి గానం ...
సరసస్వర సుర ఛరీగమనమం,సామ వేద సారమిది ||2||

నే పాడిన జీవన గీతం, ఈ గీతం ..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం 1:
ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన,
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ||2||

పలికిన కిలకిల గళముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ, విశ్వా కావ్యమునకిది భాష్యముగా..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం 2:
జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాధతరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం ||2||

అనాదిరాగం ఆదితాళమున అనంత జీవనవాహినిగా, సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

నా ఉచ్వాసం కవనం, నా నిశ్వాసం గానం ||2||
సరసస్వర సుర ఛరీగమనమం,సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం, ఈ గీతం

"మందార మకరంద మాధుర్యమునదేలు" బాగవతం నుండి పోతన పద్యం గానం మృదురవళిసీ||మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు(తుమ్మెద) వోవునే మదనములకు(ఉమ్మెత్తచెట్టు) నిర్మల మందాకినీ(గంగానది) వీచికల దూగు రాయంచ(రాజహంస) చనునె తరంగిణులకు(వాగులు) లలితరసాల వల్లవ ఖాదియై(తిని) చొక్కు(ఆనందించు) కోయిల చేరునే కుటజములకు(కొండమల్లెలు) పూర్ణేందు చంద్రికా స్పురిత చకోరకం బరగునే సాంద్రనీహారములకు(మంచుపోగ)తే||అంబుజోదర దివ్వపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల||మందారమకరందాల తీపి మరిగిన తుమ్మెద ఉమ్మెత్త పూలను చెరుకుంటు౦దా? ఆకాశగంగాతరంగాలలో ఉయ్యాలలూగే రాజహంస వాగులకూ వంకలకూ వెళుతుందా? తీయని మామిడి లేత చిగుళ్ళను తిని పరవశించే కోయిల కొండమల్లెలను కోరుకుంటుందా ? పండు వెన్నెల బయళ్ళలో విహరించే చకోరం మంచుపొగల వేపు పోతుందా ? లేదు , వీలుకాదు. వేయి మాటలెందుకు ? పరమాత్ముని వలచిన మనసు మరో వేపు చేరుకోదు .ఈ పద్యంలో కనీసం మొదటిపాదం రాని తెలుగువాడు దాదాపుగా లేడు. ఇంతటి వశీకరనశక్తికి మూలకారణం మధురాక్షర సమ్మేళనం. "మందార" "మదుప" "మదనములు" . ఒక్క పాదంలోనే ఇన్ని మకారాల గుబాళింపు. అందుకే ఈ పద్యం తెలుగువారి నోటికెక్కింది .

తెనాలి రామ కృష్ణ సినిమా చూసేరు కదా. అందులో ధూర్జటి పల్కులకేల కల్గెనో ఈ అతులిత మాధురీ మహిమ? అని రాయలు ఆశ్చర్యపోతె హా తెలిసెన్ అని రామ కృష్ణుడి సమాధానం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే పదాల విరుపులో ధూర్జటిని పొగిడినట్లు కాక వెటకారం చేసినట్లు మనకనిపిస్తుంది.ముందుగా సినిమాలో పాడిన, రామ కృష్హ్ణుడు నటించిన విధం చూద్దాము.స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీయతులిత మాధురీ మహిమ? --- --- ---ఆంధ్ర కవి = Telugu poetస్తుతమతి యైన = with praiseworthy intellectధూర్జటి = the poet Dhurjatiపల్కులకు+ఏల = how his wordsకల్గెన్ = happenedఈ = thisఅతులిత = incomparableమాధురీ మహిమ = nectar-like sweet effectహా తెలిసెన్, భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాప హారి సంతత మధురాధరోదిత సుధా రస ధారలు గ్రోలుటం జుమీహా తెలిసెన్ = yes, I got itభువనైక = the entire worldమోహన+ ఉద్ధత = capable of enchantingసుకుమార = delicateవార వనితా జనతా = group of "street" women (prostitutes)ఘన = greatతాప = suffering of loveహారి = destroyerసంతత = constantlyమధుర = sweetఅధర+ ఉదిత = born from the lipsసుధారస = honeyధారల = streamsగ్రోలుటం = upon savoringజుమీ = listen!Tenali Ramakrishna replied, "yes, I know, listen! It's because he (that is, Dhurjati) had been constantly savoring the streams of honey from the lips of the delicate prostitutes who are so lovely that they can enchant the whole world! here is the correct meaning of this poem.The answer is as follows:భువనైక = the entire worldమోహన+ ఉద్ధత = capable of enchantingసు+కుమార+వార = the group of good sons and daughtersవనిత జనత = and wives (a man could have more than one wife in those days)ఘన తాప = great painహారి = removerమధు రాధ = sweeter than honeyరోదిత = born of meditationసుధారస = honeyధారల = streamsగ్రోలుటం = upon savoringజుమీ = listen!The wives and the children, capable of enchanting the world, are the bonds that keep one attached to the world and cause pain. This pain is overcome by the constant meditation, which is sweeter than honey - it's because the Telugu poet had been feeding on such streams of sweetness that his poetry is so incomparably sweet!This explanation was put forward by renowned Telugu scholar, the late Ravuri Venkateswarlu gaaru.Both the interpretations of the poem are given in the book "పద్య కవితా పరిచయం" by ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారు.

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభంఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపంఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభంఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపంచరణం1:కోతిమంద చేత సేతువే నిర్మింపచేసింది ఆడదిరానాడు తాళికోసం యముడి కాలపాశంతోనే పోరింది ఆడదిరాఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండ ఆపింది ఆడదిరాఅల్ల బాలచంద్రుడి చండ్రభాను తేజము వెనుక వెలిగింది ఆడదిరావేమన వేదానికి నాదం ఒక ఆడదిరావేమన వేదానికి నాదం ఒక ఆడదిరాఇతగాన్ని నడుపుతుంది అటువంటి ఆడదిరాఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభంఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపంఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభంఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపంచరణం2:దశరధున్ని నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరాఅయ్యో భీష్ముడంతటివాణ్ణి అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరాఅందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ఠ చెరిపింది ఆడదిరాఅహ పల్నాడు నేలంతా పచ్చినెత్తుట్లోన తడిపింది ఆడదిరాకోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరాకోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరాఈ మగవాన్ని నేడు చెరిచింది ఆడదిరాఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభంఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపంఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభంఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపంచరణం3:పంచపాండవులకు కీర్తి కిరీటలు పెట్టింది ఆడదిరాఅయ్యో ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరాపోత పోసిన పున్నమంటి తాజ్‌మహలు పునాది ఆడదిరాఅయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూలగొట్టింది ఆడదిరామంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరామంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరాచరిత్రలో ప్రతి పుట ఆమె కథే పాడునురాఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభంఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపంఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభంఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

అన విని వ్రేటువడ్డ యురగాంగనయుం బలె, నేయి వోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హెచ్చిన కనుదోయి కెంపు తన చెక్కులఁగుంకుమ పత్ర భంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గదఖిన్న కంఠియై. దెబ్బతిన్న త్రాచువలె, నేయిపోయగా భగ్గున మండిన అగ్నిజ్వాలవలె లేచి, కన్నులు ఎర్రవడ స్త్రీ సహజమైన గద్గద కంఠముతో సందేహాందోళితయై –

కణ కణమున కంఠమిదే   అణువణువున నాదమిదే
మాతృభూమి మనల చూచి కోరుచున్న కోర్కె ఇదే , కోరుచున్న కోర్కె ఇదే

బీదరికం బాధలతో బాధామయ గాధలతో
ఆత్మన్యూన  భావంతో అలమటించు జాతిలోన
సామాజిక సమరసత స్వాభిమాన సంపూర్ణత
సాధించగ రారమ్మని మాతృభూమి పిలుపు ఇదే ||కణ |||

విలాసాలు విడిచిపెట్టి కులాసాలు కట్టిపెట్టి
వీరవ్రతం స్వికరించి ధ్యేయనిష్ఠ  దీక్షబూని 
సంఘటనా సూత్రముతో ధర్మరక్ష లక్ష్యమును
సాధించగ రారమ్మని మాతృభూమి పిలుపు ఇదే ||కణ |||

విశ్వశాంతి సందేశం వినిపించిన ఈ దేశం
విదేశీయ వాదంతో విధర్మీయ వికృతితో
విచ్చిన్నం కాక ముందే హిందుత్వం కాపాడగ
విక్రమించ రారమ్మని మాతృభూమి పిలుపు ఇదే ||కన ||

10, అక్టోబర్ 2020, శనివారం

ప్రభాత కవిత:మనిషీ! ఏమిటిలా?! మనం ఎందుకిలా?! ******************కోడిపుంజులా ఉదయాన్నే లేవాలి..పక్షిలా స్వేచ్ఛగా ఉండాలి..చిలకలా చక్కగా మాట్లాడాలి..ఆవులా పరిమితంగా తినాలి..కుక్కలా విశ్వాసం చూపాలి..దున్నలా రోజంతా పనిచేయాలి..చీమలా పొదుపు చేయాలి..సాలీడులా ఇంటిని ఉంచుకోవాలి..పక్షి జంటలా అన్యోన్యంగా ఉండాలికోడిపెట్టలా పిల్లలని సాకాలి..గొర్రెల్లా కలసి మెలిసి ఉండాలి..పావురాల్లా ఐక్యత చూపాలి..కొంగలా మౌన ముద్రలో ఉండాలి..కాకుల్లా చేయూత నివ్వాలి..ఇన్నీ విడిచి..అన్నీ మరిచి..ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాం!అవకాశపు అంచులు పట్టుకునిగబ్బిలాల్లా వ్రేళ్లాడుతున్నాం..గోడమీద పిల్లిలా నిలబడి ఆత్రంగా దిక్కులు చూస్తున్నాం!మానవత్వపు వలువలను ఒక్కొక్కటిగా విప్పేస్తూ..రాక్షసతత్వపు పూతలను రోజూ ఒళ్ళంతా పూసుకుంటూక్రమంగా రాబందులకు బంధువులవుతున్నాం!కుట్రలు కుతంత్రాలును ముప్పొద్దులా భోంచేస్తూక్రూరమృగాలకి చేరువవుతున్నాం..!అమ్మపాలు తాగి పెరిగిన మనంవిషాన్ని అనుక్షణంఆవాహన చేసుకుంటూకాలక్రమేణా కాల సర్పంలా మారిపోతున్నాం..!ఇదేమిరా మనిషీ!ఏమిటిలా ?! మనమెందుకిలా?! " వసుధ " 9490832787

4, అక్టోబర్ 2020, ఆదివారం

ప్రభాత కవిత: -"వసుధ"మాస్కులో మహత్తు..********?********బండ ముక్కు అన్న బాధ లేదు..చట్టి ముక్కన్న చింత లేదు..ఎత్తు పళ్లంటూ ఎద్దేవాలు లేవు..చొట్ట బుగ్గలన్న చీకు లేదు..జలుబు చేసిందన్న జంకులేదునోటి దుర్వాసనన్న దిగులులేదుగడ్డం నెరిసిందన్న వెరపు లేదుదుమ్ము ధూళి అన్న బెంగ లేదువైరస్ మాట దేవుడెరుగుఅందరి లోపాలెన్నో దాచిపెట్టిమహిమలెన్నో చూపెట్టుమహాతల్లి మాస్కురో!ఆత్మ విశ్వాసాన్ని తట్టిలేపురో!దివ్యమహాత్తుoది మాస్కులో!ధరించుమురా! అనునిత్యం..కాపాడునురా! ముమ్మాటికీ నిజం! " వసుధ " 9490832787

30, సెప్టెంబర్ 2020, బుధవారం

28, సెప్టెంబర్ 2020, సోమవారం

*శివ తాండవ స్తోత్రం*జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీవిలోల వీచివల్లరీ విరాజమాన మూర్ధని ధగ ద్ధగ ద్ధగ జ్జ్వలల్లలాట పట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందినీ విలాస బంధుబంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే కృపాకటాక్ష ధోరణీ నిరుంద దుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభాకదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాన్ధ సిన్ధుర స్ఫురత్త్వ గుత్తరీయ మేదురేమనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి సహస్ర లోచన ప్రభృత్య శేషలేఖ శేఖరప్రసూన ధూళి ధోరణీ విధూస రాంఘ్రి పీఠభూః భుజంగ రాజమాలయా నిబద్ధ జాటజూటకశ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభానిపీత పంచసాయకం నమన్నిలింప నాయకంసుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరంమహా కపాలి సంపదే శిరోజటాల మస్తు నః కరాళ ఫాల పట్టికా ధగ ద్ధగ ద్ధగ జ్జ్వలద్ధనంజయా హుతీకృత ప్రచండ పంచ సాయకే ధరా ధరేన్ద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రకప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహూ నిశీథి నీతమః ప్రబంధ బంధ కన్ధరః నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తి సిన్ధురఃకళా నిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్ఛటావిడంబి కంఠ కంథరా రుచి ప్రబంద కందరంస్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదంగజచ్ఛిదాంద కచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీరసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతంస్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకంగజాంత కాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమ ద్భుజంగ మస్తురఃధగ ధగ ద్వినిర్గమత్ కరాళ ఫాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమి ధ్వనన్ మృదంగతుంగమంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తికస్రజోర్గరిష్ఠ రత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః తృణారవిందచక్షుషోః ప్రజా మహీమహేంద్రయోఃసమం ప్రవర్తయః మనః కదా సదాశివం భజే కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్విముక్త దుర్మతిః సదా శిరఃస్థ మంజలిం వహన్ విముక్త లోల లోచనో లలాట ఫాల లగ్నకఃశివేతి మంత్ర ముచ్చరం సదా సుఖీ భవామ్యహంఇమంహి నిత్యమేవముక్త ముత్తమోత్తమం స్తవంపఠన్ స్మరన్ భృవన్నరో విశుద్ధిమేతి సంతతంహరే గురౌ సుభక్తిమా శుయాతి నాన్యథా గతింవిమోహనం హిదేహినాం సుశంకరస్య చింతనంపూజావసాన సమయే దశవక్త్ర గీతం యఃశంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాంలక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః - రావణ బ్రహ్మ గానం - శ్రీ యస్ పి బాలసుబ్రహ్మణ్యం

12, సెప్టెంబర్ 2020, శనివారం

శివతాండవస్తోత్రము****************** జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాండమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్- అరణ్యమును పోలు జటాజూటము నుంచి స్రవించు గంగానదీ ప్రవాహముచేత శుద్ధి చెందినా కంఠసీమను మాలవలె అలంకరించిన సర్పము కలిగినవాడు, తన డమరుకము నుండి డమ డమ శబ్దములు వెల్వడిరాగా ఆనంద తాండవమొనర్చుచున్నవాడు అయిన పరమశివుడు మనకు సమస్త శుభములను కలిగించుగాక౨. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీవిలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకేకిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటము నందు సురనదీ ప్రవాహమును కలిగినవాడు, ఆ ప్రవాహము పైకి ఎగబ్రాకుతున్న తీగలవంటి కురులు కలిగిన శిరోభాగము కలిగినవాడు, జ్వాలలతో వెలుగొందు అగ్నిని తన ఫాలప్రదేశమునందున్నవాడు, బాలచంద్రప్రభతో శోభిల్లునట్టివాడు అయిన పరమశివుని యందు నా మనస్సు ప్రతిక్షణమూ రమించుచున్నది.౩. ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధురస్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసేకృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) విలాసమైన పర్వతరాజపుత్రిక కు మగడు, ఎవని మనస్సు దిగంతములలోని సమస్త జనుల ఉనికితో నిండియున్నదో, ఎవని కృపాకటాక్షవీక్షణములు సోకితే సమస్త ఆపదలూ నశించునో, అట్టి దిక్కులే అంబరములుగా ఉన్నవానిపైన నా మనస్సు రంజించుచున్నది.౪. జటాభుజంగపింగళ స్ఫురత్ఫణామణిప్రభాకదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖేమదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురేమనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటమును అలంకరించిన పచ్చని సర్పముయొక్క ఫణి మణికాంతులతో విరాజిల్లుచూ, దిక్కులను కదంబకుంకుమ కాంతులతో నింపుచుండగా, పైని గజచర్మముతో చేయబడిన ఉత్తరీయము ఎగసి మదపుటేనుగును పోలగా సమస్త భూతపతిగా శోభించుచున్న వాడు నా మనస్సును ఆనందముతో నింపుగాత౫. సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖరప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూఃభుజంగరాజమాలయానిబద్ధజాటజూటకఃశ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరః- అశేషమైన ఇంద్రాది దేవతలయొక్క పంక్తి మొక్కుటచే ప్రభవించిన ధూళిచేత కప్పబడిన పాదపీఠముకలిగి, వాసుకి అనెడు సర్పరాజముచేత బంధింపబడిన జటాజూటము కలిగి, చకోట పక్షులకు ప్రియుడైన చంద్రుని శిఖయందు ధరించినవాడు మాకు శ్రియములనొసగుగాక.౬. లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభానిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః- హోమాగ్నివలె ప్రజ్వరిల్లుచున్న లలాటాగ్ని కలిగి, ఆ అగ్నిలో పంచబాణుడైన మన్మథుని ధగ్ధము చేసినవాడు, లోకనాయకుడు, అమృతకిరణముల పంక్తిచేత విరాజిల్లుచున్న శిఖకలిగినవాడు మహాకపాలమును ధరించువాడు అయిన పరమేశ్వరునికి మ్రొక్కి మేము ఆయన శిఖలోని సంపదలకు ప్రాప్తులు కాగలము.౭. కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వలద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకేధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రకప్రకల్పనైకశిల్పినీ త్రిలోచనే రతిర్మమ- భీకరమైన ఫాలప్రదేశమున ధగద్ధగాయమాన జ్వాలలతో వెలుగొందు అగ్నిచేత మన్మథుని దాహించినవాడు, పార్వతీదేవియొక్క కుచములపైని చిత్రములు రచించువాడు (ఆమె యందు అనురక్తి కలవాడు), మాహాశిల్పి (లోకసృష్టియందు) అయిన త్రిలోచనునియందు నా మనస్సున్నది.౮. నవీనమేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్కుహూనిశీధినీతమః ప్రబంధబద్ధకంధరఃనిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురఃకళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః- క్రొత్త మేఘముల సమూహము వంటిది, దురాపదలను నిర్మూలింపదగినదయి స్ఫురించునది, కుహూరాత్రియందు చీకటి మాదిరి భాసించు నల్లని కంఠము కలిగినవాడు, గంగానదిని ధరించువాడు, గజచర్మాంబరధారీ, చంద్రకళాధరుడు, జగత్కళ్యాణకర్త మాకు శ్రియములు చేకూర్చుగాక౯.ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభావలంబికంఠకందలీ రుచిప్రబద్ధకంధరమ్స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదమ్గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే- వికసించిన నీలసరోజ సమూహమువలె నల్లని ప్రభ తోచు కంఠసీమను అవలంబించినడి అను భ్రాంతి కలిగించువిధముగా సర్పాలన్కృత కంఠముచేత భాసిల్లువాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను.౧౦. అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీరసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతమ్స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకమ్గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే- సమస్త మంగళములనూ పొడిగించువాడు, కదిమిపూల తేనెయందు అనురక్తి కలిగినవాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను.౧౧. జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వసద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళఫాలహవ్యవాట్ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః- భుజంగోచ్చ్వాసనిశ్వ్వాసలు ఆకాశముచేయు జయజయధ్వానములు కాగా, బయటికి వెల్వడు ఫాలప్రదేశ విస్ఫులింగములు క్రమముగా చేకూర, ధిమిధిమి నాదములతో ఢమరుకము ఉచ్చమంగళరీతి మ్రోగగా వాటికి అనుగుణముగా ప్రచండతాండవము చేయు పరమశివుని ...౧౨. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్ఠరత్నలోష్టయోః సహృద్విపక్షపక్షయోతృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయోసమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్- చూడగా, విచిత్రములైన లోకరీతులు - భుజంగహారము కానీ, ముత్యపుసరము కానీ, అమూల్యరత్నము కానీ, లేక మట్టి గానీ, తనవాడు కానీ లేక పెరవాడు కానీ, గడ్డివంటి కనులుండనీ, లేక అరవిందలోచనుడు కానీ, సామాన్యుడు కానీ మహారాజు కానీ, నేను సమముగా తలచి ఎప్పుడు మహేశ్వరున్ని సేవించగలను.౧౩. కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలింవహన్విలోలలోలలోచనో లలామఫాలలగ్నకఃశివేతిమంత్రముచ్ఛరన్ కదా సుఖీ భవామ్యహమ్- ఎప్పుడు నేను సురనదీతీరమున గల సుందరవనములయందు వసించి దుర్మతిని వీడి, సదా శిరస్సుపైన అంజలి చేర్చి, వికలమైన చూపు లేక, ఫాలలలామునియందు మనస్సు చేర్చి, "శివ" అను మంత్రము జపించుచూ సుఖించెదను?

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

గురుపూజోత్సవం సందర్భంగా మా గురువుగారు శ్రీ రసరాజు గారు రాసిన పాట మీతో పంచుకుంటున్నాను.పల్లవి:గురువంటే ఎవరుగుడివెలుపలి దైవంచీకటి చిందేసినపుడు వేకువలో ధైర్యంఆ ప్రేమను తూచగలుగు సాధనమేదిఆ గురుపూజకు మించిన ఇంధనమేదిచరణం:మూడు శక్తులూ కలిసిన తేజమదిపుడమికి పరిమళమిచ్చే బీజమదిఎపుడూ తలపై ఉండే ఛత్రమదిఎదలో సుధ వెలికితీయు చైత్రమదిగురుశబ్దం, తరుశబ్దం నీడనివ్వడానికేచరణాలకు గమనదిశను చాటిచెప్పడానికే ౹౹పల్లవి౹౹చరణం2:ఎంతపంచినా తరుగని కోశమదిఎవరెస్టును చూపించే హస్తమదిరేపటి బ్రతుకును చూపే ఉదయమదిరేవును దాటించు జ్ఞాన నావయదిగురుశబ్ధం, తరుశబ్ధం నీడనివ్వడానికేచరణాలకు గమనదిశను చాటిచెప్పడానికే ౹౹పల్లవి౹౹శ్రీ కిషోర్ గారు, నోయిడా(అమెరికా) ఈ పాట గానం చేశారు. ఆ యూట్యూబ్ లింక్ ద్వారా చూడండి.https://youtu.be/xckMKmYb9yM - దుర్గాప్రసాద్ దంపూరి

29, ఆగస్టు 2020, శనివారం

*నా తెలుగు* ......శ్రీధూర్జటిఆ.వె౹౹ తీయనైన బాస...తేనెలొలుకు బాస...తేటి మాట మూట... తేట వూట...తరచి... తరచి చదువ తనివితీరదెపుడుతీపి రుచుల మావి తెలుగు బాస...!! ★సీ౹౹నన్నయ తిక్కన యర్రనలుగలసి నుదుట కుంకుమ రూపు నిలిచి మెరిసె శ్రీనాథు కలమున శ్రీలు పొంగిన కవిత ఆభరణమ్ములైనందగించెఆంధ్రభోజుని యింటి అష్టదిగ్గజ కవుల్ అందెల సవ్వడైనలరు దొడగె మొల్లలల్లిన రాత ముచ్చట గాజులై గల గల రవముల గారవించె ఆ.వె౹౹పాల్కురికియు మరియు పినవీరభద్రుడు పట్టుచీర వోలె పరవశించె కవుల మొయిలి గుంపు కావ్యమాగాణిపై తేనెజల్లుబోయ తెలుగు తడిసె ★ సీ౹౹కొమ్మలందున జేరి కోయిల పాటలా అలరించి పాడెనె అన్నమయ్య రామరామయనుచు రాచిలక పలుకై రాజిల్లి మురిసెను రామదాసు వేమన బద్దెన వెంకయ్య గారలు దుక్కి దున్నె తెలుగు ధరణి యందు గురజాడ జాషువా గిడుగు చిన్నయ సూరి సేవ చేసిరిచట ఛేవ తోడ ఆ.వె౹౹వంద వేల సంఖ్య వచ్చిరి కవులౌర...!! కదన తొక్కినారుకవనసీమ మార్పులెన్నొ తెచ్చె మన భాష యందున కాని చిదుప లేదు కొంచమైన....!! ★ఆ.వె౹౹కొత్త రుచులు కోరి కోయిల గీరగా గార్డభంబు వలెను గానరీతి వేష భాష మారి వంకర నడకతో వగచుచున్నదయ్య వనిత తెలుగు ★ తే.గీ౹౹ తిరిగి పొందవలయు పూర్వ తీరు తెన్ను తెలుగు వెలగవలయు నిల్చి తెల్లవార్లు నవ్వ వలయు తెలుగు నాడు నవ్వినట్లు దేశ భాషలం దెపుడును తెలుగులెస్సె....!! ********************అందరికి తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు గిడుగు పంతులుగారికి నమస్సులు

3, ఆగస్టు 2020, సోమవారం

పుష్ప విలాపాన్ని గుండెల్లో వినిపించిన కరుణశ్రీ 108వ జయంతి ఈరోజు.. ........నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు! హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు; బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు; బండబారె నటోయి నీ గుండెకాయ! శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?....బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్య చేసే హంతకుండ! మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె! కోయ బోకుము మా పేద కుత్తుకలను అకట! చేసేత మమ్ముల హత్య చేసి బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు; ఏమి తోచక దేవర కెరుక సేయ వట్టి చేతులతో ఇటు వచ్చినాను

30, జులై 2020, గురువారం

చమత్కార పద్యం ఏకాక్షరి దాదదో దుద్దదుద్దాదీ దాదదోదూదదీదదోః | దుద్దాదం దదదే దుద్దే దాదాదద దదోऽదదః || ప్రతిపదార్థ : దాదదః =శ్రీ కృష్ణుడు,దుద్దరుత=వరముల నన్నిటిని,దాదీ=ఇచ్చువాడు, దాదదః=పాపములను దహించు వాడు,దదోః=దుష్టులను,దూదదీ = శిక్షించు వాడుదుద్దాదం = మంచి వారిని ,దుద్దే = కాపాడుట యందు ,దదదే = దీక్ష గలవాడుదదోదదః = ధర్మాధర్మములను ,దాదా = మిక్కిలిగా ,ద ద = ధరించువాడు అనగా ధర్మమును ,అధర్మములోని ధర్మమును కాపాడు వాడుభావంశ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు.సేకరణ:-- ఆర్. వి. కృష్ణ (అనంతపురం) (వాట్స్ ఆప్ సందేశం)

28, జులై 2020, మంగళవారం

సతీసావిత్రి ఎపిసోడ్చిత్రం : ఉమ్మడి కుటుంబం (1967)సంగీతం : టి.వి.రాజుసాహిత్యం : సముద్రాల జూనియర్ గానం : ఘంటసాల, ఎం.ఆర్.తిలకంఎవరీ దివ్యమూర్తి చూడగ నా పతి ప్రాణముల్గొనిపోవచ్చిన యమమూర్తి వలె నున్నాడేఓహోహోహో.. ఏమి ఆశ్చర్యమూభహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్కఅన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబుఈ అన్నుల మిన్నకెటుల గానుపించె ఐనను ప్రకాశముగాసావిత్రీ ! మానినీ ఆహ్హ్హహ్హహ్హహ్హహ్హహ్హనిర్నిమిత్త సందేహడోలాయ మానసవైఏల అట్లు దిగాలున చూచుచుంటివిసామాన్య మనీషాగోచరంబైనమద్రూప విశేషంబు గాంచియేనేనెవ్వరో యూహించి ఉండజాలుదువుఐనను వచించెదక్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపుఒరిగినా ఒక ప్రక్క కొరుగుగాకవేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలునాలుగు మూడైన అగునుగాకపరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందుతాళము తప్పిన తప్పుగాక !చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణపలికినా అపశృతుల్ పలుకుగాకసకల లోకాల ధర్మశాసనము నమలుచేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానెవేళ తప్పక ప్రాణాలు వెలికిదీసిమోసికొని పోవుచుండు యముండ - అబలా !సావిత్రీ ! ఇదిగో నీ పతి ప్రాణంబుల్ గొనిపోవుచున్నాడఅయ్యో ! అయ్యో ! ఆ!నాథా ! నాథా !హ్హహ్హహ్హ మహిషరాజమా మరలుము పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !పోవుచున్నావా !సుంతయేని కరుణ మానిసుంతయేని కరుణ మానికాంతుని ప్రాణములను గొనిపోవుచున్నావా !ఆహా ! ఏమీ ఈ సాధ్వీలలామ సాహసముదుర్గమ కీకారణ్య ప్రయాసము సైతముశైవించినన్ననుసరించు ఈమె స్థైర్యము సంస్తవనీయమైననూ..అహో.. నిష్ప్రయోజనమే... కనుక.. చెప్పి చూచెదను గాకకాలు మోపిన చాలు కస్సని అరికాలుకోసుకుపోయెడి కూసురాళ్ళుఅలికిడైనను చాలు అదరి బుస్సున లేచిపడగెత్తి పైబడు పాపరేళ్ళుఅడుగుపెట్టిన చాలు ఒడలు జిల్లున లాగినరములు కుదియించు నదుల నీళ్ళుగాలి దోలిన చాలు కదలి ఘీ..యని కర్ణపుటములు ప్రేల్చెడి ముది వెదుళ్ళుపులులు సింహాలు శరభాలు పోవ పోవకటిక చీకటి కనరాదు కాలిదోవమరలిపొమ్మిక విడువుము మగని ఆశమాట వినవేల ఓ బేల మరలవేలా..ఆఆ...పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్నా వెంట రా తగదు రావలదు రా తగదు రావలదుపోపోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్చీమలు దూరని చిట్టడవులలోకాకులు దూరని కారడవులలోచీమలు దూరని చిట్టడవులలోకాకులు దూరని కారడవులలోలబోదిబోమని అఘోరించినాలబోదిబోమని అఘోరించినాఫలితము సున్న మరలుము మెదలకపోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !పోవుచున్నావా !ఆహా ! ఏమి ఈ బాల అచంచల మనఃస్థైర్యమూదుర్గమ కీకారణ్య సీమలనధిగమించుటయే గాకమహోన్నత పర్వత శిఖరాగ్రమ్ముసైతమధిరోహించినన్ననుసరించుచున్నదే హొహ్హో మరియునూమరికొంచెము బెదరించి చూచెదను గాకచెప్పిన వినవు చెముడా గిముడాపట్టిన పంతము విడువవుగాచెప్పిన వినవు చెముడా గిముడాపట్టిన పంతము విడువవుగాఏమనుకొంటివి ఎవడను కొంటివిఏమనుకొంటివి ఎవడను కొంటివిసముండను పాశధరుండనుకాల యముండను ఆహ్హహ్హహ్హహ్హ...పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్ ఫో..ఆహో.. ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమాబేలా సావిత్రీ ఇక మానవ మాత్రులు దాటలేని బాట యిదిగోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకుఅరంఘనీయమైన వైతరణి అల్లదిఅన్నియునూ తెలిసిన ధర్మ వేదులుమీరుఇంత దూరమేతెంచి రిక్త హస్తములతో తిరిగి పొమ్మందురామరి ఏమందును... హ్మహుహు ఇదియునూ నిక్కంబుకనికరించి ఏదైనా ఒక్క వరంబునొసంగి పంపెదసాధ్వీ నీ కార్యదీక్షతకు కడుంగడు సంతసించితినీ పతి ప్రాణంబు దక్క ఏదైనామరొక్క వరంబు కోరుకొనుము ఇచ్చెదఈ యముని కర్కశ హృదయంబుకూడా కరుగుచున్నట్లున్నదిఇచ్చిన అవకాశమేల జారనీయవలెస్త్రీలకు పుట్టినింటికన్నను మెట్టినిల్లేప్రధానమని కదా ఆర్యోక్తియమధర్మరాజా ఆ! రాజ్య భ్రష్టులై అంధులైకారడవులందు కటకటంబడు మా అత్తమామలకు సరియ సరియ రాజ్య ప్రాప్తియూ నేత్ర దృష్టియూరెండునూ ఒసంగితిని పొమ్ముఆ ! వదలక వచ్చుచున్నదేఐనను ఇటువంటి వరంబులెన్ని యొసంగిననుమా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదాకనుక మరొక్క వరంబొసంగి లాలించి బుజ్జగించిఊరడించి మరలించెదసావిత్రీ అబలవన్న ఆదరంబునఒంటి వరంబొసంగుట పాడికాదని భావంభునమరొక్క వరంబీయ ఇచ్చగించితీఅదియును నీ పతి ప్రాణంబు దక్కఆ ! ఇప్పుడు దారిన పడినాడుఈ అవకాశమును మాత్రమేల పోనీయవలెకన్నవారి ఋణము తీర్చెదసమవర్తీ అపుత్రస్య గతిర్నాస్తి అనిఅలమటించు నా జనకునకుఆ! ఇక చాలు బాబోయ్ అను అటులసుతశతంబనుగ్రహించితిసంతుష్టవై మరలిపొమ్ముఒకటి నే కోరితి రెండు నీవిచ్చితిముచ్చటగా మూడవ కోర్కెచెల్లించకుండుట పాడియే ధర్మమూర్తీఊ ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదేఐనను ఆఖరి కోరికని వాపోవుచున్నది ఇచ్చి పంపెదసావిత్రీ స్వామీ అడుగుముఅదియును నీ పతి ప్రాణంబు దక్కసంతానమును చూసియైననుసంతసించు భాగ్యమును ప్రసాదింపుముప్రసాదించితిని పొమ్ము.. ఊ !ఇంకెక్కడికి పోయెదవుఏమీ ! నా పతి ప్రాణంబులీయకఅడుగు వేయలేవుఏమీ అడుగువేయలేనామహిషరాజమా.. ఊ !..ఏమాశ్చర్యము దేవాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుషయక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులెత్తి వచ్చిననూ..విలయ రుద్రుని ప్రళయ తాండావ ఘోష విన్ననూనెమరాపక అడుగు తప్పక తలతిప్పక ముందుకు సాగిపోవునా మహిషరాజము నేడేలనో తత్తరపాటున బిత్తరపోవుచున్నదే...హహహహహహహ..ఊ... నీవు సాధ్వీయే అనుకొంటిని ఇంద్రజాలవు కూడానాఇది ఇంద్రజాలము కాదు ధర్మబద్ధమే ధర్మబద్ధమా... నాకు తెలియని ధర్మమాయమధర్మమునకు పైన మరొక్క ధర్మమా ఎటుల అమరులెటులైన సంతాన మందవచ్చుమనుజ లోకాన సాధ్వులు మగడు లేకపుత్రసంతాన మేరీతి పొందగలరుతమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !ఆహా ! పతివ్రతా శిరోమణి యన్న వాత్సల్యంబున వచ్చియుంటినికాని ఇంతటి తెలివి గలదని తెలిసి యుండిన నేను రాక నా భటులనే పంపియుండెడివాడను కదా గతంబునకు వగచి ప్రయోజనంబేమి కనుకసాధ్వీ సావిత్రీ నీ పతి భక్తికి సమయస్ఫూర్తికీకడుంగడు సంతసించితి ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము హహహయముడంతవానినే తికమక బెట్టి గెలువజాలిన నీ చరిత చరితార్ధము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములనుభవించి తదనంతరంబున నా లోకంబున అహ్హ! కాదు కాదు స్వర్గ లోకంబున జేరితరింతురు గాక తరింతురు గాక తరింతురు గాకBy వేంకట భవానీప్రసాదు

27, జులై 2020, సోమవారం

పరిసరాలు – 15 నాలుగు పద్యముల్ కెలికి, నాకు సమాన కవీంద్రుడెవ్వడూనాలుగు దిక్కులూ వెతికినా కనరాడని నోరు జారు వాచాలురు ఎందరో కలరు; చాలును, వారికి సభ్యతా విధానాలును వంట బట్టినచొ నాణ్యత కూరును కూసు విద్యకున్!28. బంధం గట్టిగా ముడిపడాలంటే భావాల రాపిడి, మాటల మార్పిడి తప్పనిసరి. ప్రాచుర్యంకంటే పరిపక్వతకు ప్రాధాన్యతనిస్తే సమాజం ప్రభావితం అవుతుంది. ప్రతిభ ప్రశంసలను పొందడం తథ్యం. దానినెవ్వరూ ఆపలేరు! అభిప్రాయాలన్నీ మూసపోసినట్లు ఒకే విధంగా ఉండవు. విమర్శలు సహజం. వాటి వలన కసి, వాసి పెంచుకోవాలే కాని, వ్యక్తిగత దూషణలతో రచ్చకు దిగటం రచయితకు, అతని ప్రతిభకు శోభనీయదు. తన భావాలను ఇతరులు గౌరవించాలని కోరుకునే ప్రతివారూ ఇతరుల ఆభిప్రాయాలను గౌరవించడం నేర్చకోక తప్పదు! అపర కవీంద్రు లెందరొ మనందరి మధ్య విశేష రీతిలోనెపముల నెంచుచూ కవిత నిండిన గానము చేయుచుండగాఉపశమనంబు కానపడ దూరట మృగ్యముగానె ఉండగా,కపటము చాల ప్రస్ఫుటముగానగు గోచర మెంత దాచినా!29. నేడు లక్ష్మీ పుత్రులకు సరస్వతీ పుత్రులు దాసులైనారు కాబోలు! లబ్దప్రతిష్ఠుల ఆశ్రమంలో సుఖజీవులై, బోదియ నీడన కునుకుతీస్తున్న వారికి పేదల వేదనారోదన చెవిన పడదేమో! కలవరింతలో పలకరించినా ఊరట, ఉపశమనానికి మారుగా, కపటం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది!

25, జులై 2020, శనివారం

మ. నవరత్నోజ్జ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయోధ్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరీ భూమి సంస్తవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కీయెడన్భువి పాలింపు ప్రజాను రంజకముగా మోదంబుతో రాఘవా ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతిఁ జేసిరొ అట్టి తల్లి సీతా మహిళాశిరోమణిని దారుణ కానలవీధి కంపగానీ మది ఎట్టులొప్పె ఎట నేర్చితివీ కఠినత్వ మగ్రజా. ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె తల్లి దుశ్చింతులు దైత్యుచేఁబడిన సీతనుఁ గ్రమ్మఱ ఏలుచున్నవాడెంత విమోహి రాముఁడని ఎగ్గులు వల్కిన నాలకించి భూకాంతుడు నిందఁజెంది నిను కానలలోపల డించి రమ్మనెన్చ. ప్రతిదినమేనుఁ దొల్దొలుత పాదములంటి నమస్కరించి నీఅతులితమైన దీవనలనంది చరింతు తదీయ భాగ్యమేగతియెడమాయె నింకెపుడుఁ గాంతు భవత్పదపద్మముల్ నమశ్శతములు సేతునమ్మ కడసారి గ్రహింపుము జానకీ సతీ. ఇదెమన ఆశ్రమంబు ఇచట నీవు వశింపుము లోకపావనీసదమల వృత్తినీకు పరిచర్యలు సేయుదు రీ తపశ్వినుల్ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీపదములు సోకి మా యునికి పావనమైఁ జెలువొందు నమ్మరో...

🌺పద్యానికి పట్టాభిషేకం🌺 పద్యాలను తప్పక వినండి"లవకుశ"భారతీయ చరిత్రలో నిత్యజీవన స్రవంతిలా మమేకమైన ఒక దివ్య చరితమ్. అలాగే సినిమా చరిత్రలో సి.పుల్లయ్యగారి లవకుశ చిత్రం కూడా అజరామరం... ఈ చిత్రానికి ఘంటసాల గారి సంగీతం సుధా స్రోతస్విని. ఉత్తర రామాయణ మాధుర్యాన్ని, మహాత్మ్యాన్ని తెలిపే దృశ్యకావ్యం"లవకుశ"అయితే లవకుశ చిత్ర మాధుర్యాన్ని మరిచిపోకుండా,మరువనియ్యకుండా ఈనాటికీ ఆ చిత్రం లోని పాటలు,పద్యాలు ప్రతి తరాన్ని,ప్రతి వర్గాన్ని ఎంత సొంతం చేసుకున్నాయో తెలియజేయటానికే ఈ పోస్ట్... "ఏకోరసః కరుణ ఏవ"అన్న భావనతో కరుణరసానికి అగ్రతాంబూలమిచ్చిన మహాకవి భవభూతి సంస్కృతంలో రచించిన నాటకం"ఉత్తర రామచరితమ్"ఎంతో కరుణరసాభరితమైన ఈ ఉత్తర రామచరితను తెనుగుసేత చేసిన వారు ఇద్దరు. ఒకరు తిక్కన.మరొకరు కంకంటి పాపరాజు...ఉత్తర రామచరిత ప్రబంధ కార్యకర్త... ఇందులో సీతమ్మవారి ప్రతి కన్నీటి చుక్కలోని అంతరార్ధానికి అక్షరరూపాన్ని ఇచ్చిన మహనీయుడు కంకంటి పాపారాజు.. దీన్నే ఆధారంగా తీసుకొని లవకుశ చిత్రాన్ని ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేసారు నిర్మాత శంకర రెడ్డి... మరెవరూ రాయలేనంత హృద్యంగా, అందరికీ అర్థమయ్యే భాషలో పాపరాజు తీర్చిదిద్దిన ఉత్తర రామాయణాన్ని రమణీయ దృశ్యకావ్యంగా ‘లవకుశ’లో సందర్భానికి తగినట్లు ఆయన పద్యాల్నే యథాతథంగా వినియోగించుకున్నారు. 'ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె విన్ముతల్లి...’, ‘రామస్వామి పదాంబుజంబు లెద నారాధింతునేనిన్‌ సదా...’, ‘రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి...’’ లాంటి పాపరాజు పద్యాలు వెండితెర ద్యశ్యాలకు ప్రాణంపోశాయి. ‘‘పాపరాజుగారి సీతమ్మ నిజంగా కరుణా ప్రబంధమే. బమ్మెర పోతరాజుగారంత ఆవేశంతోనూ పాపరాజుగారు రచన చేస్తారు. వారి పద్యాలు వెంటనే హృదయానికి హత్తుకుంటాయి’’ అన్నారు ఆరుద్ర. ‘‘మృదుపదవిన్యాసం, అర్థసందర్భం, రస సంపద వంటి కవితా గుణాలు ఉన్న ఉత్తమకవిత్వమ’’ని కంకంటి కవితావైభవాన్ని ప్రస్తుతించారు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి. సీతారాములిద్దరూ ధర్మప్రతిష్ఠాపన కోసం నెరిపిన ఆదర్శ దాంపత్యాన్ని, లోకకల్యాణం కోసం అనుభవించిన వియోగాన్ని ఆర్ద్రంగా అక్షరీకరించి పాఠకుల హృదయాలను కరిగించిన కవి కంకంటి పాపరాజు.. ఇక ఈ సినిమాలోని పద్యాలు లవకుశ పద్యాలుగానేప్రసిద్ధిచెందినయి.. *సేకరణ*లవకుశ పద్యాలు అంటే లవకుశులు పాడినవి కావుఁగాని లవకుశ పేరుఁగల సచ్చిత్రరాజ నిక్షిప్త పద్యాలని నా భావన. నేను విన్నవీ, వింటూన్నవీ, నా మనస్సును హత్తుకున్నవీ ఈ పద్యరత్నాలు. పైగా ఘంటసాల గారి అసదృశగాత్ర సుధారసాన్విత పద్యాధారస్వాదన నిరుపమాన భాగ్యమే కదా.మ. నవరత్నోజ్జ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయోధ్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరీ భూమి సంస్తవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కీయెడన్భువి పాలింపు ప్రజాను రంజకముగా మోదంబుతో రాఘవా(అన్వయము = వంశము)తా. వశిష్ఠుడు రాముణ్ణి సంహాసనారూఢునిఁ జేసి పల్కిన వాక్కులివి. "నవరత్న ప్రభాజితమైన ఈ కిరీటము పూర్వము సూర్వవంశీయ రాజులు ధరించి రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలించారు. ఈ ఘనమైన కిరీటము నీవు ధరింపఁదగినది. ధరించి ఇధ్ధరను మోదముతో ప్రజామోదగా పాలింపవయ్యా రఘువంశీయుడా"ఉ. ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతిఁ జేసిరొ అట్టి తల్లి సీతా మహిళాశిరోమణిని దారుణ కానలవీధి కంపగానీ మది ఎట్టులొప్పె ఎట నేర్చితివీ కఠినత్వ మగ్రజా(సుత్రాముడు = ఇంద్రుడు, హవ్యవాహనుడు = అగ్ని)రఘువంశ కీర్తిప్రతిష్ఠలకు కళంకముఁ దెచ్చు నపవాదు ప్రజలలో వ్యాప్తము కాకమున్నె రాజ్యపరిత్యజమో, కళత్రపరిత్యాగమో చేయవలనని సంకల్పించియున్నవాడు శ్రీరాముడు. పట్టముఁ గట్టించుకొనుటకు తమ్ములెవ్వరూ ముందుకు రారయ్యె, భార్యావియోగమే మార్గమయ్యె. సీతను భగీరథీ నదతీరము వద్ద విడిచిరమ్మని లక్ష్మణుఁ నాజ్ఞాపించెను. ఆ క్షణమున లక్ష్మణుని ఆక్రోశమే ఈ పద్యముఉ. ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె తల్లి దుశ్చింతులు దైత్యుచేఁబడిన సీతనుఁ గ్రమ్మఱ ఏలుచున్నవాడెంత విమోహి రాముఁడని ఎగ్గులు వల్కిన నాలకించి భూకాంతుడు నిందఁజెంది నిను కానలలోపల డించి రమ్మనెన్గర్భవతియైన సీతను, ఏమఱచియున్న అబలను అడవుల పాలుఁజేయు దుస్సహ కార్యము రామప్రియానుజుని పైబడినది. అడవిలో కీడు శంకించుచూ కారణమడిగిన సీతకు లక్ష్మణుని బదులు పద్యమిది. "ఇలాంటి ఘోరకృత్యము తలపెట్టి నిమిత్తము నీకు చెప్పకుండా ఉండగలనా? దురాలోచనా పరులైన రాక్షసుల వద్ద యుండిన సీతను తిరిగి స్వీకరించిని మోహితుడు రాముడను దుష్టనిందను విని, అపవాదు కలుగునని, అయోధ్యాధిపతి నిన్ను అడవులలో దించి రమ్మనెను"చ. ప్రతిదినమేనుఁ దొల్దొలుత పాదములంటి నమస్కరించి నీఅతులితమైన దీవనలనంది చరింతు తదీయ భాగ్యమేగతియెడమాయె నింకెపుడుఁ గాంతు భవత్పదపద్మముల్ నమశ్శతములు సేతునమ్మ కడసారి గ్రహింపుము జానకీ సతీతా. "అనుదినము నీ పాదములకు దండము పెట్టుకుని నీ ఆశీస్సుల తీసుకొని వెడలు వాడను, ఇక అట్టి భాగ్యము నాకు దూరమవుతున్నది కావున, చివరి సారి శతనమస్కారములు స్వీకరించుమమ్మా, సీతమ్మా" అని బాధపడు లక్ష్మణుడు.ఒక్క మాటు కిష్కింధకాండ గుర్తుతెచ్చుకోండి. ఆకాశము నుండి పూర్వము ఒక స్త్రీ పడవేసిన నగల మూటను రామసౌమిత్రుల వద్దకు తీసుకువస్తారు వానరులు. ఆ అబల సీతయై యుండవచ్చునని ఊహించిన రాముని మనస్సులో పెల్లుబికిన బాధవల్ల కన్నులు చెమర్చినాయి. నగలని చూడలేక, ప్రక్కనే ఉన్న లక్ష్మయ్య చేతఁబెట్టి గుర్తించమన్నాడు. నగలను పరికించి చూచి,నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్వభి జానామి నిత్యమ్ పాదాభివందనాత్అని బదులు చెప్పాడు ఆ సౌశీల్య గుణగరిష్ఠుడు. పై పద్యం వింటూంటే ఈ శ్లోకం గుర్తుకు రాదూ?అదృష్ట వశాన వాల్మీకి ఆశ్రమఛాయలకు చేరుతుంది జానకి. అత్యంతాదరణానురక్తులతో ఆశ్రమవాసులు ఆమెకు స్వాగతము పలుకుతారు. అయోనిజ దురదృష్టానికి చింత కలిగినా, ఆమెకు ఆతిధ్యమిచ్చే భాగ్యము తమదైనందుకు ఆశ్రమవాసుల ఆనందానికి అవధులు లేవు. వాల్మీకి స్వాగత వచనా లివి.చ. ఇదెమన ఆశ్రమంబు ఇచట నీవు వశింపుము లోకపావనీసదమల వృత్తినీకు పరిచర్యలు సేయుదు రీ తపశ్వినుల్ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీపదములు సోకి మా యునికి పావనమైఁ జెలువొందు నమ్మరో... చదువుతుంటేనే కళ్ళు చెమర్చటం లేదు... ఇటువంటి అద్భుతమైన పద్యాలను ఘంటసాల గారి గుండె లోతుల్లోని ఆవేదనను, ఆర్ద్రతను,ఆప్యాయతను ఇలా ఎన్నో ఫీలింగ్స్ ను ఆ గళం ఎలా పలికిందో మనందరికీ ఇప్పటికీ జ్ఞాపకమేకదా... ఆయన దారిలోనే ఏకలవ్య శిష్యుడైన ఆయన భక్తుడు ఈ తరపు ఓ గ్రామీణ యువకుడు ఎంత చక్కగా ఘంటసాల వారికి స్వరార్చన చేసాడో... ఆ యువకుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ...అతని పేరు శ్రీనివాస్...ఇవిగో పద్యాలు...

13, జులై 2020, సోమవారం

స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు #Brokers, #Banks నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది. ( కొంత మంది మాత్రమే) %%%%ముందుగా Brokers చేసే మోసాలు%%%%%1) #Brokers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు. సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి సంపాదిస్తారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడే వారు ( కొంత మంది కి మాత్రమే) 2) 2% broker commision తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ brokers వస్తారు. మనలని రెచ్చ కొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు. 3)నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.4) ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే #registration office లో #EC తెస్తే తెలుస్తుంది. 300 అవుతుంది EC కి.5) కొనే ముందు original #sale #deed (Original document) లో ఉండే యజమాని photo చూడండి. అన్ని links documents history చూడాలి.6) ఎట్టి పరిస్థితుల్లో #Sale agreement ( #contract) min 3months ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్న 3Months తక్కువ వెయ్యవద్దు. ఈరోజు ఏమి జరుగుతుందో తెలియదు. Agreement amount 5-10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. #Agrement cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.7) మీ సొంత మనుషులు, మీ స్నేహితులు చెప్పే మాటలు నమ్మవద్దు. వల్లే #commission కోసం కకృతి పడతారు.8.) A, B brokers ఉన్నారు అనుకుందాం. A broker నీకు తెలుసు, వీడు B broker దగ్గరకి బేరం కోసం తీసుకొని వెళ్తాడు. యజమాని B broker కి agrement వేసాడు అని అబద్ధం చెపుతారు. స్థలం రేట్ 1Lakh అనుకుందాం, స్థలం యజమానికి తో ఈ brokers 1Lakh కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకుంటాము అని deal చేసుకుంటారు. అప్పుడు B broker 1,10,000 కి కొనే వారి దగ్గర బేరం కుదుర్చుకుంటాడు. 9) ఎట్టి పరిస్థితుల్లో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితోనే మాట్లాడండి. ఈ brokers యజమాని busy గా ఉన్నాడు, వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్దాలు చెపుతారు. కనీసం video call లో ఇన మాట్లాడండి. యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.10) మీరు కొనే స్థలం , వాటి డాకుమెంట్స్ #address నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో మంచి area లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు. మీరు అనుకున్న స్థలం orginal స్థలాలు వేరుగా ఉంటాయి.11) original స్థలం size, document స్థలం size లో తేడాలు ఉంటాయి. #Documents required for Property1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి. 2) All Linked Documents3) అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవాడి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.5) EC - Encumbrance certificate (EC)6) #Mother deed certificate7) #RTC - Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)8.) Survey Sketch9) #Layout Approval10) #Katha Certificate11) #DC #Conversion certificate ( agriculture to Non-Agriculture land conversion) 12) #Property Tax Certificate13) SC, ST సోదరులకు ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది. అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు.14) పేద వారికి ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది, అటువంటి స్థలాలు కొనకూడదు.14) #apartments ఐతే plan approval, OC, CC ఉండాలి. 3Floors కి plan approval తీసుకొని 4 or 5 floors కడతారు. వాళ్ళు బ్యాంక్ వాడితో link పెట్టుకొని మీ లోన్ easy గా చేపిస్తారు resale అప్పుడు problem అవుతుంది.15) మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని brokers చెప్తూ #commission తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.16) స్థలం కాగితాల copys ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకండి. ఆ copy #paper ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి చెడు చేసే అవకాశం ఎక్కువ.17) ఇల్లు కట్టి ఉంటే #building #Plan #approval ఉండాలి.18)Agrement రోజు, #Registration ముందు రోజు EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర Agrement వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.19) ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా #underground #drainage ఉన్నదా. #Land govt ప్రజా అవసరాలకు తీసుకుంటున్న కోనకూడదు.20) ఇప్పుడు Online Registration process ఉన్నది. 15Years back online లేదు ఆ time లో ఒకే property ని ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేశారు మోసం చేసి. 21) మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.http://registration.ap.gov.in/http://registration.telangana.gov.in/....**** #Loan తీసుకొనేఅప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసే మోసాలు*****1) ఎట్టి పరిస్థితుల్లోనూ Broker లేదా యజమాని Refer చేసిన బ్యాంక్ లో Loan తీసుకోవద్దు. వాళ్ళు బ్యాంక్ వాడికి కమిషన్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నది. Agrement time period లో మీకు loan sanction కాకుండా చేసి agreement డబ్బులు brokers, bank, owner పంచుకుంటారు.2) బ్యాంక్ Loan రావాలి అంటే పైన చెప్పిన documents compulsary ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ loan ఇవ్వదు. 3) బ్యాంక్ loan 70% నుంచి 80% వరకు ఇస్తారు. అది కూడా మీరు Registration Document లో చూపించిన Property value లో. Property government value 5Lak అనుకోండి. Actual market price 30Lak అనుకోండి. మీకు loan 15Lak కావాలి అనుకోండి. అప్పుడు మీరు registration document లో 20L చూపించి Register చేసుకోవాలి. మీకు 20L లో 75% అంటే 15L బ్యాంక్ లోన్ ఇష్టది. 4) మీరు 20Lks registration document లో చూపిస్తే మీకు registration charges పెరుగుతాయి. స్థల యజమానికి TAX పడుతుంది. INDEX based Tax యజమాని Govt కి కట్టాలి. అందువల్ల యజమాని ఒప్పుకొడు.5) బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు processing fee ఉంటది min 10,000. 1.5% loan amount లో #Insurance తీసుకోవాలి . కొన్ని Banks (#DHFL) 5% కన్నా ఎక్కువ insurance charge చేస్తాయి మనకి తెలియకుండా Enable చేస్తారు. Mortage(తాకట్టు) registration బదులు 0.3% value లో #Revenue #stamp మీద లోన్ agrement వేస్తే సరిపోతుంది.6) Registration అప్పుడు #Bank #agent వచ్చి #check యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి zerox తీసుకోండి.7) పైన చెప్పిన process బ్యాంక్ లో చేసేది. అవి అవసరం లేదు మేము Loan ఇప్పిస్తాము , Sale agreement వేసుకొండి అని బ్యాంక్స్ చెపుతాను. 1Week లో Loan process complete అవుతుంది అని చెపుతారు. Agreement వేసుకొని వెళ్లిన తరువాత చుక్కలు చూపిస్తారు. 8) బ్యాంక్ లోన్ process min 20days పడుతుంది. బ్యాంక్ వెదవలు ( కొంత మందికి మాత్రమే) చెప్పే మాటలు నమ్మి sale agrement తక్కువ రోజుల్లో వేసుకోవద్దు. Min 3months agreement వేసుకోవాలి.9) #personalLoan తీసుకుంటే Processing fee ఉంటది, #Insurance optional. ముందే Insurance వద్దు అని చెప్పాలి.10) బ్యాంక్ Loan కి రెండు రకాల వడ్డీలు ఉంటాయి #fixed, #variable. #Fixed #interest ఐతే future లో వడ్డీ rates మారవు. Variable interest ఐతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్డీ rates మారుస్తూ ఉంటారు.11) pre Closing charges, #pre #Closing ఎన్ని నెలలు తరువాత చెయ్య వచ్చు. #Parshial #closing #charges వంటి వివరాలు తెలుసుకోవాలి.12) బ్యాంక్ వాళ్లు చెప్పిన ప్రతి మాటని #record చేసుకోండి. వాడు చెప్పిన దానిని #official mail నుంచి మీ mail కి పంపమని చెప్పండి.13) ఇప్పుడు కొంత మంది #Bank వాళ్లే పెద్ద దొంగలు, వారితో జాగ్రత్త14) బ్యాంక్ #EMI లో .. వడ్డీ + అసలు . ఉండాలి. కొన్ని దొంగ బ్యాంక్స్ వడ్డీ మాత్రమే తీసుకుంటాయి. #Principle మనం బ్యాంక్ కి వెళ్లి కట్టాలి. దొంగ rules ఇవి.15) #Land కొంటె #Income #Tax #Exception క్రింద రాదు. #House #Flat #Plot #Fraud #Mindgame #Careing #Land #Property #Bank #Brokers #Loan #HomeLoan #PersonalLoan #DHFL #IncomeTax #Registration #Documents #Brokers

3, జులై 2020, శుక్రవారం

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚కానీ ఎందుచేతో ఈ పద్యం జనబాహుళ్యం లో లేదుకార్యేషు యోగీ, కరణేషు దక్షఃరూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలుధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖1.కార్యేషు యోగీ 💰:పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹2. కరణేషు దక్షః 🤺:-కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾3. రూపేచ కృష్ణః🙏:-రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి.👌4. క్షమయా తు రామః🏹:-ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి5. భోజ్యేషు తృప్తః🍲🥘🍛భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.6. సుఖ దుఃఖ మిత్రం🤼‍♂:-సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు. 🙏🏻🙏🏻🙏🙏

28, జూన్ 2020, ఆదివారం

ఈ మధ్య ఊరెళ్ళి వచ్చాను.ఆకు పచ్చని పొలాలన్నీ చేపల చెరువులయిపోయాయి.మంచి నీళ్ళ చెరువేమో మురుగు కాలవయిపోయింది.రైతులందరూ కూలీలయ్యారు.కూలీలందరూ మహా నగరానికి వలస వెళ్ళి పోయారు.చదువుకున్న వాళ్ళందరూ ఇంజినీర్లయిపోయారు.చదువు లేని వాళ్ళు అప్పు చేసి ఖతరో, కువైటో వెళ్ళి, నానా కష్టాలూ పడి చేసిన అప్పు తీర్చిఇంక పడలేక ఉత్త చేతుల్తో మళ్ళీ ఊరొచ్చేశారు.కప్పల బెక బెక లూ, గాలి వాటమూ కనిపెట్టి, వాన రాకడ అంచనా వెయ్య గలిగిన రామయ్య తాతకి పక్ష వాతమొచ్చి మూలన పడి, ప్రాణం పోకడ కోసం ఎదురు చూస్తున్నాడు.క్యాలండర్ చూడకపోయినా తిధులు, అమావాస్యలు, పౌర్ణమిలు, పండుగలుచెప్పేసే సూరమ్మామ చచ్చి పోయిందని తెలిసింది.రోజూ ఇంత అన్నం పెడితే చాలు విఠలాచార్యకి కూడా తెలియని కధలన్నీ ఏడు రాత్రులు ఏడు పగళ్ళూ గుక్క తిప్పు కోకుండా చెప్పగలిగిన పళ్ళ వీరన్న కూడా పైకెళ్ళిపోయాడు.రేపో మాపో అన్నట్టు ఉన్న చాకలి ముసలి మామ్మవీధిలో కనిపించి "నువ్వు పుట్టినప్పుడు ఆరునెలలు వచ్చేవరకూ నేనే నీకు ఒళ్ళు తోమి స్నానం చేయించేదాన్న"ని గుర్తు చేసి మురిసిపోయి,"ఓ యాభై రూపాయలుంటే ఇవ్వు బాబా నాలుగు లంక పొగాకు చుట్టపీకలు కొనుక్కుంటా" అని అడిగింది. జేబులో వంద ఉంటే తీసి ఇచ్చేశాను.ముందు దండం పెట్టి తర్వాత ముద్దు పెట్టుకుంది.మనిషి దగ్గర చుట్ట కంపు వస్తుంది కానీ మనసు మాత్రంపుట్టినప్పుడు ఎంత స్వచ్చంగా వుందో ఇప్పుడూ అలాగే ఉన్నట్టనిపించింది.నారాయుడు తాత అయితే ఆధార్ కార్డు, తెల్ల కార్డు బయటికి తీసుకొచ్చి చూపించి,"ఇదుంటే చాలు రా మనవడా, నెలకి రెండొందల పింఛను, రూపాయికే కిలో బియ్యంవస్తాయి" అని ప్రపంచం లో ఏ సమస్యకయినా బ్రహ్మాస్త్రం తన దగ్గరే ఉన్నంత ధీమా గా చెప్పాడు.ఎంత అల్ప సంతోషులు? ఒక బిల్ గేట్స్ గురించి తెలీదు. ఒక ఒబామా గురించి తెలీదు.యోగా, ధ్యానం, ఐ-ఫోన్, అబధ్ధం ఇవేమీ తెలీదు.ఇప్పటి వరకూ మనం గ్రైండర్ లు వచ్చాక రుబ్బు రోళ్ళు, పురుగు మందులొచ్చాక పిచ్చుకలు,జనారణ్యాలు వచ్చాక పులులే అంతమయిపోతున్నాయనుకున్నాంకానీ, ఇలాంటి మనుషులు కూడా ముందు ముందు మనం చూద్దామన్నా కనిపించక పోవచ్చు.వీళ్ళతోపాటే కొన్ని కధలు, మాటలు, పాటలు, కొన్ని భావోద్వేగాలు అంతమైపోతాయి.మనమే తప్పుగా అర్ధం చేసుకున్నాం.మాయన్ లు చెప్పింది యుగాంతం గురించి కాదనుకుంట.ఇలాంటి "మనుషుల" యుగం అంతం గురించే అనుకుంట.మే నెల, 2013

17, జూన్ 2020, బుధవారం

సున్నితమైన శృంగార రచనని అందించడంఈ మనసు "కవి"కి మాత్రమే సాధ్యం..నాకేంతో ఇష్టమైన ఈ పాట..చిత్రం : రాజా రమేష్ (1977)సంగీతం : కె.వి. మహదేవన్గీతరచయిత : ఆచార్య ఆత్రేయనేపధ్య గానం : బాలు, సుశీలపల్లవి :నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లినా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లినా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...ఈ..ఈ..నేలమీది జాబిలి... చరణం 1:పిలిచెను కౌగిలింత రమ్మనీ...ఇమిడిపోమ్మనీతెలిసెను పులకరింత ఇమ్మనీ..దోచి ఇమ్మనీ...మనసుకు వయసు వచ్చు తీయనీ రేయినీఆ...ఆ...ఆ...వయసుకు మతిపోయి పోందనీ హాయినీతొలి ముద్దు ఇవ్వనీ..మరుముద్దు పొసగనీమలి ముద్దు ఏదనీ..మైమరచి.. అడగనీనేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లి...నా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...ఈ..ఈ..నేలమీది జాబిలి... చరణం 2:వెన్నెల తెల్లబోయి తగ్గనీ..తనకు సిగ్గనీకన్నులు సిగ్గుమానీ..మొగ్గనీ...కలలు నెగ్గనీతరచిన మల్లెలు ఫక్కుమనీ ..నవ్వనీ..పగటికి చోటివ్వక ఉండనీ..రాత్రినీ..దీపాలు మలగనీ...ఆ...తాపాలు పెరగనీ...ఆ..రేపన్న దానినీ ఈ పూటే చూడనీ...నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లి...నా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...ఈ..ఈ..నేలమీది జాబిలి...

31, మే 2020, ఆదివారం

🙏🦋పంచ పునీతాలు🙏🦋మొదటిది..వాక్ శుద్ధి:వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి. రెండవది..... దేహశుద్ధి:మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.మూడవది.....భాండ శుద్ధి:శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.నాలుగవది.......కర్మశుద్ధి:అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.ఐదవది..........మనశ్శుద్ధి:మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.💞💞💞💞💞💞💞💞💞💞💞💞రాసినవారికికృతజ్ఞతలు .

సలలిత రాగ సుధారస సారంసర్వకళామయ నాట్యవిలాసంమంజుల సౌరభ సుమకుంజములరంజిలు మధుకర మృదు ఝంకారంచరణం 1: ని దా ద ప నీ ప నీ దా ప మ గ మ గ పా..... స రి గఆ ఆ ఆ...కల్పనలో ఊహించిన హొయలూ..ఊ..ఊ...ఆ..ఆ..శిల్పమనోహర రూపమునొందీపద కరళములా మృదు భంగిమలాముదమార లయ మీరు నటనాల సాగెఝణన ఝణన ఝణ నొంపుర నాదంభువిలో దివిలో రవళింపగాప ద ప మ పా ఆ.....మ ని ద మ దా ఆ.....గ మ ద నీ సా ఆ.....రీ సా రీ సా ని ప ద దా నీ దా నీ దా మ ప నీ దా నీ దా ప మ గ పభువిలో దివిలో రవళింపగానాట్యము సలిపే నటరాయనిఆనంద లీలా వినోదమేసలలిత రాగ సుధారస సారంసర్వకళామయనాట్యవిలాసం

సలలిత రాగ సుధారససారంసలలిత రాగ సుధారససారంసర్వకళామయ నాట్యవిలాసంసర్వకళామయ నాట్యవిలాసంసలలిత రాగ సుధారససారంమంజుల సౌరభ సుమకుంజములమంజుల సౌరభ సుమకుంజములరంజిలు మధుకర మృదు ఝంకారంరంజిలు మధుకర మృదు ఝంకారంసలలిత రాగ సుధారససారంసర్వకళామయ నాట్యవిలాసంసలలిత రాగ సుధారససారంచరణం 1:ని దా ద ప నీ ప నీ దా ప మ గ మ గ పా..... స రి గఆ ఆ ఆ...కల్పనలో ఊహించిన హొయలూ..ఊ..ఊ...ఆ..ఆ..కల్పనలో ఊహించిన హొయలూశిల్పమనోహర రూపమునొందీశిల్పమనోహర రూపమునొందీపద కరళములా మృదు భంగిమలాపద కరళములా మృదు భంగిమలాముదమార లయమీరు నటనాల సాగెసలలిత రాగ సుధారససారంఝణన ఝణన ఝణ నొంపుర నాదంఆ ఆ.....ఝణన ఝణన ఝణ నూపుర నాదంభువిలో దివిలో రవళింపగాప ద ప మ పా ఆ.....మ ని ద మ దా ఆ.....గ మ ద నీ సా ఆ.....రీ సా రీ సా ని ప ద దా నీ దా నీ దా మ ప నీ దా నీ దా ప మ గ పభువిలో దివిలో రవళింపగానాట్యము సలిపే నటరాయనినాట్యము సలిపే నటరాయనిఆనంద లీలా వినోదమేసలలిత రాగ సుధారస సారంసర్వకళామయ నాట్యవిలాసంసలలిత రాగ సుధారస సారం

నంగితనం వదిలించుకోవాలి.లోపలి మురికి కడుక్కోవడం చేతనవ్వాలి.దేహానికి చేతులుండటం కాదుచేతలుండటం అలవర్చుకోవాలి.ఒక కష్ట కాలంసిన్మా హీరోల రంగు వెలిసిపోయేలా చేసినప్పుడు,అసలైన హీరోలుసోనూ సూద్, ప్రకాష్ రాజుల్లా ముందుకు వస్తారు.ఐనా ఈ గ్లోబు మీదఎవడు వలస కాదో చెప్పండి. కానీ..తమ వలసతనం దాచుకునిలోకల్ స్టిల్ ఇస్తో విగ్రహంలా కదలకుండా వుండటం కంటే ద్రోహంమరింకేదీ లేదని తెల్సుకుందాం.

30, మే 2020, శనివారం

దంతంబుల్పడనప్పుడే తనువునందారూడి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరా క్రాంతంబు కానప్పుడే వింతల్మేన జరింపనప్పుడే కురుల్వెల్వెల్ల గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!పండ్లు ఊడి రాలిపోకముందే, శరీరములో జవసత్వములు నశింపకముందే, ముదుసలితనము మీద పడక ముందే, వింత వింత (కొత్త కొత్త) రోగాలు దేహములో చేరకముందే, తల వెంట్రుకలు నెరవకముందే నీ పాదపద్మములను పూజించి తరించే మార్గాన్ని కనుగొనాలి సర్వేశ్వరా!(ముసలితనములో శరీరము సహకరించదు కాబట్టి మనుషులు ముందే ఆధ్యాత్మిక మార్గములో నడవాలి అనేది ఈ పద్యం టీకాతాత్పర్యం)

22, మే 2020, శుక్రవారం

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడాగతమెంతో ఘన కీర్తి గలవోడావీర రక్తపు ధార వార వోసిన సీమపలనాడు నీదెరా వెలనాడు నీదెరాబాల చంద్రుడు చూడ ఎవరోడోయ్తాండ్ర పాపయ కూడ నీవోడోయ్ ||చెయ్యెత్తి||నాయకీ నాగమ్మ , మంగమాంబ, మొల్లమగువ మాంచాల నీ తోడ బుట్టిన వోళ్ళెవీర వనితల గన్న తల్లేరాధీర మాతల జన్మ భూమేరా ||చెయ్యెత్తి||కల్లోల గౌతమి వెల్లువల క్రిష్ణమ్మతుంగభద్రా తల్లి పొంగిపొరలిన చాలుధాన్య రాశులు పండు దేశానకూడు గుడ్డకు కొదువ లేదోయి ||చెయ్యెత్తి||పెనుగాలి వీచింది అణగారి పోయిందినట్టనడి సంద్రాన నావ నిలుచుండాదిముక్కోటి బలగమై ఒక్కటై మనముంటేఇరుగు పొరుగూలోన ఊరు పేరుంటాదితల్లి ఒక్కటె నీకు తెలుగోడాసవతి బిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి||రచన: అమరజీవి గారు

9, మే 2020, శనివారం

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటోద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృండమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగత్ర్పమథన తాండవాటన "డ"కారనుత బసవేశ పాహిమాం!ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢంమృణఢంమృణ ఢంఢణోద్ధణంధణనటన త్వదీయడమరూత్థమదార్భట ఢంకృతి ప్రజృంభణ త్రుటితాభ్రతార గణరాజ దినేశముఖగ్రహప్రఘర్క్షణగుణతాండవాటన"ఢ"కారనుత బసవేశ పాహిమాం!ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖవిక్రమ జృంభణ సంచలన్నభోణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వనణ్ణ ణ్మృణ తాండవాటన "ణ"కారనుత బసవేశ పాహిమాం! -మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు "అక్షరాంకపద్యముల" నుండి సేకరణ.👆🏻 వినండి. మీరూ ప్రయత్నించండి.

8, మే 2020, శుక్రవారం

🌹🌹వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నదిసుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది మలయజ శీతల పదకోమల భావన బాగున్నాకంటి కంటిలో తెలియని మంట రగులుతున్నదిమంట రగులుతున్నదితరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరంసస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలోసస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలోపైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి సుప్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనారంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నదిగిరాకి పెరుగుతున్నదితరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరంపుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూపుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూచిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నదిప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నాఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నదిఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నదిఅక్కడనే వున్నదితరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది.Music:ChakravarthyLyrics- C. Narayana ReddySingers :SrinivasProducer:Babu Rao PokuriDirector:T.KrishnaYear: 1985 రగులుతున్నదితరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరంసస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలోసస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలోపైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి సుప్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనారంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నదిగిరాకి పెరుగుతున్నదితరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరంపుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూపుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూచిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నదిప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నాఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నదిఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నదిఅక్కడనే వున్నదితరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది.Music:ChakravarthyLyrics- C. Narayana ReddySingers :SrinivasProducer:Babu Rao PokuriDirector:T.KrishnaYear: 1985

30, ఏప్రిల్ 2020, గురువారం

మహాకవి:-🌷శ్రీరంగం శ్రీనివాసరావు🌷 ★★ ...శ్రీశ్రీ....★★ గారి... ....జయంతి సందర్భముగా....సముద్రపు కెరటాల.... నురుగు సంసార జీవితాల........ పరుగు లే లే లేచి నిలబడు కార్య సాధనలో తలబడుకృంగి పోకు కుళ్ళి పోకుచిరాకు పరాకు రానీయకు సూర్య వేగ మాగిందా నీటి ప్రవాహ మాగిందాఅగ్ని జ్వాల ఎగసి ఎగసి పడ్డట్టుఆశల ఆశయాలకై నీ వొడి పట్టు అక్షరం పదమవ్వలేదా ఆశయం నెరవేర్చరాదాఅనేవాడు అంటూనే ఉంటాడుకొనేవాడు మరీ కొంటూనే ఉంటాడు మరినీకెలా నిస్పృహ నిస్సత్తువ మనిషికి ఆలోచనే నిజ సత్తువపిడికిలి బిగించి పద ముందుకుపరుగులతో రాదా ఈ లోకం నీ చెంతకు..★మహా కవి శ్రీ శ్రీ జయంతి ★సందర్భముగా.........వారికి మా పాదాభివందనం..... 🌷🌷🙏🙏🌷🌷డా!! హనీఫ్చంద్ర MD.....✍ చంద్రిక ✍...........విజయవాడ....30-4/20

29, ఏప్రిల్ 2020, బుధవారం

శ్రీశ్రీ కి వంశీ నివాళి-------///--------------1.శ్రీశ్రీ కవితాశక్తికిశిరసు వంచి జోహారు..నవ కవితాసక్తికిస్ఫూర్తి నింపు మీపేరు2.మహాకవి శ్రీశ్రీకిమరోమారు నమస్కారం..ముమ్మాటికీ మీరుకాళిదాసు అవతారం3.శ్రీనివాసరావు గారిఇంటిపేరు శ్రీరంగంఈ శతాబ్దం నాదనిచేసినాడు వీరంగం4.శ్రీశ్రీ వ్రాతలు స్ఫూర్తిగప్రాస పలుకుటట్లుపవనతనయుని చూసిపిల్లకాల్వ దూకినట్లు5.తెలుగు సినీ సాహిత్యంతలెత్తుకున్న దెప్పుడుతెలుగువీర లేవరా తోవిలువ తెచ్చినప్పుడు(శ్రీశ్రీ ప్రాసక్రీడల స్పూర్తితో...వంశీ)

*కుదిరితే పరిగెత్తు.. , లేకపోతే నడువు... అదీ చేతకాకపోతే... పాకుతూ పో.... , అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు... ఉద్యోగం రాలేదని,వ్యాపారం దెబ్బతినిందని,స్నేహితుడొకడు మోసం చేశాడని,ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...అలాగే ఉండిపోతే ఎలా?దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే... తలుచుకుంటే... నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా... నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,పారే నది..,వీచే గాలి...,ఊగే చెట్టు...,ఉదయించే సూర్యుడు....అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,లే... బయలుదేరు... నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... , పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు... నువ్వు పడుకునే పరుపు... నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... , నీ అద్దం.... నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... , నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,మళ్ళీ చెప్తున్నా... కన్నీళ్ళు కారిస్తే కాదు..., చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..*చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే... అస్త్రాలు.

కరోనా కాలంలో కూలికోసం కాలు కదిపిన బాటసారిని ముందుగానే శ్రీ శ్రీ సాక్షాత్కరింపజేసుకున్నట్లున్నారు.. ఆ హృదయవేదన. బాటసారి: కూటికోసం, కూలికోసంపట్టణంలో బ్రతుకుదామని-తల్లిమాటలు చెవిన పెట్టకబయలుదేరిన బాటసారికి,మూడురోజులు ఒక్కతీరుగనడుస్తున్నా దిక్కుతెలియక-నడిసముద్రపు నావరీతిగసంచరిస్తూ సంచలిస్తూ,దిగులు పడుతూ, దీనుడౌతూతిరుగుతుంటే-చండచండం, తీవ్రతీవ్రంజ్వరం కాస్తే,భయం వేస్తే,ప్రలాపిస్తే-మబ్బుపట్టీ, గాలికొట్టీ,వానవస్తే, వరదవస్తే,చిమ్మచీకటి క్రమ్ముకొస్తేదారితప్పిన బాటసారికిఎంత కష్టం!కళ్లు వాకిట నిలిపిచూచేపల్లెటూళ్లో తల్లి ఏమనిపలవరిస్తోందో...?చింతనిప్పులలాగు కన్నులచెరిగిపోసే మంటలెత్తగ,గుండుసూదులు గ్రుచ్చినట్లేశిరోవేదన అతిశయించగ,రాత్రి, నల్లని రాతి పోలికగుండె మీదనె కూరుచుండగ,తల్లిపిల్చే కల్లదృశ్యంకళ్లముందట గంతులేయగచెవులు సోకని పిలుపులేవోతలచుకుంటూ, కలతకంటూ-తల్లడిల్లే,కెళ్లగిల్లేపల్లటిల్లే బాటసారికిఎంత కష్టం!అతని బ్రతుకున కదే ఆఖరు!గ్రుడ్డి చీకటిలోను గూబలుఘాకరించాయి;వానవెలసీ మబ్బులో ఒకమెరుపు మెరిసింది;వేగుజామును తెలియజేస్తూకోడి కూసింది;విడిన మబ్బుల నడుమనుండీవేగుజుక్కా వెక్కిరించింది;బాటసారి కళేబరంతోశీతవాయువు ఆడుకుంటోంది!పల్లెటూళ్లో తల్లికేదోపాడుకలలో పేగు కదిలింది!

**కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు- **పేర్లకి ఫకీర్లకి పుకార్లకిని బద్ధులు **తాతగారి,బామ్మగారి భావాలకు దాసులు- **నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు- **నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు- **నూతిలోని కప్పలు- **కళలన్నా కవితన్నా వీళ్లకు చుక్కెదురు- **అయ్యో గోల చేసి అరవడమే విల్లేరుగుదురు----- ****కొంతమంది యువకులు ముందుయుగం దూతలు- **భావన నవజీవన బృందావన నిర్మాతలు-*బానిస పంథాలను తలవంచి అనుకరించరు-**పోనీయని అన్యాయపు పోకడలను సహించరు *వారికి మా ఆహ్వానం *వారికి మా లాల్ సలామ్----- ***మహాకవి .శ్రీ శ్రీ గారి 110వ జయంతి స్మృతితో...

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

సీ!! వెఱ్ఱివానికి నేల వేదాక్షరంబులు? - మోటువానికి మంచిపాట లేల?పసులకాఁపరి కేల పరతత్త్వబోధలు? విటకాని కేటికో విష్ణుకథలు?వదరు శుంఠల కేల వ్రాఁత పుస్తకములు? -తిరుఁగు ద్రిమ్మరి కేల దేవపూజ?ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు? - దొంగబంటుకు మంచిసంగ తేల? తే!! క్రూరజనులకు నీమీఁద గోరి కేల? - ద్రోహి పాపాత్మునకు దయాదుఃఖ మేల?భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!

ఆ రజనీకర మోహన బింబము నీ ననుమోమును బోలునటేకొలనిలోని నవ కమల దళమ్ములు నీ నయనమ్ముల బోలునటేఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదేప: తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించ బోకేపూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువోనారాణి !!తలనిండ!!౧. నీమాట బాటలో నిండే మందారాలు నీపాట తోటలో నిగిడే శృంగారాలునీమేనిలో పచ్చ సేమంతి అందాలు 2 సార్లునీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు!!తలనిండ!!

14, ఏప్రిల్ 2020, మంగళవారం

* సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారువేలు తగపెండ్లాడన్ తిరిపెమున కిద్దరాండ్రా??!! పరమేశా, గంగవిడుము పార్వతిచాలున్ *

ఆవకాయ మన అందరిదీగోంగూర పచ్చడీ మనదేలేఎందుకు పిజ్జా లెందుకు బర్గర్లెందుకుపాస్తాలింకెందుకులే!!ఆవకాయ!!ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ...పెసరట్టులోకి అల్లమురా...దిబ్బ రొట్టెకీ తేనె పానకం...దొరకకపోతే బెల్లమురా..వేడి పాయసం ఎప్పటికప్పుడే..పులిహోరెపుడూ మర్నాడే...మిర్చీబజ్జీ నోరు కాలవలె..ఆవడ పెరుగున తేలవలె!!ఆవకాయ!!గుత్తివంకాయ కూర కలుపుకొనిపాతిక ముద్దలు పీకుమురా....గుమ్మడికాయ పులుసుందంటేఆకులు సైతం నాకుమురా...పనకాయనీకున్నరోజునే పెద్దలుతద్దినమన్నారు...పనసపొట్టులో ఆవపెట్టుకొనితరతరాలుగా తిన్నారు...తిండి గలిగితే కండగలదనిగురజాడ వారు అన్నారు..అప్పదాసు ఆ ముక్క పట్టుకొనిముప్పూటలు తెగ తిన్నారు..

9, ఏప్రిల్ 2020, గురువారం

దారెరుగని వాడును గో దారిన తానొక్కమారు తడవని వాడును కూరిమిన ఆవకాయను ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి

నక్కలు బొక్కలు వెదకున్;నక్కరతో యూర పంది యగడిత వెదకున్;కుక్కలు చెప్పులు వెదకున్;దక్కెడి నా లంజకొడుకు తప్పే వెదకున్.భావము: నక్కలు ఎప్పుడూ బొరియల కోసం వెదుకుతాయి, ఆవసరానికి ఊర పంది పెంట వెదుకుతుంది, కుక్కలు చెప్పుల కోసం వెదుకుతాయి, కాని లంజ (వేశ్య)యొక్క పుత్రుడు మాత్రం ఏప్పుడూ ఇతరుల తప్పులే వెదుకుతాడు.

*** చమత్కార పద్యము ****ఖగపతి అమృతము తేగాబుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్పొగమొక్కై జన్మించెనుపొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్ ***భావము: గరుత్మంతుడు అమృతం తీసుకొస్తుండగా అది బుగబుగమని భూమిపై పడి పొగాకు మొక్కగా మొలిచింది. అందుకే పొగత్రాగనివాడు దున్నపోతై పుడతాడు అని కవిభావన.**

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

కలడందురు దీనుల యెడకలడందురు పరమయోగి గణములపాలన్‌ కలడందురన్ని దిశలనుకలడు కలండనెడువాడు కలడోలేడో..కలడో..కల్లో..!!

*తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికేసరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినెవ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకింకరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్'*

1, ఏప్రిల్ 2020, బుధవారం

శ్రీ కామినీ కామితాకార సాకార కారుణ్య ధారా నవాంకుర సంసార సంతాప నిర్వాపణా..పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావాభవాభావా.. హే.. వాసుదేవా!సదానంద గోవింద సేవించు మావిందవై డెంద మానందమొందింప ఎందున్ విచారంబులేమిన్వచోగోచరాగోచరత్వంబు ఊహింపలేమైతిమో దేవా!నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్వేదవాదుల్ సమాదుల్ కడున్ జాల నార్జించిభోగేశ్చ వర్చించి నానా తపశ్చర్యతాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్ మాకు నేత్రముల్ లేక యెనీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటన్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె జగన్నాథా.. హే జగన్నాథా!యే రీతి చెన్నారముల్ మేరుషుల్ నిన్ను గన్నార కన్నారు నా కన్నులేన్నంగ ఏ పుణ్యముల్ చేసెనో నిన్నుదర్శింపగా!భవ్య యోగీంద్ర సాంద్రాధరా కాంక్షితై కాంత సంసేవనా భావనాతీత కళ్యాణ నానా గుణ స్త్రీ సముద్భాసితాంగదయాపూర రంగస్థరంగాంతరంగా నమో రుక్మిణీ సంగహే పాండురంగా..హే పాండురంగా!నమస్తే.. నమస్తే.. నమ:

31, మార్చి 2020, మంగళవారం

ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీలవెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళమరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీనీ బరువూ...నీ పరువూ...మోసేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...రాజనీ...పేదనీ, మంచనీ...చెడ్డనీ...భేదమే ఎరుగదీ యమపాశంకోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ...హద్దులే చెరిపెనీ మరుభూమిమూటలలోని మూలధనం...చేయదు నేడు సహగమనంనీ వెంట...కడకంటా...నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూఅందరూ సుఖపడే...సంఘమే కోరుతూ...మందిలో మార్గమే వేశావూనలుగురు నేడు పదుగురిగా...పదుగురు వేలు వందలుగానీ వెనకే...అనుచరులై ...నడిచారూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావుఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలంబతికిన నాడు బాసటగా...పోయిన నాడు ఊరటగాఅభిమానం...అనురాగం...చాటేదీ....ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీందాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాంశ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాంత్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ప్రతి పదార్ధం: లక్ష్మీం = విష్ణు పత్నియైన శ్రీ మహాలక్ష్మి; క్షీర సముద్ర రాజ = పాలసముద్రమునకు రాజు; తనయాం = కుమార్తె; శ్రీ రంగ = శ్రీ రంగంలోని శ్రీ రంగనాధుని/నాయకుని; ధామ = గృహము (గుడి); ఈశ్వరి = నాయిక /అధిపతి; దాసీభూత = దాస దాసీ జనులు /సేవకులు; సమస్త = అందరు; దేవ = దేవ సంబంధమైన / దేవతా; వనితాం = స్త్రీలు; లోకైక = లోకములో ఒకే ఒక / ఉన్నతమైన; దీప = జ్యోతి; అంకురం = మొలక; దీపాంకురాం = ప్రకాశము నిచ్చే చిరు జ్యోతి / చిరు దివ్వె; శ్రీమన్ = శ్రీమంతు రాలైన లక్ష్మీ దేవి; మంద = చల్లని/నెమ్మదైన; కటాక్ష = చూపులచే; లబ్ధ = పొందిన; విభవత్ = వైభవము; బ్రహ్మ = సృష్టి కర్తయైన బ్రహ్మ; ఇంద్ర = దేవతల రాజైన ఇంద్రుడు; గంగాధరాం = గంగను ధరించిన వాడు (శివుడు); త్వాం = నిన్ను; త్రై = మూడు; లోక్య = లోకములకు; కుటుంబిణీం = పరివారమైన; సరసిజాం = సరసులోని పద్మము నుండి పుట్టిన (లక్ష్మి); వందే = నీకు నమస్సులు; ముకుంద = విష్ణువు; ప్రియాం = ఇష్టమైన.తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.**గాయకుడు: ఎం ఎస్ రామారావు సంగీతం : గాలి పెంచల నరసింహ రావుదర్శకుడు: ఎన్ టి ఆర్తెరపై : హరనాధ్, గీతాంజలి, కాంతారావుసినిమా : సీతారామ కల్యాణం 06-01-1961 ఋఎలేసె: 6 ఝనూర్య్ 1960

27, మార్చి 2020, శుక్రవారం

తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడువెళ్లిపోయెడినాడు – వెంటరాదులక్షాధికారైన – లవణ మన్నమె కానిమెఱుగు బంగారంబు – మ్రింగబోడువిత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కానికూడబెట్టిన సొమ్ము – తోడరాదుపొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టిదానధర్మము లేక – దాచి దాచితుదకు దొంగల కిత్తురో – దొరల కవునొతేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు?భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |దుష్టసంహార | నరసింహ – దురితదూర |నరసింహా! తల్లి గర్భం నుంచి ధనముతేడు ఎవ్వడు. పోయేటప్పుడు ఈ ధనము కూడా రాదు.లక్షాధికారైనా ఉప్పు, అన్నమే టినలిగాని, బంగారం మింగలేడు. తేనెటీగలు తేనెనుపరులకిచ్చినట్లు ధనము కూడ బెట్టి, దానము కూడా చేయక, అనుభవింపని వాడుఆ సొమ్మును దొరల పాలో, దొంగలపాలో చేయును (నరసింహా శతకం)

తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడువెళ్లిపోయెడినాడు – వెంటరాదులక్షాధికారైన – లవణ మన్నమె కానిమెఱుగు బంగారంబు – మ్రింగబోడువిత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కానికూడబెట్టిన సొమ్ము – తోడరాదుపొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టిదానధర్మము లేక – దాచి దాచితుదకు దొంగల కిత్తురో – దొరల కవునొతేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు?భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |దుష్టసంహార | నరసింహ – దురితదూర |నరసింహా! తల్లి గర్భం నుంచి ధనముతేడు ఎవ్వడు. పోయేటప్పుడు ఈ ధనము కూడా రాదు.లక్షాధికారైనా ఉప్పు, అన్నమే టినలిగాని, బంగారం మింగలేడు. తేనెటీగలు తేనెనుపరులకిచ్చినట్లు ధనము కూడ బెట్టి, దానము కూడా చేయక, అనుభవింపని వాడుఆ సొమ్మును దొరల పాలో, దొంగలపాలో చేయును (నరసింహా శతకం)

21, మార్చి 2020, శనివారం

మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెనీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా..నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...ముళ్ల తీగమ్మా కంచెమీద చీరావేస్తే రానేరాదమ్మాఆడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మాపెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నోచూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరుపెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నోచూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరుఅటువంటినే అన్ననుగాను చెల్లెమ్మా...నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా...అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా...ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా...మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెచెల్లెమ్మా...అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మాఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా ఆహుమ్ ఆహుమ్అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మాకన్నవాళ్లకే రోకలి పోటమ్మా ఆహుమ్ ఆహుమ్సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మాఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయిసిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మాఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయిఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా....నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా...బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా...నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా...మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెచెల్లెమ్మా...ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్లిభుజం కట్టి చదువు చదివేదెందుకుఆ... కట్నకానుకలిచ్చి సచ్చేటందుకుఆ... కట్నకానుకలిచ్చి సచ్చేటందుకుచదివినంత నిన్ను చదివిస్తనమ్మాఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మానీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పండో కూడబెట్టుతాచదివినంత నిన్ను చదివిస్తనమ్మాఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మానీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పండో కూడబెట్టుతానచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మానా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మారిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మామీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మామల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెనీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా....నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా....తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా....తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.

ఏ మేరె వతన్ కి లోగో . జరా ఆఖ్ మే భర్ లో పానీ ".పాటను రాసిన కవి . వారి జన్మ దినం ఈరోజు... దేశభక్తి మనలో ఉన్నంత కాలమూ నిలిచిపోయే పాట అది.ऐ मेरे वतन के लोगोंतुम खूब लगा लो नाराये शुभ दिन है हम सब कालहरा लो तिरंगा प्यारापर मत भूलो सीमा परवीरों ने है प्राण गँवाएकुछ याद उन्हें भी कर लोकुछ याद उन्हें भी कर लोजो लौट के घर ना आयेजो लौट के घर ना आयेऐ मेरे वतन के लोगोंज़रा आँख में भर लो पानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीऐ मेरे वतन के लोगोंज़रा आँख में भर लो पानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीतुम भूल ना जाओ उनकोइसलिए सुनो ये कहानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीजब घायल हुआ हिमालयखतरे में पड़ी आज़ादीजब तक थी साँस लड़े वोजब तक थी साँस लड़े वोफिर अपनी लाश बिछा दीसंगीन पे धर कर माथासो गये अमर बलिदानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीजब देश में थी दीवालीवो खेल रहे थे होलीजब हम बैठे थे घरों मेंजब हम बैठे थे घरों मेंवो झेल रहे थे गोलीथे धन्य जवान वो अपनेथी धन्य वो उनकी जवानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीकोई सिख कोई जाट मराठाकोई सिख कोई जाट मराठाकोई गुरखा कोई मदरासीकोई गुरखा कोई मदरासीसरहद पर मरनेवालासरहद पर मरनेवालाहर वीर था भारतवासीजो खून गिरा पर्वत परवो खून था हिंदुस्तानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीथी खून से लथ-पथ कायाफिर भी बन्दूक उठाकेदस-दस को एक ने माराफिर गिर गये होश गँवा केजब अन्त-समय आया तोजब अन्त-समय आया तोकह गए के अब मरते हैंखुश रहना देश के प्यारोंखुश रहना देश के प्यारोंअब हम तो सफ़र करते हैंअब हम तो सफ़र करते हैंक्या लोग थे वो दीवानेक्या लोग थे वो अभिमानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीतुम भूल न जाओ उनकोइस लिये कही ये कहानीजो शहीद हुए हैं उनकीज़रा याद करो क़ुरबानीजय हिन्द जय हिन्दजय हिन्द की सेनाजय हिन्द जय हिन्दजय हिन्द की सेनाजय हिन्द जय हिन्द जय हिन्दSource: Musixmatchhttps://www.youtube.com/watch?v=DSJ1MMGi_IQ

సత్యహరిశ్చంద్రీయము పంచమాంకము(సతీసుతులతో హరిశ్చంద్రుడు నక్షత్రకుఁడు ప్రవేశించుచున్నారు)హరి: దేవీ కష్టము లెట్లున్నను, బుణ్యక్షేత్రమైన వారణాసి దర్శించితిమి. చూడు.గీ. భక్తయోగ పదన్యాసి వారణాసిభవదురిత శాత్రవఖరాసి వారణాసిస్వర్ణదీ తటసంభాసి వారణాసిపావనక్షేత్రముల వాసి వారణాసి.నక్షత్రకా! విశ్వేశ్వరుని దర్శించి వత్తము. దేవీ! రమ్ము.నక్ష: ఇఁక మాయప్పుమాట నీకుదోచదు. పద. (నడచుచున్నారు)(యవనిక నెత్తఁగా దేవాలయము కాన్పించును. అందఱు విశ్వేశ్వరునకు నమస్కరింతురు)హరి: (ప్రాంజలియై)శ్లో॥ ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే!ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వ మనయోఃత్వయైన క్షంతవ్యా శ్శివ మదపరాధాశ్చ సకలాఃప్రయత్నా త్కర్తవ్యం మదవన మియం బంధుసరణి.శా. ఆపద్బంధుఁడ వీవు సామివి గదా! మాలాటి యాపన్నులం దేపారన్‌ ప్రముఖుండఁగా మనకుం దండ్రీ? బాంధవం బింక వే ఱే పల్కం బనిలేదుఁ గాననిఁక నీవే సైఁచి నా నేరముల్‌ కాపాడం దగు నెట్టులైనఁ నిటులే కాయోగ్యబంధుత్వముల్‌.నక్ష: హరిశ్చంద్రా! ఇంకనెంతకాల మిట్లు ముక్కు పట్టుకొని కూర్చుండెదవు? రమ్ము.చ. అలయక గుళ్ళుగోపురము లన్నియు జూచుచు నప్పుమాటయేతలపవు చేరువయ్యెనుగదా గడువంచు రవంతయేని లోఁదలపవు నా ప్రయాసము వృథాయగుచున్నది వెళ్ళబెట్టుమాపెలుచన మా ఋణంబు నెగ వేయదలంచిన నేను బోయెదన్‌.హరి: అయ్యా! ఎగవేయవలయునన్న నింత కష్టమున కేల యోర్చితి? తొందర పడకుము.నక్ష: ఏమీ! సొమ్మీయఁ దలఁచిన వాఁడవు నీవు తొందర పడకపోగా బుచ్చుకో వలసిన నన్ను గూడఁ తొందర పడవలదని నీతులు చెప్పుచున్నావుగా? బాగు! అన్నిటికిఁ గాళ్ళు సాచిన నీకేమి తొందర?ఉ. పుట్టెడు నప్పుతోడ దల మున్గితి వింకొక పుట్టెడైన నీపుట్టి మునుంగ దింతయును బ్రొద్దున నీ మొగమింత సూచినన్‌బుట్టదు యన్నమున్‌ మునిగి పోక యిఁకేమిటి? దీపముండగానెట్టన జక్కఁ బెట్టుకొన నేరకపోయె గురుండు వెఱ్ఱియై.హరి: అయ్యా! నిష్ఠురము లాడకుము.నక్ష: ఏమీ! మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠురమాయెనుగా? నీ వడుగుకొన్న నలువది దినంబులు నేఁటితోఁ దీరుచున్నవే. ఇంత దనుక నాకిచ్చిన దొక్కకాసైన లేదే? ఇంక నీ విచ్చెదవని మా కెట్లు నమ్మకముండును? ఇప్పుడు మాత్రముశా. ఏలీలన్‌ సవరింతు మా ఋణము కొంపే గోడియే నింత కూడే లేదేమిటి కింకఁ జంపెదవు పొమ్మీ మీకు నేనాటి బాకీ లన్న నిన్ను గొట్టువాడెవడు? చిక్కెన్నీకు మాజుట్టు పత్రాలా? సాక్ష్యములా? నినున్‌ బలిమి మీదన్‌ రచ్చకీడ్పింపగన్‌.హరి: నక్షత్రకా! పత్రములు సాక్షములు నేల కావలయును? నిత్యస్థిరంబయిన నా వాక్కున కన్యథాత్వ మెప్పటికైన సంభవింపదు గదా!నక్ష: సంభవింపక యిప్పటికి జేసిన దేమున్నది?హరి: అయ్యా! నా దీనదశ యించుక యోచించుము.నక్ష: అలాగయిన నేను యోచించి చెప్పునది గట్టిగా వినుము.శా. నీ కాతం డది యప్పు వెట్టినది కానే కాద యామౌని నిన్నే కైసాచి మదర్థ మిమ్మనిన సొమ్మేకాని, యద్దానికైనీ కన్నుంగవ దుమ్ము సల్లి యిట మున్నే రాజ్య సర్వస్వముంజేకొన్నాడిక నేటి యప్పు నిజముం జింతింప నింతే కదా?హరి: ఇంతియె కాని నెలదినములలో నిచ్చెద నని యమ్మునితో నొప్పుకొంటిని గదా!నక్ష: లేదనిన నా మాటలన్నియు సున్న యగుంగాదే!హరి: అయ్యా! సత్యేతరంబునకు నా మానసం బొప్పదయ్యా!నక్ష: అయ్యో! అమాయకుడా! ఇంతలోఁ జెడ్డప్పుడు గూడ సత్యము సత్యమని యూఁగులాడు చున్నావే హరిశ్చంద్రా! నీ వేమనుకొన్ననుమ. జటినై నేననరాదు కాని విను నీ సత్యంబే నీ కొంప కింతటి చేటౌటకు మూల మిప్పటికినైనన్‌ మించిపోలేదు తీర్చుట కేనాటి ఋణంబు మీకనిన దీఱున్నీకు మా బాధ! యంతట నూరేగుము సత్తుచిత్త నుచు జింతన్‌ బాసి బైరాగివై.అట్లుకానిచో నింత ధనము నీ విప్పట్టున నెట్లార్జించెదవు? చెప్పుము.సీ. వైదిక వృత్తి సంపాదింతు నంటివా యుడుగవు రాచపోకడలు నీకురాచఱికంబు శౌర్యమున దెత్తు వటన్న దెసమాలి యేవంక దిక్కులేదువణిజువర్తనముచే గణియింతు నంటివా యరచేత గుడ్డిగవ్వైన లేదువ్యవసాయవృత్తిచే సవరింతు నంటివా లేదు భూవసతి గోష్పాదమంతగీ. ఇందు నేడేని వ్యాపార మందదగినయంత పున్నెంబు పుట్టిన నింత ధనముగంటుకట్టునె యీ స్వల్ప కాలముననుగడచు నీ నాటితోడ మా గడువుదినము.ఇవియేమియుగాక బానిసవృత్తికి బాల్పడినను నిన్నెవరు కొనువారు లేరు. కావున నా యుపదేశవాక్యముల ననుసరించి నీవీ ఋణబాధ తప్పించికొనుము. మా గురువు గారితో నీ దురవస్థ యంతయు జెప్పి యీ సొమ్ము వదిలివేయు తెఱంగొనరించెద. చెప్పుము ఏల నీకీ బాధ?హరి: నక్షత్రకా! నా కంఠము గత్తిరించు చున్నను నసత్యమాడుటకు నామనంబొప్పదు.నక్ష: హరిశ్చంద్రా! నీ మేలు గోరి నేనింత వచించెద వినుము.ఉ. పుట్టిననాఁట నుండియును బొంకి యెఱుంగవు యే నెఱుంగు దిప్పట్టుని గూడులేని దురవస్థల నుంటివి గాన నీ మనంబెట్టిదొ తెంపుచేసికొని యీ యుపదేశము నాలకింపు మేనొట్టిడి కొం దసత్యమున కొప్పితివంచు వచింప నేరికిన్‌.చంద్ర: నక్షత్రేశ్వరా! నీ వంటి మునికుమారుడు చెప్పవలసిన నీతులా యివి?నక్ష: చంద్రమతీ! నీవును నీ పెన్మిటికిం దగినట్టు దొరికినావు పో,శా. మీనిప్పచ్చరముం దలంచి కరుణన్‌ మీ బాగుకై యింతగానేనేమో హితమున్‌ వచించితిని, మీ కే లేని యీ బాధ నాకా? నీ పెన్మిటి నీ వెటైన విను నా కౌనేమీ! పోనేమి నాస్నానంబో జపమో తపంబో సదను ష్ఠానంబొ యోజింపుమా.చంద్రమతీ! నా నీతులు మీరు విననక్కఱ లేదు. ఊరక యడ్డుపుల్లలు వేసినట్లు కాదు. మాకు రావలసిన సొమ్ము గవ్వలతో గూడ లెక్కపెట్టి మా కిప్పింపుము. నేనింక క్షణమాగను, మీమీది మోమాటముచే నేనింకను నాలస్యముచేసినచో సహజముగా ముక్కోపియైన మా గురువుగారు నాగొంతు గొఱుకక మానరు. హరిశ్చంద్రా! నీ పెద్దఱికం బాలోచింపను. మా సొమ్ము గుమ్మరించి మఱి నడువుము.(చేయి పట్టుకొని నిలవేయుచున్నాడు)హరి: (నిట్టూర్పు విడిచి) దేవీ! ఈ ఋణబాధ కడుంగడు దుర్భరము గద! చూడు.మ. సరివారి న్నగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగం, బనంతర మాహారమునం దనిష్ట, మటుమీదన్‌ దేహజాడ్యం, బటన్‌మరణంబే శరణంబు, పెక్కు దినము ల్మంచాన జీర్ణించి ఇంతిరొ! యీ ప్రాణులకున్‌ ఋణవ్యథలకంటెన్‌ దుస్సహం బేరికిన్‌.దేవీ! మందభాగ్యుండనైన నే నిప్పుడేమి చేయుదును? నిరవశేషముగా ఋణము దీర్చివేసికొని సంతోషించు భాగ్యము నాకు లేకపోయెనే?చంద్ర: నాథా! మీరిప్పట్టున ధైర్యము వహించి నా మనవి నాలింపుడు.గీ. కాలగతి సర్వసంపద గోలుపోవమిగులు సిరి నాకు మీరును మీకు నేనెబానిసగ నన్ను నే కలవానికేనినమ్ముకొనుఁ డింక మౌని ఋణమ్ము దీఱు.హరి: హా! విధీ! ఈ హరిశ్చంద్రునకు నెంతటి యవస్థ దెచ్చితివి?ఉ. అంతటి రాజచంద్రునకు నాత్మజవై కకుబంతకాంత విశ్రాంతయశోవిశాలుని త్రిశంకు నృపాలుని యిల్లు సొచ్చి భాస్వంతకుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన గేస్తురాండ్ర మేల్బంతిని నిన్ను నొక్కనికి బానిసగా దెగ నమ్ముకొందునే?చంద్ర: ప్రాణేశా! నీచంబని సంకోచించవలదు. సత్యప్రతిష్ఠకై యొనర్చిన నీచ కార్యంబులును సగౌరవంబులేయగు.హరి: హా! జీవితేశ్వరీ! హా! సుగుణసుమవల్లీ! కఠినకర్ముండ నగు నేనెంతకు జాలను? హృదయమా! నేటితో నభిమానము వదలివేయుము. దేవీ! చంద్రమతీ!గీ. హృదయమున నెగ్గు సిగ్గులు వదలివేసిదాసిగా నిన్ను నమ్ముకో దలచినాడవాడవాడల నిన్‌ గొనువారి నూరవెదకికొన బోవుదుము జనవే లతాంగి!చంద్ర: (నడచుచు) ఓదేవా! కాశీవిశ్వనాథా! నన్ను గొనువారి ద్వరలో గను పఱచి మమ్ము విశ్వామిత్ర ఋణబాధా విముక్తులను జేయుము, తండ్రీ!నక్ష: హరిశ్చంద్రా! ఇదియే అంగడి వీథి. ఇక్కడ ఒక్క కేక వేయుము.హరి: దేవీ! నేనిప్పుడేమి ఘోషించవలయును.చంద్ర: క్రయ ధనమ్ము నమ్ము కొనువారెట్లో యట్లే.హరి: ఓహో! పౌరులారా! (కొంచెమూరకుండి) అయ్యో! యెంత నైచ్యమునకు బాల్పడుచుంటిని?నక్ష: హరిశ్చంద్రా! ధనమిచ్చి కొనదగిన వారంద ఱిక్కడనే యున్నారు? ఇంక నీ యాగడములు చాలించి యందఱు వినున ట్లెలుంగెత్తి కేక వేయుము.హరి: అయ్యా! నేనన్నిటికి దెగించియే యున్నాను.(ద్విపద - రాగము కీరవాణి - తాళము ఆది) అవధారుడయ్య యో యగ్రజులార!సవనదీక్షితులార! క్షత్రియులార!ప్రవిమల గుణగణ్య పాదజులారకడలాక్రమించి యొక్కట భూమి నేలిసడినున్న యీ హరిశ్చంద్రుడ నగుటప్రణుత కౌశిక ఋణగ్రస్తుండ నగుటగుణములదొంతి పల్కులమేలుబంతిపున్నె పింతుల యీలు పున కోజబంతియన్నుల తలకట్టు లందు సేమంతియగు నాదు నిల్లాలి హా! దయమాలితెగ నమ్ముకొందు వీధిని దాసిగానుచేరి రొక్కంబిచ్చి చెల్వను గొనుడివారణాసీ పౌర వరులార! మీరుమఱియు నో సౌభాగ్యమహితాత్ములార!సీ. జవదాటి యెఱుగ దీ యువతీలలామంబు పతిమాట రతనాల పైడిమూటఅడుగుదప్పి యెఱుంగ దత్తమామల యాజ్ఞ కసమానభక్తి దివ్యానురక్తిఅణుమాత్రమైన బొంకనుమాట యెఱుగ దీ కలుష విహీన నవ్వులకు నైనకోపం బెఱుంగ దీ గుణవితాన నితాంత యొరులెంత తన్ను దూఱుచున్న సుంతగీ. ఈ లతాంగి సమస్త భూపాలమకుటభవ్యమణికాంతి శబలిత పాదుడైనసార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్యదాసిగా నీపెఁ గొనరయ్య ధన్యులార!(పిమ్మట గేశవునితో గాల కౌశికుడు ప్రవేశించుచున్నాడు)కాల: ఓరీ! శిష్యా! ఎక్కడరా బానిసల విక్రయించునది?హరి: బ్రాహ్మణోత్తమా! ఇక్కడనే. మందభాగ్యుడనైన నేనే బానిసల విక్రయించు చున్నాడ.కాల: అట్లయిన నీవెవ్వడవు? ముందు చెప్పుము.హరి: నే నెవ్వండనైన మీకేమి?కాల: ఏమోయీ. పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతను నీ వెక్కడనో యెత్తుకొని వచ్చినట్లున్నావే! ఆఁ! నీవే దొంగతనము చేసినను సాగివచ్చుటకు నీ కాశికా పురమంత యరాజకముగ యున్నదనుకొంటివేమి? బోయవానికి రామచిలుక లాగున నీకీకాంత యెక్కడ చిక్కినది? ఫాలాక్షునంత వాడనైన నాకంటంబడి తప్పించుకొని బోవుట కల్ల. (శిష్యునితో) ఓరీ! కేశవా! నీవు పోయి మనయూరి తలారి పెద్ద యగు రామసింగును బిలుచుకొని రమ్ము. ఈ మ్రుచ్చును పట్టి యొప్పగింతము.హరి: అయ్యా! విప్రోత్తమా!గీ. ధరణిలో దొంగతనములో దొరతనములోభాగ్యవంతునకేదైన బాధలేదుపెన్నిధి యదృష్టమున నిరు పేదవానికబ్బినను దొంగసొమ్మంట కబ్బురంబె?కాల: ఏమీ! నీ యదృష్టమునకు దోడు నీకీ కాంత యెక్కడో లభించినదా?హరి: అదృష్టమున లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఈమె నాభార్య చంద్రమతి.కాల: ఏలాగూ! విశ్వామిత్రున కప్పుపడితినని యఱచినది నీవేనా? ఆలాగైన తపోధనుడైన యమ్ముని కీవెట్లు ఋణపడితివి?హరి: నారాజ్యసర్వస్వ మాతనికి ధారవోయునప్పుడు మున్నాతనికి యజ్ఞార్థమై ఇచ్చెదనన్న ధనము ముందు నిరూపింపకపోవుట వలన.కాల: పత్రము వ్రాసి పుచ్చుకొనినగాని యప్పుకాదు గదా! సాక్షులెవరైన నున్నారా?హరి: సత్యశీలమే పత్రము. మా యుభయుల చిత్తములే సాక్ష్యములు.కాల: ఓయీ యమాయకుడా! ప్రాణము లేని యీ పత్రమునకును సాక్ష్యములకును భయపడినిక్షేపము వంటి యిల్లాలి నమ్ముకొను చున్నావా? (ఆలోచించి) ఉండుండుము. నాకిప్పుడుమంచి యుపాయము తోచినది. నన్నా విశ్వామిత్రునొద్దకు దీసికొనిపోయి యీ ధనమునీకీయవలసినది కాదని పోరాడుము. నీ పక్షమున నేను న్యాయవాదిత్వము గైకొని రాయిగ్రుద్దుచు వాదింపగలను. ఓహో! ఒకరికిం బదుగురు సాక్షులుంచిన పత్రములనెగవేయుటలోను ద్రోవఁబ్రోవు వారిపై లేని యప్పులగట్టి ధనము గణించుటలోనునన్ను మించినవాడు మఱొక్కండు నీకు దొరకడు. పద, నేను నీకు సహాయుడనైయుండ విశ్వామిత్రుడును గిశ్వామిత్రుడును నిన్నేమి చేయగలడో చూతము.నక్ష: హరిశ్చంద్రా! నీ కిప్పుడు సహాయ సంపత్తి కూడ లభించినది! ఇంక రమ్ము.హరి: అయ్యలారా! మీ రిరువురును మహాబ్రాహ్మణులు కాని యూరకుండుడు. నా కెవ్వరి సహాయమక్కఱలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలయును గాని,మ. ఇటులెంతైన ధనంబు వచ్చినను రానీ గాధిరాట్సూతి నాకెటు కష్టంబుల దెచ్చెనేనియును దేనీ దివ్యభోగంబు లెన్నిటి నాకాజడదారి యిచ్చినను నీనీ, సత్యముం దప్ప నేనిటు సూర్యుండటుతోచెనేని వినుడోయీ మీరు ముమ్మాటికిన్‌.కాల: ఓహో! నీ వెంత సత్యవంతుడవైనను ధనము పట్ల గొంచెము సడలు విడవ వచ్చును. అందుకే "సర్వేజనాః కాంచన మాశ్రయంతి" యని పెద్దలు చెప్పు చున్నారు. నా యీ శాస్త్రప్రమాణ మంగీకరించి కౌశికునొద్దకు నడువుడు. చూడుము.క. ఆలాగున గౌశికుఁడేపాలయ్యె, ధనాశకింక వల దుడుగుము నీకేలా! యీ వేదాంతము?పా లొల్లని పిల్లి గలదె పరికింపంగన్‌?హరి: అయ్యా! ఏల మీకిన్ని మాటలు?కాల: సరి, నీకి బాగుపడు యోగము లేదు. తియ్యని చెఱకుపానకము నోట బోయుచుండ విషమని గ్రక్కువాని కెవ్వరేమి చెప్పగలరు. నీ యిష్టము. నీ భార్యనెంతకమ్మెదవు?హరి: నక్షత్రకా! చెప్పుము.నక్ష: ఓ కాలకౌశికుడా! వినుము.క. దంతావళంబు పయి బలవంతు డొక్కండు నిలిచి పైకిన్‌ రతనంబెంతటి దవ్వుగ రువ్వునోయంతటి యర్థంబు నిచ్చి యతివం గొనుమీ!కాల: ఓహో! కేశవుడా! ఇదేమి చవుకబేరము గాదురా!నక్ష: మఱి పంచాంగము కట్టకే వచ్చునేమి?కాల: ఏమిరా చెడుగా, మాయాయవారపు జోలె చూచి నన్ను ధనహీనునిగా గణించుచున్నావు కాని, దీనిని మా యింటికి బంపి వేయుము. ధనమిచ్చి వేయుదను. హరిశ్చంద్రా! సరియేగదా!హరి: అయ్యా! అట్లే.కాల: దాసీ! ఇక బద. కుఱ్ఱా! నడువుము. (బెత్తమున నదలించుచు)చంద్ర: అయ్యా! వచ్చుచున్నాను. (పతి పాదములపైఁ బడును)కేశ: దాసీ! నడువమేమి?చంద్ర: హా! మందభాగ్యనైన నేను నేటితో మీ దృష్టినుండి సయితము దొలగింపఁబడి పరాధీననై పోయితినే! ప్రాణపతీ! హరిశ్చంద్రా! నాకింక దిక్కెవరు?చ. పదపద యంచు బెత్తమున బ్రాహ్మణుఁ డిట్లదలించు చుండినన్‌బదమటు సాగకున్నది భవత్పద సారసభక్తి యందు నెమ్మది వశమౌట, చంద్రకర మర్దన మందుచునుండినన్‌ బదింబదిగ మరందలోలయయి పద్మముఁ బాయని భృంగికైవడిన్‌.అకటకటా! మిమ్ముఁ జూచు నవకాశము నాకు లేదు. నా యజమానుఁడింకను దొందరపడుచున్నాడు. ఈ స్వల్పకాలములోనే శుభదాయకం బగు మీమూర్తి గనులారఁ గాంచి పోయెదను. ప్రాణపతీ!సీ. కదలవే యని విప్రుఁడదలించుటకు మున్ను గనులార మీ మోముఁ గాననిండుపదవేమి యని వటుండదలించుటకు మున్నె మీ నోటి నుడి తేనెలాననిండునడువవేమని విప్రుఁడడలు వెట్టకమున్నె పొడము మీ కన్నీరుఁ దుడువనిండుసాగవేమని వటుల్లాగవచ్చుటకు ము న్నింపుగా మిముఁ గౌఁగిలింపనిండుగీ. పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ!కాలగతి మీకు దూరస్థురాల నగుచువెడలు కన్నీట బాదము ల్గడిగి మీకుఁబ్రణుతులిడుచున్న దాన సద్గుణ నిధాన!హరి: (నిర్వేదముతో) ఛీ! ఛీ! హరిశ్చంద్రా! నీవు నిక్కముగా గిరాతునకు జన్మింప వలసిన వాడవుగదా?గీ. గళమునం దాల్పవలసిన యలరుదండపాదమర్దన కొప్పించు భంగిగాగనఖిల సామ్రాజ్యభోగంబు లందఁదగినపట్టపుఁ దేవి నమ్మితే బానిసగను.చంద్ర: హృదయేశ్వరా! నాకై మీరింతగా దుఃఖింపవలదు. విధి విధాన మెవ్వరు తప్పింతురు? దుఃఖ మడంచుకొని యా కాలకౌశికుని సేవావృత్తికి నన్నిఁక సమ్మతించి పంపివేయుడు.హరి: దేవీ! ఇప్పుడనుమతించుటేమి? ఆగర్భశ్రీమంతురాలవైన నిన్ను బరున కెప్పుడు విక్రయించితినో యప్పుడే నా యనుమతులన్నియు దీఱినవి. కాని,మ. కనుసన్నన్‌ బనికత్తెలెల్ల నిరువంక\న్‌ గొల్వ రాణించు జీవనమే కాని యెఱుంగ వెప్డుఁ బర సేవాకృత్య మా జన్మమున్‌వనితా నేటికి నీకు నా వలన బ్రాప్తంబయ్యె నెట్లోపెదో?ఘనదుర్దాంత దురంతదుస్సహమహోగ్ర క్రూర దాస్యంబునన్‌.మానవతీ! రాణివాసంబు భోగభాగ్యంబులకు జెడి నూతనముగా దాసికావృత్తి నవ లంబింప బోవుచున్న నీకు గొంతచెప్పుచున్నాను. సావధానముగా నాకర్ణింపుము.మ. తల్లి దండ్రుల్‌ మఱి వేర లే రిక సతీ! తద్దంపతుల్గాక నీకిల, వేమఱపాటు సెందకుసుమీ యీ విప్ర సేవాకృతిన్‌దొలి నీ వొందిన భోగభాగ్యముల యందున్‌ జిత్తమున్‌ నిల్పకేతలలో నాలుకగా మెలంగుము నెలంతీ! పిన్నలన్‌ బెద్దలన్‌.మఱియు నో సాధ్వీమణి! నీ స్వామి కడనె బానిసీఁడుగ నుండవలసినవాడు గానఁ గుఱ్ఱవాని లోహితాస్యునెట్లు కాపాడుకొందువో? మనకు నేటితో దురంతమైన వియోగంబు సంభవించినది కదా! (లోహితాస్యునితో) నాయనా! లోహితాస్యా! నీవు కూడా నీ తల్లి ననుసరించి యుండవలసినవాడవే కాన నావెంట రాకుము.లోహి: నాన్నగారూ! మీ రెందుల కేడ్చుచున్నారు? మీ రిప్పుడెక్కడకు బోయెదరు?హరి: నాయనా! నే నెక్కడ బానిసీఁడుగా నుండవలెనో యక్కడికే.(దీనవృత్తము - హిందూస్థానీ భైరవి -ఆది తాళము)లోహి: జనకా! యిపుడెచ్చటి కేగకుమానను నీ వెనువెంటను గొనిపొమ్మాజననిన్‌ నను నిచ్చట బ్రాహ్మణుఁడేకొనిపోయిన మాకు సుఖంబగునే?హరి: తండ్రీ! (యెత్తుకొని) నీకు రావలసిన కష్టములా ఇవి?మ. కొడుకా! కష్టము లెన్ని వచ్చినను నీకున్నాకు నాకీడులందెడబాటు ల్ఘటింయింపకుండు టొక మేలే యంచు నే సంతసంబడితింగాని యెఱుంగనిన్నుఁ దెగనమ్మంజూపి హా లోహితా!కడ కీనాటికి గాలసర్పమునకుం గైకోలుఁ గావించుటన్‌.హా! తండ్రీ! నీ కమంగళము ప్రతిహత మగుగాక!(మరల) కడ కీనాటికి గాలకౌశికునకుం గైకోలుఁ గావించుటన్‌.దేవి నేనెంత దారుణమైన వాక్యము బల్కితిని.చంద్ర: నాథా! మనకు దుఃఖము శాంతించుగాక!గీ. కాలవశమున గల్గిన కష్టచయములెల్ల వెంటనే నిలుచునే యేక రీతిమిహిర మండలమును గప్పు మేఘరీతితూలిపోకుండునే యెల్ల కాలమటుల?అట్లే యచిరకాలమునకు మరల శుభములు వచ్చి పునస్సమాగమ సౌఖ్యము లభించకపోదు.హరి: దేవీ! భవితవ్యమును నెవ్వ రెఱుంగుదురు? చూడు.మ. కలికీ! ఱెక్కలురాని పిల్లలను సాకన్‌ గూటిలో నుండి మేతలకై పోతొక చెంత బెంటియొక చెంతన్‌ బాఱ నీలోన బిల్లలఁ బామే గ్రసియించునో వలల పాలన్‌ జిక్కునో పున్గులీయిలపైఁ బ్రాణులకున్‌ వియోగమగుచో నెవ్వారి కెవ్వారలో?కేశ: ఏమయ్యా! శుభమస్తు అని మాగురువుగారు దాసిని గొనుటేమి? మీరిట్లశుభముగా నేడ్చుటేమి? పద పద (అదలించును)లోహి: (కోపముతోఁ గేశవునిఁ జూచి) (స్రగ్విణీవృతము: బేహాగ్‌ - ఆది తాళము)ఏర! మాయమ్మని ట్లీడ్వ నీకేమిరాక్రూర! నిన్నిప్పుడే గ్రుద్దెదన్‌ జూడరా!దూరమందుండి మా తోడ మాట్లాడరా!శూరునిన్‌ లోహితున్‌ జూచి నోర్మూయరా!కేశ: ఓరీ! చెడుగా, దాసిపుత్రా! కూటికి లేకపోయినను నీకెంత రాజసమున్నదిరా? (పడఁద్రోయును)లోహి: (కన్నీరు కార్చుచుఁ దండ్రివంక జూచును)హరి: (దుఃఖముతోఁ గుమారు నెత్తుకొని) తండ్రీ! నీకెంత దురవస్థ వచ్చెనురా!మ: కనుదోయిన్‌ జడబాష్పము ల్దొరఁగ నాకై యేల వీక్షించెదోతనయా! నేను మహాకిరాతుఁడ సమస్తద్వీప భూమండలీజననాథాళికి సార్వభౌముడవుగా జాల్నిన్ను నీ దాస్యపుంబనికై యమ్మిన నాకు నెచ్చటిదయా ప్రారంభవిస్రంభముల్‌.కాల: ఓహో! యేమోయీ! నీకొడుకిట్లను చున్నాడే? ఇక మా ఇల్లల్లకల్లోలము చేయునా ఏమి?హరి: అయ్యా! ఇది కేవల బాల్య చాపల్యము. కాని నామనవి యొక్క టాలింపవలయు.కాల: అది యేమి?హరి: గీ. మీరు బిడ్డలఁ గని పెంచువారె యైనఁగడుపు కక్కుఱితిని నింతగా వచింతుఁబ్రేమ నీ బిడ్డలందొక బిడ్డగాఁగనరసి కొనుమయ్య వీనిఁ గృపాంబురాశి!(లోహితు నొప్పగించును)కాల: సరి, నీ యొప్పగింతలన్నియు నైనవా? ఇంక మా దాసినిఁ బంపివేయుము. మాకు జాగగుచున్నది.చంద్ర: (దుఃఖముతో) (సరసాంక వృత్తములు - ఫీలు రాగము)సెలవిచ్చి నన్బంపుడీ క్షితిపాలచంద్రా!నలవంత జెందకిఁక పావన సత్యసాంద్రా!హరి: కలకాల మీ గతిని దుఃఖముతో సుశీలా!తలపెట్టు టూఱడిలు నింతట ముద్దరాలా!చంద్ర: ఇక జాగుచేయదగదో నృపసార్వభౌమా!సకలం బెఱింగి యిటు లెస్సయ పుణ్యధామా!హరి: అకలంకశీల! నిను నిట్లలయించినాఁడన్‌మొగమెత్తి యెట్లు గననోపుదు సిగ్గు తోడన్‌.కాల: ఓహో! మీ ఏడ్పుతో మా పనులన్నియు జెడుచున్నవి. దాసీ కదలవేమి? మూటలెత్తుకొని రమ్ము.చంద్ర: (లోహితాస్యునితోఁ దిరిగి తిరిగి పతిం జూచుచుఁ బోవుచున్నది)హరి: హా! హా! నా పుణ్యలక్ష్మి దాఁటి పోయినది.నక్ష: హరిశ్చంద్రా! నీవు విశ్వేశ్వరదేవాలయము నొద్ద నుండుము. నేను ధన మందికొని వత్తును.(కాలకౌశికునితో నిష్క్రమించును. తెర వ్రాలును.)(పిమ్మట యవనిక నెత్తగాఁ గాలకంటకి గృహద్వారముకడఁ బ్రవేశించును)కాలకం: ఓరీ, యెవఁడురా? కేశవా! జనార్దనా! అంగడికిఁ బోయిన మా యాయన యింకను రాలేదుగా? కానీ(కాలకౌశికుడు, కేశవుడు, చంద్రమతి, లోహితాస్యుడును ప్రవేశించుచున్నారు)కాలకౌ: ఓరీ, కేశవా! అదిగో అరచుచున్నదిరో.కేశ: ఈనాఁడు మీ గ్రహచార మంతగా బాగున్నట్లు తోఁచదు.కాలకౌ: ఏమోరా నాయనా! నీవు మాత్రము మాముండతో నామీద గొండెములు చెప్పకేమి.(ఇల్లు చేరుదురు)కాలకం: వచ్చుచున్నావూ? రా, రా. (సమీపించును)చంద్ర: (స్వగతము) అకటకటా! ఏమీ ధూర్తయైన యీ విప్రాంగన వర్తనము! ఈవిడయే నా యజమానురాలు గాబోలు.కాలకం: దుర్మార్గుడా! నీ విల్లు వదలి యెంతసేపయినది? నీ కొఱకై పొయ్యార్పుకొని నేను గనిపెట్టుకొని యుండవలసినదా? ఈమధ్య నీకు బొత్తిగాఁ బ్రాయశ్చిత్త కర్మములు లేకుండ నున్నవి. నేఁడు నీకు మూఁడినది గానీ చెప్పు. (కీర్తన: ఫరజు - త్రిశ్రగతి)ఇంత పొద్దెక్కినదాక నీ వెక్కడ నుంటివి ఇంటికి రాక ॥ఇం॥కాలకౌ: యాయవార మెత్తినాఁడ సంతపోయి శవాలను మోసికొచ్చినాఁడ ॥యా॥కలకం: తెచ్చిన డబ్బేదో తెమ్ము నీ మ్రుచ్చుపోకిళ్ళను మెచ్చ రారమ్ముకాలకౌ: మూడెమాడలం దెచ్చి నాడ నీతోడు నాకింకను దొరకలేదేవాడకాలకం: అట్లైన నే నూరుకోను నీపొట్ట బద్దలుచేసి నెట్టివేయకపోను (కొట్టుచున్నది)కాలకౌ: అబ్బబ్బ నే నోర్వలేను యీ డబ్బునకు రేప యిబ్బడి ఈడ్చెదనేకాలకం: నీ వింక జాగరూకతతో మెలంగకున్న నీగతి యింతియే.కేశ: అమ్మా! కాలకంటకి నే డప్పుడే వదలి పెట్టినావే? ఇక్కడ చూడు.(చంద్రమతిని, లోహితాస్యుని చూపించును)కాలకౌ: ఓరీ, కేశవా! నీ పుణ్యము, నీ వూరుకోరా! (గడ్డముఁ బట్టి బ్రతిమాలును)కాలకం: ఇఁక నేనూరుకోను. ఈ నిర్భాగ్యురాలెవరు? చెప్పు. (కొట్టును)కాలకౌ: (గట్టిఁగాఁ జేతులు పట్టుకొనుచు) నీకడుపుకడ, ఇంక చంపకే!కాలకం: ఓరీ నీ చేతులు కాలిపోను! నీశక్తి మండిపోను! ముసలితనము వచ్చినను నీ కెంత మదమున్నదిరా! ఓ యెవరయ్య! నన్ను నామగఁడు చంపుచున్నాఁడు. రండయ్యా!(కేకలు వేయుచున్నది)కాలకౌ: (నోరుమూయుచు) ఓసీ, నీపుణ్యము. అఱవకే. సుకుమారివి, నీ వింటిలోఁ బనిచేసుకోలేవని దాసిని దెచ్చినాడను.కాలకం: ఆ మాట మొదటనే యేడువరాదా?చంద్ర: అమ్మా! కాలకంటకీ! ఇదియేమి న్యాయమమ్మా!క. పతిఁ గడవ సతికి, లేదొకగతి యాతండెంత మనకుఁ గైవసమైనన్‌మితి గలదు చనువునకు నీగతిఁ బ్రతికూలతకుఁ బాలు కావలదమ్మా.శా. ప్రత్యూషంబున లేచి నాథుని పదాబ్జాతంబుల్‌ వ్రాలుటోపత్యుద్దేశ మెఱింగి బోనముల సంబాళించుటో రాకకున్‌బ్రత్యుత్థాన మొనర్చి మెచ్చఁ దగు సేవల్‌ సేయుటో కాకిటుల్‌ప్రత్యాఖ్యాన మొనర్తురమ్మ సతమున్‌ బత్యాజ్ఞకున్‌ గేహినుల్‌?మఱియు,మ. పడతీ! నేనొక పాటిగాను వచియింపన్‌ నీవిభుండెంత నీయడుగు దాటఁడ యేని బత్తి మిగులన్‌ హత్తించి బంగారమేయొడలెల్లన్‌ దిగువేయునట్లుగను నీ వోరంక ప్రొద్దెల్ల మేలడ పాలూనుము, కాళులొత్తు మటుగా దాసీవరుల్‌ వీచుమా.కాలకం: ఓహో! నీ వెవ్వతివే? నాకు జక్కట్లు దిద్దుటకేనా నా మగండునిన్ను దీసికొనివచ్చినది? ఓహో! నాకు దాసివై వచ్చి దొరసాని వైతివేనీకుఁ దెలిసిన మగనాలి వర్తనాలు మాకు దెలియవేమి? గూటికివచ్చినదానవు చచ్చినట్లు పడియుండక శ్రీరంగనీతులు చెప్పుచు నామాటలోఁ బడియున్న నా మగనిబుద్ధి చెడఁ గొట్టుచున్నావుగా.కాలకౌ: చంద్రమతీ! నీ వెప్పుడు మాయావిదతో నిట్లు మాట్లాడరాదు.(రహస్యముగా) దీని నోటికి నూని కరణాలు, కాపులు గూడ వెఱచుచుచుందురు.చంద్ర: అయ్యా! నే నూఱకున్నాను.కాలకౌ: ఓసీ, యింటిదానా! నీకు నింత నిర్భయముగా మాట్లాడిన యీ దాసికిఁ దగిన పనులు నియమించి నీ కసి దీర్చుకొమ్ము.కాలకం: అట్లయిన పద, నీ పనిన్‌ చెప్పెద.(అందరు నిష్క్రమింతురు)(పిమ్మట నక్షత్రక ద్వితీయుండై హరిశ్చంద్రుడు ప్రవేశించుచున్నాడు)హరి: నక్షత్రేశ్వరా! నన్నింత యన్యాయము చేసెదవా?నక్ష: అడవులలో నన్నిన్నాళ్ళన్నమునకు నీళ్ళకును మొగము వాచునట్లు చేయుట నీది యన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్తెము నేను తీసికొనుట యన్యాయ మయ్యెనేమి? యెట్లు?ఉ. బత్తెము లేక త్రోవల విపత్తుల కోర్చుచుఁ దిండి కేనియున్‌బొత్తుగా వాచిపోయి గృహమున్‌ విడి నీ వెనువెంట రాఁగ నీతొత్తునె యింతకంటెను గతుల్మఱి మాకిఁక లెవె యేరికిన్‌మెత్తనివానిఁ జూచు నెడ మిక్కిలి మొత్తగఁ జిత్తమౌఁ గదా!హరి: నక్షత్రకా! మీ గురువుగారి పనిమీద నీవు నా వెంట వచ్చితివి కాని, నా కొఱకై వచ్చితివా? నా వలన బత్తెమే నీవు తీసికొనిన నీవు నీ గురువునకు జేసిన యుపకారమేమున్నది?నక్ష: ఓయి దుర్మార్గుడా! ఏమన్నావు? నేను నా గురువునకు జేసిన యుపకారమేమనియా?ఉ. ఆస దొరంగి ప్రాణముల కైన దెగించుచు నిట్టి బత్తెపుంగాసుల నాసచే దరువు కానిగ నీ పయి ఘోరకాననావాస మొనర్చ నొప్పుకొని వచ్చుటె నాయుపకార మాతపోభ్యాసికి నా వలెన్‌ వటుఁడెవం డిటు నెత్తురుకూటికొప్పెడిన్‌ఇప్పుడు నా గురుభక్తిని గూడ నధిక్షేపించుచున్నావుగా? నీ వేమైన ననుము. నీ భార్య నమ్మగా వచ్చిన ధనము బత్తెము క్రింద జెల్లవలసినదే. కాన నిక మా గురువుగారి ఋణమిప్పుడే యిచ్చివేయుము.హరి: వటూత్తమా! నేనిప్పుడింత ధనమెక్కడినుండి తెత్తునయ్యా?గీ. విమలశీలను నిల్లాలి విక్రయించిచేర్చిన ధనంబు నీ చేత జిక్కెను గదఅవని స్వశరీరమాత్ర వైభవుఁడ నగుచుబ్రతుకు చున్నట్టి నేనెట్లు బత్తెమిత్తు?నక్ష: నీ విట్టి నిర్భాగ్యుడ వనియే నేను దీపముండగనే చక్కంబెట్టుకొన్నాఁడ. ఓ హరిశ్చంద్రా! ఇటు వినుము.గీ. నీకు రానున్న బత్తెంపు రూకలెటులోస్వీకరించితి నే నిల్లు సేరవచ్చుముని ఋణమునకు మీరు మీరును బెనంగితుదకు నే గంగలోనైన దుముక బొండు(పోవుచున్నాడు)హరి: (చేయి పట్టుకొని) నక్షత్రకా! నీకిది బొత్తుగాఁ దగనిపని.నక్ష: ఏమోయి చేయి పట్టుకొనుచున్నావు? నన్నుఁ గొట్టుదువా యేమి?హరి: అయ్యా! నేనంత సాహసిని గాను.నక్ష: కాకున్న నా చేయి విడువుము.హరి: విడిచితిని. ఇంక నా సొమ్ము మీ గురువున కిచ్చి వేయుము.నక్ష: హరిశ్చంద్రా! నే నిన్ని మాటలవాఁడను గాను.క. అడియాస విడువు మిఁక నాయొడలన్‌ జీవంబు లున్న వొదమిన్‌ విడువన్‌జెడనెంచి తేని నినునాబొడ నీ యడిదమున గోయ మీఁరో గొనుమీ.హరి: నక్షత్రకా! ఇంతకన్న నేఁ జెడునదేమున్నది? నన్ను గూడ నమ్ముకొని మీ గురువు ఋణంబు రాబట్టుకొనుము.నక్ష: నిన్నెవ్వరిచ్చటఁ గొందురు?హరి: ఎవ్వరు గొనకున్న గడకుఁ గడజాతివానికైన నమ్మివేయుము.నక్ష: సరి నిన్ను గాదననేల. (నడచును)(ద్విపద - కీరవాణి రాగము - ఆది తాళము) అవధారుఁడయ్య యో యగ్రజులారసవన దీక్షితులార క్షత్రియులారద్రవిణేశు మించు నుత్తమ వైశ్యులారప్రవిమల గుణగణ్య పాదజులారకడలాక్రమించి యొక్కట భూమి నేలిసడినున్న యా హరిశ్చంద్రుడు నేఁడుబానిసీడుగ నమ్మంబడుచున్న వాఁడుమాననీయుడు సత్యమార్గ ధీరుండుకోరిన ధనమిచ్చి కొనఁ దగుసుండివారణాసి పౌరవరు లార రండి(ఆకసమువంకఁ జూచి) ఏమీ! ఇతఁడెట్టి వాడఁనుచున్నారా?సీ. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్‌ దాన మిచ్చిన యట్టి ధర్మ మూర్తినిజ యశశ్చంద్రికల్‌ నిఖిల దిక్కులయందుఁ బాఱఁజల్లిన యట్టి సారగుణుండుముల్లోకములను సమ్మోదింప భేతాళు మద మడంచిన విక్రమస్థిరుండుఅణుమాత్రమైన బొంకను మాట యెఱుగని యసమాన నిత్య సత్య వ్రతుండుగీ. ఏడు దీవుల నవలీల నేలినట్టిసాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తిబానిసీడుగ నమ్మంగఁ బడెడు కొనుఁడుపౌరులార మహాధనోదారులారహరి: ఎవరు కొనకున్నారు. ఇంకెంతని యఱిచెదరు? వీఁడెవఁడో కడజాతి వానివలె నున్నాఁడు. ఇటె వచ్చుచున్నాఁడు. ఉండుము.(పిమ్మట వీర బాహు ప్రవేశించుచున్నాఁడు)వీరబాహు: (గేయము)తొలగిపోనిండయ్య! దొరలు పెద్దింటోణ్ణితెరచి చెప్పకుంటే పలువ పొమ్మంటారు ॥తొ॥పబులు మీకుక్కల కట్టి వేస్కోండయ్యా ॥తొ॥గబగబ బౌవంచు కఱవ వత్తుండయ్యావాదనంటారు సూదోచ మంటారు నేకాచంత కల్లేసి కాటికి పోతుండ ॥తొ॥నక్ష: హరిశ్చంద్రా! ఇంక నిన్నెవ్వరు కొందురు?వీర: దొరా! బానిసోణ్ణి అమ్ముతుండవా? నే గొంటానండీ, ధర చెప్పండి.నక్ష: చెప్పెదను గాని నీవు దూరముగా నుండి మాట్లాడుము. నే నిప్పుడు స్నానము చేయలేను.వీర: దూరంగానే వుండానుండి, చెప్పండి.హరి: నక్షత్రకా! నన్నీ కడజాతి వానికే యమ్మెదవా?వీర: కడజాతియేముంది, పెద్దింటోణ్ణి.నక్ష: హరిశ్చంద్రా! ఎవ్వరు గొనంకున్న నన్నేమి చేయమందువు? మొత్తము మీఁదనీవు నా కిచ్చు బత్తెమునకు దండుగ లేకుండ నా వలన బనిపుచ్చుకొనుచున్నావు.అఱచి యఱచి గొంతు పగిలిపోవుచున్నది. తిరిగి తిరిగి కాళ్ళు పడిపోవుచున్నవి.హరి: అయ్యా! వీనికే విక్రయింపుడు. నే నన్నిటికి సిద్ధుఁడనై యున్నాను.నక్ష: ఓరీ! వీరబాహూ! నీ కీతఁడు కావలయునన్నక. దంతావళంబు పయి బలవంతు డొక్కండు నిలిచి పైకిన్‌ రతనంబెంతటి దవ్వుగ రువ్వునోయంతటి యర్థం బొసంగుమా కొని పొమ్మా!వీర: ఓరబ్బో! సాలదాకుండదే!నక్ష: ఇఁక నేమనుకున్నావు? వీరబాహూ! నీచేతఁ కాదు పోరా.వీర: అయ్యోరూ! యిట్లుండానని సూత్తుండావు కామసు! డబ్బిత్తా రా, రావయ్యా అరిశ్చంద్రుడా.నక్ష: హరిశ్చంద్రా! ఇఁకబొమ్ము. నీఋణము తీఱినది.హరి: నక్షత్రేశ్వరా! నేఁనిక సెలవు పుచ్చుకొనియెద. ఎక్కడనో నిశ్చింతతోఁ దపం బాచరించుకొను నీవు గూడ నా మూలమున ఘోరారణ్యములఁ బడరాని పాట్లు పడితివి. క్షమింపుఁడు. వటూత్తమా! నమస్కారము.నక్ష: (స్వ) అయ్యో! నే నిప్పుడేమని యీ ధర్మమూర్తికిఁ బ్రత్యుత్తర మిచ్చెదను?ఇట్టి పరమ శాంతుని సత్యవంతుని నేనెంతఁ జేసితిని.(ప్రకాశముగా) హరిశ్చంద్రా! నేనే నీ కన్ని విధములఁ గష్టములఁ దెచ్చి పెట్టినదుష్టుఁడను. నేను నిన్నడుగు కొనవలసిన క్షమాపణములు నీవు నన్నడుగు కొనుచున్నావు.అయినను బుట్టినదాదిననన్య సామాన్యమైన సత్యనిష్ఠాగరిష్ఠతచేఁ బరిశుద్ధమైననీ మానసమున కింతటి క్షోభ దెచ్చి పెట్టిన నాయట్టి ఘోరకర్ముడు శిక్షార్హుండు గాకక్షమాపణమునకు దగునా?హరి: అయ్యో, విప్రోత్తమా! శిక్షించుటకుఁ గాని, క్షమించుటకుఁ గాని నేనెంతటి వాఁడను. వటుశిఖామణీ! నీకిదే వందనము. (నమస్కరించును)నక్ష: (లేవనెత్తి)చ. కలతఁ వహింపకయ్య కల కాలము కష్టము లుండబోవు కావలసిన కారణార్థము లవంబును దప్పునె? నా యకృత్యముల్‌దలఁపున నుంచకయ్య విహితమ్ము ననున్‌ క్షమింపుమయ్య, నాకలుషమె యింత కింత కధికమ్మయి నన్వధియింపకుండునే?హరి: అయ్యా! మీరు చేసిన దేమున్నది? నా పూర్వభవసంచిత పాపఫలమే నన్నీ కష్టంబులకుఁ దెచ్చె.నక్ష: రాజేంద్రా! నిత్య సత్య సంధుడవైన నీ కెప్పటికిని గష్టములు లేవు చూడు.మ. కడకన్‌ గావలెనంచు సత్యఫలముం గాంక్షించి నీవే యొడంబడి కైకొన్న విపత్తులం బరితపిం పన్‌ గూడదయ్యా కడుంగడుదోసంబని నేనెఱింగియు వృథా క్రౌర్యంబునన్‌ నీ యెడన

సత్యహరిశ్చంద్రీయము పంచమాంకము(సతీసుతులతో హరిశ్చంద్రుడు నక్షత్రకుఁడు ప్రవేశించుచున్నారు)హరి: దేవీ కష్టము లెట్లున్నను, బుణ్యక్షేత్రమైన వారణాసి దర్శించితిమి. చూడు.గీ. భక్తయోగ పదన్యాసి వారణాసిభవదురిత శాత్రవఖరాసి వారణాసిస్వర్ణదీ తటసంభాసి వారణాసిపావనక్షేత్రముల వాసి వారణాసి.నక్షత్రకా! విశ్వేశ్వరుని దర్శించి వత్తము. దేవీ! రమ్ము.నక్ష: ఇఁక మాయప్పుమాట నీకుదోచదు. పద. (నడచుచున్నారు)(యవనిక నెత్తఁగా దేవాలయము కాన్పించును. అందఱు విశ్వేశ్వరునకు నమస్కరింతురు)హరి: (ప్రాంజలియై)శ్లో॥ ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే!ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వ మనయోఃత్వయైన క్షంతవ్యా శ్శివ మదపరాధాశ్చ సకలాఃప్రయత్నా త్కర్తవ్యం మదవన మియం బంధుసరణి.శా. ఆపద్బంధుఁడ వీవు సామివి గదా! మాలాటి యాపన్నులం దేపారన్‌ ప్రముఖుండఁగా మనకుం దండ్రీ? బాంధవం బింక వే ఱే పల్కం బనిలేదుఁ గాననిఁక నీవే సైఁచి నా నేరముల్‌ కాపాడం దగు నెట్టులైనఁ నిటులే కాయోగ్యబంధుత్వముల్‌.నక్ష: హరిశ్చంద్రా! ఇంకనెంతకాల మిట్లు ముక్కు పట్టుకొని కూర్చుండెదవు? రమ్ము.చ. అలయక గుళ్ళుగోపురము లన్నియు జూచుచు నప్పుమాటయేతలపవు చేరువయ్యెనుగదా గడువంచు రవంతయేని లోఁదలపవు నా ప్రయాసము వృథాయగుచున్నది వెళ్ళబెట్టుమాపెలుచన మా ఋణంబు నెగ వేయదలంచిన నేను బోయెదన్‌.హరి: అయ్యా! ఎగవేయవలయునన్న నింత కష్టమున కేల యోర్చితి? తొందర పడకుము.నక్ష: ఏమీ! సొమ్మీయఁ దలఁచిన వాఁడవు నీవు తొందర పడకపోగా బుచ్చుకో వలసిన నన్ను గూడఁ తొందర పడవలదని నీతులు చెప్పుచున్నావుగా? బాగు! అన్నిటికిఁ గాళ్ళు సాచిన నీకేమి తొందర?ఉ. పుట్టెడు నప్పుతోడ దల మున్గితి వింకొక పుట్టెడైన నీపుట్టి మునుంగ దింతయును బ్రొద్దున నీ మొగమింత సూచినన్‌బుట్టదు యన్నమున్‌ మునిగి పోక యిఁకేమిటి? దీపముండగానెట్టన జక్కఁ బెట్టుకొన నేరకపోయె గురుండు వెఱ్ఱియై.హరి: అయ్యా! నిష్ఠురము లాడకుము.నక్ష: ఏమీ! మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠురమాయెనుగా? నీ వడుగుకొన్న నలువది దినంబులు నేఁటితోఁ దీరుచున్నవే. ఇంత దనుక నాకిచ్చిన దొక్కకాసైన లేదే? ఇంక నీ విచ్చెదవని మా కెట్లు నమ్మకముండును? ఇప్పుడు మాత్రముశా. ఏలీలన్‌ సవరింతు మా ఋణము కొంపే గోడియే నింత కూడే లేదేమిటి కింకఁ జంపెదవు పొమ్మీ మీకు నేనాటి బాకీ లన్న నిన్ను గొట్టువాడెవడు? చిక్కెన్నీకు మాజుట్టు పత్రాలా? సాక్ష్యములా? నినున్‌ బలిమి మీదన్‌ రచ్చకీడ్పింపగన్‌.హరి: నక్షత్రకా! పత్రములు సాక్షములు నేల కావలయును? నిత్యస్థిరంబయిన నా వాక్కున కన్యథాత్వ మెప్పటికైన సంభవింపదు గదా!నక్ష: సంభవింపక యిప్పటికి జేసిన దేమున్నది?హరి: అయ్యా! నా దీనదశ యించుక యోచించుము.నక్ష: అలాగయిన నేను యోచించి చెప్పునది గట్టిగా వినుము.శా. నీ కాతం డది యప్పు వెట్టినది కానే కాద యామౌని నిన్నే కైసాచి మదర్థ మిమ్మనిన సొమ్మేకాని, యద్దానికైనీ కన్నుంగవ దుమ్ము సల్లి యిట మున్నే రాజ్య సర్వస్వముంజేకొన్నాడిక నేటి యప్పు నిజముం జింతింప నింతే కదా?హరి: ఇంతియె కాని నెలదినములలో నిచ్చెద నని యమ్మునితో నొప్పుకొంటిని గదా!నక్ష: లేదనిన నా మాటలన్నియు సున్న యగుంగాదే!హరి: అయ్యా! సత్యేతరంబునకు నా మానసం బొప్పదయ్యా!నక్ష: అయ్యో! అమాయకుడా! ఇంతలోఁ జెడ్డప్పుడు గూడ సత్యము సత్యమని యూఁగులాడు చున్నావే హరిశ్చంద్రా! నీ వేమనుకొన్ననుమ. జటినై నేననరాదు కాని విను నీ సత్యంబే నీ కొంప కింతటి చేటౌటకు మూల మిప్పటికినైనన్‌ మించిపోలేదు తీర్చుట కేనాటి ఋణంబు మీకనిన దీఱున్నీకు మా బాధ! యంతట నూరేగుము సత్తుచిత్త నుచు జింతన్‌ బాసి బైరాగివై.అట్లుకానిచో నింత ధనము నీ విప్పట్టున నెట్లార్జించెదవు? చెప్పుము.సీ. వైదిక వృత్తి సంపాదింతు నంటివా యుడుగవు రాచపోకడలు నీకురాచఱికంబు శౌర్యమున దెత్తు వటన్న దెసమాలి యేవంక దిక్కులేదువణిజువర్తనముచే గణియింతు నంటివా యరచేత గుడ్డిగవ్వైన లేదువ్యవసాయవృత్తిచే సవరింతు నంటివా లేదు భూవసతి గోష్పాదమంతగీ. ఇందు నేడేని వ్యాపార మందదగినయంత పున్నెంబు పుట్టిన నింత ధనముగంటుకట్టునె యీ స్వల్ప కాలముననుగడచు నీ నాటితోడ మా గడువుదినము.ఇవియేమియుగాక బానిసవృత్తికి బాల్పడినను నిన్నెవరు కొనువారు లేరు. కావున నా యుపదేశవాక్యముల ననుసరించి నీవీ ఋణబాధ తప్పించికొనుము. మా గురువు గారితో నీ దురవస్థ యంతయు జెప్పి యీ సొమ్ము వదిలివేయు తెఱంగొనరించెద. చెప్పుము ఏల నీకీ బాధ?హరి: నక్షత్రకా! నా కంఠము గత్తిరించు చున్నను నసత్యమాడుటకు నామనంబొప్పదు.నక్ష: హరిశ్చంద్రా! నీ మేలు గోరి నేనింత వచించెద వినుము.ఉ. పుట్టిననాఁట నుండియును బొంకి యెఱుంగవు యే నెఱుంగు దిప్పట్టుని గూడులేని దురవస్థల నుంటివి గాన నీ మనంబెట్టిదొ తెంపుచేసికొని యీ యుపదేశము నాలకింపు మేనొట్టిడి కొం దసత్యమున కొప్పితివంచు వచింప నేరికిన్‌.చంద్ర: నక్షత్రేశ్వరా! నీ వంటి మునికుమారుడు చెప్పవలసిన నీతులా యివి?నక్ష: చంద్రమతీ! నీవును నీ పెన్మిటికిం దగినట్టు దొరికినావు పో,శా. మీనిప్పచ్చరముం దలంచి కరుణన్‌ మీ బాగుకై యింతగానేనేమో హితమున్‌ వచించితిని, మీ కే లేని యీ బాధ నాకా? నీ పెన్మిటి నీ వెటైన విను నా కౌనేమీ! పోనేమి నాస్నానంబో జపమో తపంబో సదను ష్ఠానంబొ యోజింపుమా.చంద్రమతీ! నా నీతులు మీరు విననక్కఱ లేదు. ఊరక యడ్డుపుల్లలు వేసినట్లు కాదు. మాకు రావలసిన సొమ్ము గవ్వలతో గూడ లెక్కపెట్టి మా కిప్పింపుము. నేనింక క్షణమాగను, మీమీది మోమాటముచే నేనింకను నాలస్యముచేసినచో సహజముగా ముక్కోపియైన మా గురువుగారు నాగొంతు గొఱుకక మానరు. హరిశ్చంద్రా! నీ పెద్దఱికం బాలోచింపను. మా సొమ్ము గుమ్మరించి మఱి నడువుము.(చేయి పట్టుకొని నిలవేయుచున్నాడు)హరి: (నిట్టూర్పు విడిచి) దేవీ! ఈ ఋణబాధ కడుంగడు దుర్భరము గద! చూడు.మ. సరివారి న్నగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగం, బనంతర మాహారమునం దనిష్ట, మటుమీదన్‌ దేహజాడ్యం, బటన్‌మరణంబే శరణంబు, పెక్కు దినము ల్మంచాన జీర్ణించి ఇంతిరొ! యీ ప్రాణులకున్‌ ఋణవ్యథలకంటెన్‌ దుస్సహం బేరికిన్‌.దేవీ! మందభాగ్యుండనైన నే నిప్పుడేమి చేయుదును? నిరవశేషముగా ఋణము దీర్చివేసికొని సంతోషించు భాగ్యము నాకు లేకపోయెనే?చంద్ర: నాథా! మీరిప్పట్టున ధైర్యము వహించి నా మనవి నాలింపుడు.గీ. కాలగతి సర్వసంపద గోలుపోవమిగులు సిరి నాకు మీరును మీకు నేనెబానిసగ నన్ను నే కలవానికేనినమ్ముకొనుఁ డింక మౌని ఋణమ్ము దీఱు.హరి: హా! విధీ! ఈ హరిశ్చంద్రునకు నెంతటి యవస్థ దెచ్చితివి?ఉ. అంతటి రాజచంద్రునకు నాత్మజవై కకుబంతకాంత విశ్రాంతయశోవిశాలుని త్రిశంకు నృపాలుని యిల్లు సొచ్చి భాస్వంతకుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన గేస్తురాండ్ర మేల్బంతిని నిన్ను నొక్కనికి బానిసగా దెగ నమ్ముకొందునే?చంద్ర: ప్రాణేశా! నీచంబని సంకోచించవలదు. సత్యప్రతిష్ఠకై యొనర్చిన నీచ కార్యంబులును సగౌరవంబులేయగు.హరి: హా! జీవితేశ్వరీ! హా! సుగుణసుమవల్లీ! కఠినకర్ముండ నగు నేనెంతకు జాలను? హృదయమా! నేటితో నభిమానము వదలివేయుము. దేవీ! చంద్రమతీ!గీ. హృదయమున నెగ్గు సిగ్గులు వదలివేసిదాసిగా నిన్ను నమ్ముకో దలచినాడవాడవాడల నిన్‌ గొనువారి నూరవెదకికొన బోవుదుము జనవే లతాంగి!చంద్ర: (నడచుచు) ఓదేవా! కాశీవిశ్వనాథా! నన్ను గొనువారి ద్వరలో గను పఱచి మమ్ము విశ్వామిత్ర ఋణబాధా విముక్తులను జేయుము, తండ్రీ!నక్ష: హరిశ్చంద్రా! ఇదియే అంగడి వీథి. ఇక్కడ ఒక్క కేక వేయుము.హరి: దేవీ! నేనిప్పుడేమి ఘోషించవలయును.చంద్ర: క్రయ ధనమ్ము నమ్ము కొనువారెట్లో యట్లే.హరి: ఓహో! పౌరులారా! (కొంచెమూరకుండి) అయ్యో! యెంత నైచ్యమునకు బాల్పడుచుంటిని?నక్ష: హరిశ్చంద్రా! ధనమిచ్చి కొనదగిన వారంద ఱిక్కడనే యున్నారు? ఇంక నీ యాగడములు చాలించి యందఱు వినున ట్లెలుంగెత్తి కేక వేయుము.హరి: అయ్యా! నేనన్నిటికి దెగించియే యున్నాను.(ద్విపద - రాగము కీరవాణి - తాళము ఆది) అవధారుడయ్య యో యగ్రజులార!సవనదీక్షితులార! క్షత్రియులార!ప్రవిమల గుణగణ్య పాదజులారకడలాక్రమించి యొక్కట భూమి నేలిసడినున్న యీ హరిశ్చంద్రుడ నగుటప్రణుత కౌశిక ఋణగ్రస్తుండ నగుటగుణములదొంతి పల్కులమేలుబంతిపున్నె పింతుల యీలు పున కోజబంతియన్నుల తలకట్టు లందు సేమంతియగు నాదు నిల్లాలి హా! దయమాలితెగ నమ్ముకొందు వీధిని దాసిగానుచేరి రొక్కంబిచ్చి చెల్వను గొనుడివారణాసీ పౌర వరులార! మీరుమఱియు నో సౌభాగ్యమహితాత్ములార!సీ. జవదాటి యెఱుగ దీ యువతీలలామంబు పతిమాట రతనాల పైడిమూటఅడుగుదప్పి యెఱుంగ దత్తమామల యాజ్ఞ కసమానభక్తి దివ్యానురక్తిఅణుమాత్రమైన బొంకనుమాట యెఱుగ దీ కలుష విహీన నవ్వులకు నైనకోపం బెఱుంగ దీ గుణవితాన నితాంత యొరులెంత తన్ను దూఱుచున్న సుంతగీ. ఈ లతాంగి సమస్త భూపాలమకుటభవ్యమణికాంతి శబలిత పాదుడైనసార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్యదాసిగా నీపెఁ గొనరయ్య ధన్యులార!(పిమ్మట గేశవునితో గాల కౌశికుడు ప్రవేశించుచున్నాడు)కాల: ఓరీ! శిష్యా! ఎక్కడరా బానిసల విక్రయించునది?హరి: బ్రాహ్మణోత్తమా! ఇక్కడనే. మందభాగ్యుడనైన నేనే బానిసల విక్రయించు చున్నాడ.కాల: అట్లయిన నీవెవ్వడవు? ముందు చెప్పుము.హరి: నే నెవ్వండనైన మీకేమి?కాల: ఏమోయీ. పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతను నీ వెక్కడనో యెత్తుకొని వచ్చినట్లున్నావే! ఆఁ! నీవే దొంగతనము చేసినను సాగివచ్చుటకు నీ కాశికా పురమంత యరాజకముగ యున్నదనుకొంటివేమి? బోయవానికి రామచిలుక లాగున నీకీకాంత యెక్కడ చిక్కినది? ఫాలాక్షునంత వాడనైన నాకంటంబడి తప్పించుకొని బోవుట కల్ల. (శిష్యునితో) ఓరీ! కేశవా! నీవు పోయి మనయూరి తలారి పెద్ద యగు రామసింగును బిలుచుకొని రమ్ము. ఈ మ్రుచ్చును పట్టి యొప్పగింతము.హరి: అయ్యా! విప్రోత్తమా!గీ. ధరణిలో దొంగతనములో దొరతనములోభాగ్యవంతునకేదైన బాధలేదుపెన్నిధి యదృష్టమున నిరు పేదవానికబ్బినను దొంగసొమ్మంట కబ్బురంబె?కాల: ఏమీ! నీ యదృష్టమునకు దోడు నీకీ కాంత యెక్కడో లభించినదా?హరి: అదృష్టమున లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఈమె నాభార్య చంద్రమతి.కాల: ఏలాగూ! విశ్వామిత్రున కప్పుపడితినని యఱచినది నీవేనా? ఆలాగైన తపోధనుడైన యమ్ముని కీవెట్లు ఋణపడితివి?హరి: నారాజ్యసర్వస్వ మాతనికి ధారవోయునప్పుడు మున్నాతనికి యజ్ఞార్థమై ఇచ్చెదనన్న ధనము ముందు నిరూపింపకపోవుట వలన.కాల: పత్రము వ్రాసి పుచ్చుకొనినగాని యప్పుకాదు గదా! సాక్షులెవరైన నున్నారా?హరి: సత్యశీలమే పత్రము. మా యుభయుల చిత్తములే సాక్ష్యములు.కాల: ఓయీ యమాయకుడా! ప్రాణము లేని యీ పత్రమునకును సాక్ష్యములకును భయపడినిక్షేపము వంటి యిల్లాలి నమ్ముకొను చున్నావా? (ఆలోచించి) ఉండుండుము. నాకిప్పుడుమంచి యుపాయము తోచినది. నన్నా విశ్వామిత్రునొద్దకు దీసికొనిపోయి యీ ధనమునీకీయవలసినది కాదని పోరాడుము. నీ పక్షమున నేను న్యాయవాదిత్వము గైకొని రాయిగ్రుద్దుచు వాదింపగలను. ఓహో! ఒకరికిం బదుగురు సాక్షులుంచిన పత్రములనెగవేయుటలోను ద్రోవఁబ్రోవు వారిపై లేని యప్పులగట్టి ధనము గణించుటలోనునన్ను మించినవాడు మఱొక్కండు నీకు దొరకడు. పద, నేను నీకు సహాయుడనైయుండ విశ్వామిత్రుడును గిశ్వామిత్రుడును నిన్నేమి చేయగలడో చూతము.నక్ష: హరిశ్చంద్రా! నీ కిప్పుడు సహాయ సంపత్తి కూడ లభించినది! ఇంక రమ్ము.హరి: అయ్యలారా! మీ రిరువురును మహాబ్రాహ్మణులు కాని యూరకుండుడు. నా కెవ్వరి సహాయమక్కఱలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలయును గాని,మ. ఇటులెంతైన ధనంబు వచ్చినను రానీ గాధిరాట్సూతి నాకెటు కష్టంబుల దెచ్చెనేనియును దేనీ దివ్యభోగంబు లెన్నిటి నాకాజడదారి యిచ్చినను నీనీ, సత్యముం దప్ప నేనిటు సూర్యుండటుతోచెనేని వినుడోయీ మీరు ముమ్మాటికిన్‌.కాల: ఓహో! నీ వెంత సత్యవంతుడవైనను ధనము పట్ల గొంచెము సడలు విడవ వచ్చును. అందుకే "సర్వేజనాః కాంచన మాశ్రయంతి" యని పెద్దలు చెప్పు చున్నారు. నా యీ శాస్త్రప్రమాణ మంగీకరించి కౌశికునొద్దకు నడువుడు. చూడుము.క. ఆలాగున గౌశికుఁడేపాలయ్యె, ధనాశకింక వల దుడుగుము నీకేలా! యీ వేదాంతము?పా లొల్లని పిల్లి గలదె పరికింపంగన్‌?హరి: అయ్యా! ఏల మీకిన్ని మాటలు?కాల: సరి, నీకి బాగుపడు యోగము లేదు. తియ్యని చెఱకుపానకము నోట బోయుచుండ విషమని గ్రక్కువాని కెవ్వరేమి చెప్పగలరు. నీ యిష్టము. నీ భార్యనెంతకమ్మెదవు?హరి: నక్షత్రకా! చెప్పుము.నక్ష: ఓ కాలకౌశికుడా! వినుము.క. దంతావళంబు పయి బలవంతు డొక్కండు నిలిచి పైకిన్‌ రతనంబెంతటి దవ్వుగ రువ్వునోయంతటి యర్థంబు నిచ్చి యతివం గొనుమీ!కాల: ఓహో! కేశవుడా! ఇదేమి చవుకబేరము గాదురా!నక్ష: మఱి పంచాంగము కట్టకే వచ్చునేమి?కాల: ఏమిరా చెడుగా, మాయాయవారపు జోలె చూచి నన్ను ధనహీనునిగా గణించుచున్నావు కాని, దీనిని మా యింటికి బంపి వేయుము. ధనమిచ్చి వేయుదను. హరిశ్చంద్రా! సరియేగదా!హరి: అయ్యా! అట్లే.కాల: దాసీ! ఇక బద. కుఱ్ఱా! నడువుము. (బెత్తమున నదలించుచు)చంద్ర: అయ్యా! వచ్చుచున్నాను. (పతి పాదములపైఁ బడును)కేశ: దాసీ! నడువమేమి?చంద్ర: హా! మందభాగ్యనైన నేను నేటితో మీ దృష్టినుండి సయితము దొలగింపఁబడి పరాధీననై పోయితినే! ప్రాణపతీ! హరిశ్చంద్రా! నాకింక దిక్కెవరు?చ. పదపద యంచు బెత్తమున బ్రాహ్మణుఁ డిట్లదలించు చుండినన్‌బదమటు సాగకున్నది భవత్పద సారసభక్తి యందు నెమ్మది వశమౌట, చంద్రకర మర్దన మందుచునుండినన్‌ బదింబదిగ మరందలోలయయి పద్మముఁ బాయని భృంగికైవడిన్‌.అకటకటా! మిమ్ముఁ జూచు నవకాశము నాకు లేదు. నా యజమానుఁడింకను దొందరపడుచున్నాడు. ఈ స్వల్పకాలములోనే శుభదాయకం బగు మీమూర్తి గనులారఁ గాంచి పోయెదను. ప్రాణపతీ!సీ. కదలవే యని విప్రుఁడదలించుటకు మున్ను గనులార మీ మోముఁ గాననిండుపదవేమి యని వటుండదలించుటకు మున్నె మీ నోటి నుడి తేనెలాననిండునడువవేమని విప్రుఁడడలు వెట్టకమున్నె పొడము మీ కన్నీరుఁ దుడువనిండుసాగవేమని వటుల్లాగవచ్చుటకు ము న్నింపుగా మిముఁ గౌఁగిలింపనిండుగీ. పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ!కాలగతి మీకు దూరస్థురాల నగుచువెడలు కన్నీట బాదము ల్గడిగి మీకుఁబ్రణుతులిడుచున్న దాన సద్గుణ నిధాన!హరి: (నిర్వేదముతో) ఛీ! ఛీ! హరిశ్చంద్రా! నీవు నిక్కముగా గిరాతునకు జన్మింప వలసిన వాడవుగదా?గీ. గళమునం దాల్పవలసిన యలరుదండపాదమర్దన కొప్పించు భంగిగాగనఖిల సామ్రాజ్యభోగంబు లందఁదగినపట్టపుఁ దేవి నమ్మితే బానిసగను.చంద్ర: హృదయేశ్వరా! నాకై మీరింతగా దుఃఖింపవలదు. విధి విధాన మెవ్వరు తప్పింతురు? దుఃఖ మడంచుకొని యా కాలకౌశికుని సేవావృత్తికి నన్నిఁక సమ్మతించి పంపివేయుడు.హరి: దేవీ! ఇప్పుడనుమతించుటేమి? ఆగర్భశ్రీమంతురాలవైన నిన్ను బరున కెప్పుడు విక్రయించితినో యప్పుడే నా యనుమతులన్నియు దీఱినవి. కాని,మ. కనుసన్నన్‌ బనికత్తెలెల్ల నిరువంక\న్‌ గొల్వ రాణించు జీవనమే కాని యెఱుంగ వెప్డుఁ బర సేవాకృత్య మా జన్మమున్‌వనితా నేటికి నీకు నా వలన బ్రాప్తంబయ్యె నెట్లోపెదో?ఘనదుర్దాంత దురంతదుస్సహమహోగ్ర క్రూర దాస్యంబునన్‌.మానవతీ! రాణివాసంబు భోగభాగ్యంబులకు జెడి నూతనముగా దాసికావృత్తి నవ లంబింప బోవుచున్న నీకు గొంతచెప్పుచున్నాను. సావధానముగా నాకర్ణింపుము.మ. తల్లి దండ్రుల్‌ మఱి వేర లే రిక సతీ! తద్దంపతుల్గాక నీకిల, వేమఱపాటు సెందకుసుమీ యీ విప్ర సేవాకృతిన్‌దొలి నీ వొందిన భోగభాగ్యముల యందున్‌ జిత్తమున్‌ నిల్పకేతలలో నాలుకగా మెలంగుము నెలంతీ! పిన్నలన్‌ బెద్దలన్‌.మఱియు నో సాధ్వీమణి! నీ స్వామి కడనె బానిసీఁడుగ నుండవలసినవాడు గానఁ గుఱ్ఱవాని లోహితాస్యునెట్లు కాపాడుకొందువో? మనకు నేటితో దురంతమైన వియోగంబు సంభవించినది కదా! (లోహితాస్యునితో) నాయనా! లోహితాస్యా! నీవు కూడా నీ తల్లి ననుసరించి యుండవలసినవాడవే కాన నావెంట రాకుము.లోహి: నాన్నగారూ! మీ రెందుల కేడ్చుచున్నారు? మీ రిప్పుడెక్కడకు బోయెదరు?హరి: నాయనా! నే నెక్కడ బానిసీఁడుగా నుండవలెనో యక్కడికే.(దీనవృత్తము - హిందూస్థానీ భైరవి -ఆది తాళము)లోహి: జనకా! యిపుడెచ్చటి కేగకుమానను నీ వెనువెంటను గొనిపొమ్మాజననిన్‌ నను నిచ్చట బ్రాహ్మణుఁడేకొనిపోయిన మాకు సుఖంబగునే?హరి: తండ్రీ! (యెత్తుకొని) నీకు రావలసిన కష్టములా ఇవి?మ. కొడుకా! కష్టము లెన్ని వచ్చినను నీకున్నాకు నాకీడులందెడబాటు ల్ఘటింయింపకుండు టొక మేలే యంచు నే సంతసంబడితింగాని యెఱుంగనిన్నుఁ దెగనమ్మంజూపి హా లోహితా!కడ కీనాటికి గాలసర్పమునకుం గైకోలుఁ గావించుటన్‌.హా! తండ్రీ! నీ కమంగళము ప్రతిహత మగుగాక!(మరల) కడ కీనాటికి గాలకౌశికునకుం గైకోలుఁ గావించుటన్‌.దేవి నేనెంత దారుణమైన వాక్యము బల్కితిని.చంద్ర: నాథా! మనకు దుఃఖము శాంతించుగాక!గీ. కాలవశమున గల్గిన కష్టచయములెల్ల వెంటనే నిలుచునే యేక రీతిమిహిర మండలమును గప్పు మేఘరీతితూలిపోకుండునే యెల్ల కాలమటుల?అట్లే యచిరకాలమునకు మరల శుభములు వచ్చి పునస్సమాగమ సౌఖ్యము లభించకపోదు.హరి: దేవీ! భవితవ్యమును నెవ్వ రెఱుంగుదురు? చూడు.మ. కలికీ! ఱెక్కలురాని పిల్లలను సాకన్‌ గూటిలో నుండి మేతలకై పోతొక చెంత బెంటియొక చెంతన్‌ బాఱ నీలోన బిల్లలఁ బామే గ్రసియించునో వలల పాలన్‌ జిక్కునో పున్గులీయిలపైఁ బ్రాణులకున్‌ వియోగమగుచో నెవ్వారి కెవ్వారలో?కేశ: ఏమయ్యా! శుభమస్తు అని మాగురువుగారు దాసిని గొనుటేమి? మీరిట్లశుభముగా నేడ్చుటేమి? పద పద (అదలించును)లోహి: (కోపముతోఁ గేశవునిఁ జూచి) (స్రగ్విణీవృతము: బేహాగ్‌ - ఆది తాళము)ఏర! మాయమ్మని ట్లీడ్వ నీకేమిరాక్రూర! నిన్నిప్పుడే గ్రుద్దెదన్‌ జూడరా!దూరమందుండి మా తోడ మాట్లాడరా!శూరునిన్‌ లోహితున్‌ జూచి నోర్మూయరా!కేశ: ఓరీ! చెడుగా, దాసిపుత్రా! కూటికి లేకపోయినను నీకెంత రాజసమున్నదిరా? (పడఁద్రోయును)లోహి: (కన్నీరు కార్చుచుఁ దండ్రివంక జూచును)హరి: (దుఃఖముతోఁ గుమారు నెత్తుకొని) తండ్రీ! నీకెంత దురవస్థ వచ్చెనురా!మ: కనుదోయిన్‌ జడబాష్పము ల్దొరఁగ నాకై యేల వీక్షించెదోతనయా! నేను మహాకిరాతుఁడ సమస్తద్వీప భూమండలీజననాథాళికి సార్వభౌముడవుగా జాల్నిన్ను నీ దాస్యపుంబనికై యమ్మిన నాకు నెచ్చటిదయా ప్రారంభవిస్రంభముల్‌.కాల: ఓహో! యేమోయీ! నీకొడుకిట్లను చున్నాడే? ఇక మా ఇల్లల్లకల్లోలము చేయునా ఏమి?హరి: అయ్యా! ఇది కేవల బాల్య చాపల్యము. కాని నామనవి యొక్క టాలింపవలయు.కాల: అది యేమి?హరి: గీ. మీరు బిడ్డలఁ గని పెంచువారె యైనఁగడుపు కక్కుఱితిని నింతగా వచింతుఁబ్రేమ నీ బిడ్డలందొక బిడ్డగాఁగనరసి కొనుమయ్య వీనిఁ గృపాంబురాశి!(లోహితు నొప్పగించును)కాల: సరి, నీ యొప్పగింతలన్నియు నైనవా? ఇంక మా దాసినిఁ బంపివేయుము. మాకు జాగగుచున్నది.చంద్ర: (దుఃఖముతో) (సరసాంక వృత్తములు - ఫీలు రాగము)సెలవిచ్చి నన్బంపుడీ క్షితిపాలచంద్రా!నలవంత జెందకిఁక పావన సత్యసాంద్రా!హరి: కలకాల మీ గతిని దుఃఖముతో సుశీలా!తలపెట్టు టూఱడిలు నింతట ముద్దరాలా!చంద్ర: ఇక జాగుచేయదగదో నృపసార్వభౌమా!సకలం బెఱింగి యిటు లెస్సయ పుణ్యధామా!హరి: అకలంకశీల! నిను నిట్లలయించినాఁడన్‌మొగమెత్తి యెట్లు గననోపుదు సిగ్గు తోడన్‌.కాల: ఓహో! మీ ఏడ్పుతో మా పనులన్నియు జెడుచున్నవి. దాసీ కదలవేమి? మూటలెత్తుకొని రమ్ము.చంద్ర: (లోహితాస్యునితోఁ దిరిగి తిరిగి పతిం జూచుచుఁ బోవుచున్నది)హరి: హా! హా! నా పుణ్యలక్ష్మి దాఁటి పోయినది.నక్ష: హరిశ్చంద్రా! నీవు విశ్వేశ్వరదేవాలయము నొద్ద నుండుము. నేను ధన మందికొని వత్తును.(కాలకౌశికునితో నిష్క్రమించును. తెర వ్రాలును.)(పిమ్మట యవనిక నెత్తగాఁ గాలకంటకి గృహద్వారముకడఁ బ్రవేశించును)కాలకం: ఓరీ, యెవఁడురా? కేశవా! జనార్దనా! అంగడికిఁ బోయిన మా యాయన యింకను రాలేదుగా? కానీ(కాలకౌశికుడు, కేశవుడు, చంద్రమతి, లోహితాస్యుడును ప్రవేశించుచున్నారు)కాలకౌ: ఓరీ, కేశవా! అదిగో అరచుచున్నదిరో.కేశ: ఈనాఁడు మీ గ్రహచార మంతగా బాగున్నట్లు తోఁచదు.కాలకౌ: ఏమోరా నాయనా! నీవు మాత్రము మాముండతో నామీద గొండెములు చెప్పకేమి.(ఇల్లు చేరుదురు)కాలకం: వచ్చుచున్నావూ? రా, రా. (సమీపించును)చంద్ర: (స్వగతము) అకటకటా! ఏమీ ధూర్తయైన యీ విప్రాంగన వర్తనము! ఈవిడయే నా యజమానురాలు గాబోలు.కాలకం: దుర్మార్గుడా! నీ విల్లు వదలి యెంతసేపయినది? నీ కొఱకై పొయ్యార్పుకొని నేను గనిపెట్టుకొని యుండవలసినదా? ఈమధ్య నీకు బొత్తిగాఁ బ్రాయశ్చిత్త కర్మములు లేకుండ నున్నవి. నేఁడు నీకు మూఁడినది గానీ చెప్పు. (కీర్తన: ఫరజు - త్రిశ్రగతి)ఇంత పొద్దెక్కినదాక నీ వెక్కడ నుంటివి ఇంటికి రాక ॥ఇం॥కాలకౌ: యాయవార మెత్తినాఁడ సంతపోయి శవాలను మోసికొచ్చినాఁడ ॥యా॥కలకం: తెచ్చిన డబ్బేదో తెమ్ము నీ మ్రుచ్చుపోకిళ్ళను మెచ్చ రారమ్ముకాలకౌ: మూడెమాడలం దెచ్చి నాడ నీతోడు నాకింకను దొరకలేదేవాడకాలకం: అట్లైన నే నూరుకోను నీపొట్ట బద్దలుచేసి నెట్టివేయకపోను (కొట్టుచున్నది)కాలకౌ: అబ్బబ్బ నే నోర్వలేను యీ డబ్బునకు రేప యిబ్బడి ఈడ్చెదనేకాలకం: నీ వింక జాగరూకతతో మెలంగకున్న నీగతి యింతియే.కేశ: అమ్మా! కాలకంటకి నే డప్పుడే వదలి పెట్టినావే? ఇక్కడ చూడు.(చంద్రమతిని, లోహితాస్యుని చూపించును)కాలకౌ: ఓరీ, కేశవా! నీ పుణ్యము, నీ వూరుకోరా! (గడ్డముఁ బట్టి బ్రతిమాలును)కాలకం: ఇఁక నేనూరుకోను. ఈ నిర్భాగ్యురాలెవరు? చెప్పు. (కొట్టును)కాలకౌ: (గట్టిఁగాఁ జేతులు పట్టుకొనుచు) నీకడుపుకడ, ఇంక చంపకే!కాలకం: ఓరీ నీ చేతులు కాలిపోను! నీశక్తి మండిపోను! ముసలితనము వచ్చినను నీ కెంత మదమున్నదిరా! ఓ యెవరయ్య! నన్ను నామగఁడు చంపుచున్నాఁడు. రండయ్యా!(కేకలు వేయుచున్నది)కాలకౌ: (నోరుమూయుచు) ఓసీ, నీపుణ్యము. అఱవకే. సుకుమారివి, నీ వింటిలోఁ బనిచేసుకోలేవని దాసిని దెచ్చినాడను.కాలకం: ఆ మాట మొదటనే యేడువరాదా?చంద్ర: అమ్మా! కాలకంటకీ! ఇదియేమి న్యాయమమ్మా!క. పతిఁ గడవ సతికి, లేదొకగతి యాతండెంత మనకుఁ గైవసమైనన్‌మితి గలదు చనువునకు నీగతిఁ బ్రతికూలతకుఁ బాలు కావలదమ్మా.శా. ప్రత్యూషంబున లేచి నాథుని పదాబ్జాతంబుల్‌ వ్రాలుటోపత్యుద్దేశ మెఱింగి బోనముల సంబాళించుటో రాకకున్‌బ్రత్యుత్థాన మొనర్చి మెచ్చఁ దగు సేవల్‌ సేయుటో కాకిటుల్‌ప్రత్యాఖ్యాన మొనర్తురమ్మ సతమున్‌ బత్యాజ్ఞకున్‌ గేహినుల్‌?మఱియు,మ. పడతీ! నేనొక పాటిగాను వచియింపన్‌ నీవిభుండెంత నీయడుగు దాటఁడ యేని బత్తి మిగులన్‌ హత్తించి బంగారమేయొడలెల్లన్‌ దిగువేయునట్లుగను నీ వోరంక ప్రొద్దెల్ల మేలడ పాలూనుము, కాళులొత్తు మటుగా దాసీవరుల్‌ వీచుమా.కాలకం: ఓహో! నీ వెవ్వతివే? నాకు జక్కట్లు దిద్దుటకేనా నా మగండునిన్ను దీసికొనివచ్చినది? ఓహో! నాకు దాసివై వచ్చి దొరసాని వైతివేనీకుఁ దెలిసిన మగనాలి వర్తనాలు మాకు దెలియవేమి? గూటికివచ్చినదానవు చచ్చినట్లు పడియుండక శ్రీరంగనీతులు చెప్పుచు నామాటలోఁ బడియున్న నా మగనిబుద్ధి చెడఁ గొట్టుచున్నావుగా.కాలకౌ: చంద్రమతీ! నీ వెప్పుడు మాయావిదతో నిట్లు మాట్లాడరాదు.(రహస్యముగా) దీని నోటికి నూని కరణాలు, కాపులు గూడ వెఱచుచుచుందురు.చంద్ర: అయ్యా! నే నూఱకున్నాను.కాలకౌ: ఓసీ, యింటిదానా! నీకు నింత నిర్భయముగా మాట్లాడిన యీ దాసికిఁ దగిన పనులు నియమించి నీ కసి దీర్చుకొమ్ము.కాలకం: అట్లయిన పద, నీ పనిన్‌ చెప్పెద.(అందరు నిష్క్రమింతురు)(పిమ్మట నక్షత్రక ద్వితీయుండై హరిశ్చంద్రుడు ప్రవేశించుచున్నాడు)హరి: నక్షత్రేశ్వరా! నన్నింత యన్యాయము చేసెదవా?నక్ష: అడవులలో నన్నిన్నాళ్ళన్నమునకు నీళ్ళకును మొగము వాచునట్లు చేయుట నీది యన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్తెము నేను తీసికొనుట యన్యాయ మయ్యెనేమి? యెట్లు?ఉ. బత్తెము లేక త్రోవల విపత్తుల కోర్చుచుఁ దిండి కేనియున్‌బొత్తుగా వాచిపోయి గృహమున్‌ విడి నీ వెనువెంట రాఁగ నీతొత్తునె యింతకంటెను గతుల్మఱి మాకిఁక లెవె యేరికిన్‌మెత్తనివానిఁ జూచు నెడ మిక్కిలి మొత్తగఁ జిత్తమౌఁ గదా!హరి: నక్షత్రకా! మీ గురువుగారి పనిమీద నీవు నా వెంట వచ్చితివి కాని, నా కొఱకై వచ్చితివా? నా వలన బత్తెమే నీవు తీసికొనిన నీవు నీ గురువునకు జేసిన యుపకారమేమున్నది?నక్ష: ఓయి దుర్మార్గుడా! ఏమన్నావు? నేను నా గురువునకు జేసిన యుపకారమేమనియా?ఉ. ఆస దొరంగి ప్రాణముల కైన దెగించుచు నిట్టి బత్తెపుంగాసుల నాసచే దరువు కానిగ నీ పయి ఘోరకాననావాస మొనర్చ నొప్పుకొని వచ్చుటె నాయుపకార మాతపోభ్యాసికి నా వలెన్‌ వటుఁడెవం డిటు నెత్తురుకూటికొప్పెడిన్‌ఇప్పుడు నా గురుభక్తిని గూడ నధిక్షేపించుచున్నావుగా? నీ వేమైన ననుము. నీ భార్య నమ్మగా వచ్చిన ధనము బత్తెము క్రింద జెల్లవలసినదే. కాన నిక మా గురువుగారి ఋణమిప్పుడే యిచ్చివేయుము.హరి: వటూత్తమా! నేనిప్పుడింత ధనమెక్కడినుండి తెత్తునయ్యా?గీ. విమలశీలను నిల్లాలి విక్రయించిచేర్చిన ధనంబు నీ చేత జిక్కెను గదఅవని స్వశరీరమాత్ర వైభవుఁడ నగుచుబ్రతుకు చున్నట్టి నేనెట్లు బత్తెమిత్తు?నక్ష: నీ విట్టి నిర్భాగ్యుడ వనియే నేను దీపముండగనే చక్కంబెట్టుకొన్నాఁడ. ఓ హరిశ్చంద్రా! ఇటు వినుము.గీ. నీకు రానున్న బత్తెంపు రూకలెటులోస్వీకరించితి నే నిల్లు సేరవచ్చుముని ఋణమునకు మీరు మీరును బెనంగితుదకు నే గంగలోనైన దుముక బొండు(పోవుచున్నాడు)హరి: (చేయి పట్టుకొని) నక్షత్రకా! నీకిది బొత్తుగాఁ దగనిపని.నక్ష: ఏమోయి చేయి పట్టుకొనుచున్నావు? నన్నుఁ గొట్టుదువా యేమి?హరి: అయ్యా! నేనంత సాహసిని గాను.నక్ష: కాకున్న నా చేయి విడువుము.హరి: విడిచితిని. ఇంక నా సొమ్ము మీ గురువున కిచ్చి వేయుము.నక్ష: హరిశ్చంద్రా! నే నిన్ని మాటలవాఁడను గాను.క. అడియాస విడువు మిఁక నాయొడలన్‌ జీవంబు లున్న వొదమిన్‌ విడువన్‌జెడనెంచి తేని నినునాబొడ నీ యడిదమున గోయ మీఁరో గొనుమీ.హరి: నక్షత్రకా! ఇంతకన్న నేఁ జెడునదేమున్నది? నన్ను గూడ నమ్ముకొని మీ గురువు ఋణంబు రాబట్టుకొనుము.నక్ష: నిన్నెవ్వరిచ్చటఁ గొందురు?హరి: ఎవ్వరు గొనకున్న గడకుఁ గడజాతివానికైన నమ్మివేయుము.నక్ష: సరి నిన్ను గాదననేల. (నడచును)(ద్విపద - కీరవాణి రాగము - ఆది తాళము) అవధారుఁడయ్య యో యగ్రజులారసవన దీక్షితులార క్షత్రియులారద్రవిణేశు మించు నుత్తమ వైశ్యులారప్రవిమల గుణగణ్య పాదజులారకడలాక్రమించి యొక్కట భూమి నేలిసడినున్న యా హరిశ్చంద్రుడు నేఁడుబానిసీడుగ నమ్మంబడుచున్న వాఁడుమాననీయుడు సత్యమార్గ ధీరుండుకోరిన ధనమిచ్చి కొనఁ దగుసుండివారణాసి పౌరవరు లార రండి(ఆకసమువంకఁ జూచి) ఏమీ! ఇతఁడెట్టి వాడఁనుచున్నారా?సీ. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్‌ దాన మిచ్చిన యట్టి ధర్మ మూర్తినిజ యశశ్చంద్రికల్‌ నిఖిల దిక్కులయందుఁ బాఱఁజల్లిన యట్టి సారగుణుండుముల్లోకములను సమ్మోదింప భేతాళు మద మడంచిన విక్రమస్థిరుండుఅణుమాత్రమైన బొంకను మాట యెఱుగని యసమాన నిత్య సత్య వ్రతుండుగీ. ఏడు దీవుల నవలీల నేలినట్టిసాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తిబానిసీడుగ నమ్మంగఁ బడెడు కొనుఁడుపౌరులార మహాధనోదారులారహరి: ఎవరు కొనకున్నారు. ఇంకెంతని యఱిచెదరు? వీఁడెవఁడో కడజాతి వానివలె నున్నాఁడు. ఇటె వచ్చుచున్నాఁడు. ఉండుము.(పిమ్మట వీర బాహు ప్రవేశించుచున్నాఁడు)వీరబాహు: (గేయము)తొలగిపోనిండయ్య! దొరలు పెద్దింటోణ్ణితెరచి చెప్పకుంటే పలువ పొమ్మంటారు ॥తొ॥పబులు మీకుక్కల కట్టి వేస్కోండయ్యా ॥తొ॥గబగబ బౌవంచు కఱవ వత్తుండయ్యావాదనంటారు సూదోచ మంటారు నేకాచంత కల్లేసి కాటికి పోతుండ ॥తొ॥నక్ష: హరిశ్చంద్రా! ఇంక నిన్నెవ్వరు కొందురు?వీర: దొరా! బానిసోణ్ణి అమ్ముతుండవా? నే గొంటానండీ, ధర చెప్పండి.నక్ష: చెప్పెదను గాని నీవు దూరముగా నుండి మాట్లాడుము. నే నిప్పుడు స్నానము చేయలేను.వీర: దూరంగానే వుండానుండి, చెప్పండి.హరి: నక్షత్రకా! నన్నీ కడజాతి వానికే యమ్మెదవా?వీర: కడజాతియేముంది, పెద్దింటోణ్ణి.నక్ష: హరిశ్చంద్రా! ఎవ్వరు గొనంకున్న నన్నేమి చేయమందువు? మొత్తము మీఁదనీవు నా కిచ్చు బత్తెమునకు దండుగ లేకుండ నా వలన బనిపుచ్చుకొనుచున్నావు.అఱచి యఱచి గొంతు పగిలిపోవుచున్నది. తిరిగి తిరిగి కాళ్ళు పడిపోవుచున్నవి.హరి: అయ్యా! వీనికే విక్రయింపుడు. నే నన్నిటికి సిద్ధుఁడనై యున్నాను.నక్ష: ఓరీ! వీరబాహూ! నీ కీతఁడు కావలయునన్నక. దంతావళంబు పయి బలవంతు డొక్కండు నిలిచి పైకిన్‌ రతనంబెంతటి దవ్వుగ రువ్వునోయంతటి యర్థం బొసంగుమా కొని పొమ్మా!వీర: ఓరబ్బో! సాలదాకుండదే!నక్ష: ఇఁక నేమనుకున్నావు? వీరబాహూ! నీచేతఁ కాదు పోరా.వీర: అయ్యోరూ! యిట్లుండానని సూత్తుండావు కామసు! డబ్బిత్తా రా, రావయ్యా అరిశ్చంద్రుడా.నక్ష: హరిశ్చంద్రా! ఇఁకబొమ్ము. నీఋణము తీఱినది.హరి: నక్షత్రేశ్వరా! నేఁనిక సెలవు పుచ్చుకొనియెద. ఎక్కడనో నిశ్చింతతోఁ దపం బాచరించుకొను నీవు గూడ నా మూలమున ఘోరారణ్యములఁ బడరాని పాట్లు పడితివి. క్షమింపుఁడు. వటూత్తమా! నమస్కారము.నక్ష: (స్వ) అయ్యో! నే నిప్పుడేమని యీ ధర్మమూర్తికిఁ బ్రత్యుత్తర మిచ్చెదను?ఇట్టి పరమ శాంతుని సత్యవంతుని నేనెంతఁ జేసితిని.(ప్రకాశముగా) హరిశ్చంద్రా! నేనే నీ కన్ని విధములఁ గష్టములఁ దెచ్చి పెట్టినదుష్టుఁడను. నేను నిన్నడుగు కొనవలసిన క్షమాపణములు నీవు నన్నడుగు కొనుచున్నావు.అయినను బుట్టినదాదిననన్య సామాన్యమైన సత్యనిష్ఠాగరిష్ఠతచేఁ బరిశుద్ధమైననీ మానసమున కింతటి క్షోభ దెచ్చి పెట్టిన నాయట్టి ఘోరకర్ముడు శిక్షార్హుండు గాకక్షమాపణమునకు దగునా?హరి: అయ్యో, విప్రోత్తమా! శిక్షించుటకుఁ గాని, క్షమించుటకుఁ గాని నేనెంతటి వాఁడను. వటుశిఖామణీ! నీకిదే వందనము. (నమస్కరించును)నక్ష: (లేవనెత్తి)చ. కలతఁ వహింపకయ్య కల కాలము కష్టము లుండబోవు కావలసిన కారణార్థము లవంబును దప్పునె? నా యకృత్యముల్‌దలఁపున నుంచకయ్య విహితమ్ము ననున్‌ క్షమింపుమయ్య, నాకలుషమె యింత కింత కధికమ్మయి నన్వధియింపకుండునే?హరి: అయ్యా! మీరు చేసిన దేమున్నది? నా పూర్వభవసంచిత పాపఫలమే నన్నీ కష్టంబులకుఁ దెచ్చె.నక్ష: రాజేంద్రా! నిత్య సత్య సంధుడవైన నీ కెప్పటికిని గష్టములు లేవు చూడు.మ. కడకన్‌ గావలెనంచు సత్యఫలముం గాంక్షించి నీవే యొడంబడి కైకొన్న విపత్తులం బరితపిం పన్‌ గూడదయ్యా కడుంగడుదోసంబని నేనెఱింగియు వృథా క్రౌర్యంబునన్‌ నీ యెడన

పాండవోద్యోగ విజయాలుఅర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుని సహాయమర్ధించుటకు వచ్చుటఅర్జునుడు: దృపదుని పంపునన్ జనె పురోహితు డా ధృతరాష్ట్ర సూతి బల్కపటి; వినండు; సంధి జెడగా గమకించెడు గాని; తప్పదా-లపు బని; సర్వమున్ గడప లావు గలండు యశోద పట్టి; యారిపు జన కాలు తోడుత వహించెద, సర్వము నిర్వహించెదన్అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, నయ్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళాభ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్.జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పంక్తుల కెవ్వాని పదాబ్జ పీఠి కడు నిగ్గుల్ గూర్చు దత్సన్నిధిస్థలి గూర్చుండి భవంబు పావనముగా దైవార గావించి నాతొలి జన్మంబున గూడు పాపముల నాందోళింపగా జేసెదన్.కృష్ణుడు (అర్జునునితో): ఎక్కడనుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశోభాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్జక్కగ నున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్దక్కక నిల్చి శాంతుగతి దాను జరించునె తెల్పు మర్జునా!కృష్ణుడు (దుర్యోధనునితో): బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్?నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్దుర్యోధనుడు (కృష్ణునితో): కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ యయ్యె, మాకు నవ్వారికి గూడ నెక్కుడగు బంధు సముద్రుడ వీవు గాన, నీచేరిక మాకు నిర్వురకు సేమము గూర్చెడిదౌట, సాయమున్గోరగ నేగుదెంచితిమి గోపకులైక-శిరో విభూషణా !కృష్ణుడు (దుర్యోధనునితో): ముందుగ వచ్చి తీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్,బందుగులన్న యంశ మది పాయక నిల్చె సహాయ మిర్వురన్జెందుట పాడి, మీకు నయి చేసెద సైన్య విభాగ మందు మీకున్ దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు మున్నుగన్.అన్ని యెడలను నాకు దీటైన వారుగోపకులు పదివేవు రకుంఠ బలులుగలరు నారాయణాఖ్య జెన్నలరువారు,వార లొకవైపు నేనొక్క వైపు మరియు.యుద్ధ మొనరింత్రు వార లబద్ధ మ్మెందులకు ? నేను బరమాప్తుడనైయుద్ధమ్ము త్రోవ బోవకబుద్ధికి దోచిన సహాయమును బొనరింతున్.దుర్యోధనుడు (స్వగతం): ఆయుధము పట్టడట! యనిసేయండట! "కంచి గరుడ సేవ" యితనిచేనేయుపకృతి యుద్ధార్థికినేయెడ నగు! నిట్టి వాని నెవ్వండు గొనున్.కృష్ణుడు (అర్జునునితో): ఆయుధమున్ ధరింప నని కగ్గముగా నొకపట్ల నూరకేసాయము సేయువాడ, బెలుచన్ నను బిమ్మట నెగ్గు లాడినన్దోయిలి యొగ్గుదున్, నిజము, తొల్త వచించితి గోరికొమ్ము నీకేయది యిష్టమో, కడమ యీతని పాలగు బాండునందనా.అర్జునుడు (కృష్ణునితో): నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ-ధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి జేసి నాస్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము దప్పు గాక, నీవెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా !రథము నందెన్ని చిత్రంపు బ్రతిమ లుండవందు శివుడును విష్ణువు నజుడు నెల్లదేవతలు నుండవచ్చు, నా ఠీవి గృష్ణుడర్జున స్యందన విభూష యగును గాక !కృష్ణుడు (అర్జునునితో): "ఆలము సేయ నే" నని యదార్థము బల్కితి జుమ్మి, యిట్టి గోపాలుని నన్ను గోరితివి, భండన పండితులగ్నితేజు లు-త్తాల ధనుర్ధరుల్, బహుశతప్రమితుల్ యదుసింహు లందఱిన్బాలుగ గైకొనెన్ గురునృపాలుడు, బాలుడవైతి వక్కటా !అర్జునుడు (కృష్ణునితో): "ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ! యాల జాతికిన్దిన్నది పుష్టి" నీ వరుగుదెంచి రథంబున నున్న జాలు, నేసున్నము జేసెదన్ రిపుల చూపఱు లద్భుత మంద, సర్వ లో-కోన్నత! నాకు బేరొసగు, మూరక చూచుచునుండు మచ్యుతా !కృష్ణుడు (అర్జునునితో): ఊరక చూచుచుండు మను టొప్పితి గాని భవద్ రథస్థు నన్బారగ జూచి నీ రిపులు పక్కున నవ్వి యనాదరింతు రాశూరకులంబు మెచ్చ రిపుసూదనతాభర మూను నీకు నేసారధినై, యికన్ విజయసారధి నామమునన్ జరించెదన్అర్జునుడు (కృష్ణునితో): సారధి యంట! వేదముల సారము శౌరి, తదంఘ్రి భక్తి చెన్నారెడు క్రీడి తా రధికుడౌనట! చిందము విల్లు దేరునున్వారువముల్ మొదల్ దివిజవర్గ మొసంగిన వంట ! యస్త్ర వి-స్తార గురుల్ శివాదులట, సంగరమం దెవడాగ జాలెడిన్.కృష్ణుడు (అర్జునునితో): వచ్చెడి వాడు గాడతడు వారికి మీకును గూడ దోడు, వి-వ్వచ్చుడ, యమ్మహామహుని భావము మున్నె యెఱింగినాడ, నాసచ్చరితుండు మీకు దగ సంధి పొసంగిన సంతసించు, నాయిచ్చయు నట్టిదే, మన నరేంద్రుని యిచ్చయు గూడ నట్టిదే.రాయబారనునకు ముందు కృష్ణుడు పాండవులతో సంభాషించుటధర్మరాజు (కృష్ణునితో): ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేఱ కెల్ల చు-ట్టాలును రూపుమాయ కకటా ! యిల దక్కునె ! దక్క నిత్తురే ?చాలును రాజ్యభాగము, ప్రజల్ సుఖియించిన నాకు జాలు, నేజాలక కాదు సూవె ! తిన జాలను నెత్తురు కూడు మాధవా !కృష్ణుడు (ధర్మరాజుతో): మాయదురోదరంబున నమాయికునిన్ నిను గెల్చి కాంతకున్జేయగ రాని యంత పని జేసి యరణ్యములోని కంపియున్హాయిగ నుండనీక బలులై పలునెగ్గులు పన్నుచున్న యాదాయలు చత్తు రంచు దయ దాల్చెద వెంతటి ధర్మరాజవో ?భీముడు: అనుపమ విక్రమ క్రమ సహాయుల కంతటి పాండు రాజనందనులకు నొక్క కూళ భరణం బిడు చాడ్పున నూళులైదు నిచ్చునట ! కటా ! యటుల్ బ్రదుక జూచుట రాచ కొలంబు వారికిన్ఘనతయె ? మంత్ర రుద్ధ భుజగంబ నిసీ ! యిపుడేమి చేయుదున్కృష్ణుడు (భీమునితో): నిదుర వోచుంటివో ! లేక బెదరి పల్కుచుంటివో ? కాక నీవు తొల్లింటి భీమసేనుడవె కావొ ! యెన్న డీ చెవులు వినని,కనులు చూడని శాంతంబు గానవచ్చె."కురుపతి పెందొడల్ విఱుగ గొట్టెద ఱొమ్ము పగిల్చి వెచ్చ నె-త్తురు కడుపార గ్రోలి యని దున్మెద దుష్టుని దుస్ససేను భీకర గదచేత" నంచును బ్రగల్భము లాడితి-వల్ల కొల్వులోమరల నిదేల యీ పిఱికి మానిసి పల్కులు మృష్ట భోజనా !భీముడు (కృష్ణునితో): బకునిం జంపితి, రూపు మాపితి హిడింబా సోదరున్, దుష్ట కీ-చకులం దున్మితి మొన్న నూర్గుర, జరాసంధుం్ దురాసంధు నేనొకడం జంపితి నాకు భీమునకు వేఱొక్కండు తోడేల ! యెన్నక నన్నీగతి బోరికిం బెదరు చున్నాడం చనం బాడియే ?ధర్మరాజు (భీమునితో): తాతయు నొజ్జయున్ గురులు దక్కిన జోదులు చూచుచుండగాబాతకు లీడ బోక మన భార్యను బట్టి పరాభవింప నానాతికి మానరక్షణ మొనర్చిన యట్టి మహోపకారి నిన్నీతడు శౌర్యహీనుడని యీరసిమాడిన లోపమున్నదే.జూదరియై కళత్రమును శోకము పాలొనరించి తల్లి దాయాదుల యింట నుండగ మహాటవి వాలయి తమ్ము-గుఱ్ఱలంగాదిలి పెండ్లమున్ వెతల గ్రాంచిన యీబరి యుండ మాని యిం-దేదియు లేని భీముపయి కేగెద వేల గదా ప్రహారమా !కృష్ణుడు (భీమునితో): భీకరమై యగాధమయి భీష్మ గురు ప్రముఖోపలా-కులంబౌ కురురాట్చమూజలధి కడ్డముగా జనగా భవచ్చమూనౌకను ద్రిప్పగా దగిన నావికు డెవ్వడు ! నీవు లేక యీశోకము తీఱునే ద్రుపద సూతికి నిక్కము వాయునందనా !ద్రౌపది (కృష్ణునితో): (థెసె థ్రీ ఫ్రొం భారతము)*** వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి నందు బాండు భూవరునకు గోడలైతి జనవంద్యుల బొందితి నీతి విక్రమస్థిరులగు పుత్రులం బడసితిన్ సహజన్ముల ప్రాపు గాంచితిన్సరసిజనాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్.*** నీవు సుభద్ర కంటె గడు నెయ్యము గారవముందలిర్ప సం-భావన-సేయుదిట్టినను బంకజనాభ ! యొకండు రాజసూయావబృధంబు నందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీయేవురు జూడగా సభకు నీడ్చె-గులాంగన నిట్లొనర్తురే .*** ఇవి దుస్ససేను వ్రేళ్ళందవిలి సగము ద్రెవ్వి పోయి దక్కినయవి కౌరవులకడ దీరు మాటలయవసరమున దలప వలయు నచ్యుత వీనిన్భీముడు (ధృతరాష్ట్రునికి చెప్పమని): దొర యొక్కండన నేటి మాట ? బలవంతుం డెవ్వడో వాని దీధర, పోరన్ జయమో పరాజయమొ రాదా ? గెల్చి రాజన్యులందరు మెచ్చన్ ధర యేలు కొంద మటు కాదా ? చచ్చి స్వర్గంబునందిరుగన్ వచ్చును మంచి క్షత్రియుల కింతే యొండు లే దెచ్చటన్ఆలములోన నీ సుతుల నందఱి నొక్క గదా భుజంగికిన్బాలొనరించి వచ్చిన నృపాలురు చూడగ నిచ్చువాడ నేనూళులు తిండికిన్ బ్రతికి యుండిన మీకును "దాసి" వంచు బాం-చాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతీ వధూతికిన్ .కృష్ణుడు (ధర్మరాజుతో): నాల్గు పయోధులో యనగ నాలుగు దిక్కరులో యనంగ నీనల్గురు తమ్ములున్ బ్రమథ నాథ సమానులు, యుద్ధ రంగ మం-దల్గిన నెవ్వడోప-గలడయ్య ! భవత్పరిభావ వహ్నికిన్గల్గిన వృద్ధి యింక రిపు కాంతల బాష్పము లార్ప జూడుమా .ఐనను బోయి రావలయు హస్తిన, కచ్చటి సంధిమాట యెట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీమానసమందు గల్గు ననుమానము దీర్పగ వచ్చు దత్సమా-ధానము మీ విధానమును తాతయు నొజ్జయు విందురెల్లరున్ .ధర్మరాజు (కృష్ణునితో): సంధి యొనర్చి మా భరత సంతతి నిల్పుము, లేద యేని గర్వాంధుల ధార్త రాష్ట్రుల సహాయులతో దునిపింపు మో జగద్బాంధవ ! రెండు కర్జముల భారము బెట్టితిమయ్య ! నీ భుజస్కంధమునందు, దారసిలు గావుత మాకు యశంబొ, రాజ్యమో .కృష్ణుడు కౌరవ సభలో చేసిన రాయబారంకృష్ణుడు: తమ్ముని కొడుకులు సగపా-లిమ్మనిరటు లిష్ట పడవదేనియు నైదూళ్ళిమ్మని రైదుగురకు ధ-ర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్తనయుల వినిచెదవో నీతనయులతో నేమి యని స్వతంత్రించెదవోచనుమొక రీతిని లేదే-నని యగు వంశ క్షయంబు నగు కురునాధాపతితులు కారు నీ ఎడల భక్తులు శుంఠలు కారు విద్యలన్చతురులు మంచివారు నృప సంతతికిన్ తల లోని నాల్కల-చ్యుతునికి గూర్చువారు రణ సూరులు పాండవులట్టివారలీగతి నతి దీనులై యడుగగా నిక నేటికి సంశయింపగన్?జండాపై కపి రాజు ముందు సిత వాజి శ్రేణినిం గూర్చి నేదండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడొక్కండున్ నీ మొర నాలకింపడు కురు క్ష్మానాథ సంధింపగాన్ !!చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచి రందరున్తొల్లి గతించె నేడు నను దూతగ వంపిరి సంధి సేయ నీపిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ సంధి సేసెదోయెల్లి రణంబు గూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా !!అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడేయలిగిన నాడు సాగరము లన్నియునేకము కాక పోవు కర్ణులు పది వేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నాపలుకుల విశ్వసింపుము విపన్నుల నార్తుల గావుమెల్లెడన్సంతోషంబున సంధి సేయుదురె వస్త్రంబూడ్చుచొ ద్రౌపదీ-కాంతన్ జూసిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీపొంతన్ నీ సహ జన్ము రొమ్ము రుధిరంబుం ద్రావు నాడేని ని-శ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించు నాడేనియున్

(కృష్ణుడు భీముడితో రాయభారానికి వెళ్లేముందు )నిదురవో చుంటివో ! లేక బెదరి పలుకుచుంటివో! కాక తొల్లింటి భీమసేనుడవే కావో,అవ్వ! ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే, నిదురవో చుంటివో !కురుపతి పెందొడల్ విరుగగొట్టెద, రొమ్ము పగల్చి వెచ్చనెత్తురు కడుపార గ్రోలిదుర్మద దుష్టుని దుస్ససేనును భీకర గధచేత యని ప్రగల్భము లాడితివి అల్ల కొల్వులోమరల ఇదేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్టభోజనానిదురవో చుంటివో ! లేక బెదరి పలుకుచుంటివో ! కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో !(అర్జునుడు కృష్ణునితో రాయభారానికి వెళ్లేముందు )పాలడుగంగ కౌరవ పాలికింబోవ పాలు తెరంగెరింగింపుముభీమ భూపాలుని పాలు తాను, తన పాలిటి రాజ్యము అన్నపాలుభూపాల కుమారవర్గమది ఒక పాలది మా అభిమన్యుపాలునా పాలు సమస్త సైన్యమని తెల్పుము పంకజనాభ అచటన్(కృష్ణుడు పాండవులతో రాయభారానికి వెళ్లేముందు )ఐనను పోయిలావలయు హస్తినకు, అచట సంధి మాట ఎట్లైననుశత్రురాజుల బలాబల సంపద చూడగవచ్చు , మీ విధానము, తత్సమాధానమునుతాతయు, ఒజ్జయు విందు రెల్లరున్. ఐనను పోయిలావలయు హస్తినకు.(కృష్ణుడు కురు సభలో రాయభారానికి వచ్చి )తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్ట పడవరేని ఐదూళ్లిమనిరి ఐదుగురకుధర్మంబుగా నీతోచినట్లనుపుము వారిన్తనయుల వినిచెదవో లేక ఈ తనయులతో యేమియని స్వతంత్రించెదవోచనుమొక దారిని లేదేని అనియగు వంశక్షయంబునగు కురునాధా(ఒకవేళ మీకీ సంధి ఆమోదయోగ్యం కానియెడల జరుగబోవు విపరీత విపత్కర పరిణామములు కూడా తెలియజెప్పెదను వినుము)చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరున్, తొల్లి గతించె, నేడు నను దూతగా బంపిరి సంధిసేయ, మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింప పొందుచేసెదో యెల్లి రణంబె కూర్చెదవో ఏర్పడజెప్పుము కౌరవేశ్వరా.(అటుల సంధికొడంబడని యేని )అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే అలిగిననాడుసాగారములన్నియు ఏకము గాకపోవు హ! ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావుమెల్లరున్జెండాపై కపిరాజు ముందు శ్రితవాజిశ్రేణియున్ పూన్చి నే దండంబుంగొని తోలు శ్యందనముమీదన్ నారిసారించుచును గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మీ మూకన్ చ్చెండుచున్నప్పుడు ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము ఒక్కండును ఒక్కండును నీమొర ఆలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్సంతోషమ్మున సంధి సేయుదురే ! వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ కాంతన్ జూచి చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ నీ సహజన్ము రొమ్ము రుధిరమ్మున్ ద్రావునాడైన సంతోషమ్మున సంధి సేయుదురే ! నిశ్చిన్తన్ తద్గధయున్ ద్వదూరుయుగమున్ చ్చేధించు నాడేనియున్, హహహ.. సంతోషమ్మున సంధి సేయుదురే !(కృష్ణుని రాయభారానికి సుయోధనుని ప్రత్యుత్తరం )(ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్లిమ్మని ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !)సమరము సేయరే బలము చాలిన నల్వురు చూచుచుండ పెండ్లము పెరవారిచేకటకటంబడ చూచుచు ఊరకుందురే ! మమతయు , గొంకు, మానమవమానమునుసిగ్గును లేనివారి నెయ్యం తగునయ్యా , అవ్వ ! భూమిపతులందరూ నవ్వర టయ్యా సంధిచేసినన్.(కృష్ణుడు తనని సాయమడగటానికి వచ్చిన అర్జునిడిని చూసి )అర్జున నీవా ...)ఎక్కడనుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులేకదా ? యశోభాక్కులు నీదు అన్నలును ,భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగా నున్నవారే ? భుజశాలి వృకోడరుడగ్రజాజ్ఞకు దక్కగనిల్చి శాంతిగతి తాను చరింతునే తెల్పుమర్జునా .(కృష్ణుడు తనని సాయమడగటానికి వచ్చిన సుయోధనుడిని చూసి )బావా ఎప్పుడు వచితివీవు ? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ ? నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్(దుర్యోధనుడు కృష్ణుడి తో )కౌరవ పాండవుల్ పెనగుకలము చేరువ అయ్యే మాకును అవ్వారికిని ఎక్కుడగుబంధుసముద్రుడ వీవుగాన సాయముగోరగా యేగుదెంచితిని గోపకులైకశిరోవిభూషణకౌరవ పాండవుల్ పెనగుకలము చేరువ అయ్యే .(కృష్ణుడు సుయోధనుడితో )ముందుగ వచ్చితీవు, మునుముందుగ అర్జుని నేను జూచితినిబందుగులన్న అంశమది పాయకనిల్చె , సహాయమిర్వురున్ చెందుట పాడిమీకునైజేసెద సైన్య విభాగంబు అందు మీకున్ మీకున్ తగు దాని గైకొనుడుబావా, కోరుట బాలుని కొప్పు ముందుగన్ఆయుధమున్ ధరింప అని ఖగ్గముగా ఒకపట్ల ఊరకే సాయముచేయువాడపెలుచన్నను పిమ్మట యెగ్గులాడినన్ దోయిలియొగ్గుదున్ నిజము దొల్త వచించితి కోరికొమ్ము నీకేయది ఇష్టమో కడమ యీతనిపాలగు పాండునందనా.(అర్జునుడు కృష్ణుడి తో)నందకుమార యుద్ధమున నా రధమందు వసింపుమయ్యమధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మిజేసి నా స్యందనమొప్పుదుగాకరిపు సంతతి తేజము తప్పుదుగాక నీ వెందును ఆయుధమ్ము దరికేగమికొప్పుదుగాక కేశవా(కృష్ణుడు కర్ణుడిని పాండవుల పక్షం చేరమని ప్రలోభపెట్టే సన్నివేశంలో )అంచితులయిన బంధుగుల అందరిముందు చెప్పి నిన్ను మెచ్చించెదకుంతిచేత రవిచేత ఇది నిజంబు నిజంబని నీకు సాక్ష్యమిప్పించెదఫల్గుణ ప్రముఖ వీరులు గొల్వగా ఎల్లభూమి యేలించెద అచ్చకీర్తివిమలీకృత సర్వదిగంతంబునన్(బావా ! నీవిక సూతపుత్రుడివిగా సుయోధన దయాలబ్ధమైన అంగ రాజ్యధినేతవుగామనవలసిన అవసరములేదు. పవిత్ర చంద్రవంశోద్భవుడవై చతుసముద్రముద్రిక ధరావలయాన్ని పరిపాలించావలిసిన సమయం ఆసన్నమైనది )యే సతి వహ్నిలోన జనియించెనో జన్న మొనర్చు వేళమున్నేసతి పెండ్లినాడు నృపులెల్ల పరాజితులైరి కిరీటిచేయే సతి మీది మొహమున ఇంతలు జేసిరి రాజు నీవునిన్నాసతి పెండ్లియాడగలదు ఆరవ భర్తగా సూర్యనందన(కర్ణుడు కృష్ణుడితో )(శ్రీకృష్ణ పరమాత్ముడవైన నీకీ చేతలు సాద్యం కావచ్చు కాని మానవమాత్రుడనైననాకు అవుననే సాహసం లేదు )సూతుని చేతికిన్ దొరికి ఆసూతకళత్రము పాలుద్రావిసూతుని అన్నమున్గుడిచి సూత కులాంగన యందు నందనంవ్రాతము గాంచినేటికొక రాజకుమారుడనంచు దెల్ప నా చేతము సమ్మతించునే ఇస్సీ ఎవ్వరేగతి సిన్గ్గుమాలినన్(అతి పవిత్రమైన నడవడిక తో మానవోచిత ధర్మకర్మబద్ధుడనై ఇంతవరకు మనుగడ సాగించాను ఈ వయస్సులో సామాన్య మానవ ప్రలోభాలకు లోనై ధర్మ ద్వంసం చేయలేను. పతివ్రతను మాతృ సమానురాలైన మానవతిని నా మరదలిని, కృష్ణా ! ఆలిగా అంగీకరించలేను )కామము చేతను గాని భయ కంపిత చిత్తము చేతగానిఈ భూమి సమస్తము నేలుకొను పూనిక చేతనెగానినేను నా సేమమెగోరి చుట్టముల, స్నేహితులన్ విడనాడిమత్స్వామి సుయోధనున్ విడచి వత్తునే హహః వచ్చిన మెత్తురే జనుల్కృష్ణావతారం(శ్రీకృష్ణ స్తోత్రం )శృంగారరస సర్వస్వం సిఖిపింఛ విభూషణంఅంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయంఆశ్రయే భువనాశ్రయం(శ్రీకృష్ణుడు అర్జునిడి తో)ఊరక చూచుచుండమనుట ఒప్పుదుగాని భవత్గ్రహస్తు నన్బారగాజూచి నీరిపులు ఫక్కున నవ్వి అనాదరింతురుఆశూరకులంబు మెచ్చ రిపుసూధన తాబరమూను నీకు నే సారధినైవిజయసారధి నామంబునన్ చరించెదన్.. విజయసారధి నామంబునన్ చరించెదన్(శ్రీకృష్ణుడు ఆశ్వత్హామ తో కర్ణుడి గురించి )సేవా ధర్మము సూత ధర్మము రాశీభూతమైవొప్పవాచావాత్సల్యము జూపే కర్ణుడిటు మాత్సర్యంబు మీకేలరాజేవేళన్ మిముగోరునో అనికి నాడే పొండు పోరాడలేదా.. వర్జింపుడు కర్ణు చావువరకో ఆధ్యంతమో యుద్ధమున్వాచావాత్సల్యము జూపే కర్ణుడిటు(భగవత్గీత తెలుగు లో క్లుప్తంగా )తనువుతో కలుగు భాంధవ్యమ్ములెల్ల తనువుతో నశియించి ధరణిలో గలియుతనువనిత్యము నిత్యమ్ము ఆత్మ ఒకటే.చినికి జీర్ణములైన చేలముల్ వదలి క్రొత్త వలువలు గట్టికొన్నట్టి రీతికర్మానుగతి ఒక్క కాయమ్ము వదలి వేరొక్క తనువు ప్రవేశించు నాత్మఆత్మకు ఆదియు అంతమ్ము లేదు అది గాలికెండదు, అంబుతో తెగదు,నీట నానదు అగ్ని నీరైపోదుకరుణా విషాదాలు కలిగించునట్టి అహమ్మును మమకారమావలనెట్టిమోహమ్ము వీడి ప్రబుద్ధుడవగుమాఒక్కడు చంపు వేరొక్కడు చచ్చుననుమాట పొరపాటు, ఆ భ్రాంతి విడువుముపురుషుల ఉత్తమపురుషుండ నేనే కనులకు దోచు జగమ్ము నేనే జగదాత్మను నేనేజగము సృజియించి పోషించి లయమును గావింతు నేనేస్వార్ధమ్మునకు ధర్మమాహుతిజేసి మదమత్సులై పేరు మానవకోటి నాసంము జేయ సంకల్పించినాడ ఈ రణయజ్ఞమ్ము నెవ్వరు ఆపలేరు మృత్యు ముఖమ్ములో మెదగుచున్న రాజలోకమును రక్షింపలేరునాచేత హతులైన నరనాయకులను వందింప నిమిత్త మాత్రుండ వీవు భీష్మాది కౌరవ వీరలోకంబు నా గర్భమున మహానలకీనలందు కాలుచున్నారు ఇదే కనుము కౌంతేయానర్తనశాల(అర్జునుడి ఊర్వశికి ద్రౌపది పాండవుల బంధాన్ని వివిరిస్తూ)ఆడితప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనానపడతికి ఈశ్వరు డొసగిన వరబలాన నడచుచున్నట్టి ధర్మబంధమది వనితా(బృహన్నాల ద్రౌపది కి ధర్మరాజు గొప్పతనాన్ని వివరిస్తూ )ఎవ్వని వాకిట ఇహపర పంఖంబు రాజభూషణ రజోరాజినడగుఎవ్వాని చారిత్రమెల్ల లోకములకు ఒజ్జయై వినయంబు నొరపుగరపుఎవ్వాని కడకంట నిర్వచుల్లెడిచూవె మానిటసంపదలీనుచుండుఎవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకుఅతడు భూరిప్రతాప మహాప్రదీప దూరవికటిత గర్వాంధకార వైరివీర కోటీరమనిగ్రుని వేష్టితాంగితనుడు కేవలమత్యుడే ధర్మసుతుడు(అర్జునుడు ఉత్తర కుమారునికి కౌరవసేనలోని వీరులను చూపిస్తూ )అదిగోకాంచనమయవేదికా కనక్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండుసింహలాంగూల భూషితనభోభాగ కేతు ప్రేంఘనమువాడు ద్రోణసుతుడుకనక గోవృష సాంద్రకాంతి పరిష్కృత ధ్వజ సముల్లాసంబువాడు కృపుడులలిత కంబుప్రభాకలిత పతాకావిహారంబువాడు రాధాత్మజుండుమణిమయోరథ రుతిజాలమహితమైన పడగవాడు కురుక్షితిపతిమహొగ్రశిఖర ఘనతాళతరువగు శిరమువాడు సురనరీసూనుడు ఎర్పడజూచికొనుము(అర్జునుడు సుయోధనుడితో యుద్ధం చేసేముందు)ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల జాలగలరేమణిమయంబైన భూషణజాలములనొప్పి యెడ్దోల గంబున నుండగలరేకర్పూరచందన కస్తూరికాదుల ఇంపుసొంపార భోగింపగలరేఅతిమనోహరలగు చతురాంగనలతోడ సంగతివేడ్కలు సలుపగలరేకయ్యముననోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధిమరలి ఈ తనువు విడచిసుగతివడయుము తొల్లింట చూరగలరే, జూదమిచ్చటనాడంగరాదు సుమ్ము

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే? మదనములకు నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే ? తరంగిణులకు లలితా రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే? కుటజములకు బూర్నేందు చంద్రికా స్పురిత చకోరకమ్మరుగునే? సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనా మృత పాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?వినుత గుణశీల ! మాటలు వేయునేల ?

19, మార్చి 2020, గురువారం

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!గతమెంతో ఘనకీర్తి గలవోడా!వీర రక్తపుధార, వారవోసిన సీమ పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్ర పాపయ గూడ నీవోడోయ్ నాయకి నాగమ్మ, మల్లమాంబా, మొల్ల మగువ మాంచాల నీతోడ బుట్టినవోళ్ళే వీరవనితలగన్న తల్లేరా!ధీరమాతల జన్మభూమేరా! కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మతుంగభద్రా తల్లి, పొంగి బారిన చాలు ధాన్యరాశులె పండు దేశానా!కూడు గుడ్డకు కొదువ లేదోయీ ముక్కోటి బలగమోయ్, ఒక్కటై మనముంటే..ఇరుగు పొరుగులోన, వూరు పేరుంటాది తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!సవతి బిడ్డల పోరు మనకేలా! పెనుగాలి వీచింది – అణగారి పోయిందినట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది చుక్కాని పట్టరా తెలుగోడా!.నావ దరిజేర్చరా – మొనగాడా! చేయెత్తి జైకొట్టు తెలుగోడా!గతమెంతో ఘనకీర్తి గలవోడా!గతమెంతో ఘనకీర్తి గలవోడా!..

18, మార్చి 2020, బుధవారం

వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.వేద ఛందస్సు తెలుగు ఛందస్సు సవరించుపాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.గురువులు, లఘువులు సవరించుఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారుగురువు, లఘువు, విభజించడము సవరించుఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.కొన్ని నియమాలు సవరించుదీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)గణాలు-రకాలు . సవరించుఅక్షరాల గుంపును గణము అని అంటారు.ఇవి నాలుగు రకాలు 1. ఏకాక్షర గణాలు .2. రెండక్షరాల గణాలు 3. మూడక్షరాల గణాలు 4.నాలుగక్షరాల గణాలు.ఏకాక్షర గణాలుఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.U, l, Uఉదా: శ్రీ , ల, సైరెండక్షరాల గణాలు సవరించురెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములులగ లేదా వ IU ఉదా: రమాగల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణగగ UU ఉదా: రంరం, సంతాన్మూడక్షరాల గణాలు సవరించుఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, , గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చుఅన్ని గణాలు:ఆది గురువు భ గణము UIIమధ్య గురువు జ గణము IUIఅంత్య గురువు స గణము lIIUసర్వ లఘువులు న గణము IIIఆది లఘువు య గణము IUUమధ్య లఘువు ర గణము UIUఅంత్య లఘువు త గణము UUIసర్వ గురువులు మ గణము UUUఇవి మూడక్షరముల గణములుఉపగణాలు సవరించుఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములుసూర్య గణములున = న = IIIహ = గల = UIఇంద్ర గణములునగ = IIIUసల = IIUIనల = IIIIభ = UIIర = UIUత = UUIచంద్ర గణములుభల = UIIIభగరు = UIIUతల = UUIIతగ = UUIUమలఘ = UUUIనలల = IIIIIనగగ = IIIUUనవ = IIIIUసహ = IIUUIసవ = IIUIUసగగ = IIUUUనహ = IIIUIరగురు = UIUUనల = IIIIపద్య లక్షణాలు సవరించువృత్తాలు సవరించుగణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.చంపకమాలఉత్పలమాలశార్దూల విక్రీడితముమత్తేభ విక్రీడితముతరళంతరలముతరలిమాలినిమత్తకోకిలఇంద్రవజ్రముఉపేంద్రవజ్రముకవిరాజవిరాజితముతోటకముపంచచామరముభుజంగప్రయాతముమంగళమహశ్రీమానినిమహాస్రగ్ధరలయగ్రాహిలయవిభాతివనమయూరముస్రగ్ధరజాతులు సవరించుజాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.కందంద్విపదతరువోజఅక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)ఉత్సాహముఉప జాతులు సవరించుతేటగీతిఆటవెలదిసీసము (పద్యం)సర్వలఘు సీసము

వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.వేద ఛందస్సు తెలుగు ఛందస్సు సవరించుపాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.గురువులు, లఘువులు సవరించుఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారుగురువు, లఘువు, విభజించడము సవరించుఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.కొన్ని నియమాలు సవరించుదీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)గణాలు-రకాలు . సవరించుఅక్షరాల గుంపును గణము అని అంటారు.ఇవి నాలుగు రకాలు 1. ఏకాక్షర గణాలు .2. రెండక్షరాల గణాలు 3. మూడక్షరాల గణాలు 4.నాలుగక్షరాల గణాలు.ఏకాక్షర గణాలుఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.U, l, Uఉదా: శ్రీ , ల, సైరెండక్షరాల గణాలు సవరించురెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములులగ లేదా వ IU ఉదా: రమాగల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణగగ UU ఉదా: రంరం, సంతాన్మూడక్షరాల గణాలు సవరించుఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, , గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చుఅన్ని గణాలు:ఆది గురువు భ గణము UIIమధ్య గురువు జ గణము IUIఅంత్య గురువు స గణము lIIUసర్వ లఘువులు న గణము IIIఆది లఘువు య గణము IUUమధ్య లఘువు ర గణము UIUఅంత్య లఘువు త గణము UUIసర్వ గురువులు మ గణము UUUఇవి మూడక్షరముల గణములుఉపగణాలు సవరించుఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములుసూర్య గణములున = న = IIIహ = గల = UIఇంద్ర గణములునగ = IIIUసల = IIUIనల = IIIIభ = UIIర = UIUత = UUIచంద్ర గణములుభల = UIIIభగరు = UIIUతల = UUIIతగ = UUIUమలఘ = UUUIనలల = IIIIIనగగ = IIIUUనవ = IIIIUసహ = IIUUIసవ = IIUIUసగగ = IIUUUనహ = IIIUIరగురు = UIUUనల = IIIIపద్య లక్షణాలు సవరించువృత్తాలు సవరించుగణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.చంపకమాలఉత్పలమాలశార్దూల విక్రీడితముమత్తేభ విక్రీడితముతరళంతరలముతరలిమాలినిమత్తకోకిలఇంద్రవజ్రముఉపేంద్రవజ్రముకవిరాజవిరాజితముతోటకముపంచచామరముభుజంగప్రయాతముమంగళమహశ్రీమానినిమహాస్రగ్ధరలయగ్రాహిలయవిభాతివనమయూరముస్రగ్ధరజాతులు సవరించుజాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.కందంద్విపదతరువోజఅక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)ఉత్సాహముఉప జాతులు సవరించుతేటగీతిఆటవెలదిసీసము (పద్యం)సర్వలఘు సీసము

29, ఫిబ్రవరి 2020, శనివారం

మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెనీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా..నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...ముళ్ల తీగమ్మా కంచెమీద చీరావేస్తే రానేరాదమ్మాఆడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మాపెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నోచూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరుపెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నోచూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరుఅటువంటినే అన్ననుగాను చెల్లెమ్మా...నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా...అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా...ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా...మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెచెల్లెమ్మా...అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మాఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా ఆహుమ్ ఆహుమ్అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మాకన్నవాళ్లకే రోకలి పోటమ్మా ఆహుమ్ ఆహుమ్సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మాఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయిసిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మాఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయిఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా....నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా...బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా...నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా...మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెచెల్లెమ్మా...ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్లిభుజం కట్టి చదువు చదివేదెందుకుఆ... కట్నకానుకలిచ్చి సచ్చేటందుకుఆ... కట్నకానుకలిచ్చి సచ్చేటందుకుచదివినంత నిన్ను చదివిస్తనమ్మాఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మానీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పండో కూడబెట్టుతాచదివినంత నిన్ను చదివిస్తనమ్మాఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మానీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పండో కూడబెట్టుతానచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మానా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మారిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మామీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మామల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలెనీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా....నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా....తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా....తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్ట ట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటోత్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటోద్భట పటుతాండవాటన, “ట”కారనుత బసవేశ పాహిమాం!డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృండమృణ మృడండడంకృతివిడంబిత ఘూ(ghoo)ర్ణిత విస్ఫురజ్జగత్ర్పమథన తాండవాటన“డ”కారనుత బసవేశ పాహిమాం!ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢంమృణఢంమృణ ఢంఢణోద్ధణంధణనటన త్వదీయడమరూత్థమదార్భట ఢంకృతి ప్రజృంభణ త్రుటితాభ్రతార గణరాజదినేశముఖగ్రహప్రఘ(gha)ర్క్షణగుణతాండవాటన“ఢ”కారనుత బసవేశ పాహిమాం!ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖవిక్రమ జృంభణ సంచలన్నభోణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వనణ్ణ ణ్మృణ తాండవాటన“ణ”కారనుత బసవేశ పాహిమాం!-మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు“అక్షరాంకపద్యముల” నుండి సేకరణ.ఈ నాలుగు పద్యాలు మొదటి ప్రయత్నంలోనే తప్పులు లేకుండా చదువగలిగితే మీరు ఉత్తములు.ఓ నాలుగు సార్లు ప్రయత్నించి తప్పులు లేకుండా చదువగలిగితే మధ్యములు. ఎన్ని సార్లు ప్రయత్నించినా తప్పులు లేకుండా చదువలేకపోతున్నారంటే మీరిక ఈజన్మలో తెలుగుభాషను స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడలేరని హెచ్చరించేవారు మా గురుదేవులు.

27, ఫిబ్రవరి 2020, గురువారం

మాణిక్యవీణా ముఫలాలయంతీమదాలసాం మంజుల వాగ్విలాసాంమాహేంద్ర నీలద్యుతి కోమలాంగీంమాతంగ కన్యాం మనసా/స్మరామి.చతుర్భుజే చంద్రకళావతంసేకుచోన్నతే కుంకుమరాగశోణేపుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తేనమస్తే జగదేకమాతఃమాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీకుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీజయమాతంగ తనయే జయనీలోత్పలద్యుతేజయ సంగీత రసికేజయ లీలాశుకప్రియే...దండకమ్******** జయజననీ(1)సుధాసముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియేకృత్తివాసప్రియే సర్వలోకప్రియే(2)సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే(3)శేఖరీభూత శీతాంశు రేఖా మయూఖావళీ నద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణీ శృంగారితే లోకసంభావితే(4)కామలీలా ధనుస్సన్నిభ భ్రూ లతా పుష్ప సందోహ సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీ లలామాభిరామేసురామే రమే (5)సర్వతీర్థాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకేపాహి మాం పాహి మాం పాహి****************************

26, ఫిబ్రవరి 2020, బుధవారం

ఉ|| "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"

మ|| కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్"

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

అసలు "సామజవరగమన" ఎవరో మీకు తెలుసా??🤔**🔹'సామజవరగమన' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది...**'సామజ' అనగా "ఏనుగు🐘" అని అర్థం..'వరగమనా' అనగా "చక్కని నడక🚶🏽‍♂" అని అర్థం...అలానే ఈ సామవేదం అనగా సంగీతం.. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం.**🐘"సామజవరగమన" అంటే ఏనుగు లా గంభీరంగా, హుందాగా,ఠీవి నడిచేవారు అని అర్థం...🐘**🤔మరి అసలైన "సామజవరగమన" ఎవరో తెలుసా??... అసలైన "సామజవరగమన.. "శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు..🙏"**🕉వాల్మీకి తన రామాయణం లో ‘అరణ్యవాసం’లో ఒకచోట రాముడిని “గజవిక్రాంతగమను”డంటారు...అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని...**ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు వారు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు...🙏** "సామజవరగమన" కీర్తన ,దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం👇🏽..*కీర్తన...*🎶సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥ సామజ॥**🎶సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల!* *దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥**🎶వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత* *యాదవకులమురళీ!**గానవినోదన మోహనకర* *త్యాగరాజ వందనీయ ॥సామజ॥*ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది.. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది...కీర్తన అర్థం...*🙏ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..**🙏సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..**🙏సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మామ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..*శ్రీరామచంద్ర చారిటబుల్ ట్రస్ట్.ఫౌండర్.... గ్రంధి రామచంద్రరావు..

20, ఫిబ్రవరి 2020, గురువారం

ఎవడయ్య వాడు తెలుగువాడు.. ---------------------శాతవాహనుల వంశాన పుట్టిన వాడుకాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడుపల్లెలోనే కాదు డిల్లీలో సైతమ్ముపెద్దగద్దేలనేలి పెరుకేక్కినవాడుఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు.!పంచె కట్టుటలో మొనగాడుకండువాలేనిధే గడపదాటని వాడుపంచబక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసువాడుఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు.!నేల నల్దేసల డేరాలు నాటినవాడుఅన్ని మూసలలోన అట్టే ఒదిగినవాడు"ఎ దేసమేగిన ఎందుకాలిడినా"ఆవకాయ వియోగామసలె సైపని వాడుఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు.!మంచి మనసెదురైన మాలలిచ్చేవాడుభాయీ భాయీ అన్న చేయి కలిపేవాడు తిక్కరేగిందంటే డొక్కా చీల్చేవాడుచిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడుఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు.!-------- డాక్టర్ సి.నారాయణ రెడ్డి

15, ఫిబ్రవరి 2020, శనివారం

నను భవదీయదాసుని మనంబున నెయ్యపు గిన్క బూని తాచినయది నాకు మన్ననయ; చెల్వగునీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము దాకిన నొచ్చునంచు నేననియెద; నల్కమానవు గదా! యికనైన నరాళకుంతలా!

క్షమ కవచంబు, క్రోధ మదిశత్రువు, జ్ఞాతి హతాశనుండు, మిత్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య విత్త, ముచితలజ్జ భూషణ్, ముదాత్త కవిత్వము రాజ్య మీ, క్షమాప్రముఖ పదార్ధముల్‌ గలుగుపట్టున తత్కవచాదు లేటికిన్!!ఓర్పు కవచం లాంటిది, కోపము శత్రువు, దాయాది నిప్పులాంటివాడు, మిత్రుడు మంచి ఔషధం. దుర్జనులు సర్పములవంటివారు. మంచి విద్య చేతిలో ఉన్న ధనము వంటిది. వినయము భూషణము. సుకవిత్వం రాజ్యం. ఇన్ని సంపదలు కలవానికి వరే రక్షణ్ అవసరము లేదు!! అంటే సజ్జనునికి సద్గుణాలే రక్షణ కల్పిస్తాయి..

7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

నేటి సెల్ఫోన్ వ్యవస్థనేటి సెల్‌ఫోన్ చరవాణి...జేబుల్లో కీరవాణిమాయచేసే cమహారాణివ్యసనాల యువరాణిగుప్పిట్లో ఉండాల్సింది..అందర్నీ గుప్పిట్లో పెట్టుకుందిఅదనపు అవయవంగా మారి..అవయవాలన్నటినీ ఆడిస్తోంది"ప్రపంచానికి" అవసరమని రూపిస్తే..తానే "ప్రపంచమై" కూర్చుందిసౌకర్యం కోసం సృష్టిస్తే ..సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది"నట్టింట్లో" మాటలు మాన్చి..నెట్టింట్లో ఊసులు కలిపింది.చాటింగులు...మీటింగులు...ఆపై రేటింగులు..అంటూయువతను పెడద్రోవ పట్టిస్తోందిసమాజాన్ని పట్టి పీడిస్తోంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూచిత్రంగా హరిస్తోందిఅయిన వాళ్ళు పక్కప్రక్కనే ఉన్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్ళను చేసిందివ్యసనపరులుగా మార్చింది. ప్రమాదవశాత్తు పడిపోయినా..."ప్రాణం ఉందోలేదో చూసుకోకుండా "ఫోను"ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది. ఎన్నని చెప్పను దీని లీలలుఓ మిత్రమా...!విజ్ఞానం కోసం చేసిందిఅజ్ఞానంగా వాడకుఊడిగం చేయించుకో...అంతేగాని బానిసగా మారకు. దేన్నెక్కడుంచాలో అక్కడే ఉంచు. నెత్తినెట్టుకున్నావో ..పాతాళానికి తొక్కేస్తుంది.బి కేర్ ఫుల్అది మాయల మహరాణివ్యసనాల యువరాణి చేతిలోని చరవాణి.💐💐

2, ఫిబ్రవరి 2020, ఆదివారం

నుంచీ..మందేరా!!బ్రహ్మపురము మందేరాపర్లాకిమిడి మందేరాకాదని వాదుకువస్తేకటకందాఁకా మందేరా!బస్తరెల్లా మందేరాజయపూరంతా మందేరాకాదని వాదుకువస్తేనాగపూర్‌ దాఁకా మందేరా!గోలకొండ మందేరాతెలింగానా మందేరాకాదని వాదుకువస్తేనైజామంతా మందేరా!చెన్నపురము మందేరాచంగల్‌పట్టు మందేరాకాదని వాదుకువస్తేతంజావూరును మందేరా!బెంగుళూరు మందేరాబళ్ళారీ మందేరాకాదని వాదుకువస్తేకన్నడ మర్ధం మందేరా!దేవికోట మందేరాపుదుక్కోట మందేరాకాదని వాదుకువస్తేకాండేదాఁకా మందేరా!

1, ఫిబ్రవరి 2020, శనివారం

.నటసామ్రాట్...నటసామ్రాట్...అక్కినేనినటసామ్రాట్...అక్కినేనినటసామ్రాట్.....................................కళలకొలువు అన్నపూర్ణ నుదుటి తిలక మీ సమ్రాట్... తెలుగు చిత్ర జగతుకే మణి మకుటం ఈ సమ్రాట్. అనునిత్యం తనను తాను చెక్కుకున్న శిల్పి యితడు..ఆత్మనాత్మవిద్య లెరిగినట్టి అధునాతన యోగి యితడు... వేదికనూ, వెండితెరను, జయించిన మహానటుడు.... ప్రతిమలుపున,జీవితాన్ని, గెలుచుకున్న, కృషీవలుడు.. బ్రతుకును సాదించినట్టి బహుదూరపు బాటసారి..... నటసమ్రాట్... నటసమ్రాట్...!! తరతరాల నలరించిన అభినయాల కళాశాల..అనాటి నవయువతుల కలలరేడు అక్కినేని.. ఆనాటి నవయువతుల కలల రేడు అక్కినేని... తెలుగుతల్లులెందరికో ప్రియ తనయుడు అక్కినేని.. పొలంగట్లపై తిరిగిన మట్టిమనిషి ఆనాడు...వెండితెర పై మెరిసిననిండుజాభిలీనాడు బడికెల్లని ఆచార్యుడు......గుడికెల్లని తాత్వికుడు...నటసమ్రాట్..నటసమ్రాట్... ! శశిరేఖను చేపట్టిన అభిమన్యుడితడే...రావాణాసురుని తాత నారదుడుఇతడే... శపధంనెరవేర్చుకున్న చాణుక్యుడు యితడే...రాయలవారి కొలువున రామక్రిస్ట్నుడితడే.. బెంగాలీ శరత్చంద్ర దేవదాసుడితడే....ఉత్తరాది మహాకవి కాళిదాసు అతడే..... తమిళనాటి విస్ట్నుభక్తుడీ విప్రనారాయణ...కర్ణాటక ముద్దుబిడ్డ అమరశిల్పిజక్కన... ఇష్టపడే అష్టపదుల ఒరిస్సజయదేవుడు...మహారాష్ట్ర సంఘసంస్కర్త తుకారాముడు... మహమదీయ మొగల్...సలీం..... నటసామ్రాట్...నటసామ్రాట్!! ..కలసి, వెరసి..భారతజాతీయనటుడు...నటసామ్రాట్... • సాటిలేని మహానటుడు .............. నటసామ్రాట్...నటసామ్రాట్!!

29, జనవరి 2020, బుధవారం

మాణిక్యవీణా ముఫలాలయంతీమదాలసాం మంజుల వాగ్విలాసాంమాహేంద్ర నీలద్యుతి కోమలాంగీంమాతంగ కన్యాం మనసా స్మరామి.చతుర్భుజే చంద్రకళావతంసేకుచోన్నతే కుంకుమరాగశోణేపుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తేనమస్తే జగదేకమాతఃమాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీకుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీజయమాతంగ తనయే జయనీలోత్పలద్యుతేజయ సంగీత రసికే జయ లీలాశుకప్రియే దండకమ్జయజననీసుధాసముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియేకృత్తివాసప్రియే సర్వలోకప్రియేసాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికేశేఖరీభూత శీతాంశు రేఖా మయూఖావళీ నద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణీ శృంగారితే లోకసంభావితేకామలీలా ధనుస్సన్నిభ భ్రూ లతా పుష్ప సందోహ సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీ లలామాభిరామేసురామే రమేప్రోల్లసద్వాళికా మౌక్తికశ్రేణికా చంద్రికామండలోద్భాసి లావణ్య గండస్థల న్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూతసౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీభవ న్మంత్ర తంత్రీస్వరే భాస్వరేవల్లకీ వాదన ప్రక్రియా లోల తాళీ దళా బద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధసమ్మానితేదివ్యహాలా మదోద్వేల హేలాల సచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలేపూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలేస్వేదబిందూ ల్లసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహకృ న్మాసికా మౌక్తికే సర్వ మంత్రాత్మికేకాళికేకుంద మంద స్మితోదార వ క్త్రస్ఫుర త్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరేజ్ఞాన ముద్రాకరే శ్రీకరేకుందపుష్పద్యుతి స్నిగ్ధ దంతావళీ నిర్మలా లోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరేచారువీణాధరే పక్వ బింబాధరేసులలిత నవయౌవనారంభ చంద్రోదయో ద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బిబ్బోక హృత్కంధరేసత్కళా మందిరే మంథరేబంధురచ్ఛన్న వీరాధి భూషా సముద్ద్యోత మానానవద్యాజ్ఞ శోభే శుభేరత్న కేయూర రశ్మిచ్ఛటా పల్లవ ప్రోల్లస ద్దోర్లతా రాజితే యోగిభిః పూజితేవిశ్వదిజ్ఞ్మణ్డల వ్యాప్త మాణిక్య తేజ స్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతేసాధుభి స్సత్కృతేవాస రారంభ వేళా సముజ్జృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్ద్వయేదివ్యరత్నోర్మికా దీధితి స్తోమ సంధ్యాయ మానాంగుళీ పల్లవోద్య న్నకేందుప్రభా మండలే ప్రోల్లస త్కుండలేతారకా రాజి నీకాశ హారావళి స్మేర చారు స్తనాభోగ భారానమన్మధ్యవల్లీ వళిచ్ఛేద వీచీ సముద్యత్సముల్లాస సందర్శితాకార సౌందర్యరత్నాకరే శ్రీకరేహేమ కుంభోప మోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రేలసద్వృత్తగంభీర నాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే మంజు సంభాషణేచారు శింజర్కటీసూత్ర నిర్భత్ర్సితానంగ రేఖా ధనుశ్శింజనీ డంబరే దివ్యరత్నాంబరేపద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభా జితస్వర్ణ భూబృత్తలే చంద్రికాశీతలేవికసిత నవకింశుకా తామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరు శోభా పరాభూత సింధూర శోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గళే శ్యామలేకోమల స్నిగ్ధ నోత్ప లోత్పాదితానంగ తూణీర శంకాకరోద్దమ జంఘాలతే చారు లీలాగతేనమ్ర దిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖ న్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలేప్రహ్వ దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని మాణిక్య సంఘృష్ట కోటీర బలా తపోద్దామ లక్షారసారుణ్య లక్ష్మీగృహీ తాంఘ్రి పద్మద్వయే అద్వయేసురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితేశంఖ పద్మద్వయోపాశ్రితే తత్ర విఘ్నేశ దుర్గావటుక్షేత్ర పాలైర్యుతే మత్తమాతంగకన్యా సమూహాన్వితే భైరవై రష్టభిర్వేష్టితేదేవి వామాదిభి స్సంశ్రితే ధాత్రి లక్ష్మ్యాది శక్త్యష్టకా సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రత్యా చ సంభావితేప్రీతిశక్త్యా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే ఛందసా మోజస బ్రాజసే యోగినా మానసే ధ్యాయసేగీత విద్యాది యోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వ బృద్యేన వాద్యేన విద్యాధరై ర్గీయసే యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలై ర్మండితేసర్వ సౌభాగ్యవాంఛఅవతీభి ర్వధూభీ స్సురాణాం సమారాధ్యసే సర్వ సౌభాగ్యవాంఛావతీభి ర్వధూభి స్సురాణాం సమారాధ్యసేసర్వ విద్యా విశేషాన్వితం చాటుగాథా సముచ్చారణం కంఠమాలోల్ల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార పక్షద్వయం తుండ శోభాతిదూరీభవ త్కింశుగభంశుకం లాలయంతీ పరిక్రీడసేపాణిపద్మద్వయే నాక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసరత్మకం పుస్తకం చాప పాశాంకుశాన్ బిభ్రతీ యేన సంచిత్యసేచేతసా తస్య వక్తాంతరా ద్గద్య పద్యాత్మికా భారతీ నిస్సరేద్యేన వాయావకాభఅ కృతి ర్భావ్యసేతస్యవశ్యా భవంతి స్తీయః పుర్షాః యేన వా శాత కుంభ ద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్త్రైః పరిక్రీడితేకి న్నసిద్ధ్యేయత స్తస్య లీలాసరో వారిధి స్తస్య కేళీవనం నందనం తస్య భాద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కంకరీ తస్య చాజ్ఞాకరీ శ్రీ స్స్వయంసర్వతీర్థాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకేపాహి మాం పాహి మాం పాహి.Last edited 9 years ago by Aja1210వికీసోర్స్అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద లభ్యంగోప్యతడెస్కుటాప్

22, జనవరి 2020, బుధవారం

కనకధారా స్తోత్రంవందేవందారు మందార మిందిరానంద కందళమ్,ఆమందానంద సందోహ బంధురం సింధురాననమ్,అంగం హరే పులకభూషణ మాశ్రయంతీబృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్,అంగీకృతాఖిల విభూతి రపాంగలీలామాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః 1 ముగ్ధా ముహర్వదతీ వదనే మురారేఃప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని,మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యాసా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః 2 విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షమ్ఆనందవేతు రధుకం మురవిద్విషో‌౬పిఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థమ్ఇందీవరోదర సహోదర మిందిరాయాః 3 ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్ఆనందకందమనిమేష మనంగతంత్రమ్,ఆకేకరస్థితకనీనిక పద్మనేత్రంభూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః 4 కాలాంబుదాళి లలతోరసికైటభారేఃధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ,మాతుసమస్థజగతాం మహనీయమూర్తిఃభద్రాణి మే దిశతు భార్గవనందనాయాః 5 భాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యాహరావళీవ హరినీలమయీ విభాతి,కమప్రదా భగవతోపి కటాక్షమాలాకల్యాణమావహతు మే కమలాలయాయాః 6 ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్మాంగళ్యభాజి మధుమాధిని మన్యథేన,మయ్యాపతేత్ తదిహ మన్థర మీక్షణార్థంమన్దాలసం చ మకరాలయకన్యకాయాః 7 దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారామస్మిన్ న కించిన విహంగశిశౌ విషణ్ణేదుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరంనారాయణప్రణయినీ నయనాంబువాహః 8 ఇష్టా విశిష్టమతయో౬పి యయా దయార్ద్రదృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే,దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాంపుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః 9 గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతిశాకంభరీతి శశిశేఖర వల్లభేతి,సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయైతస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై 10 శ్రుత్యై నమో౬స్తు శుభకర్మఫలప్రసుత్యైరత్యై నమో౬స్తు రమణీయ గుణార్ణవాయై,శక్త్యై నమో౬స్తు శతపత్రనికేతనాయైపుష్ట్యై నమో౬స్తు పురుషోత్తమవల్లభాయై 11 నమో౬స్తు నాళికానిభాననాయైనమో౬స్తు దుగ్దోదధి జన్మభూమ్యై,నమో౬స్తు సోమామృత సోదరాయైనమో౬స్తు నారాయణ వల్లభాయై 12 నమో౬స్తు హేమాంబుజ పీఠికాయైనమో౬స్తు భూమండల నాయికాయైనమో౬స్తు దేవాది దయాపరాయైనమో౬స్తు శార్ఙ్గాయుధ వల్లభాయై(sAr~ggAyudha vallabhAyai)13 నమో౬స్తు దేవ్యై భృగునందనాయైనమో౬స్తు విష్ణోరురసి స్థితాయైనమో౬స్తు లక్ష్మ్యై కమలాలయాయైనమో౬స్తు దామోదర వల్లభాయై 14 నమో౬స్తు కాంత్యై కమలేక్షణాయైనమో౬స్తు భూత్యై భువనప్రసూత్యైనమో౬స్తు దేవాదిభి రర్చితాయైనమో౬స్తు నందాత్మజ వల్లభాయై 15 సంపత్కరాణి సకలేంద్రియ నందనానిసామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి!త్వద్వీక్షితాని దిరితాహరణోద్యతానిమామేవ మాతరనిశం కలయంతు మాన్యే! 16 శ్రీకటాక్ష సముపాసనావిధిఃసేవకస్య సకలార్థ సంపదఃసంతనోతి వచనాంగమానసైఃత్వాం మురారిహృదయేశ్వరీం భజే 17 సరసిజనిలయే! సరోజహస్తే!దవళతమాంశుకగంధమాల్యశోభే!భగవతీ! హరివల్లభే! మనోజ్ఞే!త్రిభువనభూతికరి! ప్రసీద మహ్యమ్ 18 దిగ్ఘస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట్స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాధగృహిణీం అమృతాబ్ధిపుత్రీమ్ 19 కమలే! కమలాక్షవల్లభే! త్వంకరుణాపూర తరంగితైరపాంగైఃఅవలోకయ మామకించనానాంప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః 20 బిల్వాటవీమధ్యలసత్ సరోజే!సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్అష్టాపదాంభోరుహ పాణిపద్మాంసువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ 21 కమలాసనపాణినా లలాటేలిఖితామక్షర పంక్తిమస్య జంతోఃపరిమార్జయ మాతరంఘ్రిణా తేధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీమ్ 22 అంభోరుహం జన్మగ్రూహం భవత్యాఃవక్షస్స్థలం భర్తృగృహం మురారేఃకారుణ్యతః కల్పయ పద్మవాసేలీలాగృహం మే హృదయారవిందం 23 స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహంత్రయీమయీం త్రిభువనమాతరం రమామ్గుణాధికా గురుతర భాగ్యభాజినోభవన్తి తే భువి బుధభావితాశయాః 24 సువర్ణధారాస్తోత్రం యచ్చంకరాచార్యనిర్మితమ్,త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ఇతి శ్రీమచ్ఛంకర భగవత్కృతం కనకధారాస్తోత్రమ్

యమ నియమాలు “యమం” అంటే, “నియంత్రణ” .. “కంట్రోలు” మౌలిక ఆధ్యాత్మిక – జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి వుండడంపతంజలి మహర్షి అయిదు యమాలను ప్రవచించారుఅవి :1. సత్యం : ఎప్పుడూ ఆత్మ సత్యాన్నే పలకడం2. అహింస : హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం3. బ్రహ్మచర్యం : ఎప్పుడూ మధ్యేమార్గాన్నే అవలంబించడం4. ఆస్తేయం : ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం5. అపరిగ్రహం : అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం“నియమం”అంటే తప్పనిసరి దైనందిక కార్యకలాపాలుమన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరిపతంజలి మహర్షి అయిదు నియమాలను ప్రవచించాడు .. అవి:1. శౌచం : శరీరాన్నీ పరిసరాలనూ శుచిగా, శుభ్రంగా వుంచుకోవడం2. సంతోషం : మనస్సును ఎప్పుడూ ఉల్లాసంగా వుంచుకోవడం3. స్వాధ్యాయం : చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను సదా చదువుతూ వుండడం4. తపస్సు : నిద్రాహారాదులను క్రమక్రమంగా తగ్గిస్తూ వుండడం5. ఈశ్వరప్రణిధానం: “అంతా ఈశ్వరమయమే” అన్న భావనలో సదా వుండడంయమ నియమాలు భౌతికజీవనంలో హస్తగతం కావాలి అంటేనిత్య, అనునిత్య యోగం, ఆధ్యాత్మిక జ్ఞానం వినా వేరే శరణ్యం లేదు* కనుక ” పతంజలి మహర్షీ , శతకోటి నమస్కారాలు, కరిష్యే వచనం తవ. “

20, జనవరి 2020, సోమవారం

.... అని చెప్పిన మహనీయుడే, ఎవరు ఉత్తములు, ఎవరు కాదు అనికూడా భర్తృహరి శతకంలో చెప్పాడు. తమ కార్యంబు పరిత్యజించియు బరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్,దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్ధ వ్యాపృతుల్ మధ్యముల్,దమకై యన్యహితార్ధ ఘాతుకజనుల్ దైత్యుల్, వృధాన్యార్ధభంగము గావించెడువారలెవ్వరో యెరుంగన్ శక్యమే యేరికిన్!!భావం: తమ పన్లను వదలుకుని ఇతరులకు మేలు చేసే వారు సజ్జనులట. తమ కార్యాలను నేరవేర్చుకుంటూ ఇతరుల కార్యాలు కూడా చక్కబెట్టే వారిని మధ్యములుగా పేర్కొన్నారు. తమ కార్యాలకోసం ఇతరుల కార్యాలను చెడగొట్టే వారిని అధములు అన్నారు. తమకు ఎటువంటి మేలు కలగక పోయినా ఇతరులకార్యాలను పనిగట్టుకు చెడగొట్టే వారిని ఏమనిపిలవాలో ఆయనకు కూడా తెలియలేదట

అప్పుసొప్పులు జేసి- యాలుపిల్లల సాకి, అష్టకష్టంబుల-నరుగునొకడు.!స్థిరమగు పనిలేక- తిండికి గతిలేక, యాటుపోటుల మధ్య-నలయునొకడు.!గడియతీరిక లేక- గవ్వరాబడి లేక, బండ చాకిరి చేసి-యెండునొకడు.!ఆటపాటల తోడ-నడ్డునదుపులేక తిన్నదరిగి పోక- తిరుగునొకడు.!తే.గీ.దానధర్మాల తరియించు- ధన్యుడొకడు.!న్యాయమార్గమున్ ధైర్యమై-నడచునొకడు.!నీతి నియమాలు దప్పక- నిలుచునొకడు.!నాది నీదేది లేదను-జ్ఞానియొకడు.!పెక్కువిధములిట్లు జనము-పెనుగులాడి, కదలుచుందురు జగతిన-కడలియటుల.!

18, జనవరి 2020, శనివారం

రాజు మరణించే నొక తార రాలిపోయే సుకవియు మరణించే నొక తార గగన మెక్కెరాజు జీవించే రాతి విగ్రహములందుసుకవి జీవించే ప్రజల నాలుకల యందు''

ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత! భ గ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్! కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్!

13, జనవరి 2020, సోమవారం

lనాన్న ఎందుకో వెనకపడ్డాడు"*అమ్మ తొమ్మిది నెలలు మోస్తే...నాన్న జీవితాంతం మోస్తాడు...రెండూ సమానమే అయినానాన్నెందుకో వెనకబడ్డాడు.ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ...సంపాదన అంతా ఇంటికే పెడుతూ నాన్న...ఇద్దరి శ్రమా సమానమే అయినాఅమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు.ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ...ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న...ఇద్దరి ప్రేమా సమానమే అయినాఅమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు.ఫోనులోనూ అమ్మ అనే పేరేదెబ్బ తగిలినప్పుడూ అమ్మా అనే పిలుపే...అవసరం వచ్చినప్పుడు తప్పమిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధ పడ్డాడా?అంటే..ఏమో!ఇద్దరూ సమానమే అయినాపిల్లల ప్రేమ పొందడం లో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు.అమ్మకు, మాకు బీరువా నిండారంగురంగుల బట్టలు...నాన్న బట్టలకు దండెం కూడా నిండదు...తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాక్కూడా పట్టనంత వెనకబడ్డాడు.అమ్మకు ఎన్నో కొన్ని బంగారు నగలు...నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచె ఒక్కటే...కుటుంబం కోసం ఎంత చేసినాతగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్నేందుకో బాగా వెనకబడ్డాడు.పిల్లల ఫీజులు ఖర్చులున్నాయ్ అన్నప్పుడు ఈసారి పండక్కి చీర కొనొద్దని అమ్మ...ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులుతో ఇష్టంగా తినే నాన్న...ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినాఅమ్మకంటే నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు.వయసు మళ్ళాకా అమ్మైతే ఇంట్లో పనికి పని కొస్తుంది...అదే నాన్నైతే ఎందుకూ పనికిరాడని తీర్మానం చేసేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే!నాన్న ఇలా వెనకబడి పోవడానికి కారణం*నాన్నంటే కుటుంబానికి వెన్నుముక* కావడమే!అంత ప్రేమను పంచే నాన్నను ప్రేమగా చూసుకొందాం

11, జనవరి 2020, శనివారం

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతోఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నోఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నోఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నోకులమతాల సుడిగుండాలకుబలియైన పవిత్రులెందరో... ॥ఆ చల్లని॥మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతోరణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నోకడుపుకోతతో అల్లాడినకన్నులలో విషాదమెంతోఉన్మాదుల అకృత్యాలకుదగ్ధమైన బ్రతుకులు ఎన్నో...॥ఆ చల్లని॥అన్నార్తులు అనాథులుండనిఆ నవయుగమదెంత దూరంకరువంటూ కాటకమంటూకనిపించని కాలాలెపుడోపసిపాపల నిదుర కనులలోమురిసిన భవితవ్యం ఎంతోగాయపడిన కవి గుండెలలోరాయబడని కావ్యాలెన్నో... ॥ఆ చల్లని॥- దాశరథి కృష్ణమాచార్య(1947కు ముందే రాసిన ఈ పాట 1949లో అగ్నిధారలో ముద్రితమైంది)(నేడు దాశరథి జయంతి)

కూనలమ్మ పదాలు సర్వజనులకు శాంతిస్వస్తి, సంపద, శ్రాంతినే కోరు విక్రాంతిఓ కూనలమ్మఈ పదమ్ముల క్లుప్తిఇచ్చింది సంతృప్తిచేయనిమ్ము సమాప్తిఓ కూనలమ్మసామ్యవాద పథమ్ముసౌమ్యమైన విధమ్ముసకల సౌఖ్యప్రదమ్ముఓ కూనలమ్మఅరుణబింబము రీతిఅమర నెహ్రూ నీతిఆరిపోవని జ్యోతిఓ కూనలమ్మసర్వజనులకు శాంతిస్వస్తి, సంపద, శ్రాంతినే కోరు విక్రాంతిఓ కూనలమ్మఈ పదమ్ముల క్లుప్తిఇచ్చింది సంతృప్తిచేయనిమ్ము సమాప్తిఓ కూనలమ్మతెలివితేటల తాడుతెంపుకొను మొనగాడుఅతివాద కామ్రేడుఓ కూనలమ్మఇజము నెరిగిన వాడునిజము చెప్పని నాడుప్రజకు జరుగును కీడుఓ కూనలమ్మస్టాలినిస్టు చరిత్రసగము గాడిదగత్రచదువుకో ఇతరత్రఓ కూనలమ్మమధ్యతరగతి గేస్తుమంచి బందోబస్తుజనులకిక శుభమస్తుఓ కూనలమ్మదహనకాండల కొరివితగలబెట్టును తెలివికాదు కాదిక అలవిఓ కూనలమ్మకూరుచుండిన కొమ్మకొట్టుకొను వాజమ్మహితము వినడు కదమ్మఓ కూనలమ్మకష్టజీవుల కొంపకాల్చి బూడిద నింపతెగునులే తన దుంపఓ కూనలమ్మజనుల ప్రేముడి సొమ్ముక్షణము లోపల దుమ్ముతులువ చేయును సుమ్ముఓ కూనలమ్మమధువు మైకము నిచ్చువధువు లాహిరి తెచ్చుపదవి కైపే హెచ్చుఓ కూనలమ్మహరుడు అధికుడు కాడునరుడు అల్పుడు కాడుతమకు తామే ఈడుఓ కూనలమ్మసుదతిపాలిట భర్తమొదట వలపుల హర్తపిదప కర్మకు కర్తఓ కూనలమ్మచివరి ప్రాసల నాభిచిత్రమైన పఠాభికావ్యసుధట షరాభిఓ కూనలమ్మతీర్చినట్టి బకాయితెచ్చిపెట్టును హాయిఅప్పు మెడలో రాయిఓ కూనలమ్మనిజము నిలువని నీడనీతి యన్నది చూడగాజు పెంకుల గోడఓ కూనలమ్మచెప్పి దేవుని పేరుచెడుపు చేసెడివారుఏల సుఖపడతారుఓ కూనలమ్మఈశుడంతటివాడుఇల్లరికమున్నాడుపెండ్లయిన మరునాడుఓ కూనలమ్మమరియెకరి చెడు తేదిమనకు నేడు ఉగాదిపంచాంగమొక సోదిఓ కూనలమ్మజనులు గొర్రెలమందజగతి వేసెడు నిందజమకట్టు స్తుతి క్రిందఓ కూనలమ్మఉడుకు రచనల యందుఎడద మెదడుల విందులేటు గోపీచందుఓ కూనలమ్మఇరకు కార్యపు గదులుఇరుకు గోడల బదులుమేలు వెన్నెల పొదలుఓ కూనలమ్మకోర్టుకెక్కిన వాడుకొండనెక్కిన వాడువడివడిగ దిగిరాడుఓ కూనలమ్మపరుల తెగడుట వల్లబలిమి పొగడుట వల్లకీర్తి వచ్చుట కల్లఓ కూనలమ్మకోపాగ్నులకు వృద్ధికుత్సితాలకు రద్దిలేమి చంపు సుబుద్ధిఓ కూనలమ్మఅతివ పలుకే చాలుఅందు వేనకువేలుమొలచు నానార్థాలుఓ కూనలమ్మచెక్కు చెదరని వక్తచేదు నిజము ప్రయోక్తచంపబడును ప్రవక్తఓ కూనలమ్మఎంకి పాటల దారిఎడద గుర్రపు స్వారిచేయులే నండూరిఓ కూనలమ్మఆలు మగల లడాయిఅంత మొందిన రేయిఅనుమానపు హాయిఓ కూనలమ్మబ్రూటు కేసిన ఓటుబురదలో గిరవాటుకడకు తెచ్చును చేటుఓ కూనలమ్మరాజముద్రికె మొహరుప్రజల నేతయె నెహురుస్వేచ్ఛ పేరే యుహురుఓ కూనలమ్మజనులు నమ్మెడివరకుకనులు తెరవని వరకువెలుగు నకిలీ సరకుఓ కూనలమ్మపాత సీసాలందునూతనత్వపు మందునింపితే ఏమందు?ఓ కూనలమ్మఅయిదు రోజులు వేస్టుఅగుట కెయ్యది బెస్టుఝచూడుము క్రికెట్‌ టెస్టుఓ కూనలమ్మ'అతడు - ఆమె'ల ఫైటుఅతివ ఛాన్సులు బ్రైటుఆడదెపుడూ రైటుఓ కూనలమ్మఆత్మవంచన వల్లఆడు కల్లల వల్లఅగును హృదయము డొల్లఓ కూనలమ్మవాతలుండిన నక్కవ్యాఘ్రజాతిలొ లెక్కఅనును కద తలతిక్కఓ కూనలమ్మనూతిలోపలి కప్పపాతఘనతలు తప్పమెచ్చ దితరుల గొప్పఓ కూనలమ్మనరుడు మదిలో దొంగనాల్క బూతుల బుంగకడుగ జాలదు గంగఓ కూనలమ్మపంగనామము లేలభస్మ పుండ్రము లేలభక్తి నిజమగు వేళఓ కూనలమ్మఅతివ పురుషుని దీటుఅనుచు నభమున చాటుఆడ కాస్మోనాటుఓ కూనలమ్మప్రజలు చేసెడి పొదుపుప్రభుత ఫ్యాడుల మదుపుసంగయాత్రలో కుదుపుఓ కూనలమ్మకొత్త పెండ్లము వండుగొడ్డుకారము మెండుతీపియను హస్బెండుఓ కూనలమ్మపాత బిరుదముకన్నపదవియే కద మిన్నహ్యూము చాటెను మొన్నఓ కూనలమ్మగుండెలో శూలమ్ముగొంతులో శల్యమ్ముకూళతో స్నేహమ్ముఓ కూనలమ్మపిరికి ఎలుకల జంటపిల్లి మెడలో గంటవెళ్లికట్టిన దంటఓ కూనలమ్మలంచమనియెడి ఉప్పుక్లార్కు తింటే తప్పుఘనుడు తింటే మెప్పుఓ కూనలమ్మహృదయమున్న విమర్శమెదడు కలచు విమర్శతిట్టు నెచ్చెలి స్పర్శఓ కూనలమ్మహాస్యమందున అఋణఅందెవేసిన కరుణబుడుగు వెంకటరమణఓ కూనలమ్మఆపరేషను శిక్షఆయుధమ్ముల భిక్షప్రక్కవాడికి కక్షఓ కూనలమ్మఅత్తవారిని మొక్కఅలక పానుపు యెక్కమృగము కిందే లెక్కఓ కూనలమ్మకడకు పాకిస్థానుకలిసె చైనాతోనుమిత్రుడా! సైతాను?ఓ కూనలమ్మపడతి వలపుల కలలుపండి వేసెడి గెలలువెలుగు నీడల వలలుఓ కూనలమ్మకుమతియొక్క సమీక్షగుబ్బ యెముక పరీక్షచేయువలయు ఉపేక్షఓ కూనలమ్మఏకపత్నీ వ్రతముఎలుగెత్తు మన మతమువేల్పు భార్యలో? శతము!ఓ కూనలమ్మపాలకోసము రాళ్లుభరియించుమను వాళ్లుతాము వంచరు వళ్లుఓ కూనలమ్మగంగగట్టున నూయికందకములో గోయిత్రవ్వేను లొల్లాయిఓ కూనలమ్మఆశ తీరని తృష్ణఅఘము తేలని ప్రశ్నప్రతిభ అడవుల జ్యోత్స్నఓ కూనలమ్మబండి కూల్చెను తొల్లిబండి తోలెను మళ్లిదండి ఊసరవెల్లిఓ కూనలమ్మమేనమామకు యముడుమేనయత్తకు మరుడుఘనుడుకద మాధవుడుఓ కూనలమ్మగుడి గోడ నలరారుపడతిదుస్తుల తీరుఫిల్ములో సెన్సారుఓ కూనలమ్మచలిహోమ గుండాలుపలు సోమపానాలుఅది బార్‌-బి-క్యూలుఓ కూనలమ్మపుణ్య గాథల బూతుబూజు పట్టిన ట్రూతుఅంతు చిక్కదు లోతుఓ కూనలమ్మగ్రోలెనే స్తన్యమ్ముగ్రుద్దెనే ఆ రొమ్మువాడెపో దైవమ్ముఓ కూనలమ్మభక్తి తేనెల యేరుపసిడి కలల బిడారుకలసి పోతనగారుఓ కూనలమ్మతగిన సమయము చూచితాను వేయును పేచిపాలిటిక్సుల బూచిఓ కూనలమ్మకులము నిచ్చెన నెక్కగుణము కిందికి తొక్కదివికి చేరున నక్క?ఓ కూనలమ్మకటిక మూర్ఖుల క్రొవ్వుకరగజేసెడు నవ్వుపాప చల్లని నవ్వుఓ కూనలమ్మకసరు తేనెల వంటికథలు కుత్తుకబంటినింపు కొడవటిగంటిఓ కూనలమ్మవెన్న మీగడ పాలువెలది సౌందర్యాలుబాలకృష్ణుని పాలుఓ కూనలమ్మఎద్దు నెక్కెను శివుడుగెద్దపై మాధవుడుఘనుడు మన మానవుడుఓ కూనలమ్మతెల్లవారల హజముతెల్లవారుట నిజములేచె నీగ్రో వ్రజముఓ కూనలమ్మకసిని పెంచే మతముకనులు కప్పే గతముకాదు మన అభిమతముఓ కూనలమ్మపెరుగుచుండె అప్పుకరుచుచుండె చెప్పుకానుపించని నిప్పుఓ కూనలమ్మనరము లందున కొలిమినాగుపాముల చెలిమిఅల్పబుద్ధుల కలిమిఓ కూనలమ్మగడ్డిపోచలు పేనిగట్టి ఏనుగు నేనికట్టువాడే జ్ఞానిఓ కూనలమ్మకయ్యమాడెడి యువతితియ్య విలుతుని భవతితనకు తానే సవతిఓ కూనలమ్మమమత పగిలే గ్లాసుమనికి గుర్రపు రేసుచిట్టచివరకు లాసుఓ కూనలమ్మభార్య పుట్టిన రోజుభర్త మరచిన రోజుతగ్గె ననుకో మోజుఓ కూనలమ్మఎపుడొ పరిణయమైనఈడ వుండదు కానఆడ దనబడె చానఓ కూనలమ్మసఖుని సన్నని నఖముచంద్రబింబపు ముఖముగిల్లినపుడే సుఖముఓ కూనలమ్మపాదరసమును గెలుచుపడతి చపలత వలచుగుండెలందున నిలచుఓ కూనలమ్మఅడ్డు తగిలిన కొలదిఅమిత శక్తుల గలదిఅబల అగునా వెలది?ఓ కూనలమ్మకొత్తదంటే రోతచెత్త పాతకు జోతమనిషి ప్రగతికి ఘాతఓ కూనలమ్మపిలువకున్నా వెళ్లిచెరుపజాలును పిల్లిపలు శుభమ్ముల పెళ్లిఓ కూనలమ్మమంచి నడవడి లేకమరులు ఎడదను లేకమనిషి చేయడు రూకఓ కూనలమ్మచెరకు రసముల వూటచిన్మయత్వపు తేటయోగివేమన మాటఓ కూనలమ్మరంగు శంకల మగడురాజబెట్టిన నెగడురమణి ప్రేమకు తగడుఓ కూనలమ్మపిలిచినప్పుడు రాదువెడలగొట్టిన పోదువనిత తీయని చేదుఓ కూనలమ్మఅజ్ఞులగు కాకవులుఅయిరి కాకాకవులుమూసుకో నీ చెవులుఓ కూనలమ్మపేజి పేజికి వధలుప్రెజలు వొల్లని కథలుఆరగించును చెదలుఓ కూనలమ్మపేదలే కానిమ్ముప్రభువులే కానిమ్ముచివర కవరా దుమ్ముఓ కూనలమ్మకాలవశమున మారిచాల ముడుపులు కోరిదేవుడే వ్యాపారిఓ కూనలమ్మజోలెకట్టె నవాబుజాలిచూపె గరీబుమూటకట్టె నవాబుఓ కూనలమ్మచీట్ల పేకల క్లబ్బుచివికి కొట్టెడి గబ్బుమధ్యతరగతి లబ్బుఓ కూనలమ్మఅంతు చూసేవరకుఆకట! ఆంధ్రుల చురుకునిలువ వుండని సరుకుఓ కూనలమ్మభర్తతోడను సీతపట్టు పట్టుటచేతఅట్లు తగలడె రాత!ఓ కూనలమ్మమరచె చేసిన మేలుచరచె పోరికి కాలువాడు చైనా పూలుఓ కూనలమ్మమనసు కుదరని పెళ్లిమరుదినమ్మున కుళ్లిసుఖము హళ్లికి హళ్లిఓ కూనలమ్మతొలుత కట్టిన బొప్పిదొసగు వివరము చెప్పితొలగుజేమును నొప్పిఓ కూనలమ్మభాగవతమున భక్తిభారతములో యుక్తిరామ కథయే రక్తిఓ కూనలమ్మబహుదినమ్ములు వేచిమంచి శకునము చూచిబయలుళురేరఘ హా-చ్చిఓ కూనలమ్మఆలి కొన్నది కోకఅంతరిక్షపు నౌకఅంతకన్నను చౌకఓ కూనలమ్మపసిడి వన్నెయ తరిగెపన్ను లెన్నియె పెరిగెప్రజల వెన్నులు విరిగెఓ కూనలమ్మవివిధ నీతులు గలవిపెక్కు బుక్కులు చదివినేను చేసెద మనవిఓ కూనలమ్మపసిడి వన్నియు తరుగుప్రజల కెంతో మెరుగుపాత మౌఢ్యము విరుగుఓ కూనలమ్మమిసిమి మెచ్చెడి తులువపసిడి కిచ్చును విలువనాకు చాలును చెలువఓ కూనలమ్మకొంటె బొమ్మల బాపుకొన్ని తరములసేపుగుండె వుయ్యెల నూపుఓ కూనలమ్మఅణువు గుండెను చీల్చిఅమిత శక్తిని పేల్చినరుడు తన్నున బాల్చిఓ కూనలమ్మజాలి కరుణలు మానిఆలి నేలని వానిజోలి కెళితే హానిఓ కూనలమ్మనీరు యెత్తున కేగునిజము చాటున దాగునీతి నేడొక ప్లేగుఓ కూనలమ్మతమలపాకులు నములుదవడతో మాట్లాళుతానె వచ్చును తమిళుఓ కూనలమ్మరెండు శ్రీల ధరించిరెండు పెగ్సు బిగించివెలుగు శబ్ద విరించిఓ కూనలమ్మపెరిగె ఇనకమ్‌ టాక్సుపెరిగె సూపరు టాక్సుటాక్సులేనిది సెక్సుఓ కూనలమ్మతాగుచుండే బుడ్డితరగుచుండే కొద్దిమెదడు మేయును గడిఓ కూనలమ్మమనసు తెలుపని భాషమంచి పెంచని భాషఉత్త సంద్రపు ఘోషఓ కూనలమ్మకొంతమందిది నవతకొంతమందిది యువతకృష్ణశాస్త్రిది కవితఓ కూనలమ్మసన్యసించిన స్వామిచాలినంత రికామిచాన దొరికిన కామిఓ కూనలమ్మలంచ మనియెడి పట్టిమంచ మేమిటి గట్టిఇనుప మేకుల తొట్టిఓ కూనలమ్మతాను మెచ్చిన కొమ్మతళుకు బంగరు బొమ్మవలపు గుడ్డి కదమ్మఓ కూనలమ్మఇంటి కప్పుల నెక్కిఇపుడు నిజమును నొక్కిచెప్ప మేలు హుళక్కిఓ కూనలమ్మసగము కమ్యూనిస్టుసగము కేపిటలిస్టుఎందుకొచ్చిన రొస్టుఓ కూనలమ్మఆశ పెరిగిన వాడుఅహము పెరిగిన నాడుతనకు తానే కీడుఓ కూనలమ్మగుడిని వీడెను శివుడుగోడ రాలును చవుడుకానడే మానవుడుఓ కూనలమ్మమంచి గంధపు చలువమంట వేండ్రపు నిలువకుంట నున్నదె చెలువఓ కూనలమ్మకావ్య దుగ్ధము పితుకకఠిన హృదయమె చితుకఖలుడు కూడా మెతుకఓ కూనలమ్మపన్ను వేయని ప్రభుతపన్ను హ్యూమరు కవితప్రజల కెంతో మమతఓ కూనలమ్మపిల్ల నిచ్చినవారిపీకమీద సవారిచేయూ అల్లుడె మారిఓ కూనలమ్మపెద్ద జంతువు దంతివెడద దంతుల దొంతిసమము ఒక్క వదంతిఓ కూనలమ్మఈసు కన్నుల దోయిచూచు చెడుపుల వేయిగుడ్డి ప్రేమే హాయిఓ కూనలమ్మనీవు పలికిన రీతినేను పాడెద నీతినీకు చెందుత ఖ్యాతిఓ కూనలమ్మరాక్షసత్వము పోయిరాచరికములు పోయిప్రజలదే పైచేయిఓ కూనలమ్మపొరుగు దేశము లిచ్చుపుల్ల ఇజముల మెచ్చుమూర్ఖ మెప్పుడు చచ్చుఓ కూనలమ్మపొరుగు పొలముల హద్దుపరుల రాజ్యపు హద్దుదాటువాడే మొద్దుఓ కూనలమ్మచిన్ని పాదము లందుచివరి ప్రాసల చిందుచేయు వీనుల విందుఓ కూనలమ్మజాతి ఛందము లోననీతి చెప్పెడు జాణమీటు హృదయపు వీణఓ కూనలమ్మపెను సమాసము లున్నపెద్ద వృత్తముకన్నచిన్న పదమే మిన్నఓ కూనలమ్మపరుల మేరును కోరిపదము లల్లెడువారిపథము చక్కని దారిఓ కూనలమ్మపాటగాడు at 2:03 PMShare4 comments:చదువరి1:00 AM, May 08, 2006బొడ్డు కిందికి మూరజారిపోయెను చీరఇండియాలో ఔరఓ నాయనమ్మా!నా చిన్నప్పుడు చదివిన పదమండి ఇది. కూనలమ్మ పదాలకు పేరడీ అనుకుంటా. ఎవరు రాసారో తెలీదు.ReplyRamanadha Reddy10:26 AM, August 14, 2006గుత్తొంకాయ కూరతిందాము బిరబిరఇంటికెళ్దాం పదరఓ కూనలమ్మా!చాలా ఆకలిగా ఉందండీ. మధ్యాహ్నం అయింది. ఇంటికెళ్ళినా సరైన బువ్వ లేదు. ఇప్పుడు వండాలి. హోటల్ మొహమ్మొత్తింది.(అన్నం సంస్కృత పదం).Replyanveshi5:08 PM, September 16, 2006bagunnayi koonalamma padAluReplyUnknown8:53 AM, December 27, 2019Parula melu Kori.... Please send meaningReply›HomeView web versionPowered by Blogger.

10, జనవరి 2020, శుక్రవారం

అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది.నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది.తాత అనే పిలుపులో తన్మయత్వం ఉంది.అమ్మమ్మ అనే పిలుపులు అభిమానం ఉంది.నానమ్మ అనే పిలుపులో నవ్వు ముఖం ఉంది.అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది.మామ అనే పిలుపులో మమకారం ఉంది.బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉంది.చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంది.అన్నా అనే పిలుపులో అభయం ఉంది.చెల్లి అనే పిలుపులో చేయూత ఉంది.తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉంది.అక్క అనే పిలుపులో అనురాగం ఉంది.బావా అనే పిలుపులో బాంధవ్యం ఉంది.వదినా అనే పిలుపులో ఓర్పు ఉంది.మరదలు అనే పిలుపులో మర్యాద ఉంది.మరిది అనే పిలుపులో మానవత్వం ఉంది.గురువు అనే పిలుపులో గౌరవం ఉంది.మిత్రులారా! నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్ని పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి.కనీసం పిలుపులో నయినా మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం.....!

5, జనవరి 2020, ఆదివారం

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులైయారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులైప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్!!

💝ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు💝💝గువ్వ గూడు కట్టే చోట కుంపటెట్టి పోరాదు💝మనిషికో స్నేహం మనసుకో దాహంలేనిదే జీవం లేదు జీవితం కానే కాదుమమతనే మధువు లేనిదే చేదుమనిషికో స్నేహం మనసుకో దాహంఒక చిలక ఒద్దికైంది.. మరు చిలక మచ్చికైందివయసేమో మరిచింది.. మనసొకటై కలిసిందికట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనాప్రేమలేని నాడీ నేల పూవులిన్ని పూచేనామనిషిలేని నాడు దేవుడైనా లేడుమంచిని కాచే వాడు దేవుడికి తోడుమనిషికో స్నేహం మనసుకో దాహంలేనిదే జీవం లేదు జీవితం కానే కాదుమమతనే మధువు లేనిదే చేదుమనిషికో స్నేహం మనసుకో దాహం వయసు వయసు కలుసుకుంటేపూరి గుడిసె రాచనగరు...ఇచ్చుకోను ..పుచ్చుకోను..ముద్దులుంటే పొద్దుచాలదుప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదుగువ్వ గూడు కట్టే చోట కుంపటెట్టి పోరాదుఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తంజాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసంమనిషికో స్నేహం మనసుకో దాహంలేనిదే జీవం లేదు జీవితం కానే కాదుమమతనే మధువు లేనిదే చేదుమనిషికో స్నేహం మనసుకో దాహంచిత్రం : ఆత్మబంధువు (1985)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : ఆచార్య ఆత్రేయగానం : బాలు, జానకి

3, జనవరి 2020, శుక్రవారం

*** భర్తృహరి సుభాషితము ***క్షమ కవచంబు క్రోధ మది శత్రువు జ్ఞాతి హతాశనుండు మిత్రము దగుమందు దుర్జనులు దారుణపన్నగముల్ సువిద్య విత్త ముచితలజ్జ భూషణ ముదాత్తకవిత్వము రాజ్య మీక్షమాప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁ దడ్కవచాదు లేటికిన్.

కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు )1. కార్యేషు యోగీ :• పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.2. కరణేషు దక్షః • కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.3. రూపేచ కృష్ణః• రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.4. క్షమయా తు రామః• ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.5. భోజ్యేషు తృప్తః• భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.6. సుఖదుఃఖ మిత్రం• సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.ఈ ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ భర్త కొనియాడబడతాడు. 2. మరి ఉత్తమమైన భార్య లక్షణాలు ఎలా ఉంటాయి ?(2). శ్లో॥ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (ఉత్తమ భార్య లక్షణాలు)1. కార్యేషు దాసీ• పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు చెయ్యాలి.2. కరణేషు మంత్రీ• మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి.3. రూపేచ లక్ష్మీ• రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలి.4. క్షమయా ధరిత్రీ• కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేయకూడదు.5. భోజ్యేషు మాతా• భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.6. శయనేషు రంభా• పడకటింటి లో రంభ లాగా ఉండాలి. ఈ 6 పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది.శ్రీ రామమోహనరావు గారికి కృతజ్ఞతలతో .